Satyavani B

Comedy Fantasy

4.2  

Satyavani B

Comedy Fantasy

బధ్ధకస్తుడు

బధ్ధకస్తుడు

3 mins
820


 పూర్వం రాణా ప్రతాప్ అనే ఒక రాజు ఉండేవాడు. ఆ రాజ్యంలో ఒక నది ప్రవహించేది. ఆ నదిలో విచిత్రమైన రాళ్ళు ఉండేవి. అవి అందంగా మెరిసిపోతూ శివలింగ ఆకారంలో ఉండేవి. ఆ రాళ్ళని అతను సేకరించేవాడు. అవి శివలింగ ఆకారంలో ఉండటం వల్ల మహాత్ములు,ఋషులు అందరూ వచ్చి అర్చనలు, పూజల కోసం తీసుకెళ్ళేవారు. అతను అలాంటివి చాలా సేకరించి అడిగిన వాళ్ళందరికీ పంచి ఇచ్చేయడం వలన ఆఖరికి ఒకే ఒకటి మిగిలింది.

                                               

 అది అతను చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు. అలా ఉండగా ఒక రోజు ఒక ఋషి వచ్చి ఆ రాజు ని ఆ రాయి కోసం అడిగాడు. ఆ రాజు తన దగ్గర ఒకటే మిగిలి వున్నా కూడా, ఆ ఋషి అడిగినదానిని కాదనకుండా మిగిలిన ఆ రాయిని కూడా ఇచ్చేసాడు. దానికి ఆ ఋషి ఎంతో సంతోషించి ఆ రాజు కి ఒక మాయాపేటిక ఇచ్చీ "దీంట్లొ ఒక భూతం ఉంది, అది నువ్వు ఏమి చెప్తే అది చేస్తుంది. దీనికి నువ్వే యజమానివి" అన్నాడు. ఆ రాజు సరే ఒక సారి ప్రయత్నిద్దాం అని ఆ పెట్టెని తెరిచాడు. తెరిచిన వెంటనే ఆ పెట్టె నుంచి ఒక చిన్న భూతం వచ్చింది. చూస్తుండగానే రెప్పపాటులో అది 40 అడుగులు అయిపొయింది. అది చూసి రాజు ఆశ్చర్యపడిపొయాడు. తరవాత రాజు ఆ భూతం ని స్నానంకి వేడి నీళ్ళు సిద్ధం చెయ్యమన్నాడు. అది వెంటనే చేసేసింది. 

                                                     

మిగతా పనివాళ్ళు చేసే పనిని ఆ భూతం చిటికె లో చేసేసేది. ఇంక అప్పటినుంచి రాజు అన్ని పనులూ భూతం చేతనే చేయించేవాడు. ఒక రోజు తన ఇంట్లో పనివాళ్ళని పిలిచి "మీరింక ఇక్కడ పని చేయనవసరం లేదు" అని వాళ్ళని వెళ్ళిపొమ్మన్నాడు. ఆ పనివాళ్ళు ఆ రాజు కాళ్ళా వేళ్ళా పడి "మేము మీ ఇంట్లో పని చెయ్యకపోతె మాకు డబ్బులు ఎక్కడనుంచి వస్తాయి, మేము ఎలా తిని బ్రతకాలి? రోజూవారి పనులు మా చేత చేయించండి, మేము చెయ్యలేని పనులు, మేము ఎక్కువ సమయం తీసుకునే పనుల్లాంటివి భూతం చేత చేయించండి" అని ప్రాధేయపడ్డారు. దానికి రాజు సరే అన్నాడు. ఆ ఇంటి పనివాళ్ళలో ఒక పనివాడు చాలా బద్ధకస్తుడు, వాడి పేరు రంగడు. వాడికి రాజు చెప్పే పనులు అన్నీ వేరేవాళ్ళ చేత చేయించేవాడు. వాళ్ళు వాడిని "నీ పని నువ్వే చేసుకో" అని తిట్టేవాళ్ళు. ఒక రోజు రాజు బయటికి వెళ్తూ రంగడికి ఒక మామిడి మొక్క నాటడం కోసం ఒక గొయ్యి తవ్వమన్నాడు. వాడికి బద్ధకం కదా, ఆ పని వేరేవాళ్ళకి చెపితే వాళ్ళు వీడిని తిట్టారు. ఇప్పుడు గొయ్య తవ్వే పని వాడే చెయ్యాలి కాని వీడికి అది ఇష్టం లేదు. చాల సేపు ఆలోచించిన తరవాత వాడికి ఒక అలోచన వచ్చింది. ఆ మాయా పేటిక ఇంట్లో నే వుంది కనుక రంగడు ఆ పెట్టె దగ్గరికి వెళ్ళి దాన్ని తెరిచాడు. ఆ భూతం బైటికి వచ్చి,"నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు నా యజమాని యెక్కడ, నేను మా యజమాని మాటే వింటాను, నీ మాట వినను"అని అంది. రంగడు "నేనే ఈ పెట్టెని తెరిచాను గాబట్టి నేనే నీ యజమానిని" అన్నాడు. అలా 2-3 సార్లు వాదించుకున్నారు. సరేలే అని ఆ భూతం రంగడు చెప్పిన మాటే వింటాను అని చెప్పింది. రంగడు, ఇంక ఆ గొయ్యి తవ్వే పనిని ఆ భూతం కి చెప్పాడు . ఆ భూతం తోట కి వెళ్ళింది తవ్వడానికి. భూతం ఎలాగూ పని చేస్తుంది కదా అని వాడు శుభ్రంగా తిన్నాడు. తర్వాత వాడికి ఆవలింతలు వచ్చాయి. వాడికి నిద్ర వచ్చింది. రాజుగారు ఎటూ ఇంట్లో లేరు కదా అని రాజు గారి రత్నకంబళి కప్పుకొని పడుకుందాం అని వెళ్ళాడు. అది మధ్యాహ్నం వేళ. మధ్యాహ్నం 3.30, 4.00 అయినా కూడా ఆ భూతం తవ్వుకుంటూ పొయింది. దానికి ఎవరూ ఆపమని చెప్పలేదు. ఈ విషయం ఆ దారిలో వెళ్తున్న ఒక వంటవాడు చూసాడు. వాడు ఆ పనిని ఆపమన్నాడు కాని ఆ భూతం వాడి మాట వినలేదు. నేను నా యజమాని మాటలే వింటాను అన్నది. ఆ వంటవాడు రంగడి దగ్గరకి వెళ్ళి వాడిని లేపడానికి ప్రయత్నించాడు కాని వాడు లేవలేదు. వంటవాడి దగ్గర అట్లకాడ ఉంటుంది కదా అది వేడిగా ఉంది. అది వాడి చేయి మీద పెట్టి లేపాడు. లేపి వాడితో "ఒరేయ్ లేచి ఆ భూతంకి చెప్పు తవ్వడం ఆపమని మా ఎవరి మాటలూ వినటంలేదు" అని అన్నాడు. రంగడు పరిగెత్తుకుని వెళ్ళి చూస్తే పెద్ద గొయ్యి ఏర్పడిపోయింది. 


ఆ భూతం ని ఇంక ఆపక పోతే వాళ్ళ ఇల్లు కూలిపొయేది. అంత లోతు, పొడవు తవ్వేసింది. అప్పుడు రంగడు దానికి ఆపమని చెప్పాడు. ఆ భూతం ఇంక తవ్వడం ఆపింది. ఆ గొయ్యి ఒక 100 అడుగులు పొడవు ఇంక 50 అడుగులు లోతు ఉంది. అదే సమయానికి రాజు వచ్చేసాడు. అతను ఈ గొయ్యి చూసి రంగడు ని "ఏరా నేను ఒక చిన్న మొక్క నాటడం కోసం గొయ్యి తవ్వ మంటే నువ్వు ఇంత పెద్ద గొయ్యి తవ్వావా? అని అడిగాడు. నీకు చెప్పిన పనిని నువ్వు చెయ్యకుండా ఆ భూతం చేత చేయించటం వలన ఇంత ప్రమాదం జరిగింది. ఇప్పుడు నువ్వే దీన్ని పూడ్చాలి, ఇదే నీకు శిక్ష" అన్నాడు. ఆ పూడ్చే పనిలొ వాడి బద్ధకం అంతా వదిలి పోయింది !!!

ఈ కథలో నీతి ఏంటి అంటే, బద్ధకంగా ఉండ కూడదు అని.

Name: Mayukha.B

Age: 13

Class; 8th

Address: Saundarya Edifice, Chinchwad, Udyognagar

Story/ poem ( choose any 1): Story

Name of the school: City Pride School

Theme: Moral


Rate this content
Log in

Similar telugu story from Comedy