కలం ✍️✍️.... రచయిత నేస్తం
కలం ✍️✍️.... రచయిత నేస్తం
తన రచయిత ఒంటరి తనాన్ని చూసిన ఆ రచయిత చేతిలోని కలం ✍️ ఇలా బాధ😞 పడుతుంది.
కనుమరుగైన ఎన్నో కథలను కళ్ళ ముందుకు తెచ్చే నా రచయిత కనుమరుగై పోయాడు.
నాన్న ప్రేమ తెలియని నాకు నాన్న ఉంటే ఇంత ప్రేమగా ❤️ చూసుకునే వాడు అని తెలియ చెప్పిన నా రచయిత వెనుకబడ్డాడు.
అవును నా రచయిత వెనకబడ్డాడు అమ్మ ప్రేమ తెలియని ఎందరికో తన రచనలతో అమ్మ ప్రేమ💗 అంటే ఇది అని తెలియ చెప్పిన నా రచయితకు అమ్మ ప్రేమ కు దూరం అయ్యాడు.
చరిత్ర లో కలిసిపోయిన ఎన్నో కథలకు తన కలం✍️ ద్వారా ప్రతిరూపం ఇచ్చిన నా రచయితకు రూపం లేని వాడిగా చూస్తుంది ఈ సమాజం.
బానిస బతుకులకు బందీ అయిన ఈ పేద ప్రజల జీవితాలకు తన కలంతో ✍️ వెలుగు ☀️ నింపి తనకు తాను చీకటి తో ఒంటరి వాడయ్యాడు.
అవును నా రచయిత ఒంటరి వాడయ్యాడు
తన రచనలు చదివే ప్రతి మగువ నా రచయితను ప్రేమించకుండా ఉండదు అలాంటి నా రచయిత ఒంటరి వాడయ్యాడు......
నా రచయితతో ఎవరు ఉన్నా లేకున్నా తాను చివరి శ్వాస విడిచే వరకు తనతో తోడుగా నేను ఉంటాను ✍️✍️✍️✍️.
ఓ నేస్తమా ప్రేమతో
✍️✍️✍️✍️
