సస్పెండ్డెడె కాఫీ
సస్పెండ్డెడె కాఫీ
సస్పెండ్డెడె కాఫీ. . ఇదేం కొత్త రకం కాఫీ అని అనుకుంటున్నారా? సాధారణంగా మనం తాగే కాఫీ చిక్కగా వుండే ఫిల్టర్ కాఫీ.దాని సువాసన మరి రుచి మనకి కొత్త కాదు.మన దినచర్య ఆ పదార్థం తో మొదలవుతుంది.కొంత మందికి అది తాగకపోతే తల నెప్పి వస్తుంది.ఇంక పని కూడా సమంగా చెయ్యలేదు పాపం సరే ఇవి కాఫీ ముచ్చట్లు.ఇంక అసలు కథకు వద్దాము.తాత నాకు స్కూల్లో వ్యాసాల పోటీ వుంది అంటూ రామకృష్ణగారి మనవుడు ఉదయాన్నే ఆయన దగ్గరకి వచ్చాడు.అపుడే ఆయన తిరికగా కాఫీ తాగుతూ పేపర్ తిరగేస్తున్నారు.అవునా? బావుందిరా మంచి విషయం అన్నారాయన.ఆయన మనవడు నసుగుతూ అన్నాడు మంచిదే కానీ... అని ఆగిపోయాడు. ఆయన ఆగిపొయావే ? చెప్పు ఏ విషయం గురించి రాద్దాం అనుకుంటున్నావు, అని అడిగారు.అదే తెలియటం లేదు తాత అన్నాడు మనవడు.అలాగ ఆగు నేను ఒక మంచి సలహా ఇస్తాను అన్నారు ఆయన. ఒక పేపరు పెన్ను తెచ్చుకో అన్నారు.ఆ కుర్రాడు గబ గబ అవి తెచ్చుకుని ఆయన పక్కనే కూర్చుని చెప్ప తాత అన్నాడు బాబు వినరా అని ఆయన చెప్పడం మొదలు పెట్టారు. . సస్పెండ్డెడె కాఫీ అంటే ఏమిటో తెలుసా? స్పెయిన్ లో ఒక కాఫీ రెండు సస్పెండ్డెడె కాఫి అంటూ బిల్లు పే చేస్తారు.పేదవారు ఎవరయినా సస్పెండ్డెడె కాఫీ అని అడిగి freeగా కాఫీ తాగి వెళుతుంటారు.మంచి విషయాలు ప్రచారం చెయ్యడం అవసరం.మనిషిలొ నిద్రాణంగా ఉన్న సంస్కారాలని తట్టి లేపడం వారి చేత మంచి పనులు చేయించడం అవసరం. ఇదిగత ఏడాది రెండు సంవత్సరాలగా face book లో ఎవరొ ఒకరు ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెపుతున్నారు.ఇది కేవలం ప్రచారం కోసం దాన ధర్మాలు చేసే విదేశీ సంస్కృతి కావచ్చు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కన్నా ఉన్నత మయినవా ఇవన్నీ ఆలొచించండి..ఇలా అందరినీ ప్రశ్నించి నీ వ్యాసాన్ని ఆపు అన్నారు రామకృష్ణగారు.అలాగే తాత అని ఆయన మనుమడు స్కూల్కి వెళ్ళడానికి తయారు అయ్యాడు . ఇవన్నీ ఆయన పెద్ద మనమడు వింటూ వున్నాడు.అతను ఆ విషయం గురించి ఇంకా కొంత మాట్లాడదామని అనుకుంటూ రామకృష్ణగారి దగ్గరకి వచ్చి కూర్చున్నాడు.తాతగారు మీ రు చెప్పిన మాటలు అన్నీ విన్నాను కానీ మీ మాటలతో నేను ఏకీభవించను.ఇపుడు ప్రతి వాళ్ళు వారు చేసే దానధర్మాల గురించి face book ,twitter అనబడే చానల్లో అందరికీ తెలిసే విధంగా ప్రచారం కోసం చెయ్యడం ఆనవాయితీ అయ్యింది. ఎంతో మంది లైక్ చేస్తే అంత ఆనందంగా వుంటుంది.తెలుసా అన్నాడు.రామకృషణగారు నర్బగర్బంగా నవ్వీ ఊరుకున్నారు .ఆ విషయం అలా ఉంచితే, ఆయన చిన్న మనమడు వ్యాస రచన పోటీలో రెండవ బహుమతి గెలుచుకున్నాడు.. అందరూ ఎంతో సంతోషించారు ఆ సందర్భంలో అందరూ ఏదయినా హోటల్లో భోజనం చేద్దాము అని ఆలోచించి ఆ ఊరిలో ఉన్న ప్రముఖమైన హొటల్కి వెళ్లారు.ఆ హొటల్ వారు రామకృష్ణగారిని ఎరుగుదురు.అదీ కాక ఆయన ఒక అనాథ శరణాలయానికి అధ్యక్షులుగా చాలా కాలం నుండి సేవలు అందిస్తున్నారు.అందరూ కూర్చున్నాక ఆ హొటల్ లో పద్దతి ప్రకారం అరిటాకు పరిచి వివిధ రకాలయిన ఆధరావులు వడ్డించారు. అందరూ బొజనం రుచిగా వుందని సంతొషించారు బిల్ చెల్లించే పని నడుస్తుండగా హొటల్ బయిట ఒక చిన్న కుర్రాడు బిచ్చం వేయమని అడుగుతున్నాడు.కొంత మంది డబ్బు ఇచ్చారు, కొంత మంది తిట్టి పొమ్మన్నారు.ఇది చూసి రామకృష్ణగారికి బాధ కలిగింది. ఆయన తలుపు తెరుచుకుని ఆ పిల్లవాడిని లోపలికి తీసుకుని వచ్చి హోటల్ వారికి బిల్లు నేను పే చేస్తాను ఈ పిల్లవాడికి కావాల్సినంత భోజనం పెట్టండి అని చెప్పారు. ముందు కాస్త జంకుగా లొపలికి వచ్చినా వడిచిన విస్తరిని చూసి ఆబగా తినడం మొదలు పెట్టాడు.ఆ పిల్లవాడి కళ్ళలో మెరుపు చూసి రామకృష్ణగారి మనవులకి ఆశ్చర్యం వేసింది.ఆయన హొటల్ వారికి బిల్లు చెల్లించబొతే వారు అన్న మాటలు ఆయన పెద్ద మనమడికి చెంప చెల్లు మన్నట్టు అయ్యింది.హొటల యజమాని
అన్నాడు, మీరు ప్రతి నెలా చెల్లించే రొక్కంతొ కనిసం వంద మందికయినా మేము ఫిరీగా బొజనం పెడుతున్నాము.. తిన్న వాళ్ళు మాకు ధన్యవాదాలు తెలిపారు, కానీ అవి చెల్లించ వెలిసింది మీకు.మీరేమొ మీ పేరు ఎవరికి తెలియక పోయినా పర్వాలేదు కానీ ఆ పని నడుస్తుంటే చాలు అదే పది వేలు అంటారు.మహనుబావులు.facebook ,social media లో చిన్న రొక్కం దానమిచ్చి దండోరా చాటుకునే జనాన్ని చూసాము కానీ మీ లాగ అదృశ్యంగా వుండి పది మందికి ఉపయోగ పడే వారు చాలా అరుదు అని అన్నాడు.ఆ నిమిషంలో రామకృష్ణ గారి మనవలకి సస్పెండ్డెడె కాఫీ అంటే ఏమిటో అర్థం అయ్యింది.ఆయన మీద గౌరవం పదింతలు పెరిగింది. ం
