కనుమరుగు అవ్వని కళ..
కనుమరుగు అవ్వని కళ..


అనగనగా ఒక ఊరు ..
ఆ ఊరిలో ఒక ఊహల రామలింగయ్య అనే వ్యక్తి ఉండేవాడు...
అతనికి కథలు రాయడం అంటే చాలా ఇష్టం...
అలా వేస్తూ వేస్తూ...ఒక పెద్ద రచయిత గా ఎదగాలని అతని ఆశయం...తన కథలను రాస్తూ రాస్తూ...ఎదైన కంటికి కనిపిస్తే చాలు నిమిషాల్లో... కథలు రాసవాడు...
ఒక్కరోజు తనకి ఒక కల వచ్చింది..అది ఎలాంటిది అంటే.. ఎవరో తెలియని మనుషి ఒక మనిషిని వెంబడిస్తు తనను హత్య చేసి తన దగ్గరే ఉన్న ధనం నీ కాజేసినట్టుగా...వచ్చింది..
వెంట్టనే ఉలికి పడి లేచిన ఆ రామలింగయ్య...తన కలలో .
వచ్చిన దృశ్యాలను కథలు
గా రాకున్నడు
...
తిరిగి తను మళ్లీ పడుకున్నాడు...
సూర్యోదయం వేళకి లేచి చూసే సరికి ఆ కథ రాసిన పత్రులు కనుమరుగై పోయాయి...
వెతికాడు కనిపించలేదు...
రామలింగయ్య అల ఊరిలో నడుస్తు వెళ్తుండగా ఒక్కసారికి తన కలలో కనిపించిన దృశ్యం కళ్ల ముందు ఎదురయ్యింది...అక్కడే తను
ఆశ్చర్యంతో...అయోమయంలో.పడి భయపడుతూ ఇంటికి పరుగు తీశాడు...
మర్నాడు రాత్రి మళ్లీ ఒక కల ఈసారి..అద్బుతం...ఏమిటి అంటే తన పొలంలో దేవుని విగ్రహాలు ప్రతక్షమయి అందరినీ ఆకట్టకుంటు ఆ ఊరిని ఆశీర్వదిస్తూ ..ఎల్లవేళలా ఊరిని పచ్చగా కాపాడుతున్నట్టు వచ్చింది ...
వెంటనే అతను నిద్రలేచి... ఆ అద్భుత దృశ్యాన్ని కథ గా రాసుకున్నాడు..
తిరిగి నిద్ర పోయాడు...
తెల్లవారింది...
మళ్లీ తను వేసిన కథా పాత్రులు కనుమరుగైయ్యాయి..
ఎంత వెతికినా దొరకలేదు...అల పొద్దున ఊరి చల్ల గాలి కి అల పొలం వైపు నడక సాగిస్తున్నాడు..
రామలింగయ్య...ఒక్కసారిగా ఊరి జనం పరుగు....
భక్తితో... భగవంతుని నామస్మరణతో...అందరూ పరుగు తీస్తున్నారు...తను కూడా.. ఏంటో అని ఆశక్తిగా వెళ్ళారు...
అక్కడిగి వెళ్లి చూసే సరికి తన రాస్కున్న కథ నిజంలా తన కళ్లముందు ఉంది...అల కొన్ని రోజుల్లో అక్కడ దేవుళ్ళకి గుడి పూజలు నిర్వహించారు...కొన్ని రోజులు అల గడిచాయి ఊరు కూడా పచ్చిగా ఆనందంగా ఉంది..అల తను కొంత కాలానికి తను ఆశ్చర్యం నుంచి బయటకి వచ్చి మళ్ళీ తన రచనలు ప్రారంభించారు...
మళ్లీ ఒక్కరోజు మరో కల తనని అతలాకుతలం చేసింది... ఈ సారి తను ఉంటున్న గృహంలో ఒక ఇనుప
పెట్టే నిండ్డ బంగారు కాసులతో ప్రత్యేకమైంది...అది వెంటనే రెండు మూడు సార్లు రచించాడు కలలో వచ్చిన దృశ్యాన్ని...
తను పడుకోకుండా మెలుకువతోనే ఉన్నాడు ఆ రాత్రి మొత్తం అనుకోకుండా...ఒక వెలుగు కంటిని కప్పేసి బంగారు కాసుల పెట్టే తన ఇంటిలో నిలిచిపోయింది..అక్కడే తట్టుకోలేని ఆశ్చర్యంతో కూడిన సంతోషంతో తను ఉక్కిరిబిక్కిరి అవ్తున్నడు.. వెంట్టనే అతని మంచి తనం .
తనకు లభించిన ఆ ధనంకి లోగి పోకుండా తన ఊరికి ,ఊరి ప్రజలకి దానం చేసాడు....
అప్పటి నుండి...ఊరిలో తన చుట్టూ పక్క ఊరిలో కూడా ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే తన చెంతకు వచ్చి విన్నపించుకో సాగరు..ఊరి ప్రజల సమస్యలకి సమాధానం..కోసం కలలు కంటూ...సమస్యలని తీరుస్తూ అల తన జీవితాన్ని విజయవంతంగా సాగించాడు...