Varun Ravalakollu

Action Crime Thriller

4.8  

Varun Ravalakollu

Action Crime Thriller

డిటెక్టివ్-7

డిటెక్టివ్-7

4 mins
496


నేలంతా దుమ్ము కొట్టుకుపోయి వుంది..లోపలికి అడుగుపెట్టి అన్నాడు కాస్త భయపడుతోనే జేమ్స్ "మనకు జేమ్స్ సీక్రెట్ గా దాచిపెట్టిన సాక్ష్యం కావాలి. అది ఓ పెన్ డ్రైవ్ లో ఉన్నట్టు సమాచారం "అన్నాడు సిద్ధార్థ "ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో ఎలా కనిపెట్టడం? జేమ్స్ అన్నాడు డిటెక్టివ్ సిద్ధార్థ జేమ్స్ వైపు చూసి చెప్పాడు చిరునవ్వుతో "చనిపోయిన మీ ఫ్రెండ్ డేవిడ్ ను అడుగు" జేమ్స్ ఉలిక్కి పడ్డడు..డేవిడ్ ను తను అడగడమే? సిద్ధార్థ జోక్ చేస్తున్నాడా? "అడుగు భయ్యా .. నువ్వడిగితే తప్పకండా చెబుతాడు... "నింపాదిగా అన్నాడు సిద్ధార్థ జేమ్స్ కళ్ళు మూసుకున్నాడు... అడుగుతున్నావా? అడుగు ..."అన్నాడు డిటెక్టివ్ సిద్ధార్థ మనసులోనే డేవిడ్ ను అడిగిన ఫీలింగ్ వచ్చింది. కళ్ళు తెరిచి చూసి షాకయ్యాడు.. డేవిడ్ నడుస్తున్నాడు.. అతని అడుగుజాడలు దుమ్ము మీద ముద్రలుగా పడుతున్నాయి. ఒక్కక్షణం నమ్మశక్యం కానట్టు నేలవైపు చూసాడు.దుమ్ములో డేవిడ్ పాదం స్పష్టముగా కనిపిస్తుంది. ఒక పాదం ముందుకు కదిలి మరో పాదం ...జేమ్స్ ఒళ్ళు మరోసారి గగుర్పొడించింది. తనకే ఎందుకిలా జరుగుతుంది. సిద్ధార్థ ఎంత కామ్ గా వున్నాడు. అతనికి డేవిడ్ ఆత్మ మీద నమ్మకం ఉందా? అలా ఆలోచిస్తూ ఉండగానే డేవిడ్ పాదాల ముద్రలు డేవిడ్ బెడ్ రూమ్ వరకు వెళ్లాయి..బెడ్ రూమ్ తలుపు వేసి వుంది. ఇప్పుడు సినిమాలో చూపించినట్టు తలుపు కిర్రుమనే శబ్దంతో తెరుచుకుంటుందా? ఒక్కక్షణం కళ్ళు గట్టిగా మూసుకుని మెల్లిగా ఒకకన్ను తెరిచి చూసాడు. . అప్పటికే డిటెక్టివ్ సిద్ధార్థ తన దగ్గరున్న చిన్న సూదిలాంటి సాధనంతో బెడ్ రూమ్ తలుపు తెరిచాడు...జేమ్స్ వైపు చూసి .."నువ్వు బెడ్ రూమ్ తలుపు వైపు చూడడంతోనే అర్థమైంది. "డేవిడ్ తాళంచెవి తీసుకువచ్చి బెడ్ రూమ్ తాళం తీస్తాడని " నువ్వు ఎదురుచూస్తున్నట్టు వున్నావ్.." నవ్వుతూ అన్నాడు "ఈ మనిషి ఇలాంటి పరిస్థితిలోనూ ఎలా నవ్వగలుగుతున్నాడు ? అనే అనుమానం భయం ఆశ్చర్యం " అన్నీ కలిగాయి జేమ్స్ కు డిటెక్టివ్ సిద్ధార్ద డేవిడ్ బెడ్ రూమ్ లోకి అడుగుపెట్టాడు...అతని కళ్ళు చేతులు యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. పదినిమిషాల్లో పెన్ డ్రైవ్ దొరికింది. ప్లవర్ వాజ్ కింద కనిపించింది. జేమ్స్ ఆ ఇంట్లో ఆ బెడ్ రూమ్ లో డేవిడ్ తో కలిసి పేకాడిన సందర్భం గుర్తు చేసుకుంటూ ఉండగా....బెడ్ రూమ్ తలుపు టపటపా కొట్టుకున్నాయి. ఆ గాలికి టీపాయ్ మీద వున్న ప్లవర్ వాజ్ కిందపడింది భళ్ళున శబ్దం చేస్తూ.. అప్పుడు కనిపించింది ప్లవర్ వాజ్ కింద వున్న పెన్ డ్రైవ్. డిటెక్టివ్ సిద్ధార్థ జేమ్స్ వైపు తిరిగి "మనం వచ్చిన పని అయిపొయింది... మీ ఫ్రెండ్ కు థాంక్స్ చెప్పు వెళ్ళిపోదాం ? అంటూ గోడకు వున్న డేవిడ్ ఫోటో వైపు చూస్తూ " థాంక్యూ ఫ్రెండ్..చనిపోయి కూడా సాక్షాన్ని బ్రతికించావ్ "అన్నాడు జేమ్స్ డేవిడ్ ఫోటో వైపు చూసి..టేబుల్ మీద వున్న క్యాండిల్ తీసుకువచ్చి వెలిగించి కళ్లుమూసుకున్నాడు... ఇప్పుడతనిలో చిత్రంగా భయం లేదు... తర్వాత ఇద్దరూ బయటకు వచ్చారు... డేవిడ్ ఇంటికి తాళం వేస్తూ డిటెక్టివ్ సిద్ధార్థ చెప్పాడు.." డేవిడ్ కు వృద్ధురాలైన తల్లి ఉన్నట్టు.. ఆవిడ అనారోగ్యంతో ఉన్నట్టు తెలిసింది.చనిపోతూ కూడా డేవిడ్ మనకు మేలు చేసాడు.. ప్రభుత్వం తరపున అతని తల్లికి ఇల్లు సమకూరుతుంది. బ్రతికినంతకాలం ఆవిడకు సాయం అందుతూనే ఉంటుంది. " చెప్పాడు డిటెక్టివ్ సిద్ధార్థ "థాంక్యూ సర్ డేవిడ్ చాలా మంచివాడు"చెప్పాడు డేవిడ్ ఇంటివైపు చూస్తూ... డేవిడ్ తనవైపే నీళ్లు నిండిన కళ్ళతో చూస్తున్నాడు.మెల్లిమెల్లిగా అతని రూపం కనుమరుగవుతూ ఆకాశంవైపు పైపైకే వెళ్తుంది. ఇక డేవిడ్ తనకు కనిపించడని.. అతను అనుకున్న పని పూర్తయ్యిందని ఆ క్షణం అతనికి తెలియదు. సరిగ్గా అదేక్షణంలో... ఆ ఇంటిని చుట్టుముట్టిన మిస్టర్ డి అనుచరులు సిర్ర మీద జేమ్స్ మీద ఎటాక్ చేసి వాళ్ళు సేకరించిన సాక్ష్యాన్ని తీసుకుందామనుకున్నారు. మూకుమ్మడిగా చుట్టుముట్టబోయారు. అప్పుడే వీలవైపే చూస్తూ కనిపించింది ఒక శునకం. దానికళ్ళు ఎర్రగా వున్నాయి.నాలుక పొడవుగా వుంది.పళ్ళు రంపాళ్ల లా వున్నాయి. ఒక్కసారిగా వాళ్ళ మీదికి దూకింది...... *** మిస్టర్ డి అసహనంగా మాటిమాటికి తన మొబైల్ వంక చూసుకుంటున్నాడు." సిద్ధార్థ రాకతో తనకు సమస్యలు మొదలయ్యా యి " అన్న బలమైన ఫీలింగ్ ఉంది అతనికి. పైగా మిస్టర్ డి తనను తానూ కూడా నమ్మడు. ఎప్పుడైతే తనవాళ్లలోనే ఒక పోలీస్ ఇన్ఫార్మర్ వున్నాడని తెలిసిందో..అప్పుడే అసహనంగా ఫీలయ్యాడు. దానికి తగ్గట్టు తన డెస్ కు సిద్ధార్థ రావడం.. గురించి సిద్ధార్థకు తెలియడం..అంతా తన అనుమానాన్ని నిజం చేసేలా అనిపిస్తుంది. ( పెంపుడు కుక్క దయ్యం రూపంలో వచ్చింది! ఈ వార్త ...ఈ చాప్టర్ లోనే చదవండి) ఈపాటికి డేవిడ్ ఇంటి దగ్గరికి పంపించిన తన మనుష్యులనుంచి కబురురావాలి. అలా అనుకుంటున్నా సమయంలోనే అతని మొబైల్ రింగ్ అయ్యింది. " బాస్ డేవిడ్ ఇంటి ముందు డిటెక్టివ్ సిద్ధార్థను ఎటాక్ చేసి ఆ పెన్ డ్రైవ్ తీసుకుందామని అనుకున్నాం.. కానీ ఒక దెయ్యం కుక్క మమ్మల్ని తీవ్రంగా గాయపరిచింది " తను పంపిన అనుచరుల్లో ఒకడు చెప్పాడు " దెయ్యం కుక్కలేమిట్రా ? అయినా కుక్కలకు భయపడడం ఏమిట్రా ఫూల్స్.. అయినా మీ దగ్గర ఆయుధాలున్నాయిగా " కోపంగా అన్నాడు మిస్టర్ డి. " మేము ఆయుధాలు బయటకు తీసే సమయం కూడా ఇవ్వకుండా మా మీద విరుచుకుపడ్డాయి,,, ఒక్కోసారి ఒక్కో కుక్క రెండు కుక్కలయ్యింది " అవతల వాడు చెబుతున్నాడు " ఒరే నా ముందుకు వస్తే నేనే మిమ్మల్ని కాల్చి చంపుతాను.నా డాబర్ మెన్ కుక్కలకు ఆహారంగా వేస్తాను..బాగా తాగి వేషాలేస్తున్నారా? కోపంగా ఆ గది అదిరేలా పిచ్చి పట్టినట్టు అరిచాడు మిస్టర్ డి. " ఒట్టు బాస్ ఒక్క కుక్క రెండు కుక్కలయ్యింది...పళ్ళు కత్తుల్లా వున్నాయి.. కళ్ళు ఎర్రగా వున్నాయి " " ఒరే అపరా.. ముందు మీరు రండి ...మీ పని చెబుతా? హిస్టీరియా వచ్చినట్టు వూగిపోతూ అన్నాడు కోపంగా మిస్టర్ డి. అప్పుడే మిస్టర్ డి వాట్సాప్ నంబర్ కు ఓ ఇమేజ్ వచ్చింది. *** ఆ ఇమేజ్ వంక చూసి షాకయ్యాడు. అది కరీం ఇమేజ్... మిస్టర్ డి కరీం వంక చూసాడు.వాట్సాప్ లో వచ్చిన ఇమేజ్ లోని చొక్కానే వేసుకున్నాడు... ఆ ఇమేజ్ లో మూడవ బటన్ ( గుండీ) దగ్గర రౌండప్ చేసి ఉంది. పరీక్షగా చూస్తే తెలుస్తుంది... అదొక బటన్ కెమెరా..అని మిస్టర్ డి కరీం వంక అతని చొక్కా వంకే చూస్తున్నాడు.బాస్ తన వంక చూడడం ఎందుకో అర్థం కాలేదు. తమవాళ్లలోనే వున్న పోలీస్ ఇన్ఫార్మర్ ఎవరో తెలుసుకోవడంలో తన హెల్ప్ అడుగుతున్నాడా ? తాను తన బాస్ కోసం ఏదైనా చేస్తాడు... మిస్టర్ డి మిగితా ఆరుగురిని బయటకు పంపించాడు. ఆ గదిలో కరీం , మిస్టర్ డి మాత్రమే వున్నారు. " చెప్పండి బాస్... మీకోసమే నన్నేం చేయమంటారు.. మీకు వ్యతిరేకంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఆ నీచ్ కమీనే ఎవరో తెలుసుకుని సీక్రెట్ గా లేపేయమంటారా ? అడిగాడు కరీం మిస్టర్ డి కరీం వంకే చూస్తూ " నీ షర్ట్ బావుంది.. కొత్తగా..ఎప్పుడూ వేసుకోలేదనుకుంటాను .." పరీక్షగా కరీం వైపే చూస్తూ అన్నాడు వెంటనే ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఎందుకంటే " రెండు రోజుల క్రితం ఒకమ్మాయి పరిచయం అయ్యింది. తనంటే ఇష్టం అంది. ఆమె పుట్టినరోజుకు తనకు షర్ట్ కొనిచ్చింది. అది వేసుకోకపోతే ఒట్టు అంది..." కరీం కు అమ్మాయిల పిచ్చి. బాస్ కు అనుమానం ఎక్కువ. అందులోనూ తనదగ్గర పనిచేసేవాళ్ళు అమ్మాయిలకు దూరంగా ఉండాలంటారు. కావాలంటే అనుభవించి చంపెయ్..అంటాడు.. అలాంటిది ఒకమ్మాయి గిఫ్ట్ గా ఇచ్చిందని చెబితే... అందుకే వెంటనే ఓ అబద్దం చెప్పాడు.." ఈరోజు నా బర్త్ డే బాస్" సిగ్గుపడుతూ చెప్పాడు మిస్టర్ డి మాట్లాడలేదు...కరీం వైపు చూసి " వెరీ గుడ్.. హ్యాపీ బర్త్ డే" అన్నాడు షేక్ హ్యాండ్ ఇస్తూ... " థాంక్యూ బాస్... ఇంతకూ ఆ ఇన్ఫార్మర్ ..? "ఆ విషయం నేను చూసుకుంటాను...." అన్నాడు మిస్టర్ డి కరీం వెళ్తుంటే " మనసులో అనుకున్నాడు..బర్త్ డే లు రెండుసార్లు చేసుకుంటున్నావ్..ఒకే ఒక డెత్ డే నీకు ఫిక్స్ అయ్యింది... ఎందుకంటే కరీం బర్త్ డే ఎప్పుడో మిస్టర్ డి కి తెలుసు. (ఇంకా వుంది)Rate this content
Log in

Similar telugu story from Action