నాన్నకు ప్రేమతో
నాన్నకు ప్రేమతో


నాన్న..
నేను పుట్టినప్పుడు అందరూ మళ్లీ అమ్మాయే అని అంటుంటే...నాకు ఎవరైనా ఒకటే అని నన్ను గుండెలకు హత్తుకున్నారు....బహుశా ఈ ఆపేక్ష కోసమే మళ్లీ మీకే పుట్టన ని అనిపించింది నాన్న.నాకు మీరు వున్నారు అని భరోసా వచ్చేసింది.
నాన్న మా కోసం కష్ట పడుతూ ఎక్కడో ఉద్యోగం చేస్తూ.. ఏ అర్ధ రాత్రో మీరు ముసుగు తన్ని పడుకొంటే పొద్దున్నే చూసి ఆ ముసుగు లో నేను దూరి మిమ్మల్ని హత్తుకొని అన్నీ రోజుల బెంగ పోగొట్టుకున్నాను.
మమ్మల్ని యాత్రలకు తీసుకెళ్ళి దేవుణ్ణి పరిచయం చేసి అక్కడ షాప్స్ లో నేను వేలి తో ఏమి చూపిస్తే అవి కొనేవారు..అప్పుడే అనిపించింది నాకు మా నాన్న వున్నారు..ఏమి లోటు అని.
నాకు పెళ్ళి చేసి పంపేసి మళ్లీ వచ్చిన రోజు కన్నీళ్ళతో నా తల నిమిరారే...అది నా తుది శ్వాస వరకూ మరువలేను నేను.
ఇప్పుడు 78 వయస్సుకు మీరు వచ్చేస్తే.. రోజూ మిమ్మల్ని చూసి నాన్న వయస్సు ఇక్కడే ఆగిపోతే ఎంత బాగుండు...అని ప్రతీ క్షణం అనుకొంటున్న నాన్న.
మీ మంచితనం,మీ ప్రేమ,మీ ఆపేక్ష.... నేను ఎన్ని వేల కోట్ల జన్మలు ఎత్తినా తీర్చు కోలేని రుణం నాన్న..ఏమిచ్చి రుణం తీర్చుకో ను..నేను..మళ్లీ మళ్లీ మీకే పుట్టి...మిమ్మల్ని నాన్న అని పిలవాలి.ఆ దేవుడే కనిపిస్తే మా నాన్న నీ చిరంజీవి గా దీవించమని అడగాలి...
ఇట్లు...మీ చిట్టి పాప