Women's Diary

Comedy Romance Classics

3  

Women's Diary

Comedy Romance Classics

నువ్వేనా నా నువ్వేనా.. 1

నువ్వేనా నా నువ్వేనా.. 1

3 mins
434హాయ్ ఫ్రెండ్స్ నేను రాస్తున్న మొదటి ధారావాహిక..


అందరి ఇళ్ళలో టామ్ అండ్ జర్రి (tom and jarry) టీవీలో ఉంటాయి, కాని మనకి ఇంటిలోనే ఉంటాయి.. అనవసరంగా వీళ్ళకి సెలవలు ఇచ్చారు బయలుదేరవలసిన టైం అవుతుంది గొడవ ఆపటం లేదు...


అత్తయ్య మీరు ఉండండి వాళ్ళనీ నేను ఆపుతాను.. ఆగేలగా లేరు వదిన..


ఇంతలో రేణు విసిరిన ఫోటో ఫ్రేం ఇద్దరి మధ్యలో వెళ్ళిన శారద దేవికి తగలబోయి కొంచంలో తప్పుతుంది ప్రమాదం..


ఎం జరుగుతుంది ఇక్కడా రఘు మాటల్లో కోపం చూసి మౌనంగా ఉన్నారు అందరు..


అది కాదు అన్నయ్య మీరు పదండి రెడి కావాలి కదా మాట మారుస్తుంది అంజలి పిల్లలని ఏమైనా అంటారేమో అని..


నువ్వు ఏమి మాట్లాడకు అంజలి కోపంగా చూస్తున్నాడు భూపతి..


కొడుకు మాటలకి శారద దేవి అడ్డుపడుతుంది పిల్లలు ఏదో సరదాగా అంటూ..


అమ్మ నువ్వుండు ఇంకొంచం ఉంటే నీ తల పగిలిపోయేది ఈ రోజు వీళ్ళు హద్దులు దాటేసారు ఇద్దరు కోపంగా చూస్తున్నారు రఘు, భూపతి..


టామ్ అండ్ జెర్రీ మాత్రం ఒకళ్ళని ఒకళ్ళు కళ్ళతోనే తిట్టుకునే పనిలో ఉన్నారు..


ఎం చేసిన వీళ్ళు గొడవ పడటం అపడం లేదు ఎప్పుడు లేనిది భుపతి కుడా కోపంగా ఉన్నాడు అని శారద దేవి మనసులో అనుకుంటు అక్కడి నుండి వెళ్ళిపోతుంది..


మిగిలిన వాళ్ళు వెళ్ళి కారులో కూర్చుంటారు..


అసలు ఎందుకు ఒకరంటే ఒకరికి పడదు వాళ్ళ అమ్మా నాన్నలు ఏమో ఎంతో ప్రేమగా ఉంటారు, కానీ వీళ్ళు ఇలా అని శారద దేవి కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంది మనసు చాలా ఏళ్ళ వెనక్కి వెళ్ళీపోయింది, కారు వేగం తెలియటం లేదు..


***************************************************


ఎవరైనా నిద్ర లేగవగానే దేవుణ్ణి చూస్తారు నువ్వు ఎంటి అన్నయ్య దీని ముఖం చూస్తావు..


ఎం లేదు సీత నా ముద్దుల మేనకోడలు ముఖం చూస్తే రోజు అంత బాగుంటుంది ఈ లోపు పాపా లేచి గుడ్ మార్నింగ్ మామయ్య అని దుప్పటి ముసుగు తీస్తుంది..


ఆ పాప పేరు హనీ భూపతి రాయుడి చెల్లి కి ఒక్కగాని ఒక కూతురు అసలు పేరు రేణుక అందరూ రేణు అని పిలుస్తారు కానీ ఒక్కడు మాత్రం రాక్షసి అని పిలుస్తాడు తనే భూపతి గారి ముద్దుల కొడుకు విజయ్..


భూపతి కి తన చెల్లి సీతకి ఒకే ఏడాదిలో పెళ్ళిళ్ళు జరిగాయి.. భూపతికి దగ్గర బంధువు అయిన రఘు రామ్ చిన్నతనంలోనే అందరికి దూరంమై వాళ్ళ ఇంటిలోనే పెరిగాడు తన మంచితనం చూసి చెల్లి సీతని ఇచ్చి పెళ్ళి చేసాడు..


ఎంత కాలం ఇలా ఊరిలోనే ఉండాలి అని ఇద్దరు కలిసి సిటీ కి వచ్చి వ్యాపారం మొదలు పెడతారు..


ఈలోగా భూపతి కొడుకు పుడతాడు బిజినెస్ బాగా నడుస్తుంది..


తన చెల్లికి కూడా పాప పుడుతుంది ఆ తరువాత బాగా లాభాలు వచ్చాయి రెండు సంవత్సరాలకి పెద్ద కంపెనీ పేట్టాలి అని, ఏ పేరు పెట్టాలో ఆలోచనలో పడ్డారు..


మీ పిల్లల పేరు పెట్టండి వాళ్ళు పుట్టాకే మీకు ఈ లాభాలు వచ్చి ఇంతటి వాళ్ళు అయ్యారు రేపు వీళ్ళు పెరిగి పెద్దవాళ్లు అయ్యాక వాళ్ళకి పెళ్ళి చేస్తా సరిపోతుంది అని సలహా ఇస్తుంది శారదా దేవి..


భూపతికి రఘు కి శారదా దేవి మాట వినగానే చాలా సంతోషించి వీ ఆర్ (VR) టెక్సటైల్స్ అని పేరు పెడతారు..


బిజినెస్ బాగా జరుగుతుంది ఎప్పటికైనా తమ పిల్లలు ఒకటవుతారు అని ఇద్దరికి వేరు వేరు ఇల్లు ఎందుకని ఒకటే ఇంటిలో ఉందాం అని భూపతి గారి భార్య అంజలి దేవి అన్నది..


రోజులు గడిచాయి బాగా పెద్ద వాళ్ళు ధనవంతులు అయ్యారు పిల్లలు పెరిగారు పది సంవత్సరాలు గడిచాయి..


వీళ్ళు అనుకున్నది జరుగుతుంది అనే నమ్మకం లేదు పెద్దవాళ్ళు బానే ఉన్నారు పిల్లలకి మాత్రం పడదు ఎదో అల్లరి బాగ గొడవపడతారు ఇద్దరికి ఒకటే కావాలి అక్కడ మొదలు పెడతారు ఇంక అంతే, పిల్లలు కదా అని వదిలేస్తారు..


పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు వాళ్ళ మద్య గొడవలు పెరిగాయి..


కారు హరన్ సౌండ్ ఈ లోకంలోకి వస్తుంది శారద దేవి..


అసలు నిన్నటి నుండి వీళ్ళు గొడవపడుతూనే ఉన్నారు అందుకే అమ్మా వాళ్ళని ఒకే కారులో రమ్మని పనిష్మెంట్ ఇచ్చాను..


నేను దానీ గురించి ఏమి ఆలోచించటం లేదు భూపతి..


మరి ఎందుకు అత్తయ్య ఆ దిగులు అని రఘు అడుగుతాడు..


ఎం లేదు అల్లుడు గారు పాపం మన వారణాసి గురించే, వాడు ఈరోజు అసలు ఇంటికి బతికే వస్తాడా, లేదా అని..


అదేమిటి అమ్మా వాడు బానే ఉన్నాడు పొద్దున్న అమాయకంగా అడుగుతుంది సీత..


వాడు బానే ఉన్నాడే కానీ మన టామ్ అండ్ జర్రి (tom and jarry) వాడితో ఉన్నారు..


అందరు ఆ మాటలకి నవ్వుతారు..


మీ నవ్వులు బానే ఉన్నాయి కానీ నా దిగులు అది కాదు మనసులో అనుకుంటూ కళ్ళు తుడుచుకుంటుంది శారద దేవి ఎవరికీ కనిపించకుండ..


అసలు నిన్న చిన్న గొడవే అది పెద్దది అయింది..


మళ్ళి తన ఆలోచను నిన్నటికి వెళ్ళాయి వద్దు అనుకున్న అవే గుర్తుకు వస్తున్నాయి..


నిన్న....

తెల్ల వారగానే మొదలైంది..


ఇంకా ఉంది..


Women's Diary..

Rate this content
Log in

Similar telugu story from Comedy