నా ప్రియమైన మీకు...ప్రేమ లేఖ
నా ప్రియమైన మీకు...ప్రేమ లేఖ


ప్రియమైన శ్రీవారికి
పెళ్లి అయ్యి ఇరవై ఏ ళ్లు అయ్యింది...ఇప్పుడేంటి కొత్తగా ...లేఖ..అదీ ప్రేమ లేఖ.. ఏం రాయకూడదని రూల్ ఏమీ లేదుగా..ఇన్నాళ్లు ఏమయ్యింది.. ఈ ప్రేమ...లేక...రాయలేదా...అనుకుంటున్నారేమో..ఎక్కడో..నిక్షేపాలలోకి వెళ్లిపోయి..ఇన్నాళ్లు బాధ్యతలు,బరువులు పడి పైకి రాలేక పోతుంటే...నేనే.. ఈ యాంత్రిక జీవనానికి అతీతంగా మిమ్మల్ని 25 ఏళ్ల నాటి ప్రేమైక జీవనాన్ని మళ్లీ రుచి చూపించి..మళ్లీ ప్రేమలో..నా ప్రేమ లో పడేయాలని ఆశ.
ఆనాటి గుర్తులు మళ్లీ వసంతంలో చిగురించే ...ప్రకృతి లాగా మనం మళ్లీ మళ్లీ నెమరు వేసుకుంటూ వుంటేనే కదా..జీవితం...కొత్తగా మళ్లీ మళ్లీ జీవించాలని అనిపించేలా వుంటుంది.
అందుకే...నీవు నవ్వితే నెల వంక సిగ్గూ పడినట్టుగా అనిపించే. ..ఆ నవ్వుని..నీవు క్రీగంట చూస్తే... తామరలు ముడుచుకోవాలో..విప్పారాలో అని ఆలోచిస్తున్నట్టు...నీ ప్రేమ .. గ్రీష్మం నాటి వెన్నెల రాత్రి చల్లదనం కోసం ఎదురు చూసే కలువలు...ఆ ప్రేమ వాటికే సొంతం కదూ..నీ ప్రేమ నాకు శాశ్వతం అయినట్టు. నీ ప్రేమ కోసం నేను చంద్రుని కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తూ నే వుంటాను...ఎక్కడ నా ప్రేమను మరచిపోతావో.. ఈ యాంత్రిక జీవితంలో అని.. ఈ ప్రేమ లేఖ...
గత స్మృతులు..ఆ స్వచ్ఛమైన ప్రేమ ను నీకు గుర్తు చేస్తూ..ఆ ప్రేమతో పలుకరిస్తూ..రోజూ రాస్తూనే వుంటా... ఈ...ప్రేమ లేఖ..
ఇట్లు....మీ హృదయ సహచరి అయిన జీవన సహచరి