STORYMIRROR

KANAKA ✍️

Drama Classics Inspirational

4  

KANAKA ✍️

Drama Classics Inspirational

నేబానిసనైపోయాను

నేబానిసనైపోయాను

4 mins
8

నేబానిసనైపోయాను


"చదువు ఏప్పుడూ మంచే నేర్పిస్తుంది కానీ నేర్చుకునే విధానంలోనే తేడా ఉంటే ,మనిషిని పతనం చేస్తుంది..


అవును, నేను బాగా చదువుకున్న కానీ, చదువు నాకు ఏమి నేర్పింది?


బీటెక్ చదివినా ఉపయోగం లేదు ..

ఇంట్లో గారాల బిడ్డను .నాన్న ఆశలన్నీ నా మీదే కదా మరీ .


"ఒరేయి కేశవ నాకు పెళ్లయిన 15 ఏళ్లకు లేక లేక పుట్టావు .

మా ప్రేమ అంతా ధారపోసి నిన్ను పెంచుకున్నాము,


"నాకా వయసు అయిపోతుంది పనిచేసే ఓపిక నశించిపోతుంది రా కన్నా..

ఏదైనా ఉద్యోగం చూసుకొని నా భారం తగ్గించు నాన్న" అన్న నాన్న మాటలు ఇంకా నా చెవిలో మారుమ్రోగుతునే ఉన్నాయి. 


"కాలం నన్ను మర్చిపోయింది అనిపిస్తుంది. అందుకే అందరూ ముందుకు వెళుతున్నారు ఒక్క నేను తప్ప"..


నన్ను నడిపించే కాలం, నాకెందుకు దగ్గరగా చేరడం లేదో తెలియదు.

నాన్న అడిగిన మాట తీర్చే శక్తి నాకు రావడం లేదు ...


"ఓసారి నా చదువు నాకేమి నేర్పలేదా లేక నేను ఏమీ నేర్చుకోలేదా ?" అని సందేహం కలుగుతుంది .


కాలేజీ చదువంటే, ఆడుతూ పాడుతూ గడిపేసా.నాలుగేళ్ల కాలంలో తరగతి గదిలో గడిపిన కాలం, వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు .


నాన్నను డబ్బు కోసం అడిగిన క్షణం, ఆ డబ్బు అవసరమే కనిపించింది కానీ దాని వెనుక నాన్న కష్టం కనిపించలేదు ..


"ఇప్పుడు నాన్న పడిన కష్టం కనిపించినా ఆయన కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదు"...

 

"సరస్వతిని నిర్లక్ష్యం చేసిన నా చెంతకు,లక్ష్మీ ఎలా వస్తుంది?"..


"బద్ధకానికి, వ్యసనానికి వారసుడునయ్యాను.". 


"నిరంతర పోరాటంలో జీవితం ఈదడం రాని చేతకాని నిరుద్యోగిని నేను"...


"జీవిత వైకుంఠపాళీలో నిచ్చెన ఎక్కలేని సగటు మధ్యతరగతి మనిషిని "...


అయినా ,అమ్మానాన్న ఉన్నారు నాకు భయం లేదు ,ఇంకా కొంతకాలం నా జీవితానికి డోకా కాలేదు కదా ...


నాన్నకి ఓపిక ఉన్నా లేకపోయినా, పనిచేస్తూ,తను చస్తూ నన్ను బ్రతికిస్తాడు.


నా ఆలోచనలకి అడ్డం వస్తూ,పోస్ట్ అంటూ పిలుపు వచ్చింది..


నాకోసం కాదులే అడ్రస్ చూసుకో అన్నాను లోపల నుండి ..


"కేశవ అంటే మీరేగా మీకే ,"అంటూ గుమ్మంలో నుండి లోపలికి విసిరేసాడు ..


పాపం ఆ పోస్ట్ మాన్ కి కూడా నాలాగే సహనం నశించి ఉంటుంది.

కవర్ తీసి పేరు అడ్రస్ చూశాను కేశవ అని ఉంది.హా ! నా కోసమే అనుకొని మళ్ళీ నా గదిలోకి వెళ్ళిపోయాను..


అమ్మ కాఫీ కప్పుతో వచ్చింది.." ఏమిట్రా అది" అన్నది టేబుల్ మీద ఉన్న కవర్ చూసి ..

"ఏమో" అన్నాను,ఏదో పుస్తకం చదువుతూ.


ఏదో పుస్తకం కాదు, బుచ్చిబాబు గారి నవల "చివరకు మిగిలేది"చదువుతూ.


ఆ కథలో దయానిధికి నాకు దగ్గర పోలికలు ఉన్నాయి.


"ఏమో" ఏంట్రా ఏదైనా ఉత్తరం వస్తే తీసి చూడాలని ఆత్రం లేకపోతే ఎలా?రా ఏమిటో చూడు అంటూ నా చేతికి అందించింది.


 నా కోసం కాదులే అమ్మ అంటూ

నాకు ఉద్యోగం రాదని నాకు అర్థం అయిపోయింది .చదువుకున్న అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఎవరి తరం? అనుకున్న మనసులో .


నేను పుస్తకం చదువుకుంటుంటే మధ్యలో ఏంటమ్మా నువ్వు అంటూ అమ్మను కోప్పడుతూ ఆమె చేతిలో ఉత్తరం తీసుకున్న కోపంగా.


మన కోపం భరించేది అమ్మే కదా! ఆ ప్రదర్శన అంతా అమ్మ మీదే.


"జాగ్రత్తగా తెరువు లోపల ఉత్తరం చిరగకుండా కవర్ చింపు" అన్నది అమ్మ నా నిర్లక్ష్యాన్ని చూసి.


ఒకసారి ఆమెను చూశాను "ఆమె కళ్ళల్లో కనిపించిన ఆశ నాలో ఎందుకు లేదు?" అనిపించింది ఒకసారి .


అమ్మ చెప్పినట్టే ఉత్తరం చిరగకుండా జాగ్రత్తగా తీశాను..


ఉత్తరం చూడగానే ,నా కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి అక్షరాలు సరిగా కనిపించడం లేదు సంతోషంతో చేతులు, కాళ్లు వణుకుతున్నాయి...


 నన్ను చూసి అమ్మ ఏమైంది అన్నది.

"ఏమో" అన్నాను ఉత్తరం అమ్మ చేతికిచ్చి.


ఒక చేతిలో కన్నీళ్లు తుడుచుకుంటూ అమ్మ భుజం మీద చంటి బిడ్డల వాలిపోయాను.


"ఒరేయ్ నాన్న నీకు ఉద్యోగం వచ్చింది"రా అన్నది అమ్మ ఆనందంగా.


"కలా నిజమా అర్థం కాని స్థితి "ఉండు నీకు స్వీట్ చేసి తీసుకు వస్తాను అని అమ్మ వంట గదిలోకి వెళ్ళింది.పిచ్చి తల్లి కొడుకు మీద ప్రేమతో స్వీట్ చేసి పెట్టాలని.


రాత్రి 9 గంటలకు నాన్న ఇంటికి వచ్చాడు అమ్మ నా ఉద్యోగం గురించి నాన్నకు చెప్పింది .


నాన్న ఆనందంగా "నా కొడుకు ఏమనుకున్నావ్ "అన్నాడు మీసం మెలితిప్పుతూ గర్వంగా .


వ్యసనానికి,బద్ధకానికి బానిసై చదువు నిర్లక్ష్యం చేసినా,

నా చదువు నాకు జీవితం , జీతం ఇచ్చింది అనుకున్నా పొంగిపోతూ .


నా సంపాదన నాది అమ్మా, నాన్నకి పేయింగ్ గెస్ట్ ల కొంత డబ్బు ఇచ్చి, మిగిలింది నాకోసం బ్యాంకులో దాచుకుంటున్నాను రేపు పెళ్లయితే నాకు కావాలి కదా?అనే స్వార్థంతో 


సంవత్సరకాలం ఇట్టే గడిచిపోయింది ..


ఓ రోజు దారిలో, "ఏమయ్యా కేశవ ఉద్యోగం ఎలా ఉంది" అని రోడ్డు మీద పలకరించాడు ప్రకాశం బాబాయ్.


చాలా బాగుంది బాబాయ్ చాలా సంతోషంగా ఉన్న అని చెప్పాను.,


సంతోషంగా ఎందుకు ఉండవు, నీ వెనుక మీ నాన్న ఉంటే నీకు ఏ లోటు ఉండదురా , సంతోషంగానే ఉంటావు అన్నాడు భుజం తడుతూ.


నీకోసమే రా వాడి తపన అంతా 

నువ్వు చదువుకునేటప్పుడు నీకు డబ్బుకు లోటు లేకుండా వాళ్లు పస్తులు ఉండి నీకు డబ్బులు పంపారు ..


ఇప్పుడు ఉద్యోగం లేక నువ్వు చెడు వ్యసనాలకు బానిస అయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నావని పొలం తాకట్టు పెట్టి 

5లక్షలు నీ కంపెనీకి షూరిటీకట్టి నీకు లక్ష రూపాయలు జీతం గా వచ్చే ఉద్యోగం వేయించి వాడు నెలనెలా వడ్డీ కట్టుకుంటున్నాడు.


"మీ నాన్న మంచోడు రా, కానీ నీ విషయంలో మాత్రం చాలా గొప్పోడు "అన్నాడు ప్రకాశం బాబాయ్ నా భుజం తడుతూ.


నోటి మాట రాలేదు కళ్ళు మేఘములా వర్షిస్తున్నాయి.


ఇంటికి వెళ్లాను పడకుర్చీలో పడుకొని ఉన్న నాన్నను చూడగానే దుఃఖం సముద్రపు అలలు లాగా పొంగుకు వచ్చింది ..


నాన్న అంటూ నాన్న కాళ్ళ మీద పడిపోయాను. 


"నా కన్నీళ్ళతో నాన్న పాదాలు అభిషేకించాను" ..


ఎందుకు నాన్న నన్ను ఇంకా భరిస్తున్నారు ఉద్యోగం వచ్చినా నా స్వార్థంతో మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఉంటే నన్ను ఒక్క మాట కూడా అనకుండా అప్పులు తీరుస్తున్నావు ..


ఎందుకు నాన్న నేను క్షమించరానీ తప్పులు చేసినా ఇంకా నన్ను భరిస్తున్నావు అంటూ బోరున ఏడుస్తున్నాను...


ఎందుకు ఏమిటి రా నేబానినైపోయాను ,

నీ మీద ప్రేమకి . కన్న బిడ్డలకి తల్లిదండ్రులు ఎప్పుడూ బానిసలే కదా ! వారి ప్రేమకు బానిస లేరా..అమ్మా నాన్నగా అది మా బాధ్యత అంటూ నన్ను భుజం పట్టుకు పైకి లేపారు.


వెంటనే నాన్నను గుండెలకు హత్తుకొని ఇంక నువ్వు కష్టపడకు నేను నిన్ను నా కొడుకులా చూసుకుంటాను అన్నాను ..


వంటగది గుమ్మం దగ్గర నుంచొని చూస్తున్నా అమ్మ ,మా దగ్గరకు వచ్చి "మరి నన్ను" అన్నది నవ్వుతూ,.


 నువ్వు ఎప్పుడూ నా బంగారు తల్లివి, నా కూతురివి


అన్నాను, ఆమెను దగ్గరికి తీసుకొని .


ఇద్దరు నా భుజం మీద చంటి బిడ్డల్లా వాలిపోయారు .


ఇప్పుడు నాకు వీళ్ళిద్దరూ 

కొడుకు, కూతురు అయిపోయారు .


"పెంచితే పెరిగేది బిడ్డల ప్రేమ,

పెంచకుండానే పెరిగేది అమ్మానాన్న ప్రేమ"..


రచన 

కనక


Rate this content
Log in

Similar telugu story from Drama