STORYMIRROR

Anuradha T

Abstract Drama

2  

Anuradha T

Abstract Drama

పరివర్తన

పరివర్తన

2 mins
28

ఆరతి, ఆరతి నా పుత్తూరు తైలం ఎక్కడ పెట్టావు,? కాలు నెప్పిగా వుంది నీకు తెలుసు కదా త్వరగా తీసుకురా అంటూ ఆరతి అత్తగారు తెలవారుతూనే ఆరతిని రొజు మాదిరిగా పిలిచింది కానీ ఆ రొజు వస్తున్నా అత్తయ్య అంటూ ఆరతి రాలేదు.ఆరతి నా కళ్ళ జోడు ఎక్కడ పెట్టావు? కాస్త కాఫీ ఇస్తావా తల్లి అంటూ ఆరతి మావగారు పిలిచారు ఆయన పిలుపు విని రోజులాగా‌‌ ఆరతి పరుగు పరుగున రాలేదు. అమ్మ నాకు స్కూల్కి వెళ్ళే టైం అయ్యింది టిఫిన్ బాక్స్ తొందరగా ఇవ్వు అంటూ ఆరతి కూతురు కంగారు పడుతొంది. అమ్మ నా పుస్తకాలు కనపడటం లేదు, అంటూ ఆరతి కొడుకు కంగారు పడుతున్నాడు. ఇల్లంతా గందరగోళంగా వుంది అప్పుడు ఆరతి భర్త ఆశొక్ నిద్ర లేచి వచ్చాడు.ఎందుకు అందరూ ఇంత గొల చేస్తున్నారు ‌‌‌‌అని‌ విసుక్కున్నాడు. అమ్మ నా టిఫీన్ ఇంకా ఇవ్వలేదు, తమ్ముడి పుస్తకాలు ఇవ్వలేదు, అంటూ కూతురు కంప్లయింట్ చేసింది.ఆరతి ఆరతి అని ఆశొక్ పిలుపుకి ఆరతి నుండి సమాధానం రాలేదు.ఆశొ్క్ అన్నీ గదులు వెతికాక బెడ్ రూం లోకి వెళ్ళి చూడగా ఆరతి కనపడలేదు కానీ ఒక కాగితం రెప రెప లాడుతూ కనిపించింది. ఆశొక్ కొద్దిగా కంగారు పడుతూ ఆ‌ కాగితం తీసి చదివి దిగ్బ్రాంతికి గురయ్యాడు.అ కాగితం ఆరతి ఆశొక్కి వ్రాసిన ఉత్తరం . ఇప్పుడు అసలు విషయానికి వద్దాం.ఈ వృత్తాంతం జరిగే ముందు అసలు ఏమైందంటే ఆశొక్ ఏదో కొపంతొ ఆరతిని అందరి ముందు చాలా చులకనగా నువ్వు నీ జీవితంలో ఏం సాధించావు?వంట చేయడం ఇంక పిల్లల్ని చూసుకొవడం తప్ప.అది కూడా అంతంత మాత్రమే ‌‌‌‌అనేసాడు.ఆ మాటలు విన్న ‌‌వెంటనే ఆరతి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.వెంటనే అక్కడ నుంచి ఆమె తన బెడ్ రూము లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చి ఆ రాత్రి నిద్రపొలేదు.తెలవారక ముందే లేచి ఆశొక్కి ఉత్తరం వ్రాసింది.అందులొ ఆమె తన భర్తను ఉద్దేశ్యించి అంది నిన్న రాత్రి మీరు అందరి ముందు అన్న మాటలు నిజమే.నేను నా జీవితంలో ఏమీ సాధించలేదు . చిన్నప్పుడు అమ్మ నాన్న ఏమి చదవవమంటే అదే చదివాను.18 ఏళ్లు రాగానే నాన్నగారు నాకు పెళ్ళి చేద్దాము అని ఆలోచించి మీకు నన్ను కట్టిపెట్టి ఆయన బాధ్యత తీరిపొయింది‌ అనుకున్నారు.కూతురు మరి గుది బండ కదా? సరే కొత్త మనుషులు ఇంక మీ అందరి చుట్టూ నా జీవితాన్ని అల్లుకున్నాను.ఇంటి బాధ్యతల్ని వీలయినంత సక్రమంగా నిర్వహించాలని ప్రయత్నం చేశాను.అత మామల సేవ చేసాను.మీరు మీ ఆఫీసులో బిఝీగా వుంటారని ఇంటి పరంగా ఎటువంటి బాధ్యతలు అప్పచెప్పి మీకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రయత్నం చేసాను.ఇంటి పని,వంట పని అన్నీ ఒక ధాటిన చేసాను.పిల్లల చదువులు, వాళ్ళ ఆటలు, పాటలు, ఇంక పొటిలు అన్ని సక్రమంగా జరిగేలా చూసాను.మీ అందరి ఆనందమే నా ఆనందం అని అనుకుని ఇన్నాళ్లు చాలా ఆనందించాను.కాని నిన్న మీ మాటలతో నాకు కనువిప్పు కలిగింది.అందుకని నేను నా జీవితంలో ఏదయినా సాధించుదాం అని భావించి ఇల్లు వదిలి వెళ్లిపొతున్నాను. నేను ఎక్కడకి వెళుతున్నానొ నాకే తెలియదు. పిల్లలు ఇల్లు జాగ్రత్త అని వుత్తరం లో రాసింది.ఇది ఇప్పటిదాకా జరిగిన విషయం.ఆశొక్ వెంటనే ఆరతి పుట్టింటికి ఫొన్ చేసాడు. ఎవరూ ఫొన్ ఎత్తలేదు.ఆశొక్కి ఇంకా కంగారు పెరిగింది.అతను హుటాహుటిన ఆరతి పుట్టింటికి బయలుదేరాడు.ఓక గంట ప్రయాణం చేసి ఆమె ఇంటికి వెళ్లాడు.ఆ గంట అతనికి ఒక యుగం అనిపించింది.ఆరతి ఇంటికి చేరిన వెంటనే ఆమెను అక్కడ చూసి కొపం, సంతొషం ఓకే సారి అనిపించాయి.కారణం ఈ‌ పాటికి మీకు‌ అర్థం అయ్యి వుండాలి. కొపం ఆమె ఇల్లు వదిలి వెళ్లినందుకు, కనీసం ఫోన్ అయినా చెయ్యనందుకు, ఇన్నాళ్లు అతనిని, పిల్లల్ని కంగారు పెట్టినందుకు సంతొషం ఆమె క్షేమంగా పుట్టింటిలొనే వున్నందుకు.ఇంక ఆలస్యం చేయకుండా ఆశొక్ ఆరతికి క్షమాపణ చెప్పి ఆమెను ఇంటికి తీసుకుని వెళ్లిపొయాడు.అలా ఈ కథ‌ సుఖాంతం అయ్యింది.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar telugu story from Abstract