Aakash kumar

Fantasy

4  

Aakash kumar

Fantasy

విక్రమార్క - భేతాళ కథలు

విక్రమార్క - భేతాళ కథలు

3 mins
581


ఉజ్జయిని నీ రాజధాని గా చేసుకొని,తన మహాసామ్రాజ్యాన్ని " విక్రమార్కుడు" అనే మహారాజు పరిపాలిస్తున్నాడు.అతను ఎంతో పరాక్రమం,కీర్తి,తేజస్సు కలిగినవాడు.

ఒక రోజు ఆ విక్రమార్క మహారాజు సభలో ఉండగా అతని వద్దకు ఒక ముని వచ్చాడు.అతను విక్రమార్కుని ఒక ఫలాన్ని ఇచ్చి వినయం గా నిలుచున్నాడు.అప్పుడు చక్రవర్తి ఆ ఫలాన్ని స్వీకరించి,ఆ ఫలానికి బదులుగా ఏం కోరిన ఇవ్వడానికి సిద్ధంగా గా ఉన్నానని అన్నాడు.అప్పుడు ఆ ముని," ఓ మహారాజా నేను ఒక యజ్ఞం చేయబోతున్నాను.ఆ యజ్ఞానికి కావాల్సిన దానిని మీరు నాకు సాధించి పెట్టాలి.అందుకోసం మీరు ఖడ్గదారి అయి నా వెంట అడవి లో ఉన్న నా ఆశ్రమానికి రావాలి." అని అన్నాడు.

అందుకు అంగీకరించిన విక్రమార్కుడు,అతని వెంట బయలుదేరాడు.అలా అడవికి చేరుకున్న ఆ ఇద్దరూ అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టుని చూసారు.దాన్ని విక్రమార్కుని చూపిస్తూ ఆ ముని "ఓ రాజా అది సాధారణ మర్రి చెట్టు అని అనుకుంటున్నావా?? కాదు.దాని మీద అన్ని రకాల భూత,ప్రేత,పిశాచాలు ఉన్నాయి.ఆ కొమ్మ మీద ఒక శవం వేలాడుతోంది చూసావా?? దాని పేరు "భేతాళుడు" దాన్ని చెట్టు పై నుంచి కిందకు దించి మౌనంగా తీసుకు వచ్చి నాకు అప్పగించు.కానీ జాగ్రత్త!! నీవు ఒక్క మాట మాట్లాడినా అది నీ దగ్గర నుంచి మాయం అయ్యి తిరిగి చెట్టెక్కుతుంది.నీ వంటి పరాక్రమవంతుడు తప్పిస్తే అన్యులు ఎవ్వరూ ఆ చెట్టు దరి చెర లేరు.అందుకనే నిన్ను సహాయం అడిగాను.ఇదే నీవు నాకు చెయ్యగల ఉపకారం" అని అన్నాడు.

అప్పుడు విక్రమార్కుడు అందుకు అంగీకరించి,ఆ చెట్టుని చేరి భేతాళుని తీసుకొని భుజాన వేసుకొని మౌనంగా ముని ఆశ్రమం వైపు నడవసాగాడు.అప్పుడు ఆ భేతాళుడు విక్రమార్కుని తో" ఓ రాజా! నీవు విక్రమార్కుడు అని నాకు తెలుసు.నాకు చాలా సందేహాలు తీరకుండా ఉండిపోయాయి.అవి తీరిస్తే కానీ నీవు నన్ను అనుకున్న చోటికి తీస్కుపోలేవు.నీకు నా సందేహాలకు సమాధానం తెలిసీ కూడా నోరు మెదపక పోయినట్టైతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది" అని తన మొదటి సందేహాన్ని ఒక కథ రూపం లో చెప్పసాగెను.

భేతాళుని మొదటి కథ:-

" ఓ రాజా పూర్వం ఒక రాజు కి ఒక కొడుకు ఉండేవాడు.అతని పేరు సుమంత్రుడు.అతను వీరుడు,సకల విద్యా పారంగతుడు.అతను ఇంకా మంత్రి కుమారుడైన సుషీలుడు మంచి మిత్రులు.ఒకనాడు వారు ఇరువురు వేటకు అడవికి వెళ్ళారు.అక్కడ వేటాడి అలసిపోయి,ఒక కొలను లో నీరు త్రాగి ఒక పక్కన విశ్రమించారు.కాస్సేపటికి అక్కడకి ఒక రాకుమార్తె చెలికత్తెలతో వచ్చి స్నానం చేసి వెళ్ళిపోయింది.ఆ రాకుమార్తె నీ చూసి ఇష్టపడ్డ యువరాజు సుమంత్రుడు,ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. మంత్రి కొడుకు తో కలిసి ఆ రాకుమార్తె నగరానికి చేరుకున్నాడు.

రహస్యం గా కోట లోకి ప్రవేశించి రాకుమార్తె ని తన అందం,వీరత్వం తో మెప్పించి వివాహం చేసుకున్నాడు.అయితే ఈ విషయం సుమంత్రుడు కి,మంత్రి పుత్రుడు కి,రాకుమార్తె కి తప్ప ఎవరికి తెలియదు.

ఇది ఇలా ఉండగా ఒక రోజు రాకుమార్తె కి తన భర్త కంటే మంత్రి కుమారుడు తెలివైన వాడని,భవిష్యత్తు లో తన తెలివి తో రాజ్యం కాజేయ్యొచ్చని అనిపించి,ఆ రోజు సాయంత్రం తన భర్త కి కొన్ని మిఠాయిలు ఇచ్చి ఆ మంత్రి కుమారునికి ఇవ్వమని చెప్తుంది.ఆ మితాయిలలో రాకుమార్తె విషం కలిపి ఇస్తుంది.

ఆ మిఠాయి లను సుమంత్రుడు,మంత్రి కుమారునికి ఇస్తాడు.ఆ మిఠాయిలను చూసి అనుమానం తో వాటిలో కొంత భాగాన్ని దారి లో పోయే కుక్కకి వేస్తాడు. వాటిని తిన్న ఆ కుక్క మరణిస్తుంది.రాకుమార్తె ఉద్దేశాన్ని పసిగట్టిన ఇద్దరూ ఆ రాత్రి దొంగలలాగ కోట లో దూరి,రాకుమార్తె నగలు దోచుకున్నారు.వెళ్తూ ఆమె భుజం పై ఒక గుర్తును ముద్రించి వెళతారు.ఉదయాన నగలు కనబడకపోవడం తో దొంగలు దొంగిలించారు అని తన తండ్రికి పిర్యాదు చేసింది రాకుమార్తె.

కావాలనే ఆ నగలను ఆ ఇద్దరు మిత్రులూ మారు వేషాలు వేసుకొని బజారు లో అమ్మ సాగారు.రాజ భటులు ఆ నగలను గుర్తించి,వారిని ఖైదు చేసి,రాజు యెదుట ప్రవేశపెట్టారు.

రాజు వారిని విచారించగా ఆ కపటులు" ఓ రాజా ఆ నగలు ఒక రాక్షసి వి మేము మాంత్రికులం .ఆ రాక్షసి మాపై దాడి చేసినప్పుడు మేము ఆమెను నిగ్రహించి ఆమె నగలను తీసుకున్నాం. ఆమె రాక్షసి నుంచి మనిషిగా,మనిషి నుంచి రాక్షసి గా మారగలదు.అందుకని ఆమె భుజం పై ఒక రహస్య మంత్రపు గుర్తును ముద్రించాం.ఆ నగలను మీరే ఉంచుకోండి.మమ్మల్ని వదిలెయ్యండి అని అక్కడ నుంచి జారుకున్నారు.

దీంతో రాజు కి తన కూతురు రాక్షసి అని అనుమానం కలిగింది.పరీక్ష చెయ్యగా ఆమె భుజం పై గుర్తు కనిపించింది.

దాంతో ఆమె రాక్షసి అని తనకి ఇక కూతురు లేదని గుండె రాయి చేసుకొని ఆమె ను పడుకున్నప్పుడు మంచం తో సహా భటులతో మోయించి అడవిలో వదిలేశాడు.రాజా భటులు వెళ్ళాక, సుమంత్రుడు,మంత్రి కుమారుడు,ఆమెను చేరి క్షమాపణ చెప్పించి ఆమెను తీసుకొని తమ రాజ్యానికి తాము వెళ్లిపోయారు.

ఇక్కడ ఈ రాజు రాక్షసిని కన్న తల్లిదండ్రులు గా రాజ్యం లో మొహం చూపించుకొలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయారు." అని భేతాళుడు కథను ముగించి," ఓ రాజా ఈ కథ లో నిజమైన దోషులు ఎవరో నీవు తెలిసీ కూడా చెప్పక పోతే నీ తల వెయ్యి ముక్కలు కాగలదు." అని అన్నాడు.

అప్పుడు విక్రమార్కుడు" సుమంత్రుడు,మంత్రి కుమారుడు దోషులు కారు.తన భర్త మేలు కోసం మంత్రి కుమారుని చంపాలి అనుకున్న రాకుమార్తె కూడా దోషి కాదు.చెప్పుడు మాటలు విని విచక్షణ లేకుండా,విచారించకుండా కూతుర్ని అడవి లో వదిలేసి,ఆత్మహత్య చేసుకున్న రాజా దంపతులు మాత్రమే దోషులు"అని అన్నాడు.

విక్రమార్కుడు మౌనం వీడి మాట్లాడడం తో భేతాళుడు మాయమై తిరిగి చెట్టు ఎక్కిపోయాడు.

__________________________(ఇంకా ఉంది)______

ఈ విక్రమార్క - భేతాళ కథలని ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

త్వరలో తరువాయి భాగం రాస్తాను.



Rate this content
Log in

Similar telugu story from Fantasy