ఎదురు చూపు
ఎదురు చూపు
ఎదురుచూపు
నీకు ఎన్ని సార్లు చెప్పాలి పని చేయడానికి తొందరగా రమ్మని అని సుబ్బులు మీద విరుచుకు పడింది సుజాత..
ఏంటి అమ్మ గారు అలా అంటారు మీ ఇంటికేకదా నేను తొందరగా వచ్చేది ...
ఏదో ఈరోజు లేట్ అయింది రాత్రి మా ఆయన తాగొచ్చి నానాయాగీ చేశాడు అందుకే ఉదయం లేగవ లేక పోయాను అన్నది సుబ్బులు ...
సరే సరే తొందరగా వెళ్లి పని తొందరగా చేసుకో అయ్యగారు కేరళ నుండి తిరిగివచ్చే సమయం అయింది ట్రైన్ వచ్చేసి ఉంటుంది అన్నది సుజాత ..
అవునామ్మా అయ్యగారు వచ్చేస్తున్నారు అన్న మాట అని జుట్టు ,చీర సరి చేసుకున్నది సుబ్బులు ...
ఒక్కసారి పై నుండి కిందకి చూసింది సుజాత , సబ్బులు ని .....సిగ్గు పడి లోపలికి వెళ్ళింది సుబ్బులు...
సుధాకర్ కేరళ వెళ్ళాడు ఆఫీస్ పని మీద వారం రోజు ఎలా గడిచింది తెలియలేదు ...
తనకోసం ఎదురు చూస్తూ తన మాటలు తలుచుకుంటూ ,తన ఆలోచనతోనే గడిపేసింది సుజాత ...
ఎప్పుడొస్తావ్ ,ఎప్పుడొస్తావ్ అని పదేపదే ఫోన్ చేస్తూ మెసేజ్ చేస్తూనే ఉంది ...
సుధాకర్ వచ్చే టైం దగ్గర పడుతుంటే ఆమెలో ఏదో తెలియని ఆత్రం మొదలైంది...
ఇల్లంతా శుభ్రంగా సర్దింది ...
మొక్కలకి నీళ్లు పోసి శుభ్రంగా దుమ్ము లేకుండా ఆకుల మీద కూడా నీళ్ళు పోసింది ...
సుధాకర్ కి మొక్కలంటే ప్రాణం మొక్కలు ఏ ఒక్కటి బాగోపాయినా సరే చాలా బాధ పడతాడు...
ట్రైన్ వచ్చిందో లేదో అని ఒకసారి చెక్ చేసుకున్నది ఇంకా 10 నిమిషాల్లో ప్లాట్ఫాం మీదకు వస్తుందని అని ఉన్నది ట్రైన్ స్టేటస్ లో ...
ఎందుకో ఏమో కానీ భర్త ఊరు వెళ్లి తిరిగి వస్తుంటే ఎగ్జైట్మెంట్ వేరు ..
ఇంట్లోకి బయటికి అటూ ఇటూ తిరుగుతూనే ఉంది.. ఎందుకమ్మా మీరు అటు ఇటు తిరగడం ..
అయ్యగారు లోపలకు రాకుండా పోతారా ,లేదా వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారా?? ఏదో ఒకటి అంటూ సరదాగా నవ్వించే ప్రయత్నం చేస్తుంది సుబ్బులు ...
ఉండవే వారం రోజులు అయింది ఆయాన్ని చూసి అన్నది వంటగదిలోకి వెళ్లి ...
అదేంటమ్మా నేను వచ్చే ముందు వీడియో కాల్ లో మాట్లాడుతున్నారు వారం రోజులు అయింది అంటావేంటి అన్నది సుబ్బులు బుగ్గ మీద చేయి వేసి నొక్కుకుంటూ...
వీడియో లో చూస్తే, పక్కన ఉన్నట్లేనా ...??
మన పక్కన ఉంటేనే మనకు ఆనందం .
ఆయన ఉన్నప్పుడు పోట్లాడుతూ ,గిల్లికజ్జాలు ఆడుకుంటూ ఉంటాం తను లేకపోతే ఆ విలువ ఇప్పుడే తెలిసింది తను లేని క్షణాన్ని నేను భరించలేను అనిపిస్తుంది అన్నది సుజాత గుమ్మం కి జరబడి ...
హా అయితే ఇప్పుడు గొడవ పడరా ఏమిటి అన్నది సుబ్బులు ...
అది ఎలా కుదురుతుంది ,గొడవలే ప్రేమకి పునాది అన్నది ...
గుమ్మం ముందు ఆటో ఆగిన శబ్దం అయింది ...
వెంటనే సుజాత బయిటకు పరిగెత్తింది ..
ఎదురు ఇంటి లక్ష్మి గారు ...
ఏమిటి సుజాత అంత హడావుడిగా బయటకి వచ్చావు అన్నది లక్ష్మి ...ఏమి లేదు పిన్ని గారు ,అని లోపలకి వెళ్ళిపోయింది ..
ఏమిటో పిచ్చి పిల్ల మొగుడు కోసం ఎదురు చూస్తుంది ,చెప్పటానికి సిగ్గు మా రోజులో ఇలా లేము అమ్మ ,...
వచ్చినప్పుడే ,పిలిచినప్పుడే అన్ని అని ఒక నిట్టూర్పు విడిచి లోపలకి వెళ్ళింది ...
ఇంకా రావటం లేదు ఏమిటి ,ఫోన్ చేస్తే ఊరుకోను,నేను వచ్చే వరకు ఫోన్ చెయ్యవద్దు అన్నడు ఎలా ఇప్పుడు అనుకుంది సుజాత ...
పాడు ఆటో ఒక్క ,ఆటో కూడా రావటం లేదు ,..
ఆయనకోసం చాలా వంటలు చేశాను ,చల్లారి పోతున్నాయి ...
ఆకలి కూడా వేస్తుంది
వచ్చిన తర్వాత కలిసి తినాలి అనుకున్న ,అని గిన్నెలు దగ్గరకి వెళ్ళటం ,వొద్దు లే వచ్చిన తర్వాత తినవచ్చు అనుకొని మళ్ళీ బెడ్ రూం లోకి వెళ్ళటం అదే సరిపోయింది సుజాతకు ...
పని అంతా అయిపోయింది ,అని లోపలకి వచ్చింది సుబ్బులు ,చెంగుతో చేతులు తుడుచుకుంటూ ....
సరే అయితే వేళ్ళు రేపు తొందరగా రా అన్నది సుజాత ..
లేదు ,అమ్మ కొంచం సేపు కూర్చుని వెళ్తా అన్నది సుబ్బులు కింద నేల మీద సతికిలబడుతు ...
అది ఏమిటి ఇంటికి వెళ్లావా ??
మొగుడు పెళ్ళాలు అన్నాక ఏదోవొకటి వస్తూ ఉంటుంది ,ఆ మాత్రానికే ఇంటికి వెళ్లకుండా ఇక్కడ కూర్చుంటే ఎలా ??...వేళ్ళు మీ ఆయన నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు అంది సుజాత ...
వాడు నాకోసం ఏమి ఎదురు చూస్తూ కుకొడు , బెగా ఇంటికి వాస్తే ఇంకేమి అన్నది సుబ్బులు ...
అలా కాదే మొగుడి మీద అలిగి ఇక్కడే కూర్చుంటే ఎలా అన్నది బుజ్జగిస్తూ ...
నేను వాడి మీద అలిగి ఇక్కడ కూర్చోలేదు అమ్మ ,సుధాకర్ బాబు వస్తున్నారు గా ,చూసి వారం అయింది ...చూసి పోదాం అని అన్నది సుబ్బులు చెంగు నలుపుతూ ...
ఆ .....ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటావా అని నోరెళ్ళబెట్టి చూసింది సుజాత.....
సుజీ నేను వచ్చేసా అని లోపలికి వచ్చి గట్టిగా సుజాతను పెట్టుకున్నాడు సుధాకర్....
మంచం దగ్గర కింద కూర్చున్న సుబ్బులు అయ్యగారు అని పైకి లేచింది....
ఓసినీ దుంప తెగా నువ్వేంటె ఇక్కడ అంటూ సుజాతను ఒక్క తోపు తోసాడు సుధాకర్ ...
సుజాత వెళ్ళి మంచం మీద పడింది...
అబ్బా నా నడుము అంటూ నడుం పట్టుకుంది...
అయ్యో అలా అనకే ఇప్పుడు చాలా పని ఉంది అన్నడు సుజాతను లేపబోతు సుధాకర్....
సుబ్బులు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బయటకి వెళ్ళిపోయింది..
