భళిరా బాహుబలి!
భళిరా బాహుబలి!
అవును దేవసేనా. నువ్వు భల్లాలదేవుని పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి అన్నాడు బాహుబలి.
అంత కంటే నన్ను ఈ కత్తికి బలి కమ్మని చెప్పండి అంటూ దేవసేన కత్తిని తీసుకుంటుంది.
ఆగు దేవసేనా! ఇప్పుడు మనం భుజబలాన్ని కాదు. బుద్ధి బలాన్ని ఉపయోగించాలి అంటాడు.
దేవసేన అతడి ఆలోచనలు అర్థం చేసుకుంటుంది.
శివగామి సంతోషంగా భల్లాలదేవుడిని పిలిచి దేవసేనతో అతడికి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాను అని చెబుతుంది.
అంతకు మునుపే వేగుల ద్వారా బాహుబలి దేవసేనను ప్రేమిస్తున్నాడు అని తెలుసుకుని భల్లాలదేవుడు దేవసేనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు.
తనకు రాజ్యం కావాలని, దేవసేనను పెళ్లి చేసుకోను అని శివగామి మీద దాడి చేయిస్తాడు. దేవసేన శివగామిని కాపాడి ఆమె మనసు గెలుచుకుంటుంది.
శివగామి సంతోషంగా బాహుబలి దేవసేనలకు పెళ్లి జరిపిస్తుంది. భల్లాలదేవుడిని రాజద్రోహం నేరం కింద చీకటి చెరసాలలో ఉంచుతారు.
(ఇలా తీస్తే ఇది మరీ పాత చందమామ కథ అయిపోతుంది కాబోలు.)
