దైవ లీల
దైవ లీల
ఈ కథనం సత్య అనుభవం మీద ఆధారపడి ఉంది.దైవం మనుష్య రూపంలో వచ్చి ఆదుకున్న వృత్తాంతం. సూర్య ఓక పెద్ద కంపెనీలో ఉన్నతమైన పొజిషన్లో ఏన్నొ ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. అతని అనుభవం, పనిమీద ఏకాగ్రత, కార్య నిర్వాహణ అందరికీ తెలిసిందే.కాని ప్రమోషన్ దగ్గరకి వచ్చేసరికి అతనికి ఎప్పుడూ అంత ఆనందం కలగలేదు.ఇదిగొ ఈ రోజు కూడా అతనికి నిద్ర పట్టలేదు ఆ ఆలొచనలు వేధిస్తున్న కారణం చేత.అతని భార్య పిల్లలు వింటర్ సెలవులని ఊరు వెళ్ళారు.. పక్క మీద అటూ ఇటూ దొర్లినా అదే పరిస్థితి, ఒక కప్పు టీ తాగితే ఏమయినా ప్రయోజనం ఉంటుందేమో అంటే అదీ వున్న నిద్ర కాస్త పోగొట్టింది.టీ తాగితే నిద్ర ఎక్కుడ వస్తుంది కనుక?ఇంక ఇలా కాదు పచార్లు చేసి చూద్దాం అని ఇంటి పైకప్పు ఎక్కి పచార్లు చేసినా ప్రయోజనం కనిపించలేదు.టైము రాత్రి 11.30 అయింది.కారులొ అలా తిరిగి వస్తే కొంత ఊరట కలుగుతుందని ఆలోచించి కారు స్టార్ట్ చేసాడు.అతని భార్య ప్రతి వారం ఒక గుడికి వెళుతుంది అని అతనికి గుర్తు వచ్చింది.ఆ గుడికి వెళ్ళి వస్తే మనశ్శాంతి రావచ్చు అని అనుకుని కారు నడపడం మొదలు పెట్టాడు.ఆ గుడి అతని ఇంటికి మరీ అంత దూరం ఏం కాదు.కారులో ఒక పావు గంట ప్రయాణం అంతే.గుడి చాలా పెద్దదే. అతని భార్య గుడి అందులో వున్న దేవుని విగ్రహాలు మరియు పూజలు గురించి మాట్లాడగా విని వున్నాడు. గుడి దగ్గర కారు ఆపి నెమ్మదిగా మెట్ల మీద కూర్చుని దేవుడిని ప్రార్థిస్తూ కూర్చున్నాడు.మనసు కొంత శాంతించినట్టు అనిపించింది. నెమ్మదిగా లేచి ఇంటికి వెళ్దాం అనుకుని చూస్తే కింద మెట్టు మీద ఒక నడివయసు అతను భగవంతుడిని దీనంగా ప్రార్థిస్తూ వున్నాడు.అది విని సూర్య ఆగి ఆ నడివయసు అతనిని ఏమయ్యిందండీ? ఏదయినా ఇబ్బందిలో వున్నారా? అని అడిగాడు.ఆ నడివయసు అతను ఏం చెప్పమంటారు మా ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యివుంది.. వెంటనే ఆపరేషన్ చెయ్యాలనే డాక్టర్లు అంటున్నారు.నా దగ్గర సరిపడ డబ్బు లేదు అంటూ భొరుమని విలపించాడు.అది విని సూర్య అతని భుజం మీద చెయ్యి వేసి మీరు బాద పడకండి ఇదిగొ ఈ డబ్బు వుంచండి అంటూ తన జేబులో నుంచి మొత్తం వున్న డబ్బంతా ఆ నడివయసు అతని చేతుల్లో పెట్టాడు.అతని కళ్ళలో నీళ్ళు ఆనంద భాష్పాలుగా కారాయి.. వెంటనే ఆ నడివయసు అతను థ్యాంక్స్ చెప్పి మీ మేలు జన్మ లో మర్చిపొలేను అన్నాడు. పర్వాలేదు మీకు ఇంకా ఏమయినా సహాయం కావాలని అనిపిస్తే నాకు ఫోన్ చెయ్యండి, ఇది నా కార్డు ఇందులో నా పేరు,ఫొన్ నంబరు వున్నాయి అన్నాడు.నడివయసతను వెంటనే మీ పేరు నేను తెలుసుకొగలను అన్నాడు..అది విని సూర్య ఆశ్చర్యపొయి అదెలా సాద్యం అని అడిగాడు.దానికి నడి వయసు అతను అన్నాడు మిమ్మల్ని ఇంత రాత్రి నా సహాయం కోసం పంపిన ఆ మహానుభావుడు ఈ గుడి లో వున్న ఆ కొండంత అండ నా దేవుడు నాకు అవసరమయిన సహాయం ఎప్పుడూ చేసాడు ఇక ముందు కూడా అంతే అని నాకు నమ్మకం అని అన్నాడు.ఆ మాటలు విన్న తర్వాత సూర్యానికి కొంత ఆశ చిగురించింది.ఏమో నాకు కూడా దేవుడు మనిషి రూపంలో వచ్చి కావాల్సిన వరం ప్రసాదిస్తాడు అనే నమ్మకంతో ఇంటికి వెళ్ళడానికి ఉపక్రమించాడు. మిగతా కథ తరువాయి భాగంలో. ్ ః ంంం ం
