నాలో నేను
నాలో నేను


ఆ రోజు ఇద్దరికి పెద్ద వాదనే జరిగింది..ఎలాగైనా ఆ సమస్యను పరిష్కరించాలని నేను, ఆలోచనలు కలవనపుడు ఆ విషయం వదిలేయాలని అతను..నేను సాగదీస్తూ వుంటే అతను ఇక వదిలెయ్యి..అన్నాడు.నాకు ఏదో దిగులు..ఇల్లంతా శూన్యం ఆవహించిన నిశ్శబ్దం....
ఆ మర్నాడు యధావిధిగా ఎవరి పనులు వారివి..కానీ ఇద్దరి మధ్యా మౌనం..చూపులు ఒకటే...దిగులుగా చూసుకుంటున్నయి.మాటలకు ఇక అక్కడ దిక్కు తోచక అటూ ఇటూ వెళ్లిపోయాయి.నాకు మనసంతా దుఃఖం,వేదన,అశాంతి..... ఈ దిగులు తో నేనేం అయిపోతాను..అనుకొన్న..ఇక ఏదో చేయాలని..మంచం పట్టిన మనసుకు మందు వెదకడం ఆరంబించాను..
గొడవ వచ్చి వెళ్లిపోయింది..నన్నెందుకు వదలదు..మాటలేం చేశాయి పాపం..అంతే తేలిక పడిన మనసు...ఆలోచించడం మొదలు పెట్టింది.ఏదైనా తినే ముందు నాకు తినిపించే అతని ప్రేమ,ఆరోగ్యం సరి లేక పోతే చూపిన శ్రద్ద గుర్తొచ్చాయి.వాదన,గొడవ వచ్చి వెళ్ళిపోవడం వరకే.కొనసా గ వలసినది మాత్రం..ప్రేమ,ఆపేక్ష,బంధం..ఆయన సాయంత్రం ఇంటికి రాగానే ..అసలే అలకలు ఎక్కువ...మరి నాకు పలుకులు ఎక్కువే..గా. నవ్వవయ్యా...బాబూ.నీ సొమ్మేం పోతుంది...అని పాట అందుకొన్న...అంతే..నవ్వేశాడు... మార్గలి లో వెన్నెల రోజు ముంగిట్లో తెల్లని..ముగ్గు వేసినట్టు..స్వచ్ఛంగా..అంతే..మళ్లీ మాటలు,పాటలు మామూలే..నువ్వే కావాలి...నీ నవ్వే కావాలి అంటూ...అందుకే ఏ సమస్య కి అయినా పరిష్కారం...మనలోనే...నాలోనే...ను.