నా ఇల్లే ఆఖరి ఇల్లు.
నా ఇల్లే ఆఖరి ఇల్లు.
మురళీ గారికి మనసంతా ఏదోలా ఉంది.ఆయన ఒక రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి.ఆయనకు 70ఏళ్ల వయసు,ఆయన భార్య సునీత కు 65. ఇద్దరు పిల్లలు అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ అమెరికాలో స్థిరపడి పోయారు.ఇంకేం అంతా సంతోశమేగా అనుకొంటే పొరబాటు.
మురళిి గారు చిన్నతనంలోనే తండ్రి మరణిస్తే...కుటుంబ సభ్యులకు ఏ లోటూ లేకుండా చూసుకొంటూ, చెల్లి తమ్ముడు బాధ్యత లు నెరవేర్చి,పెళ్లి పిల్లలు అయ్యాకా...వాళ్ళని ఎన్ని ఆర్థిక సమస్యలు తలెత్తినా మంచి చదువులు చదివించారు.వాళ్ళు అంతే కష్టపడి మంచి ఉద్యోగాలు..పెళ్లిళ్లు...పిల్లలు...ఆ పిల్లలు ఇండియా కి రాలేని పరిస్తితి.ఆరు నెలలు ఒకరి దగ్గర వారి ప్రేమ,వాత్సల్యం కోసం వుంటు వచ్చారు..రిటైర్ అయిన దగ్గర నుండి..
కానీ వయసు మీద పడుతున్నా కొద్ది ఆయన లో ఏదో దిగులు...అసలు నా ఇల్లు ఏది.రాత్రికి ఎప్పుడో వచ్చే పిల్లలు..చదువులతో బిజీగా వుండే మనుమలు
..ఇక చాలు..ఇన్నాళ్లు అందరి కోసం నేను చేసిన ఉరుకులు పరుగులు చాలు.వీళ్ళ జీవితాలకు అలవాటు పడిన వీళ్ళు బాగానే సంతోషంగా వున్నారు.నాకు వయసు మీద పడింది.నా ప్రాణం పరాయి దేశంలో నన్ను విడిచి పోకూడదు.నా ఆఖరి ఇల్లు అయిన నా దేశం..లో నా ఇంటిలో నే నా చివరి రోజులు గడవాలి..అని నిర్ణయం తీసుకున్నారు..అప్పుడు గానీ ఆయనకు మనసు స్థిమిత పడలేదు..
కొడుకు ఆపీస్ నుండి ఇంటికి రాగానే వెంటనే టికెట్ బుక్ చేయమన్నారు..అప్పుడేనా అన్న కొడుకుతో ఇక ఇండియా లో నే వుంటాము.. ఇక రాలేమని గట్టిగా చెప్పేశారు..అర్థం చేసుకొన్న కొడుకు వెంటనే పంపేశాడు..
ఇండియా వచ్చిన ఆయనకి మనసు ప్రశాంతంగా హాయిగా వుంది.నా ఇల్లే నా ఆఖరి ఇల్లు..నా మిగిలిన జీవితం ఇక్కడే,...నా భార్య,నా స్నేహితులు,నా జ్ఞాపకాలు, నా బాల్య స్మృతుల తో కూడిన ఈ గాలి,వెలుతురు, ఈ వాతారణం లో నే గడిపేస్తాం.అనుకొన్నారు.