STORYMIRROR

Anuradha T

Classics

4  

Anuradha T

Classics

యుద్ధం వద్దు వద్దు

యుద్ధం వద్దు వద్దు

2 mins
227

  అది ఒక అందమైన అరణ్యం.అదేమిటీ అరణ్యం అందంగా ఆకర్షణీయంగా ఉంటుందా అని ఆశ్చర్యపోకండి. అరణ్యం లో సంచరిస్తూ ఉంటే ఆ విషయం మనకు అర్థం అవుతుంది. అక్కడ నివసించే జలచరాలు,రక రకాలైన జంతువులు, పక్షులు పశువులు మన భాషలో వర్ణించ లేము. కొంచెం కష్ట పడాలి మరి.అలాంటి ఒక అందమైన అరణ్యంలో అన్నీ జంతువులు దీర్ఘమైన ఆలోచనలో ఉన్నట్లు జంతువుల మహారాజు అదేనండి సింహం 🦁 కనుగొని విషయం ఏమిటి అని ఆరా తీసాడు.అసలు విషయం తెలిసి నివ్వెర పోయాడు.సింహానికి అసలు విషయం చెప్పింది ఆయన మంత్రి కాదు కంత్రి! నక్క 🦊 కదా, అందుకని సింహ రాజు స్వయంగా అన్నీ జంతువులతో మాట్లాడదామని నిర్ణయించి అన్నీ జంతువులకి కబురు పంపించాడు.ఆ జంతువులు పక్షులు చెప్పిన మాటలు విని ఆశ్చర్యపోయాడు. ఆ జంతువులు పక్షులు ఒకటి తో ఒకటి కలిసి వుండడం వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది అని వాపోయాయి.అదే దగ్గర లో ఉన్న పట్టణంలో ఉన్న జూ అయితే బావుంటుంది అన్న అభిప్రాయం వ్యక్తం చేసాయి.ఆ మాటలు విన్న వెంటనే సింహ రాజుకి విపరీతమైన ఆగ్రహం వచ్చింది. అయినా ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకుని ఒక మాట అన్నాడు.' అందరూ వినండి,మా మాటలు విని నేను ఒక నిర్ణయానికి వచ్చాను.అదేమిటంటే అందరూ స్వేచ్ఛగా జీవించే హక్కు వుంది.మీరు మీ ఇష్టమైన ప్రదేశానికి వెళ్లండి.నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ వుంటాయని మరిచిపోవద్దు అన్నాడు.ఆ మాట విన్న వెంటనే జంతువులు పక్షులు పశువులు అన్నీ కలిసి పక్కనే ఉన్న పట్టణానికి ప్రయాణం అయ్యాయి.ఎంతొ దూరం నడిచాక, మిణుకు మిణుకు మంటూ లైటు వెలుగులో ఒక అందమైన ఊరు కనిపించింది.అహ ఎంత అందమైన ప్రదేశమో కదా అని జంతువులు పక్షులు పశువులు సంబర పడిపోయి ఆనందంగా గెంతులు వేసాయి.ఇంకా ముందుకి వెళ్దాం అని నిర్ధారణ చేసుకుని ముందుకు నడిచాయి.ఆహ అని మళ్ళీ అనుకునే సరికి కాళ్ళకి బేడీలు వేసినట్లు ఆగిపొయాయి.‌ఆ దృశ్యం అలా వుంది. జనాలు ఒకరినొకరు కర్రలతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ వున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అని సవాలు చేస్తూ దుర్భాశ ప్రయోగిస్తూ ఒకరినొకరు చంపుకుంటారా అన్నంత భీకరంగా కొట్టుకోవడం చూసి జంతువులు పక్షులు పశువులు విపరీతమైన ఆవేదనకు గురయ్యాయి. బాబోయ్ ఇదేమి రాజ్యం, ఇదేమి చోద్యం, ఇదేమి వింత జనం అని ఖంగు తిన్నాయి.‌ అందరికన్నా పెద్దదయిన ఏనుగు ముందుకి వచ్చి, అందరూ వినండి మన అరణ్య సామ్రాజ్యం లో ఒక పద్దతి, నీతి నియమాలు వున్నాయి.అదే మరి పట్టణం మాటకి వస్తే మీరే చూసారు.ఆలాంటి పద్దతి నీతి నియమాలు ఇక్కడ కనిపిస్తున్నాయ? లేవే.మరి‌ మన అరణ్యం అందంగా వుందా? ఈ పట్టణమా? మీరే నిర్ణయించుకోండి. ఇక్కడ వున్న యొద్ద రాజకీయాలు, అరాచకాలు, కిరాతకత్వం మన అరణ్యంలో లేదు.పదండి పోదాం అనేసరికి అన్నీ జంతువులు పక్షులు పశువులు హుషారుగా హుటాహుటిన బయలుదేరి వెళ్లాయి.మరి సింహం ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ తన గుహలోకి వెళ్లాడు.నాకు ముందే తెలుసు ఇలాగే జరుగుతుంది అని అనుకున్నాడా? ఈ సందేహం ఎవరు తీరుస్తారు?



Rate this content
Log in

Similar telugu story from Classics