Parimala Pari

Drama Horror Tragedy

4.8  

Parimala Pari

Drama Horror Tragedy

మళ్లీ పుట్టాడు

మళ్లీ పుట్టాడు

3 mins
573



సంపత్ బాగా సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వాడు. తల్లి తండ్రులు డబ్బు బాగా సంపాదించి పెట్టడం తో అల్లరి చిల్లరిగా అమ్మాయిలని ఏడిపిస్తూ, ఉన్న డబ్బు తో ఫ్రెండ్స్, పబ్బులు, పార్టీలు, అమ్మాయిలు అంటూ ఆనందంగా కాలం గడిపేస్తూ ఉండేవాడు. దొరికిన అమ్మాయి నల్లా ఏడిపిస్తూ ఉంటాడు.

తండ్రి పెద్ద పేరుమోసిన బిజినెస్ మాన్ అవ్వటం తో కొడుకుని పట్టించుకునే కాళీ లేదు. తల్లి కూడా పట్టించుకునే స్థితిలో లేదు. కొడుకు అడిగినది ఏదైనా కొనివ్వటం, అవసరానికి మించి డబ్బు ఇవ్వటం తప్ప చేసేది ఏమీ లేదు.

ఏదో చదువు మాత్రం పూర్తి చేశాను అనిపించాడు. ఒక రోజు తన కాలేజ్ స్టూడెంట్స్ నీ ఏడిపిస్తూ ఉండగా ఒక అమ్మాయి వచ్చింది. సంపత్ చేసే టీజింగ్ నుంచి ఆ అమ్మాయిలని తప్పించింది. సంపత్ కన్ను వెంటనే ఆ అమ్మాయి మీద పడింది. ఎలాగైనా ఆ అమ్మాయిని పట్టుకోవాలని, దక్కించుకోవాలని అనుకున్నాడు.

ఆ అమ్మాయి శ్వేత, ఒక మెడికో. కుందనపు బొమ్మ లా ఉంటుంది. ఎంబీబీఎస్ చదివి హౌజ్ సర్జన్ చేస్తుంది. అనాధ శరణాలయాలకి, ఓల్టేజ్ హోమ్ పిల్లలకి ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఉంటుంది. అలా ఒకరోజు బయటకి వెళ్ళి వస్తూ ఉండగా సంపత్ శ్వేత నీ చూసాడు.

ఎలాగైనా శ్వేత నీ ఈరోజు వదలకూడదు అని నిర్ణయించుకున్నాడు. శ్వేత నీ ఫోలో చేస్తూ వెళ్ళాడు. చీకటి పడింది, ఆకాశం మేఘావృతమై ఉంది. చల్లని గాలులు వీస్తున్నాయి. వర్షం పడేలా ఉంది త్వరగా ఇంటికో వెళ్ళాలి అనుకుని బండి రైస్ చేసింది శ్వేత. సడెన్ గా బండి ఆగిపోయింది. చూస్తే పెట్రోల్ అయిపోయింది. అయ్యో ఇప్పుడు ఇలా చిక్కుకు పోయాను ఎంట్రా అని ఆలోచిస్తూ ఉంది.

అప్పుడే తనని ఫాలో చేస్తున్న సంపత్ స్కోడా కార్ లో అక్కడకి వచ్చాడు. లిఫ్ట్ కావాలా అని అడిగాడు. సంపత్ నీ చూడగానే ఎక్కడో చూసినట్టు అనిపించింది శ్వేత కి, గుర్తు తెచ్చుకుని సరికి అతన్ని చూడగానే కోపం వచ్చింది.

కానీ సంపత్ తను మారిపోయాయని, అలా ఎవర్ని ఏడిపించడం లేదని నమ్మించాడు. పక్కనే ఉన్న తన గెస్ట్ హౌస్ కి తీసుకు వెళ్ళాడు. వర్షం మొదలైంది. ఇంక ఏమీ చేయలేక సంపత్ తో పాటు వెళ్ళింది శ్వేత.

గెస్ట్ హౌస్ కి వెళ్ళగానే టవల్ ఇచ్చి తక తుడుచుకోమని అన్నాడు శ్వేత నీ. కాఫీ తీసుకు వస్తా అని చెప్పి కిచెన్ లోకి వచ్చాడు. కాఫీ లో మత్తు మందు కలపబోతు ఉండగా శ్వేత అడు కనిపెట్టేసింది. అక్కడి నుంచి బయటకి రావాలని ప్రయత్నించినా ఫలితం లేదు. అన్ని డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. సంపత్ నుంచి దూరంగా వెళ్తూ ఉంది. రాను రాను సంపత్ శ్వేత కి దగ్గరగా వస్తున్నాడు.

శ్వేత వెనక్కి గోడకు జారబడింది. ఎదురుగా ఉన్నది సంపత్. తనని తాను ఎలాగైనా కాపాడుకోవాలి అనుకుంటూ ఉండగా పక్కనే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ కనిపించింది. సంపత్ శ్వేత మీదకి రాగానే ఒక్క ఉదుటున ఆ ఫ్లవర్ వాజ్ తో సంపత్ తలపై బలం గ కొట్టింది. సంపత్ వెంటనే కింద పడిపోయాడు.

అక్కడినుంచి బయటకి రావటానికి చూస్తోంది శ్వేత. ఈలోగా సంపత్ తల నుంచి రక్తం కారటం చూసింది శ్వేత. వెంటనే సంపత్ దగ్గరకి వచ్చి ఆ దెబ్బ కి కట్టు కట్టింది. తన బాగ్ లో ఉన్న ఫస్ట్ అయిడ్ కిట్ తీసి సంపత్ కి వైద్యం చేసింది. నొప్పి తో అరుస్తున్నాడు సంపత్.

ప్లీజ్ పైన్ తగ్గిపోతుంది. సారీ అండి, ఏదో కంగారులో అల చేశాను. కట్టు కట్టాను కదా తగ్గిపోతుంది అని ఒదారుస్తుంది సంపత్ నీ. శ్వేత కళ్ళలో బాధ కనపడుతుంది సంపత్ కి. అది చూసిన సంపత్ ఒక్కసారి తను చేయాలనుకున్న పని ఏమిటో, ఇప్పుడు తను ఉన్న పరిస్థితి ఎంటో గుర్తు వచ్చింది. చాలా బాధ పడ్డాడు తన ఆలోచనకి.

అక్కడే అప్పుడే సంపత్ మళ్లీ పుట్టాడు. తన మీద అత్యాచారం చేయబోయిన వాడికి కూడా దెబ్బ తగిలితే విలవిల లాడిపోయిన శ్వేత నీ చూసి పశ్చాత్తాపం చెందాడు. సంపత్ ఆ పాత జీవితం నుంచి బయటకి వచ్చి మరోసారి బ్రతికాడు. అప్పటి నుంచి మంచిగా మారి, మనిషిలా ఉండటం మొదలు పెట్టాడు.

శ్వేత వృత్తి పరంగా ఒక డాక్టర్ కదా. అందుకే తనకి కష్టం తలపెట్టిన వాడిని కూడా కాపాడి, డాక్టర్ గా తన బాధ్యత నిలుపుకుంది. తర్వాత శ్వేత చేసే అన్ని సామాజిక కార్యక్రమాలలో సంపత్ తనకి తోడుగా ఉంటూ, తన వంతు సాయం తను చేస్తూ వచ్చాడు.

హ్యాట్సాఫ్ టు శ్వేతా. తనకి అపకారం చేయాలని చూసిన వాడిని కూడా మంచి వాడిగా మార్చేసింది.



Rate this content
Log in

Similar telugu story from Drama