Women's Diary

Drama Romance Classics

4  

Women's Diary

Drama Romance Classics

నువ్వేనా..నా నువ్వేనా.. 6

నువ్వేనా..నా నువ్వేనా.. 6

3 mins
348*గమనిక :- నువ్వేనా నా నువ్వేనా 5 వ భాగం పొరపాటున కవిత లా సేవ్ అయింది గమనించగలరు...🙏🙏


ఇంటికి వెళ్ళకుండా ఇక్కడేం చేస్తున్నావు... ఏంటా పరుగు..


 అది.. అ..దీ.. డాడ్.. అని కంగారుగా చూస్తుంది హిమ..


ఈ లోగా ఎక్కడికి పరుగు అంటు వరుణ్ అక్కడికి వచ్చేశాడు..


చచ్చాం అనుకుంటూ తల పట్టుకుని వరుణ్ కి రావద్దు అని సైగ చేసినా అర్ధం కాక వాట్ మేడం అంటు భుజం మీద చేయి వేసి ఎదురుగా ఉన్న హిమ డాడ్ నీ హాయ్ వర్మ సర్ అని విష్ చేస్తాడు..


వర్మ అప్పటికే కోపంగా చూస్తున్నాడు..


వర్మ కోపం దేవుడా... నువ్వు నిజంగానే ఉన్నావా నన్ను ఇలా బుక్ చేశావు అనుకుంటూ ఓ వెర్రి నవ్వు నవ్వి ఎదో మంత్రం వేసినట్టు మాయమైపోతాడు వరుణ్..


వస్తున్న నవ్వుని ఆపుకుంటూ వెళ్దామా హిమ అంటాడు కోపం నటిస్తూ..


ఓకే డాడ్ అంటు వర్మ వెనుక వెళ్తుంది హిమ..


వర్మ సర్ హిమని ఏమ్మన్న అన్నాడా అనే ఆలోచనతో ఇంటికి వెళ్ళిన వరుణ్ కీ, అంతా బానే ఉంది అని హిమ మెసేజ్ చేస్తుంది, అది చూసి హమ్మయ్య అని ఉపిరి పిల్చుకుంటాడు..


    ****


డిన్నర్ కి ఎం చేస్తున్నావు అత్తయ్య..నీకేం కావాలో చెప్పు అదే చేస్తా హాని..నాకు పూరి కావాలి ప్లీజ్ చేయవా ఆ సీతా దేవి వస్తే చేయనివ్వరు..


ఎంటే అమ్మ కూతుర్లు అని ఒకే సారి అంటున్నావా అని అక్కడికి వచ్చిన శారదా దేవి నీ హాగ్ చేసుకుని బానే కనిపెట్టావే ముసలి అంటుంది రేణు..


అయినా ఎప్పుడు లేనిది తమరు దారి తప్పి ఇలా వచ్చావు..ఎం లేదులే సీతా డార్లింగ్ వూరికే..ఊరికే ఎందుకు ఈ కూరలు కోసివ్వు అని రేణు చేతికి కూరగాయలు ఇస్తుంది సీత..అమ్మో నా వల్ల కాదు అమ్మ ప్లీజ్ నన్ను వదిలై..


రేపు నీ మొగుడుకి ఎం చేసి పెడతావు నేర్చుకో అంటుంది శారద దేవి..
చూడు శారద దేవి నేను వంట వచ్చినా వాడిని చేసుకుంటా..ఎడిచావులే ఇలా ఇవ్వు కూరలు నేనే కట్ చేసుకుంటా రేణు చేతిలో ఉన్న వాటిని తీసుకుంటుంది సీత..


బాధ పడకు సీతా డార్లింగ్ నాకు పెళ్ళి అయ్యాకా నీకు మా ఆయన అదే మీ అల్లుడు గారు కోసి పెడతారులే కూరలు సిగ్గు పడుతూ చెప్తుంది రేణు..మెలికలు తిరిగింది చాలులే ఆపు అంటు నవ్వుతుంది అంజలి..


అత్తయ్య నీకో విషయం చెప్పనా అమ్మ కన్నా నువ్వే అదృష్టవంతురాలివి..


ఏంటా అని వింతగా చూస్తుంది అంజలి..


అర్ధం కాలేదా అత్తయ్య కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అడుగుతుంది రేణు..లేదని తల అడ్డంగా ఉపుతుంది అంజలి...


అదే అత్తయ్య అమ్మకి అయితే ఒక్కడే అల్లుడు వస్తాడు కాని నీకు కనీసం నలుగురు కోడళ్ళు అయినా వస్తారు, తలా ఒక పని చేసి పెడతారులే..ఎంటే వాగుతున్నావు రేణు చేవి మేలిపేడుతుంది అంజలి..


అత్తయ్య... అదే నీ సుపుత్రుడి పని కాలేజిలో ఎప్పుడు అమ్మాయల వెనుక తిరిగుతూ ఉంటాడు..


రేణు... రేణు... ఇక్కడ ఉన్నావా ఆ మస్తాన్ లేడు అదే ఆ ముస్లిల్ కుర్రాడు నీకు ఈ లవ్ లెటర్ ఇవ్వమన్నాడు అని విజయ్ ఓ కాగితం రేణు చేతికి ఇచ్చి వెళ్ళిపోతాడు..ఎంటే ఈ పనిరేణు తల మీద మొట్టికాయ వేస్తుంది సీత..


హమ్మయ్య పడ్డయ్య.... నాకు ఇప్పుడు హ్యాపీ లేకపోతే నాని దగ్గర ఎం వాగావు వాడు గంట తినేసాడు నన్ను అంటు రేణు నీ కోపంగా చూస్తున్నాడు..


రేణు తల రుద్దుకుంటూ అమ్మ... సీతమ్మా... మస్తాన్ అంటే చిన్న పిల్లోడు సెకండ్ క్లాసూ..... చదువుతున్నాడు అయిన ఐఓఐ (ioi) ఏది చేప్పినా నమ్ముతావా అంటు కొపంగా నవ్వుతున్న విజయ్ దగ్గరికి వచ్చి ఇంతకీ నాని ఏమని అడిగాడు విజయ్ అని కళ్ళు ఎగరేస్తుంది..


ఛీ నిన్ను చంపేసినా తప్పులేదే అంటు రేణు గొంతూ పట్టుకుంటాడు..విజయ్ వదలరా దాన్ని అని అంజలి అరుస్తుంది..ఒరేయ్ నువ్వు నిజంగానే ఐఓఐ (ioi) అని పరుగున వెళ్ళిపోతుంది రేణు..


చూడమ్మా దాన్ని ఏమీ అనరు అదేమో నన్ను ఐఓఐ (ioi) అని వంద సార్లు అన్నది..విజయ్ ఎన్ని సార్లు అన్నా ఎవరికి ఐఓఐ (ioi) అంటె తెలియదు కదా వెళ్ళి పనిచూసుకో అసలే డిన్నర్ ఎం చేయాలా అని తెలియటం లేదు సర్ది చెప్తుంది అంజలి..


అంజలి మాతా ఆ రాక్షసి నీ వెనకేసుకొస్తావా దాని సంగతీ నేను చూసుంటా అది వేసుకునే రబ్బర్ బ్యాండ్, గాజులని వీరగొడితే అదే చచ్చిపోతుంది మనసులో అనుకుంటూ రేణు గదివైపు వెళ్తాడు..


*******


మ్యాగీ ఫొన్ రింగ్ అవుతూనే ఉంది ఎక్కడికీ వెళ్ళింది అని రూం మొత్తం చూస్తుంది అతిధి..మ్యాగీ కంగారుగా వచ్చి అతిధి చేతిలో ఫొన్ తిసుకుని మాట్లాడి పెట్టేస్తుంది..మ్యాగీ ఎవరి ఫొన్ లో అతిధి అడుగుతుంది..డాడ్ కాల్ చేశారు పద మెస్ వెళ్దాం లేకపొతే ఈ రోజూ ఆకలితో పోడుకోవాలి..


మెస్ నుండి తిరిగివస్తూ ఏదైనా పని ఉందా మ్యాగీ రేపు..అదేమీ లేదు అతిధి నీకేమైనా ఉందా పని..లేదు ఇందాక ఫోన్ లో మీ డాడీతో రెండు రోజులేగా ఇక్కడికి వచ్చి త్వరగానే పని మొదలు పెడతాను అని అన్నావు..


ఓసీని వినేసిందా అని మనసులో అనుకుని అదేమీ లేదు డాడీ బాగా చదవమని చేప్తే అలాగన్నాను అంటు అతిథి ముఖం చూస్తుంది తను నమ్మిందా లేదా అని..


అతిథికి నిద్ర పట్టదు ఎందుకో మ్యాగీ సమాధానం సరిగ్గ లేదు అనిపిస్తుంది..


పైగా వచ్చిన వేంటనే ఆ హిమ గ్రూప్ తో మాట్లాడడం నాకు నచ్చలేదు ఈ హాస్టల్ లో నాతో రూంలో ఉండి నాతోనే సరిగా మాట్లాడ లేదు వాళ్ళతో ఎప్పటి నుండో తెలిసినట్టు కలిసిపోయింది ఇలా అతిథి ఆలోచిస్తూ చెతిలో ఉన్న వాటర్ బాటిల్ కింద పడేస్తుంది..


ఆ శబ్దానికి మ్యాగీ నిద్రలోనే వాట్ అతిథి నిద్రపోకుండా ఏం చేస్తున్నావు అని అరుస్తుంది..నాకు నిద్ర రావటంలేదు మ్యాగీ..


హా నేను చూస్తున్న ఎదో ఐఏఎస్ (i a s) లాగా ఆలోచిస్తే నిద్ర ఎలా వస్తుంది...నేను నీ గురించే ఆలోచిస్తున్న మ్యాగీ ఐఏఎస్ (i a s) లాగా కాదు..అతిధి అలా అనే సరికి టక్కున లేస్తుంది దుప్పటి ముసుగు తీసి..
Women's Diary...


Rate this content
Log in

Similar telugu story from Drama