అరవై యేండ్ల
అరవై యేండ్ల


భవ్య కు బీఎడ్ అయ్యింది...DSC ki బాగా ప్రిపేర్ అయ్యి బాగా రాసింది.తనకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది అనే నమ్మకంతో వుంది..ఇంతకు ముందు 3మార్కుల తేడాతో తనకు ఆ జాబ్ దక్కకుండా పోయింది.తనకు టీచర్ ఉద్యోగం చాలా ఇష్టం. పిల్లలకు సంస్కార వంతమైన విద్య అందించాలని తనకు ఇష్టం.
ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవ ప్రదం..ఎందుకంటే ఒక వ్యక్తి అక్షరాలు దిద్దే స్థితి నుంచి ఐఏఎస్ అవ్వాలంటే, ప్రపంచం లో ఏ వృత్తి లో వ్యక్తి నైనా తయారు చేసేది టీచర్..రిజల్ట్ రానే వచ్చింది.. ఈ సారి ఒక్క మార్కు తక్కువతో జాబ్ రాలేదు.
ఇక భవ్య పరీక్ష రాయకూడదని నిర్ణయించుకున్నది.చాలా డిప్రెషన్ లోకి వెళ్ళింది.జీవితం ఏమిటో ఆశించినవి జరిగితే బాగున్నట్టు, లేకపోతే బాలేనట్టు..రెండిటినీ స్వీకరించాలంటే ఎన్ని జీవితాలు అవపోసన పట్టలో,నేర్చుకొన్న వాటిని ఆచరణలో పెడితేనే గానీ దాని లోతు తెలియదు.
ఈ మే పరిస్తితి నీ గమనించిన వాళ్ళ అక్కయ్య వాళ్ళ ఇంటి కి తీసుకు వెళ్ళింది.ఒక రోజు అంతా ముందు లాగే ..గడచింది.అక్క వాళ్ళ మామగారు 75ఏళ్లు వుంటాయి..ఆయనని గమనించడం మొదలు పెట్టింది.ఆయన క్రమ శిక్షణ తో కూడిన జీవన విధానం ఆమె ను ఎంతో ఆకట్టుకొంది.ఉదయానే ప్రాణాయామం,నడక..తోట పని..ఎప్పుడూ వుత్సహంగా వుండే నడవడిక,9గం కు మళ్లీ ఒక ట్యూషన్ సెంటర్ లో పాఠాలు...ఆయన విశ్రాంత అధ్యాపకుడు. సాయంత్రం మనుమలకు హోమ్ వర్క్ ...ఆయన రోజూ షెడ్యూల్ లో ఖాళీ టైం లేదు..పోని ఒత్తిడి కి గురి అవుతున్నారా అంటే...సంతోషంగా,వుత్సాహం గా చేస్తున్నారు..అన్నీ పనులు...ఆయన్ని చూస్తే అరవై యేండ్ల కుర్రాడు లా కనిపించాడు.
మహాకవి శ్రీశ్రీ అన్నట్టు... పదండి ముందుకు పదండి తోసుకు.. చిన్న చిన్న అపజయాలకే చతికిల పడి, ఇరవై లో అరవై యేండ్ల ముదుసరి లాంటి నా లాంటి వారికి ఆయన వ్యక్తిత్వం,నడవడిక ఆదర్శం..
ఎవరో చెప్పినట్టు ఖాళీ బుర్ర చెత్త బుట్ట తో సమానం అన్నట్టు..నా బుర్ర లోకి వ్యర్థమైన ఆలోచన లు ,నిరుత్సాహం ...వీటి నుండి దూరంగా ఉండాలి అంటే నా బుద్ది తో పాటు నా శరీరం కూడా బిజీగా వుండాలి. అనుకొన్నది.
ఆ మర్నాడే మళ్లీ DSC ప్రిపరేషన్ కోసం ఇంటికి వెళ్ళడానికి బస్ ఎక్కింది.