Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

Parimala Pari

Comedy Drama Fantasy

4.8  

Parimala Pari

Comedy Drama Fantasy

మీనా

మీనా

10 mins
800


బెడ్ మీద నుంచే ఒక్కసారి చేత్తో మోగుతున్న అలారమ్ మీద టప్ మని కొట్టి మళ్లీ ముసుగుతన్ని పడుకుంది మీనా.

పడుకుందే కానీ నిద్ర పట్టక అటు ఇటు దొళ్లుతునే ఉంది.

"పట్టపగలే ఇంకా ఆ నిద్ర ఏంటే, లేవవే తల్లి ఎగ్జాం కి టైమ్ అవుతుంది"

"ఏంటే పొద్దునే నీ గొడవ?" అంటుంది మీనా లేస్తూ.

"నా బాధ నీకు గొడవ లా ఉందా? నీకేంటి లే అయినా ఎపుడో నే ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది. నాకు మాత్రం ఫుల్ టెన్షన్ గా ఉంది. మీనా ఈసారి నాకు తెలిసిన క్వశ్చెన్స్ మాత్రమే పేపర్ లో రావాలని కోరుకోవే." అంటుంది శ్వేత.

"హహహ!" అని ఒక నవ్వు నవ్వి "అది మరీ స్వార్థం అవుతుందే. నీకు తెలిసిన క్వశ్చెన్స్ మాత్రమే రావాలంటే ఎలా? అందులో నీకు తెలిసినవి కొన్ని ఉన్న చాలు కదా నీకు ఫస్ట్ క్లాస్ రావటానికి. "

"మొదలు పెట్టావా నీ లెక్చర్ సరే టైమ్ ఔతుంది త్వరగా రెడీ అయ్యి రా"

5 నిమిషాలు అని వెళ్ళిన మీన అలాగే ఐదే నిముషాలలో రెడీ అయ్యి వస్తుంది.

మీనా ని అలాగే చూస్తూ

"ఆహా ఏం టైమింగ్ ఏ నీది. timer పెట్టుకున్నట్టు 5 నిముషాలలో నే వచ్చేసావు." అంటూ మీనా తో ఇద్దరు కిందకి వెళ్తారు.

"ఆహా! ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టారు" అని పూరి ని ఆస్వాదిస్తూ తింటుంది శ్వేత.

మీనా ఎటో ఆలోచిస్తూ ఉంటుంది.

"మేడం మీ ఆలోచనలన్నీ తర్వాత చించుదువు గాని ముందు తిని వెళ్దాం రా"

"అది కాదే జస్ట్ మిస్! అబ్బ కొంచం లో తన ఫేస్ చూసేదాన్ని"

"ఓహ్! ఏంటమ్మా మళ్లీ అదే కలా! అసలు అది నిజం అవుతుందంటావా?"

"అలా అనకే తను నా కలల రాకుమారుడు, ఎప్పటికైనా నన్ను వచ్చి తీసుకువెళ్తాడు."

"ముందు తన మొహం అయిన సరిగా చూడవే ఆ తర్వాత ఊహించుకుందువు గాని, ఎపుడు చూసిన మొహం కనపడలేదు అంటావ్" అంది శ్వేత కొంచం విసుకుగా.

"ఏమోనే మరీ 2 yrs నుంచి అదే కల, కానీ ఒక్కసారి కూడా తన మొహం కనపడలేదు. నా bad luck"

"అయితే నీ కలల రాకుమారుడు ఈ కాలేజ్ లో నే ఉన్నాడేమో చూడవే, ఒకసారి అందరినీ కొంచెం పరీక్షగా చూడు..ఏమైనా తెలియవచ్చు." అని సలహా ఇస్తుంది శ్వేత.

ఎగ్జామ్ హాల్ లో కి వెళ్ళిపోతారు ఇద్దరు. ఎవరి సీట్ లో వాళ్ళు కూర్చొని ఎగ్జామ్ రాస్తారు.

తిరిగి మళ్లీ రూం కి వెళ్తూ దారిలో అడుగుతుంది శ్వేత.

"ఇంతకీ చెప్పనే లేదు ఎగ్జామ్ ఎలా రాశావు. నీకేం నువ్వు బాగానే రాసి ఉంటావ్ లే, నేను కూడా బాగానే రాశాను."

"అది సరే గానీ ఇంతకీ నీ కలల రాకుమారుడు గురించి చెప్పు" అంది.

"ఆరడుగుల ఎత్తు ఉంటాడే, మహేష్ బాబు లా కాదు కాదు ప్రభాస్ లా ఉహూ కాదు పవన్ కళ్యాణ్ లా, 🤔 ఏమోనే సరిగా కనిపించట్లేదు కదా ఈసారి గారంటీ గా ఫేస్ చూడాల్సిందే."

"హ్మ్మ్, సరే చూద్దాం"

**********

మీనా, శ్వేత లు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్, ఒకే కాలేజి లో చదివారు, ఇంజనీరింగ్ లో కూడా ఒకే కాలేజి లో సీట్ లు సంపాదించారు. కాలేజి వేరే ఊర్లో కావటం వల్ల హాస్టల్ లో ఉండి చదువుకుంటున్నారు.

***********

ఒకరోజు బెడ్ మీద నుంచే నిద్ర లో నే యాహూ అంటూ అరచి కిందపడి "అబ్బా" అంటూ తగిలిన దెబ్బాని రుద్దుకుంటూ లేచింది మీనా.

ఆ అరుపుకి కంగారుపడి లేచింది శ్వేత.

"ఏమైందీ ఎందుకే అలా అరిచావు".

"యాహూ ఈరోజు ఎంత మంచిరోజు నాకు, ఆహా ఏమి నా భాగ్యము, ఏం ఉన్నాడే ఆ కళ్ళు, ఆ ముక్కు ఆ ఫేస్, టోటల్ గా సూపరో సూపర్."

"ఏం అయిందే నీకు, ఏం మాట్లాడుతున్నావ్?"

"చూసాను ఈరోజు చూసాను, నా కలల రాకుమారుడు కనిపించాడు నాకు. చాలా అంటే చాలా బాగున్నాడే. నేను ఫిక్స్ ఏ తనే నా బాయ్ ఫ్రెండ్. "

"ఓహ్! వావ్! కంగ్రాట్స్ ఏ. కానీ ఎలా గుర్తుపట్టడం" అంది శ్వేత.

"ఒక పని చేద్దాం ఈ కాలేజీ లో ఎవరైనా అలా ఉన్నారేమో ఈ సారి అందరినీ పరీక్షగా చూడవే" అంది మళ్ళి తనే.

"లేదే తను ఇక్కడ లేడు. నా దగ్గరలో ఉంటే నా మనసుకి తెలిసిపోతుంది. కాబట్టి వెతకాల్సిన అవసరం లేదు. తను తప్పకుండా నా దగ్గరికి వస్తాడు." అంది.

తన కలల రాకుమారుడి చిత్రాన్ని గీసి ఎవరికి తెలియకుండా దాచుకుంది . దాన్నే చూస్తూ ఆరాధిస్తూ ఉంటుంది.

**********

ఒకరోజు మీనా రోడ్డు పై వెళ్తుండగా సడన్ గా ఒక కార్ కి ఒక పాప అడ్డు వస్తుంది. ఆ పాప ని తప్పించపోయి ఆ కారు అటు ఇటు కొంచం వేగం గా తిప్పుతూ మీన ని గుద్దింది. అంతే అది గమనించని మీనా ఎగిరి పడింది. పేవ్మెంట్ అంచు కి తల తగిలింది. తలనుంచి రక్తం కారసాగింది.

ఆ కారు లోని వ్యక్తి మాత్రం అది గమంచించ లేదు. ఆ అమ్మాయి కింద పడటం మాత్రం చూసి, "దేవుడా ఆ అమ్మాయి కి ఏమి కాకూడదు. please save her" అనుకుని వెళ్ళిపోయాడు.

రక్తం లో పడి ఉన్న మీనా ని అక్కడ కొందరు చూసి, హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు. మీనా తో పాటు తన ఫ్రెండ్ శ్వేత కూడా ఉంది.

మీనా కి సర్జరీ చేసి, డాక్టర్ తను ఇంక చూడలేదు అని చెప్పారు.

అది విని చాలా బాధపడుతుంది శ్వేత. మీనా కి కూడా ఈ విషయం తెలిసి, ఆ బాధ తట్టుకోలేకపొతుంది.

మీనా అమ్మ నాన్నలు, అన్నయ్య అందరూ వస్తారు హాస్పిటల్ కి. మీనా ని ఆ స్థితి లో చూసి కన్నీళ్ళ పర్యంతం అవుతారు.

***********

అక్కడ కారు లో వ్యక్తి

"తప్పు చేశాను పాపం అక్కడ అమ్మాయికి ఎలా ఉందో ఏంటో" అనుకుంటూ ఉంటాడు. కానీ కార్ ఆపలేని పరిస్థితి లో ఉంటాడు. కార్ ఆపకుండా వెళ్ళిపోతాడు.

***********

అభయ్ వాళ్ళు చాలా ధనవంతులు. వాళ్ళ నాన్న అంతే మంచివాడు కూడా. అభయ్ అల్లరి చిల్లరగా తిరిగేవాడు. అభయ్ వాళ్ళ వాచ్మెన్ కూతురికి నెలలు నిండాయి. ఆమెని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలి అని బాధ పడుతుంటే, అభయ్ వచ్చి వాచ్మెన్ నీ, వాళ్ళ అమ్మాయి నీ కార్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. అదే దారిలో ఉండగా మీనా నీ గుద్దేసాడు. కానీ కార్ లో ఆమెకి పైన్స్ ఎక్కువ అవటం తో అపలేకపోతాడు.

వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్ళి తనే అడ్మిట్ చేస్తాడు. డెలివరీ అయ్యేవరకు అభయ్ అక్కడే ఉంటాడు. వాచ్మెన్ రామయ్య కి అన్నిట్లో సాయం చేస్తూ, తనే బిల్ కూడా కడతాడు.

అమ్మాయి పుట్టింది అని చెప్తారు డాక్టర్. 

"మీరే మా పాలిట దేవుడు బాబు, మీరే పేరు పెట్టండి పాప కి." అంటాడు రామయ్య.

"అయ్యో నేనా, నేనేం చేశాను. మీరు పెట్టమని అడుగుతున్నారు కాబట్టి, పాప పేరు నయన." అని పెడతాడు అభయ్.

"చాలా సంతోషం బాబు" అని వెళ్ళిపోతారు.

***********

ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకున్న అభయ్ తండ్రి చక్రవర్తి అభయ్ మంచి తనాన్ని చూసి సంతోషిస్తాడు. అల్లరి చిల్లరగా తిరిగే అభయ్ లో ఇంత బాధ్యత ఉందా అని మనసులో అనుకున్నాడు.అభయ్ కి తన కంపెనీ బాధ్యతలు అప్పగించాలి అనుకుంటాడు.

అభయ్ నీ పిలిచి "అభయ్, నువ్వు ఇన్నాళ్లు బాధ్యత లేకుండా తిరుగుతున్నావు అనుకున్న, కానీ రామయ్య విషయం లో నువ్వు చేసిన పని చాలా మంచిది. నీకు బాధ్యత అంటే తెలిసింది కాబట్టి మన కంపెనీ బాధ్యతలు నీకు అప్పగించాలి అనుకుంటున్నాను"

అంటాడు.

అపుడు అభయ్ "లేదు డాడ్, నాకు ఇంకా కొంచం టైం కావాలి, నాకు ఇంకా బాధ్యత పూర్తిగా తెలియలేదు డాడ్," అంటూ కార్ లో జరిగిన ఏక్సిడెంట్ విషయం చెప్పి బాధపడతాడు.

"జరిగింది ఏదో జరిగిపోయింది, కావాలని చేసింది కాదు కదా, నీ తప్పు కూడా లేదు దాంట్లో" అంటాడు చక్రవర్తి.

"లేదు డాడ్, నేను మిస్టేక్ చేశాను, ఆ అమ్మాయి కి ఎలా ఉందో, ఏం అయ్యిందో. I have to know. I'll see for her, dad" అంటాడు.

"ok Abhay, ur wish" అంటాడు అభయ్ వాళ్ళ నాన్న.

అభయ్ ఏక్సిడెంట్ జరిగిన చోటకి వెళ్లి ఎంక్వైరీ చేసి హాస్పిటల్ కి వెళ్లి, మీనా గురించి తెలుసుకుంటాడు.

తను ఉండే హాస్టల్ కి వెళ్తాడు.

************

అక్కడ మీనా కి చూపు రాదు అని తెలిసి అంతా బాధ పడతారు. ఇంకా నేను ఇక్కడ ఉండను మీతో పాటు వచ్చేస్తాను అని అంటుంది మీన.

"నీ స్టడీస్, మరి మధ్యలో అపేస్తావా" అంటాడు మీన అన్న అశోక్.

"అవును అన్నయ్య నేను ఇంకా చదువు continue చేసి ఏం చేయాలి. ఎలా చదవాలి. " అని బాధ పడుతుంది.

మీనా బాధ ని చూడలేక వాళ్ళు తనని తీసుకుని ఊరు వెళ్ళిపోతారు.

అభయ్ మీనా గురించి వెతుకుతూ వెతుకుతూ తన details తీసుకొని హాస్టల్ చేరతాడు. అక్కడ శ్వేత ని కలుస్తాడు. మీనా గురించి అడగగా జరిగిందంతా చెప్తుంది శ్వేత. అదివిని షాక్ అవుతాడు అభయ్.

శ్వేత కి తనే కార్ ఏక్సిడెంట్ చేసిన సంగతి చెప్పి, ఎందుకు అలా జరిగింది చెప్తాడు.

శ్వేత అభయ్ బాధ నీ అర్థం చేసుకుంటుంది.

"నేను ఎలా అయిన సరే మీనా ని కలవాలి." అని శ్వేత దగ్గర నుంచి మీన వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకుంటాడు.

"అభయ్, మీనా చాలా మంచి అమ్మాయి. పాపం తనకి ఇలా అయినందుకు చాలా బాధపడుతుంది. తనని మళ్లీ ఎలా అయినా నువ్వే మామూలుగా మార్చాలి" అని జాగ్రత్త చెప్పి పంపిస్తుంది అభయ్ ని.

మీనా వాళ్ళ ఇంటికి వెళ్తున్న సంగతి వాళ్ళ నాన్నకి చెప్పి బయలుదేరుతాడు అభయ్. మీనా ఇంటికి చేరతాడు.

అది ఒక పల్లెటూరు.మీన అన్నయ అశోక్ agricultural MSc చేసి పంటల్లో మంచి దిగుబడి గురించి, సహజ ఎరువుల వాడకం గురించి ఊళ్ళో వాళ్ళకి చెప్తూ అక్కడే వ్యవసాయం చేస్తూ ఉంటాడు.

ఊరు గురించి, పొలాల గురించి రీసెర్చ్ చేస్తున్నా అని చెప్పి, వాళ్ళ ఇంటికి వస్తాడు అభయ్. ఎక్కడైనా షెల్టర్ ఇప్పించమంటాడు.

ఎక్కడో ఎందుకు మా ఇంట్లోనే ఉండచ్చు అంటాడు అశోక్.

అలా మీనా వాళ్ళ ఇంట్లో చేరతాడు.

అక్కడ మీనా ని చూస్తాడు, మీనా నీ చూడగానే ఆనందం తో కూడిన బాధ కలుగుతుంది అభయ్ కి.

---------

మీనా ఒకరోజు బస్టాప్ లో, బస్ కోసం చూస్తూ ఉండగా అభయ్ అదే దారిలో వెళ్తూ మీనా ని చూస్తాడు. చూడగానే నచ్చుతుంది. గ్రీన్ చుడీదార్, లూజ్ హెయిర్ లో అప్సరస లా అనిపించింది. చూడగానే ఆకట్టుకునే రూపం తనది. కాబట్టి చూడగానే ఇష్టపడ్డాడు అభయ్.

-------

ఇపుడు ఇక్కడ మీనా ని చూసి చాలా సంతోషంగా, ఇంకా బాధ గా పశ్చాత్తాప పడతాడు.

"ఛ ఛ! ఎంతపని చేశాను నేను, చూడకుండా చేసిన పని ఎంత హాని చేసింది."

"ఈ తప్పు నా వల్లనే జరిగింది కాబట్టి, నేనే సరిచేయాలి. నేనే ఆ బాధ్యత తీసుకోవాలి." అనుకున్నాడు.

వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసిపోయాడు. అన్నిట్లో సాయం గా ఉండసాగాడు. నెమ్మదిగా మీనా ఇంట్లో వాళ్ళ అందరినీ తన వైపు తిప్పుకున్నాడు. మీనా కి ఆపరేషన్ చేయించాలని, తను ఆపేసిన చదువు continue చేయించాలని అనుకున్నాడు. అదే మాట మీనా ఇంట్లో వాళ్ళ అందరితో చెప్పి ఒప్పించాడు.

మీనా ని అడగగా ముందు ఒప్పుకోలేదు. నెమ్మదిగా అందరూ కలిసి మీనా ని ఒప్పించారు.

సిటీ కి తీసుకువెళ్ళి ఆపరేషన్ చేయించాలని అనుకున్నారు. మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండచ్చు అని వాళ్ళ గెస్ట్ హౌస్ లో పెట్టాడు.

రేపే ఆపరేషన్. అభయ్ ఫ్రెండ్ అయిన మురళి వాళ్ళ హాస్పిటల్ లో నే మీనా కి ఆపరేషన్ ఏర్పాటు చేశారు. అభయ్ దగ్గరే ఉండి అన్ని ఏర్పాట్లు చూసాడు.

ఆపరేషన్ మొదలు అయింది. డాక్టర్. మురళి కి అన్ని జాగ్రత్తలు చెప్పి ఇపుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు.

హాస్పిటల్ లో మీనా తో పాటు వాళ్ళ ఫ్యామిలీ ఇంకా శ్వేత అందరూ ఉన్నారు.

ఆపరేషన్ పూర్తి అయ్యింది.

డాక్టర్ మురళీ బయటకి వచ్చి "ఆపరేషన్ సక్సెస్. తను ఇంకొక 15నిముషాలలో స్పృహ లోకి వస్తుంది. మీరు వెళ్లి చూడచ్చు. తనకి స్ట్రైన్ అయ్యే విషయాలు ఏమీ చెప్పద్దు. జాగ్రత్త గా చూసుకోండి" అని చెప్పి వెళ్ళిపోతాడు.

అందరూ లోపలకి వెళ్లి మీనా ని చూస్తారు. ఇపుడిపుడే స్పృహ లో కి వస్తుంది. రాగానే అందరినీ చూసి సంతోషం తో కన్నీళ్లు పెట్టుకుంటుంది.

"మీనా నువ్వు ఏమీ బాధపడకు. అన్ని మామూలు అయిపోతాయి. ఇపుడేమో రెస్ట్ తీసుకో. ఏమీ ఆలోచించకు" అని ధైర్యం చెప్తారు మీనా తల్లితండ్రులు.

అందరూ అభయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అభయ్ తన విషయం ఎవరితోనూ చెప్పద్దు అని శ్వేత దగ్గర మాట తీసుకుంటాడు.

అభయ్ గురించి అడగగా డాక్టర్ మురళీ, "అభయ్ పని మీద ఊరు వెళ్ళానని చెప్పాడు. రెండు రోజుల్లో మీనా నీ డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు" అంటాడు.

మీనా ని తీసుకొని వాళ్ళు ఉన్న అభయ్ వాళ్ళ గెస్ట్ హౌస్ కి వస్తారు. అక్కడ వాచ్మెన్ రామయ్య ని ఉంచుతాడు అభయ్. తనే అన్ని పనులు చేసి పెడతాడు.

"అభయ్ బాబు రెండు రోజుల్లో వస్తాను అన్నారు బాబు. మీరు అప్పటిదాకా ఇక్కడే ఉండచ్చు. మీకు కావల్సిన ఏర్పాట్లు అన్ని నేనే చూసుకుంటాను" అంటాడు.

అశోక్ ఇంకా మీనా అమ్మా నాన్న, అభయ్ తో మీనా పెళ్ళి చేద్దాం అని అనుకుంటారు. అభయ్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు.

వాచ్మెన్ రామయ్య ని నెమ్మదిగా మాటల్లో పెట్టి అభయ్ వాళ్ళ గురించి వివరాలు తెలుసుకుంటాడు అశోక్. అభయ్ వాళ్ళు చాలా ఆస్తిపరులు అని తెలుసుకుంటారు. ఇంకా మంచివాళ్ళు అని కూడా చెప్తాడు రామయ్య.

అయితే మన సంబంధాన్ని ఒప్పుకుంటారా లేదా అని అనుకుంటారు. అదే విషయం మీనా ని అడుగుదాం అని అనుకుంటారు.

"మీనా, ఒక విషయం అడుగుతాము చెప్తావా" అని మొదలుపెడతారు.

" ఏంటి నాన్న అలా అడుగుతున్నారు, మీరు అడిగినది ఏదైనా కాదు అన్నానా? ఎందుకు అలా అన్నారు నాన్నా" అంటుంది మీనా.

"నీ పెళ్ళి విషయం తల్లి. అందుకనే నీ నిర్ణయమే మాకు ముఖ్యం. అందుకే నిన్ను అడుగుతున్నాము" అంటారు మీనా తండ్రి రాఘవరావు.

"నాన్న, ఇంతలా అడగాలా చెప్పండి నాన్న, మీరు ఏం అనుకుంటున్నారో" అంటుంది మీనా

"అదే తల్లి! అభయ్ బాబు ఉన్నాడు కదా, తన గురించి నీ అభిప్రాయం ఏంటి?" అడుగుతాడు మీనా నాన్న.

"....."

"ఏంటి తల్లీ ఆలోచిస్తున్నావు"

"ఏం లేదు నాన్న, తన గురించి ఎందుకు అడుగుతున్నారు, అయినా మనకి తెలిసినంత వరకు అభయ్ మంచివాడు. నేను తనని చూడలేదు కాబట్టి ఎలా ఉంటాడో తెలియదు. కానీ మనిషి మంచివాడు అని తను మన ఇంట్లో ఉన్న రోజుల్లో తెలిసింది. ఇంకా తన వాళ్ళ గురించి మనకి ఏమీ తెలియదు కదా నాన్నా. అయిన ఇపుడు ఎందుకు అలా అడుగుతున్నారు?" అని గుచ్చిగుచ్చి ప్రశ్నిస్తుంది మీనా.

ఇక చెప్పాలి అని మీనా కి విషయం చెప్తాడు రాఘవరావు.

మీనా ఆలోచన లో పడుతుంది.

తన కలల రాకుమారుడు వెంటనే కళ్ళ ముందు మేదిలాడు.

తన కలలో మాత్రమే కనిపించేవాడు. కానీ అభయ్ తన కుటుంబ సభ్యులతో కలిసిపోయాడు. అందరికీ నచ్చాడు. ఇంకా మంచివాడు. ఏం సంబంధం లేకపోయినా తన ఫ్యామిలీ కోసం ఇంత చేశాడు. అవి అన్నీ ఆలోచిస్తూ ఉంది మీనా.

బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. పొద్దునే నాన్న కి చెప్పాలి అనుకోని పడుకుంటుంది. ఆ రాత్రి మళ్లీ అదే కల, కానీ ఈ సారి తన కలల రాకుమారుడు తన నుంచి దూరం వెళ్ళిపోతున్నాట్టు కల వస్తుంది.

వెంటనే లేచి చుట్టూ చూసి కల అనుకోని, మంచి నీళ్ళు తాగి పడుకుంటుంది.

మర్నాడు ఉదయమే తన తండ్రి తో తను అనుకున్నది చెప్తుంది.

"నాన్న మీ ఇష్టం నాన్న, నాకు ఏది మంచిదో మీకు తెలుసు, మీకు నచ్చినట్టు చేయండి" అంటుంది.

"నీ నిర్ణయం కూడా చెప్పమ్మా" అని అడుగుతారు.

"మనం ఏమి కాకపోయినా మన కోసం ఇంత చేశాడు అంటే మంచి వాడు అయి ఉంటాడు. మిగిలిన విషయాలు మీరు ఆలోచిస్తారు. నాకు అంతకన్నా ఇంకేం కావాలి నాన్నా" అంటుంది.

ఆ మాటలకి సంతోషిస్తారు అందరూ.

ఇంకా అభయ్ ని కలిసి మాట్లాడాలి అనుకుంటారు. అభయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

ఒకసారి మీనా ని కలవాలి అని ఒక చోటకు తీసుకు రమ్మని రామయ్యకు చెప్పి పంపిస్తాడు అభయ్.

రామయ్య మీనా ని తీసుకొని అక్కడకి వెళ్తాడు. అక్కడ ఒక పాప ఉంటుంది. ఆ పాప ముందు మీనా కి ఏక్సిడెంట్ అయినపుడు రామయ్య వాళ్ళ అమ్మాయికి పుట్టిన పాప నయన.

ఆ పాప నీ చూస్తూ ఆడిస్తూ ఉంటుంది మీనా. ఈలోగా మీనా కి కనిపిస్తాడు అభయ్. ఒక్కసారిగా అభయ్ నీ చూసిన మీనా షాక్ అవుతుంది.

మాటలు రాక అలా ఉండిపోతుంది. అభయ్ తనను మాట్లాడిస్తాడు.

"మీనా"

తనని పిలవగానే ఒక్కసారి ఆ మాట ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది మీనా కి, వెంటనే తడుతుండి తనే అభయ్ అని. ఆనందం తో ఒక్కసారి గట్టిగా అభయ్ ని వచ్చి చుట్టేస్తుంది. ఆ ఊహించని సంఘటన కి ఆశ్చర్యపోతాడు అభయ్.

"మీనా ఎంటి నువ్వు, ఇది?" అని ఏం మాట్లాడాలో తెలియక చుట్టూ చూస్తాడు. ఎవరు ఉండరు అక్కడ.

నయన ని తీసుకువెళ్ళి ఆడిస్తూ ఉంటాడు రామయ్య.

తను చేసిన పని గుర్తు చేసుకొని దూరం జరుగుతుంది మీనా.

"మీనా నేను చెప్పేది విను. ఆ తర్వాత నువ్వు ఎం చెప్పాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా నీ ఇష్టం" అంటాడు.

మీనా ని కుర్చీ లో కూర్చోపెట్టి తను కింద మోకాళ్లపై కూర్చొని తనకి ఏక్సిడెంట్ జరిగిన విషయాన్ని చెప్తాడు.

"నేను తెలియకుండా చేసిన తప్పు నిన్ను ఈ పరిస్థితి కి తీసుకువచ్చింది. తప్పు నాదే కానీ అది తెలిసి చేసింది కాదు. ఇదుగో ఈ పాప అపుడు పుట్టిందే. నయన" అని చూపిస్తాడు.

"ఇంకొక విషయం చెప్పాలి. నేను నీకు ఏక్సిడెంట్ జరగక ముందే, నిన్ను మొదటి సారి చూడగానే ప్రేమించాను. పెళ్ళి చేసుకోవాలి అనుకున్నాను, కానీ నా వల్ల ఒక అమ్మాయికి ఏక్సిడెంట్ జరిగింది అని తెలిసి తనని ఎలా అయినా చూడాలి, నా తప్పు సరిదిద్దుకోవాలి అని అనుకున్నాను. కానీ మీ ఇంటికి వచ్చాక కానీ తెలియలేదు ఆ అమ్మాయి నువ్వే అని. I Love you, I want to marry you. will you marry me?" అని అడుగుతాడు.

"ఇంకొకటి ఆగిపోయిన నీ చదువు కూడా మళ్లీ నువ్వు కంటిన్యూ చేయచ్చు మన పెళ్ళి అయిన తర్వాత. అదీ నీ ఇష్టమే" అంటాడు అభయ్.

ఏం చెప్పాలో తెలియని పరిస్థితి లో ఉంటుంది మీనా.

"బాగా ఆలోచించుకొని చెప్పు మీనా నీ నిర్ణయాన్ని నేను మనసారా స్వీకరిస్తాను" అని చెప్పి మీనా నీ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయమని రామయ్య కి చెప్పి వెళ్ళిపోతాడు .

ఇంటికి వెళ్ళిన మీనా ఈ విషయాన్ని అందరితో చెప్తుంది. బాగా ఆలోచిస్తారు అందరూ. ఇంట్లో వాళ్లంతా అభయ్ కి సపోర్ట్ చేస్తారు. అభయ్ నీకు కరెక్ట్ అంటారు. శ్వేత కూడా వస్తుంది అక్కడకి. శ్వేత కూడా తనకి తెలిసింది చెప్తుంది అభయ్ గురించి. అపుడు తన దాచుకున్న కలల రాకుమారుడు చిత్రాన్ని తీసి చూపిస్తుంది మీనా అందరికీ. అభయే తన కలల రాకుమారుడు అని అందరికీ చెప్తుంది.

"అయితే ఇంకేం అభయ్ తో పెళ్ళి నీకు ఇష్టమే కదా" అంటారు అంతా.

ఈ విషయం అభయ్ తో నేనే స్వయం గా చెప్తా అని వెళ్తుంది మీనా.

అభయ్ ని కలిసి తను వేసుకున్న ఆ కలల రాకుమారుడు బొమ్మని తీసి చూపిస్తుంది.

"అభయ్ మీరు ఎవరో తెలియక ముందే నేను మిమ్మల్ని నా కలలో నే చూసి ప్రేమించాను. నువ్వే నా సర్వం అనుకున్నాను. కానీ నాకు ఏక్సిడెంట్ అయ్యాక ఇక మీ గురించి తలుచుకోవటం అనవసరం అనిపించింది. ఇంతలో మళ్లీ మీరే అభయ్ లా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళ అందరికీ నచ్చారు. నా అదృష్టం బాగుంది నా కలల రాకుమారుడు మీరే అయ్యారు. 

మిమ్మల్ని పెళ్ళి చేసుకోవటం నా అదృష్టం గా భావిస్తాను." అంటుంది.

అపుడు అభయ్ ని చూసి గట్టిగా తనని చుట్టుకున్న విషయం గుర్తు వచ్చి అదా సంగతి అనుకుంటాడు. మీనా వెనక్కి తిరిగి ఉంటుంది. సడెన్ గా వచ్చి ఒకసారి గట్టిగా మీనా నీ వెనుక నుంచి చుట్టేస్తాడు అభయ్.

ఒకసారి ఆ చర్య కి ఆశ్చర్యపోయి చిన్నగా అరచి, తనకి కూడా అలా బాగుండటం తో అలాగే ఉంటుంది.

అలా తన రెండు చేతులు మీనా నడుము చుట్టూ వేసి తన మెడ వొంపులో చిన్నగా తన శ్వాస ని వదులుతాడు. మెలికలు తిరుగుతూ సిగ్గు పడి ఒక్కసారి విడిపించుకుంది అభయ్ చేతిలో నుంచి.

ఇవన్నీ పెళ్ళి అయిన తర్వాతే. అప్పటిదాకా ఇలా బుద్ధిమంతుడు లా ఉండాలి అంటూ అభయ్ నోటి మీద వేలు పెట్టి చూపిస్తుంది.

అభయ్ వాళ్ళ నాన్న చక్రవర్తి గారు మీనా ని చూసి గుణవంతురాలు, అందాల రాశి, మా వాడికి తగ్గ అమ్మాయి అని అనుకుంటారు. అభయ్ గురించి తెలుసు కాబట్టి ఈ విషయం ముందే ఒప్పుకున్నారు. అలా అభయ్ మీనా ల పెళ్ళి జరిగిపోయింది.

పెళ్ళి అయిన తర్వాత అభయ్ చెప్పినట్టు గానే మీనా చదువుని కంటిన్యూ చేయిస్తాడు.

సమాప్తం...

*****************Rate this content
Log in

More telugu story from Parimala Pari

Similar telugu story from Comedy