STORYMIRROR

KANAKA ✍️

Drama Tragedy Inspirational

4  

KANAKA ✍️

Drama Tragedy Inspirational

నేను లేకపోతే

నేను లేకపోతే

3 mins
12

"నేను లేకపోతే "


జీవితపు చివరి క్షణం.

నా కళ్ళ ముందు దృశ్యం ఆస్పష్టంగా కనిపిస్తుంది .....


నా వాళ్లందర్నీ చివరి సరిగా చూడాలి అనిపిస్తుంది నా కొడుకు ,కూతురు గుర్తు వస్తున్నారు.


నేను పోతే నా భర్త ,ఏమి అయిపోతాడో ,నేను పోతునందుకు కాదు బాధ నేను లేకుండా ఎలా బ్రతుకుతాడో అని బాధగా ఉంది..

చిన్న పని కూడా చేసుకోవటం తెలియదు

ఇప్పటివరకు వంట గదిలోకి తొంగి కూడా చూడలేదు .

నేను లేని జీవితం ఆయనకి నరకంలో ఉనట్లు ఉంటుంది ఏమో .


ప్రాణంలా ప్రేమించిన వాడు నేను లేకుండా ఎలా ఉంటాడో ?అని బాధతో ఏదో కన్నీటి తెర మెల్లగా నన్ను కప్పేస్తుంది ..


నా బాల్యం ,యవ్వనం ,వృద్ధాప్యం ,నేను సాధించిన విజయాలు ,నా బాధలు నేను అనుభవించిన మంచి, చెడు అన్ని వదిలేసి వెళ్లిపోవాల్సిన క్షణం ఆసన్నమైంది ..


నా ఊపిరి ఆగే చివరి క్షణం...

నా స్పర్శ ఇంకా పూర్తిగా పోలేదు

నా కంటి నుండి జారిన కన్నీటి చుక్క నా చెవిని తాకుతున్న స్పర్శ నాకు తెలుస్తుంది ....


నాకు దుఃఖం ఎక్కువ అవుతుంది 

కానీ ,బాధ పడే శక్తి కూడా లేదు ...


మనసు మాత్రమే అటు ,ఇటు ఊగిసలు ఆడుతుంది ....


ఎవరికోసమో నా ఎదురు చూపు, ప్రాణం పోకుండా చూస్తూ ఉన్నది ఏమో తెలియదు, "నా కళ్ళు పూర్తిగా ముసుకు పోయాయి చెవులు మాత్రం వినిపిస్తున్నాయి" .


డాక్టర్ అనుకుంటా నాడీ పట్టుకు చూశారు,

"ఇంకా ప్రాణం ఉంది" అని నా చేతిని వదిలేశారు ప్రాణం ఉన్నా ,కట్టేలా పడిపోయింది.


అందరూ ఎదురుచూస్తుంది నా ప్రాణము పోతే మిగిలిన పనులు చేసుకోవచ్చు కదా అని ,ఎన్ని రోజులు ఈరోజా ,రేపా అని పోయే నా ప్రాణం కోసం ఎదురు చూస్తారు ?


అంత సేపు ,అన్ని రోజులు ఎవరు మాత్రం ఎదురు చూస్తుంటారు పోయే ప్రాణం ముందు పెట్టుకొని కాపలా కాస్తూ..


"రాధమ్మ చాలా మంచిది ,నాకు ఏమి కావాలి అని అడిగినా సహాయం చేసేది" అని నా కోడలితో చెబుతుంది పక్కింటి అలివేలుమంగ. 


"వారం నుండి ప్రాణం పోకుండా ,కొట్టుకుంటూ ఎదురు చూస్తోంది ఎవరి కోసమో "అన్నది మళ్ళీ కళ్ళు తుడుచుకుంటూ. 


బాధ పడకు మాధవ,"రాధమ్మ నీకు ప్రాణం అని తెలుసు దేవుని నిర్ణయం మనం అంగీకరించాలి తప్పదు కదా!" అని మా వారి స్నేహితుడు ఆయన్ని ఓదారుస్తున్నట్లు బుజం తడుతూ అన్నాడు ..


అప్పుడు ఆయన నా చేయి పట్టుకొని ఉన్నారు.

మా పెళ్లి రోజున పాణిగ్రహణం అప్పుడు నన్ను అలాగే పట్టుకున్నారు..

ఇప్పుడు అది గుర్తు వచ్చి కన్నీరు జలజల రాలాయి.


నలభై ఏళ్ల కాపురంలో నా కొంగు పట్టుకు తరిగిన నా మాధవ ఇప్పుడు నేను లేకుండా ఎలా ఉంటారో పిచ్చి మారాజు ఆయన చేతిని గట్టిగా పట్టుకున్నా ..


పక్కన ఉన్న నా పెద్ద కొడుకు కంటిలో కన్నీటి పొర లీలగా కనిపిస్తుంది ..


మనవరాలు నా కాళ్ళు నొక్కుతుంది .

మనవడు మౌనంగా నన్నే చూస్తూ ఉన్నాడు.


వారం నుండి ఇంటిలోవారికి నిద్రాహారాలు లేవు నేను బ్రతికితే బాగుండు అనుకునే వారి కంటే, పోతే మా మిగిలిన కార్యక్రమాలు చేసుకోవచ్చు అనుకునే వారే ఎక్కువ అవుతున్నారు...


రాత్రి నాకు తోడుగా ఎవరు ఉంటారు అని నా కోడలు అడుగుతుంది వారం నుండి జరుగుతున్న తంతుకి ఎంతలా కాపలా కాస్తారు? ....


నా ప్రాణం కాపాడాలి అని అందరి అశ

కానీ పోయే ప్రాణం ఎవరు కాపాడగలరు??


నా గదిలోకి చీకటి నెమ్మదిగా ప్రవేశించింది.

నా దెగ్గర నుండి అందరూ వెళ్లిపోయారు ...


రాత్రి అయ్యే కొలది ఒంటరి తనం తేలులా పాకుంటు వస్తుంది ..నా గదిలో గడియారం కూడా ఆగిపోయింది అలాగే ఒంటరిగా పడుకున్న ...


దాహం వేస్తుంది నీళ్లు అందించేవాళ్ళు లేరు తెచ్చుకునే ఓపిక లేదు ..


బ్రతుకు చివరి మజిలీ ప్రాణం పోకుండా నాతో ఆడుకుంటుంది .


చివరి క్షణం బరువైన మనసుతో ,తేలిక పడుతున్న శరీరంతో ఉన్న నాకు దేవుడి పిలుపు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తూ నేను అలాగే పడుకొని ఉన్నాను ....


"సమాప్తం కోసం ఎదురు చూస్తూ,నా బ్రతుకు చివరి పేజీకి వచ్చిన పుస్తకంలా ఉంది."


నిశ్శబ్దం నాకు చాలా ఇష్టం

ఇప్పుడు అదే నిశ్శబ్దం భయపెడుతోంది. 


బంధాలు తెంచుకోవటానికి నా మనసు ఆగికరించటం లేదు అని నాకు అర్ధం అవుతుంది.అందుకేనేమో కొట్టుకుంటూ ఉంది..

మనసుకు తెలుసు,

మనసు వెళ్లిన చోటికి మనిషి వెళ్లకోడదు అని కానీ, "నేను లేకపోతే?" అనే ఆలోచన నన్ను నా వారి నుండి దూరం చెయ్యటం లేదు ...


ఆ దేవదేవుడిని కోరుతున్న "నా వాళ్ళు, నా కోసం బాధపడకుండా, నన్ను తీసుపో తండ్రి .".ఈ భవబంధాలు నుండి విముక్తి ప్రసాదించు..


నా కళ్ళు అలాగే మూసుకొని ఉన్నాయి .

నా చెవులుకి శబ్దాలు వినిపించటం లేదు .

నా శరీరం తేలిపోతుంది..


ఊపిరి తీసుకోవటం భారంగా ఉంది .

ఇప్పటివరకు నా చుట్టూ ఉన్న నా వాళ్ళని

నా దెగ్గర లేకుండా చేశాడు ...


బహుశా నా ఊపిరి ఆగిపోవటం కళ్లారా చూస్తే తట్టుకోలేరు అని ఏమో ?? 


చిన్నగా నా ప్రాణం ఆగుతుంది.నాకు అర్ధం అవుతుంది .

ఇవి జీవితపు చివరి క్షణాలు అని 

నా ఆయువు గాలిలో కలిసిపోతుంది అని 

నా జీవుడు గాలిలో ఐక్యం అయిపోతుంది.


శాశ్వతమైన నిశ్శబ్దం .

నిశ్శబ్దలో కలిసిపోయిన నా ప్రాణం 

దేవ దేవుడి పాదాల చెంతకు పయనం 

అవుతున్న సమయం మనసులోనే 

"నా జీవికి మరుజన్మ లేకుండా చేయి తండ్రి అదే నా చివరి కోరిక " అని వేడుకున్న...


సమాప్తం .

****************


రచన ;.కనక



Rate this content
Log in

Similar telugu story from Drama