Harianiketh M

Tragedy Action Inspirational

4  

Harianiketh M

Tragedy Action Inspirational

అమ్మ డైరీలో బంగారు పేజీ

అమ్మ డైరీలో బంగారు పేజీ

2 mins
887


వాడు నాకొడుకు.నాకోసం పుట్టిన కొడుకు.నన్ను ధన్యురాల్ని చేయడానికి అవతరించిన కలియుగ అవతారం అనిపించింది అపుడు..ఎంత అల్లరి?ఊరికే తన్నుతూండేవాడు వాళ్ళమ్మని..ఎందుకిలా తన్నుతున్నాడని ఓ సారి కనిపెట్టేను..మాట కూడా తెచ్చుకోలేని వాడు,ఎంత జ్ఞానం పెంచుకున్నాడు?వాడికి పాలిచ్చిన తరువాత ఆమె పవుట సరిలేదు..లేవలేకుండా ఉన్న ఆమె,వాడు చూపిస్తున్న తపనకు అచ్చెరువొందింది..పవుట సర్దుకుంటూ ముందుకొచ్చిన ముంగురుల్ని సద్దలేని ఆమెను చూసి బోసిమవ్వు చిందించేడు..వెయ్యేనుగుల బలం అనిపించింది ఆ నవ్వు.ఏమైనా తప్పు ఉందా అమ్మలో నెమ్మదిగా అడిగింది..తలపైకి లేపుతూ అవ్...అంటూ బలంకొద్దీ నవ్వేడు.అమ్మయ్యా అనుకున్నాను.అయినా చెదరడం తప్పుకాదు..చెదిరినదాన్ని సరిచేయకుండా ఉండడం తప్పు అనేది వాడి ఉద్దేశ్యం అని రోజులవయసు నుంచి ఇప్పుడు ఈ డిగ్రీ అయిన వయసుకూ గమనిస్తున్న!..వాడి వస్తువులు,బట్టలు,పుస్తకాలు,చెప్పులు ఏవి సరిగా

లేకున్నా..బయటకు వెళ్లే పనున్నా,సర్దిమాత్రమే వెళ్ళేవాడు.అలాగే పెరిగేడు.

వాడి తపనకు తగ్గ సంపాదన ఇచ్చి ఉంటే,నా కొడుకు ఎక్కడో ఉండేవాడని వాళ్ళ నాన్న బాధపడేవారు.వాడు మాత్రం ఎప్పుడూ ఇది తక్కువ అయింది అని అడగలేదు.ఉన్నదానితో సర్దుకోవడం,పంచడం కూడా అలవాటు చేసుకున్నాడు.లాక్కుంటే ఒప్పుకునేవాడు కాదు.ఎన్ని దెబ్బలు తినయినా సాధించేడు ఇప్పటివరకు.

ఇక ఇపుడు సరయిన సమయం అన్నాడోసారి.

దేనికో విన్న ఆ మనసులు మొదట్లో దుఃఖంతో కూలినంత పని చేస్తుంటే...ఈ నీటిబిందువుని సముద్రపు అలల్లో కాదు నాన్నా! అమ్మ ఒడిలో ఇంకిపోనివ్వండి అన్నాడు..

మొదటిసారిలా మళ్ళీ నా హృదయం పులకించింది..

ఓ స్త్రీ ఇలా పరువు నిలబెట్టే భర్త కావలనుకుంటుంది.

అలాంటపుడు ఆ కొడుకును కన్న తల్లి ఇంకెంత అదృష్టవంతురాలో కదా!అన్నిటినీ మించి ఇపుడేస్తున్న అడుగువెనుక ఉన్న పరమార్థం, నేను అవుతున్నందుకు మరింత ధన్యురాలిని..ఆమ్మంటే ఇష్టంలేని పిల్లలు ఉండరు కానీ అమ్మకోసం ప్రాణాల్ని లెక్కచేయని వాళ్ళు కొందరే ఉంటారు..


ఆరోజు ఎవరూ ఊహించలేదు.చెప్పకుండా శతృమూకలు

విరుచుకుపడ్డాయి.కలికాలం కదా!మాటకి విలువ లేదు.

ప్రతిదానికీ దెబ్బకు దెబ్బ సమాధానం.సంధి ఫలితం శూన్యం.నా బిడ్డలు ,నేనంటే ప్రాణం ఇచ్చేవాళ్ళు అందరూ సరదాగా కుటుంబాలతో ఉన్నారు.పిల్లలుపుట్టిన సంతోషంలో ,ఇల్లు కట్టి ఒకరు,పెళ్లి చేసుకుని ఒక్కరూ,చేసుకుంటూ మరొకరు,అమ్మ మంచంపై ఉండగా ఒకరు,నాన్నలేని ఒకరు,అమ్మలేని ఒకరు,ఈ ఉద్యోగమే జీవనాధారమై ఒకరు రకరకాల సంతోషాల్లో మునిగి ఉండగా మోగింది నగారా..హుటాహుటిన వారొచ్చేలోపే ఇక్కడున్న నా బిడ్డలు తెగువ చూపుతూ సాగుతున్నారు.శత్రువుకు న్యాయం లేదు.దయలేకుండా,ఎం కావాలో తెలీకుండా ,ఎం తీసుకుపోతాడో వివరం లేకుండా పిడుగుల వర్షాన్ని భరిస్తోంది నా శరీరం..నా ప్రతి రక్తపుబొట్టును(సైన్యాన్ని) రక్షించుకోవాలనుకున్న తపన,రాక్షస బలం ముందు నెమ్మదిగా నీరసపడుతుంది.ఇంతలో కడుపు నింపే వంట వాని గుండె సైతం మండింది..తన ఆయుధానికీ పనిచెప్పేడు.ముందుకు..నన్ను ధన్యురాల్ని చేస్తూ,మేము ముందుకు వెళ్తున్న కొద్దీ వెనుకబడుతున్న ఈనేల నీదే తల్లి!చెబుతున్నట్టు ఉన్నాయి అడుగుల చప్పుళ్ళు.

అమ్మా!అని ఒరిగిపోతుంటే అచేతనగా ఉండిపోయిన నా దైన్యానికి ఏడుపు మిగిలింది..లేదు!వాడ్ని నా గుండెలకు హత్తుకున్నాను..చిన్ని పాదాలతో నన్ను కమ్మగా తన్ని మురిసిన అడుగులు నిస్తేజంగా పడున్నాయి.ఇక వాటిని కళ్ళకు అద్దుకోవడం తల్లిగా నా పని.ఎంతటి తెగువ ఉంటే అడుగిడిన పద్మవ్యూహం ఇది.చావుకు తెగించి,ఎదిరించి,పోరాడి అలిసి!కాదు ...ఈ కొంచెం చెదిరిన నేలను గెలిచి నా దోసిట పోసిన వాడి తెగువకు ఎం పేరు పెట్టాలి.పరమవీరచక్ర...అవును!మరణానికి కాలు దువ్వే ధైర్యానికి మారు పేరిది..అదీరోజు ఎవరుకన్న బిడ్డో,నా ఒడిని చేరగా లభించింది.. ఓ అతివ కడుపుకోత,సింధూరపుగీత,మంచితనాలపోతని కరిగించి నాలో కలుపుకున్నా,ఆమె తెగువ ముందు నా బాధ నిండు సున్నా...ఎందరి వీరుల త్యాగఫలం ఈ రోజుకూ మనం అనుభవిస్తున్న దేశపు తీరం..అడుగు అటు మనది కాదు. మనవైపు గీత చెరగొద్దు అనే అద్వితీయ సంకల్పంలో ముందుకు సాగుతున్న నా వీరులకు నాడైరీలో ఓ బంగారు పేజీ అంకితం.బాలేదు!నాలో ఓ పేజీ బంగారంగా వారికి అంకితం..



Rate this content
Log in

Similar telugu story from Tragedy