Anuradha T

Classics

4.0  

Anuradha T

Classics

రాజకుమారి -హంస‌

రాజకుమారి -హంస‌

2 mins
267


   ఒకానొక రాజ్యంలో ప్రజలంతా సంతోషముతో కలిసి మెలిసి జీవించేవారు. ఆ రాజ్యంలో అందరూ కష్ట పడి కృషి చేసి అభివృద్ధి కోసం పాటు పడేవారు. రాజుగారి పరిపాలన ఎంతో మేలు చేసే విధంగా వుండేది. రాజ్యంలో అంతా పచ్చదనం పరిశుభ్రత పాటించి అందరూ ఆనందంగా కాలం గడుపుతూ వుండే వారు.రాజుగారికి సంతానం లేని కారణంగా ఆయన భార్య అనగా మహారాణి దుఃఖంగా‌ వుండేది.‌ రాజుగారు ఎంతగా ప్రయత్నించినా ఫలితం కనిపించలేదు. కారణం ఏమిటి అంటే ఆ రాజుగారి కుమార్తె పెళ్ళి నిశ్చయం కాకపోవడం.ఎంతొ మంది రాజకుమారులు ఆమెను కలిసి మురిపించాలని చూసారు. రాజకుమారి కొలనులొ నీళ్ళలోకి తదేకంగా చూస్తూ కాలం గడుపుతూ వుండేది.ఎవరికీ అర్థం అయ్యేది కాదు.రాజకుమారి మౌనంగా ఉండిపోయింది.మహరణి ఇంక రాజుగారికి దిక్కు తోచలేదు. ‌‌‌‌.          ఇలా కొంత కాలం గడిచింది.ఊరి ప్రజలు కూడా ఆమె నిరుత్సాహంగా‌ వుండడానికి కారణం ఏమిటి అని ఆలోచించ సాగారు.అలా రోజులు వారాలు ఇంక నెలలు గడుస్తున్నాయి.ఆమె‌ ఎక్కువ సమయం ఊరిలో వున్న కొలను లోకి చూస్తూ కాలం గడిపేది. రాజకుమారి వున్నట్టు వుండి ఒక రోజు తనలో తాను చిరునవ్వు నవ్వుతూ కనిపించేసరికి ఆ రాజుగారికి, మహారాణికి పట్ట లేనంత ఆనందం కలిగింది. మహారాణి వడి వడిగా రాజకుమారి వున్న కొలను దగ్గరకి వెళ్లి చూసి ఖంగు తింది. రాజకుమారి ఒక హంసని హత్తుకుని గుస గుసలాడి ఎంతో ఆనందంగా కనిపించింది. మహారాణి ఇంక వుండ బట్టలేక రాజకుమారి దగ్గరకి వెళ్లి తన్మయంతో ముసి ముసి నవ్వులు నవ్వుతూ వున్న కూతురి బుజం తట్టింది.‌‌.రాజకుమారి ఉలిక్కిపడి మహారాణిని చూసి కంగారు పడింది.మహరాణి కూతురిని బుజ్జగించి కారణం ఏమిటి అని అడిగింది.కూతురు ఆ కొలనులో ఉన్న హంస ఒక అందమైన రాజకుమారుడు అని చెప్పింది రాజకుమారి.ఆ రాజకుమారిడికి ఒక ముని శాపంవలన మానవ రూపంలో కాకుండా హాంస‌ రూపంలో జీవితం గడిపవలసి వస్తోంది.ఈ శాపం నించి విముక్తి కలగాలంటే మన రాజభవనంలో వున్న అతి పురాతనమైన ముత్యాల తలంబ్రాలతొ ఆ హంసని అభిషేకం చేస్తే ఆ హంస‌ మానవ రూపం‌ మరల దాలుస్తాడని చెప్పింది.ఆ మాట విన్న వెంటనే మహారాణి రాజు భవనానికి వెళ్లి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు తెచ్చి పెట్టింది.రాజకుమారి ఇంక ఆలస్యం చేయకుండా తలంబ్రాలతొ హింసని అభిషేకం చేసి తరించింది.అంతలొ హంస ఒక అందమైన రాజకుమారుడిగా రూపం దాల్చి రాజకుమారిని వివాహం చేసుకుని సుఖంగా ఉన్నారు.ఇలా ఈ కథ సుఖాంతం అయ్యింది.

 ః



Rate this content
Log in

Similar telugu story from Classics