కథ విందాం
కథ విందాం
కథ అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది పిల్లలు. ఏ వయస్సు పిల్లలయినా కథలు వినడానికి ఇష్ట పడతారు.కొంత మంది పిల్లలు హాస్య భరితమైన కథలు ఇష్టపడుతారు, ఇంక కొందరు సస్పంస్ కథలు వినడానికి ఇష్టపడుతారు..ఏది ఏమైనా మొత్తానికి కథలు వినడానికి అందరూ కలిసి వస్తారు.కానీ ఇక్కడే ఉంది అసలు విషయం. పిల్లలు పౌరాణిక, చారిత్రక, ఇంక జానపద కథలు వినడానికి అస్సలు ఇష్టపడరు.కారణం ఏమిటి అంటే ఆ కథలు మరీ ప్రాచీన కాలం కథలు.ఆ పాత్రలు కానీ ఆ పరమార్ధం కానీ ఇప్పటి పిల్లలకు అస్సలు అర్థం కాకపోవచ్చు.సరే ఇప్పుడు అసలు కధకి వద్దాము. . . 'మానస వాళ్ళ బామ్మగారు ఊరినుంచి వచ్చారు అమ్మగారు' అని అన్నపూర్ణగారి పనిమనిషి మంగి చెప్పింది.ఆవకాయ జాడీలు ఇంక ఆవిడ ఎప్పుడూ తెచ్చే తినుబండారాల డబ్బా కూడా తెచ్చారు.ఆ మాట విన్న వెంటనే వనజకి ఇంక వినయ్కి నోట్లో నీళ్ళు ఊరాయి. అవును మరి బామ్మగారు తెచ్చే తినుబండారాల కథే వేరు కదా.సిటీలొ పెరిగిన వారికి పల్లె నించి వచ్చే అరిసెలు ,బొబ్బట్లు ,జంతికలు కాజాలు ఆహా ఏమి రుచి అనిపిస్తుంది.కాని, వనజ వాళ్ళ అమ్మగారు సాయంత్రం వరకు ఆగమనే సరికి కాళ్ళకి బేడీలు పడ్డట్టు అనిపించి కాసేపు ఆగుదాం అని డిసైడ్ అయ్యారు.సాయంకాలం ఐదు గంటలు అవుతుంటే ఇంక వాళ్లని ఆపడం సాధ్యమా? మానస ఇంటికి పరుగు తీసారు పిల్లలు ఇద్దరు. ఆవిడని అంటే బామ్మగారిని పలకరించి పక్కనే కూర్చుని ఆవిడతో కబుర్లు చెబుతూ కూర్చున్నారు. ఇంతలో వనజ వాళ్ళ అమ్మగారు పని ముగించుకుని అందరూ కూర్చుని వున్న గదిలోకి వచ్చి కూర్చుంది.వనజ తమ్ముడు అరుణ్ 'అమ్మ ఆకలి'అన్నాడు.అది విని బామ్మగారు కోడలితో ''పూర్ణ ఆ రాగి డబ్బా తీసుకుని రా అమ్మా' అంది . పిల్లలు హుషారుగా ఆ డబ్బా కొసం ఆత్రంగా ఎదురు చూసారు. డబ్బా రానే వచ్చింది. బామ్మగారు అందులో ఉన్న అరిసెలు, బొబ్బట్లు జంతికలు అన్నీ అమర్చి ఇచ్చింది..అవి తిన్న తరువాత అందరూ చేతులు కడుక్కుని బామ్మ గారి పక్కన కూర్చుని కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు.ఇంతలొ బామ్మగారికి ఎదో గుర్తు వచ్చింది.'ఓరేయ్ అరుణ్ నా సంచి ఇంక కళ్ళ జోడు తీసుకుని రా బాబు 'అంది. ఆవిడ అలా అన్నారు అంటే పిల్లలు గ్రహించారు,ఆవిడ ఏదయినా మంచి విషయాలు చెప్తారు అని.ఎలాగూ సెలవులు కాబట్టి కాస్త ఎక్కువ సమయం అక్కడ గడిపిన పర్వాలేదు కదా. ఇంతలో ఆవిడ సంచి లో ఉన్న రెండు బరువయిన పుస్తకాలు తీసుకుని కళ్ళ జోడు పెట్టుకుంది.బాబొయ్ ఇంత బరువున్న పుస్తకాలు చదివి బామ్మగారు ఎమి చెపుతుంది అని ఆలోచించసాగారు. ఆ వయసు పిల్లలకు ఏ కార్టూన్ చానెల్ అయినా లేక సినిమా కథ అంటే ఆసక్తి ఉంటుంది. మరి బామ్మగారు అవేమీ చెప్పదు అని వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు.అంతలో బామ్మగారు 'మీలొ ఎవరికయినా హిరణ్య కశిపుడు గురించి తెలుసా ?'అని అడిగింది . ఆ ప్రశ్నకు సమాధానం మానస 'నాకు తెలుసు అని చెప్పింది.హిరకశిపుడు ఒక రాక్షసుడు అని అతను ప్రహ్లాదుడిని చంపాలని పన్నాగం వేసాడని చెప్పింది.బామగారు మరి అలా హిరణ్య కశిపుడు ఆలోచించడానికి కారణం ఏమిటి అని అడిగింది. దానికి వనజ ఇలా అంది.పహదుడు హిరణ్యకశిపుడి కొడుకు అయినా, విష్ణు మూర్తిని అతి భక్తితో స్తుతిస్తూ నమ్మకంతో ఆరాధించేవాడు. హిరణ్యకశిపుడు ఎన్ని సార్లు మందలించి, అత్యంత కఠినంగా దండించినా ప్రహ్లాదుడు తన భక్తితో విష్ణు మూర్తిని కొలుస్తూ వున్నాడు. హిరణ్య కశిపుడు ఇంక ఆగ్రహం పట్టలేక ప్రహ్లాదుడిని చంపడానికి ఉద్యుక్తుడయ్యాడు. అప్పుడు ప్రహ్లాదుడి ఆర్తనాదాలు విని విష్ణుమూర్తి ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని వధించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న నిజాన్ని అమలు చేయడం ద్వారా ధర్మం శరణం గచ్ఛామి అని నిర్ధారణ చేస్తాడు. ఆ హిరణ్యకశిపుడికీ ఒక తమ్ముడు అతని పేరు హిరణ్యాక్షుడు. వీళ్ళు ఇద్దరూ దితి ఇంక కశ్యపుడు సంతానం 'బామ్మగారు సంతానం అంటే ఏమిటి'? అని అరుణ్ అడిగాడు. 'సంతానం అంటే పిల్లలు అని అర్థం,కదా బామ్మ' అని వనజ అంది 'అవును కరెక్ట్ గా చెప్పావు' అని బామ్మగారు మెచ్చుకునే సరికి మిగతా ముగ్గురు పిల్లలు కూడా కథ సరిగ్గా విని బామ్మగారు ఏమయినా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాలి అని డిసైడ్ చేసుకున్నారు.'బామగారు మళ్ళీ కథ చెప్పండి 'అని అడిగారు పిల్లలంతా.బామగారు కథ చెప్పడం మొదలు పెట్టింది.హిరణయకషుడు ఒక అసురుడు అంటే రాక్షసుడు అని అర్థం.అతడు తన ఆధిక్యతను చాటుకోవడానికి భూమి మీద నానా భీభత్సం సృష్టించాడు.దేవతల పై దండెత్తి వాళ్ళ మనశ్శాంతిని విధ విధాలుగా పోగొట్టి సంతోషించేవాడు. నారద మహర్షి కలహాలు సృష్టించినా అది లొక కల్యాణం కోసం అని దేవతలందరికీ తెలిసిందే కదా.ఓక సారి నారదుడు హిరణ్యాక్షుడిని కలుసుకునేందుకు వచ్చాడు.తీరా చేసి నారదుడు అక్కడకి. దగ్గరకి వచ్చేసరికి హిరణ్యాక్షుడు గధ దారి అయి ఎక్కడికో ప్రయాణం అవుతున్నాడు.నారద మహర్షి అతని ప్రయాణం గురించి అడుగగా హిరణ్యాక్షుడు ఇలా అన్నాడు."మా దానవులుందరికి విష్ణుమూర్తితొ విభేదాలు తలెత్తాయి కదా వాటి గురించి తెలుసుకుని అవసరం అయితే యుద్ధం కూడా చేద్దాం అని నిర్ధారణ చేసుకుని అక్కడికే బయలుదేరాను అని అన్నాడు.అదా సంగతి ,,, అయితే విష్ణుమూర్తి నువ్వు అనుకున్న ప్రదేశంలో లేడు, ధరణిదేవిని రక్షించేందుకు వరాహ అవతారం ఎత్తి సముద్ర గర్భంలో పాతాళ లోకంలో ఉన్నాడు కదా అన్నాడు. అని నారదుడు అనేసరికి హిరణ్యాక్షుడు హుటా హుటాహుటిన యుద్ధానికి బయలుదేరాడు. అక్కడికి చేరి మహ గర్వంతో వికటాట్టహాసం చేస్తూ ,'ఎం శ్రీ హరి దానవుల బలానికి భయపడి సముద్ర గర్భంలో పాతాళ లోకంలో దాక్కున్నావ' అని హేళన చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసాడు.ఈ సూకర రూపంలో ఇక్కడ దాక్కుని ఉన్నావు,ఈ భూమి నాది సముద్ర గర్భంలోకి విసిరింది నేనే అని అతిగా విష్ణు మూర్తిని హేళన చేస్తూ ఉండగా మహా విష్ణువుకి కోపం వచ్చింది.అయినా భూ మాతను తన మూతి పై నిలిపి 'ఒ దానవుడా ,,నీ అహంకారం నీకు ముప్పు తిప్పలు పెడుతుంది.నువు తగని మిడిసిపాటుతొ ఉన్నావు.ఆ అహంకారం వల్ల నువ్వు ఎంత ఆపద తెచ్చుకున్నావో నీకు అర్థం కాదులే. భూ మాతను రకషచ కాపాడుతాను రా యుద్ధానికి సిద్ధం కా అని ఇద్దరూ కలిపడి పోట పోటీ యుద్ధం చేసారు.ఆ యుద్ధంలో ఎవరు గెలిచారు చెప్పండి చూద్దాం అని బామ్మగారు అడిగిన ప్రశ్నకు అందరూ ముక్తకంఠంతో విష్ణు మూర్తి అని సమాధానం చెప్పారు.అవునరా పిల్లలు చెడ్డవారు ఎంత బలవంతులైన మంచితనం ముందు ఓడిపోక తప్పదు.అది ఈ కథ సారాంశం. కథ కంచికి మనం ఇంటికి పరుగు తీసారు పిల్లలు.
ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంఖ
ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం
ంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంంం
