పిడుగు
పిడుగు


వాన పడుతుంటే దానిని ఆస్వాదించాలనే వారు కొందరుంటే పెద్ద వాన కురిస్తే భయపడే వారు కొందరు.
మరీ గట్టిగా ఉరుములు మెరుపులతో కూడిన వాన అయితే అర్జునా పార్థివా అని అర్జునుడి పది నామాలు
పలకాలంట.
అసలు పైన అంటే ఆకాశంలో యుద్ధం జరుగుతూ ఉంటుందంట.
అర్జునుడి రథంకున్న మేకులు(సీలలు) ఊడిపోయి క్రింద పడ్డాయనుకో అది పిడుగంట.
అందుకే మరీ పెద్దగా వాన కురుస్తుంటే అర్జునా పార్థివా ఫాల్గుణ అని మనం అర్జునుడి పేర్లు పలికామనుకో
అర్జునుడు తన రథం వేరే ప్రక్కకు తిప్పుకొని మన మీద పిడుగు పడకుండా చేస్తాడన్నమాట.
ఇది నేను విన్న జానపద కథ.