నూతన సంవత్సరం
నూతన సంవత్సరం
నూతన సంవత్సరమా నీకు ఇదే స్వాగతం.
రాశీభూతమైన ,సౌందర్యముతో
ముగ్ధమనోహరమై,సింధూరయుక్తమైన ముఖారవిందముతో,
ప్రేమ,కరుణ,ఆప్యాయత,
ఔదార్యములమేళవింపుతో,
వజ్రవైఢూర్య మరకతమాణిక్య నీల,గోమేధిక,పుష్యరాగముల శోభతో,
దయాంతరంగ, అమ్రృతచూడ్కులతో దేదీప్యమానవై ధ్రృగ్దోచరమవ్వు దేవీ
పూర్ణేందుచంద్రికా, గజ్జలందియల ఘల్లుఘల్లనిమ్రోయ దివ్య పాదారవిందములకు
శత సహస్ర ప్రణామములతో
సంక్రాంతిలక్ష్మికివే
స్వాగత అక్షరసుమార్చనతో
స్వాగతం సుస్వాగతం ...
నీ ముగ్ధ మనోహర శోభిత నయనం
కావాలి అందరిపై వర్షించే వరాల సిరులై
నీ మనసు హలో గిరిలో అందరికీ
శాంతి ప్రసాదించుమా..
నీకై స్వాగత సత్కారాలతో వేచెను జానులు
స్వాగతం స్వాగతం అనుచ్చు..
రచన
కనక
