KANAKA ✍️

Classics Inspirational

4  

KANAKA ✍️

Classics Inspirational

కన్నయ్యా

కన్నయ్యా

2 mins
419


'అమ్మా.. నేను వచ్చేశా.'


అంటూ రాఘవ నా దగ్గరికి పసి పిల్లాడిలా వస్తున్న ఆఖరి అస్పష్ట దృశ్యం.


'అమ్మా. నీకోసం వచ్చేశాను. ఇక నిన్ను వదిలి మళ్లీ అక్కడికి వెళ్ళను. నీ కోడలు కూడా వచ్చేసింది.' 


అంటూ ఆత్రంగా తల్లివద్దకొచ్చి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని, అమ్మా.. ఇటు చూడు నీకోసం ఏమి తెచ్చానో.. అని 

అమ్మకోసం మగ్గం మీద నేసిన వంగపువ్వు రంగు నేత చీర, వజ్రపు ముక్కుపుడకను బ్యాగ్ లో నుండి బయటకు తీసి, చీరను తల్లి భుజం మీద వేసి చేతిని పట్టుకున్నాడు.


ఆమె చేతులు చల్లబడ్డాయి. కళ్లకున్న కళ్లజోడు కిందకు జారింది. ఆమె శాశ్వతంగా కళ్ళు మూసుకొని ఉండటం గమనించాడు రాఘవ.


అంతే.. ఒక్కసారిగా అతని గుండెలు పగిలాయి. 


అమ్మ.. అమ్మ.. అని ఏడుపందుకున్నాడు. మీనాక్షిలో కదలిక లేదు. చేతిలోని లలిత సహస్ర నామ పారాయణం పుస్తకం కిందకు జారీ పడింది. అందులోంచి 

ఓ కవర్ బయిటకు వచ్చింది.


నిర్మలమైన ప్రసన్న వదనంతో మీనాక్షి రూపం దేదీప్యమానంగా ఉంది. ఎనలేని తృప్తిని కళ్ళలో నింపుకొని పోయినట్లుగా కనిపిస్తున్నది.


రాఘవ చెంపల మీద కన్నీరు జారుతుంటే, కవర్ ఓపెన్ చేసాడు. అక్షరాలు కనిపించటం లేదు. కన్నీటి పొర అడ్డుపడుతుంది. ఒక చేతితో కళ్లజోడు తీసి కళ్ళు రుద్దుకొని, మళ్ళీ కళ్లజోడు పెట్టుకొని ఉత్తరం చదువసాగాడు.


'నా ప్రాణమైన కన్నయ్యా..


నువ్వు వస్తావని నా మనసుకు తెలుసు. అందుకే ముందే ఈ ఉత్తరం రాస్తున్న. ఎదురుచూపులతో నా గుండె బరువెక్కిపోయిందిరా.

మన ఆస్తి తాలూకా దస్తావేజులు, బంగారం, అంతా నీకోసం భద్రంగా లాకర్లో దాచి ఉంచాను. తీసుకో..

నీకు అన్నీ ఉన్నాకూడా ఎందుకోసమో పరుగు పెడుతూ నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయావు. కానీ, మరిచిపోయి ఉండాల్సింది కాదు. నీకోసం నేను తపించిపోయినట్లు  

నీ పిల్లలకోసం, వారి ప్రేమ కోసం నువు తపించకూడదని ఆస్తి మొత్తం పెంపు చేసి ఉంచాను.

ఈ ఆస్తిని జాగ్రతగా కాపాడుకో.

నీ పిల్లలు నిన్ను వదిలి వెళ్ళకుండా చూసుకో..


చివరగా ఒక్క ఒక్కటే చిన్న కోరిక. నేను చనిపోతే, నా అస్థికలు నీకు ఇష్టమైన కాశీలోని గంగలో కలుపు చాలు.


ప్రేమతో...

మీ అమ్మ.'


గుండెలవిసేలా ఏడుస్తూ ఉత్తరాన్ని ముఖంకి హత్తుకొని 'అమ్మా.. నేను తప్పు చేశానమ్మా.'అని ఏడుస్తున్నాడు రాఘవ.


         «సమాప్తం»


Rate this content
Log in

Similar telugu story from Classics