రాణీ చంచల....ధీరత్వము తన ఆభరణం
రాణీ చంచల....ధీరత్వము తన ఆభరణం
మహీధర ఆనాడు నీవు పుట్టినప్పుడే గురువు విసృతుడు చెప్పకనే చెప్పారు .. నీ తర్వాత ఈ మహేంద్రగిరి సింహాసనం వారసత్వ శృంఖలాలు తెంచుకుని ...దేశ పాలన చేసే ధీరత్వం ఒకటి ఈ గద్దె కి ఆభరణమై...శత్రు సేనల పాలిట సింహస్వప్నం అవుతుంది...అని పలికెను మహేంద్రగిరి రాజా మాత యశోధరాదేవీ....
ఆ ధీరత్వము....ఎలా ఉంటుంది.... అంటే....
కాళీ మాత ప్రసాదం ఆయువు పోసుకుంటుంది అడవితల్లి వొడిలో..
తల్లే మొదటి గురువై..తన తాతల కాలం నాటి ఆయుర్వేద వైద్యం చేతి మొనల యందు చేరును...
రెండవ గురువాయే గూడెం పెద్ద సింగం దొర..తన తోడైన అస్త్ర,శాస్త్ర విద్యలను నేర్చును..
శంకు మామ నేర్పును అడవితల్లితో దోబూచులాటలు , వన్య ప్రాణుల తో ఆటలు,మృగాల వేటలు ...
మారెమ్మ అత్త వల్ల అలుపెరుగని ఓర్పు గుణం అబ్బును.
ఇన్నిటి కలపోత గా...మహేంద్రగిరి నల్లమల్లల సమ్మేళనంగా మహేంద్రగిరి గద్దెనెక్కును...ఒక ఇంతి..
ఆ పేరు వింటే శత్రురాజ్యాలకి సివంగి పరిపాలన హడలు పుట్టించును
అచంచలమైన ధీరత్వాన్ని కి ఎదురు నిలబడును
మాంత్రికుడు భేరుండుడు..
దానిని తిప్పి కొట్టువాడు చంచల మానసచోరుడు...రాజా నరసింహ భూపతి...
ఈ కథ లో ప్రతి మాట ప్రతి పదము నా కలం నుంచి జాలువారినవే ...కనుక కాపీరైట్స్ అన్ని నావే....
ఆదరిస్తారని భావిస్తూ....
కిరణ్మయి నండూరు...
