ఓడిపోతున్నా నేస్తమా
ఓడిపోతున్నా నేస్తమా


ఎలా చెప్పాలో తెలియక నా ఫీలింగ్స్ కాగితం మీద వ్రాసి వెళ్ళిపోయాను.నా స్నేహితుడు చూస్తాడన్న నమ్మకంతో వెళ్ళిపోయాను దూరంగా.
ఓడిపోతున్నా నేస్తమా
నా ఓటమిని ఒప్పుకుని వెళ్ళిపోతున్నా
నీకు దూరంగా నన్ను నేను తీసుకెళ్తున్నా
పిచ్చి మనసు
ఇంకా నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని ఎదురు చూస్తోంది
వనం వసంతం కోసం నిరీక్షించినట్లు వేచి చూస్తోంది
సర్ది చెప్పాను
దాని చెంప పగలగొట్టాను
ఏడ్చింది
బాగా ఏడ్చింది
కానీ నిన్ను మాత్రం మరువలేనంది
ఇక చేసేది లేక దాని పీక నులిమాను
నా మనసును విజయవంతంగా బలి చేశాను
నా ప్రయాణం ఆరభించాను
మనసులేని మనిషిలా
ఓడిపోతున్నా నేస్తమా
నా ఓటమిని ఒప్పుకుని వెళ్ళిపోతున్నా
మరు జన్మ ఉంటే నువ్వు చెలిమి చేస్తానంటే
మళ్ళీ కలుద్దాం
నీ ప్రశాంతతకు భంగం కలుగకుండా
నీ జీవితంలోని ఈ వ్యర్థపు జీవి
నీకు దూరంగా వెళ్ళిపోతుంది
బహుశా నీకూ నా ఓటమే ఇష్టమేమో
అందుకే
ఓడిపోతున్నా నేస్తమా
నా ఓటమిని ఒప్పుకుని వెళ్ళిపోతున్నా
వారం రోజుల తర్వాత కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చింది.
సన్నీ! ఏమైందిరా?
నాకొక్క మాట చెప్పుండొచ్చు కదా.ఎవరో ఏదో అంటే నువ్వెందుకు కాంపిటీషన్ నుంచి వెళ్లిపోయావ్ రా.
నువ్వు లేకుంటే నేనెలా ఆడగలను.
ప్లీజ్ రా.
స్నేహం ఎప్పుడూ స్నేహితుణ్ణి ఓడిపోవాలని కోరుకోదు.
కానీ నువ్వు నేను ఎవేరు వేరు జట్టుల్లో సెలెక్ట్ అయ్యామని నువ్వు బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీ నుంచి తప్పుకుంటే ఎలా.ఇప్పుడు నువ్వు రాకపోతే నేను కూడా ఆడను.
అతని గద్గద స్వరం విని నేను వెళ్ళక తప్పలేదు.
స్నేహితుడికి గట్టి పోటీ ఇవ్వడం కూడా స్నేహ ధర్మమే కదా.