Ambica Lakshmi

Children Stories Drama Fantasy

4.7  

Ambica Lakshmi

Children Stories Drama Fantasy

నువ్వు జీనివా

నువ్వు జీనివా

11 mins
667


ఈ కథను ఫాంటసీ కథల పోటీ కోసం రాసినది మీ ప్రేమ అభిమానం నాకు దక్కుతాయి అని ఆశిస్తున్నాను..

ఈ కథలోని పాత్రలు పేర్లు సనివేసాలు కేవలం కల్పితాలు మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఎవరిని మనోభావాలను దెబ్బతీయాలని అసలు కాదు నలుగురు ఆనందం కోసం మాత్రమే రాసింది ......


మీకు జీనీ అంటే ఇష్టమా ????

నాకు చాలా ఇష్టం తెలుసా...

ఎందుకో చెప్పుకోండి...

ఎందుకంటే మనకు ఎం కావాలి అన్నా ఇస్తాడు మనతోనే ఉంటాడు అని....

మీకు జీని అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఎవరు?

మీకే కాదు నాకు కూడా అల్లావుద్దీన్ మాత్రమే గుర్తుకు వస్తాడు ఎందుకంటారు ఎందుకంటే మనం అల్లావుద్దీన్ కధకు అంత అలవాటు పడిపోయాము అన్నమాట.

కానీ ఎప్పుడు అందరికీ తెలిసిన కథ చెప్పుకుంటే కొత్త ఏం ఉంటాది చెప్పండి ఈరోజు మనం కొత్తగా చెప్పుకుందాము అందుకనే మన జిని జాబితాలో ఇంకొక మట్టిలో మాణిక్యం కూడా చేరుద్దం.

కానీ ఎప్పుడు మీరు వినని కొంచం బిన్నంగా ఉండే జిని గురించి చెప్పుకుందాం అయితే....

ఆ మట్టిలో మాణిక్యం ఎవరో కాదు మన కథకు హీరో సుల్తాన్

పేరులో ఉన్న భోగం మాత్రం జీవితంలో లేదు మన హీరోకి.ఉదయానే బద్దకంగా లేచి అమ్మ నాకు టీ కావాలి.

డాడీ నాకు స్కూల్ టైమ్ అయింది కాస్త ఆ సాక్స్ ఎక్కడ ఉందో చూడండి.

కళ్ళు తుడుచుకుంటూ అయ్యో నాకు అమ్మ డాడీ లేరు కదా అంతేకాకుండా నేను ఎప్పుడు స్కూల్ కి కూడా వెళ్ళలేదు కదా.అని అనుకుంటూ పైకి లేచాడు.

మొఖం కడుక్కొని దగ్గరలో ఉన్న ఒక్క మార్కెట్ లోకి వెళ్లి.బాబాయ్ ఎంటి ఈరోజు ఆపిల్స్ ఫ్రెషగా ఉన్నాయా అని ఒక్క కాయని తీసుకోని తినేశాడు.

మనస్సులో హమ్మయ ఇంకా ఈరోజు టిఫిన్ అయిపోయింది .అలానే మధ్యాహ్నము రాత్రి కూడా కష్టం లేకుండా కడుపు నింపుకుంటు ఉండేవాడు.

ఒక్కోసారి జనాలు కోపంపడిన తప్పక బరించేవారు .

ఎందుకంటే సుల్తాన్ తల్లి తండ్రి అక్కడి ప్రజలకు బాగా సహాయం చేస్తూ ఉండేవారు.ఆ కోశానా సుల్తాన్ నీ భరించేవారు.కానీ ఏ నాడు కూడా ఒక్కరి దగ్గర చెయ్యి ఛాచడం గాని దొంగతనాలు చేసేవాడు కాదు.

సరదాగా మెల్లగా అడిగి తీసుకునే వాడు అందరితో ప్రేమగా వారికి సహాయం చేస్తూ ఉండేవాడు ఏదైనా వారి దగ్గర తీసుకున్న వారికి రెట్టింపు సహాయం చేసేవాడు సుల్తాన్.

సహాయం చెయ్యడం అందరితో కలివిడిగా ఉండటం చేసేవాడు.ఆ విషయాలు అక్కడ ఉండే కొంతమందికి నచ్చేవి కాదు.(సుల్తాన్ వయస్సు పిల్లలకి).

సుల్తాన్ పెరిగి పెద్దవాడు అయ్యాడు.తనతో పాటు తన మంచితనం తన అల్లరి కూడా పెరిగింది దానితో పాటు చిన్న చిన్న పనులు చెయ్యడం కూడా మొదలు పెట్టాడు.

ఆ ఊరిలో తనకు పెరుగుతున్న పేరుని కొంత మంది కుర్రాళ్లకు నచ్చక వారు అందరూ ఒక్కరోజు సుల్తాన్ వద్దకు వచ్చి తనని ఏదైనా చెయ్యాలి అని ఉదేశ్యంతో.

సుల్తాన్ సుల్తాన్.

మేము అందరము కలిసి ఒక్క చోటికి వెళ్ళాలి అని ప్లాన్ చేసాము చిన్నప్పటినుంచి నువ్వు కూడా మాతోనే పెరిగావు కదా అని అక్కడికి నిన్ను కుడా తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటున్నాము నువ్వు కూడా మాతో పాటు వస్తున్నావు కదా.

సుల్తాన్ :

నేను ఎందుకు మధ్యలో మీరు వెళ్లి రండి నేను రాను.

నువ్వు రాకపోతే మేము కూడా అక్కడికి వెళ్ళాము నీ మీద ఆశలు పెట్టుకొని ఈ ప్లాన్ వేసాను నువ్వు రాను అంటే ఎలా చెప్పు.అని అందరూ బతిమిలాడడం మొదలుపెట్టారు ఇంకా వారి బాధ బరించలేక సరే అని చెప్పాడు సుల్తాన్.

ఒక రెండు రోజులు ఉండి రావాలి కావాల్సినవి కూడా తెచ్చుకో సరే నా!అని అంటూ అందరూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

సుల్తాన్ ఆనందంగా అందరితో నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పడం మొదలు పెట్టాడు చాలా సంతోషంగా మొత్తం అన్ని సద్దుకోనీ రెఢీ అయిపోయాడు.

సుల్తాన్ రేయ్ నాన్న ఎక్కడికి వెళ్లుతున్నావు.

తెలియదు బాబా ఫ్రెండ్స్ రమ్మని ఇబ్బంది పెడుతుంటే వెళ్తున్నాను .

నీ ఫ్రెండ్స్ ఆ?

అదే బాబా మన పక్క కొట్టు అబ్బాయిలు .

హొ వాళ్ళ వాళ్ళను చూస్తే పెద్ద మంచి వాళ్ళలా నాకు అనిపించరు.

తప్పు బాబా పూర్తిగా తెలియకుండా మనం ఒక్క అలోచనలకు రాకూడదు కదా.

పోనీలే కానీ ఎక్కడికి పోతున్నావు .

నాకు తెలియదు సర్ప్రైజ్ అని చెప్పారు.

అదేమిటి?

తెలియదు బాబా .

పోనీలే ఏడకి పోయిన క్షేమముగా వెళ్లి రావాలి అదే అందరికీ కావాలి ఏం అంటావు.?

నేను క్షేమంగానే ఉంటాను గాని నువ్వు నీ ఆరోగ్యాని జాగర్తగా చూసుకోవాలి సరే నా ఇంక టైమ్ అయింది నేను వెళ్లి జాగర్తగా త్వరగా వచ్చేస్తాను బై బాబా అని చెప్పి బయలుదేరాడు

సుల్తాన్ :

రేయ్ హుస్సేన్ మిగిలిన వారు ఇంకా రాలేదు ఎంటి మీరు నాకు ఎక్కడికి వెళ్తున్నాము అనే విషయం మాత్రం చెప్పలేదు నాకు చాలా సరదాగా ఉంది నేను ఎప్పుడు ఇలా వెళ్ళలేదు మీతో వెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంది.

హుస్సేన్ :

వాళ్ళు అన్ని సద్దుకొని వస్తారులే కానీ నీకే తెలుస్తుంది లే మనం ఎక్కడికి వెళ్తున్నాము అనేది....

ఇంకొక విషయం మనం ట్రైన్ మీద వెళ్తున్నాము నీకు కూడా మేము టికెట్ తీశాం లే....

చాలా బాగుంటది

అలా వారు మాట్లాడుకుంటున్న సమయంలో హుస్సేన్ స్నేహితులు వచ్చారు అని చెప్పి వారి దగ్గరకు వెళ్లిపోయాడు

స్నేహితులు వచ్చారు అని సుల్తాన్ కూడా వారి దగ్గరకు వెళ్ళాడు.

రివాన్ :

ఎంటి సుల్తాన్ అంతా సద్దుకున్నావా మారీ...

చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నావు

ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు కదా సంతోషంగానే ఉంటాది లే....

మాతో రావడం ఇంతకీ నీకు ఇష్టమేనా బాధపడుతూ మాత్రం రాకు...

సుల్తాన్ :

హా ఇష్టమే దీనిలో బాధ పడడానికి ఏం ఉంటుంది.

ట్రైన్ లో వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది సరదాగా ఉంటుందా..????

హుస్సేన్ :

చాలా బాగుంటుంది సరదాగా కూడా ఉంటుంది

మనం సుమారు ఒక రాత్రి ఒక పగలు ప్రయాణిస్తాము స్ తర్వాత మనం వెళ్లాలి అని అనుకున్న ప్రదేశానికి వెళ్తాము

ఇంతకీ అందరూ వచ్చేశారు కదా ఇంకేంటి ఆలస్యం బయలుదేరడం మంచిది లేకపోతే రైలు దగ్గరకు వెళ్లేసరికి ఆలస్యం అయితే రైలు వెళ్లిపోతాది పదండి పదండి అని ముందుకు తీసుకొని వెళ్ళాడు

అందరూ కలిసి ట్రైన్లో కూర్చున్నారు

అప్పట్లో బోగికి బెర్తులు ఉండేవి కాదు ఒక బోగిలోనే ప్రయాణికులు అందరూ కూర్చుని ప్రయణించేవారు

అలానే సుల్తాన్ తన స్నేహితులతో ఎక్కి కూర్చున్నాడు..

అందరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు కానీ సుల్తాన్ తో పెద్దగా ఎవరు మాట్లాడం లేదు...

కానీ సుల్తాన్ మాత్రం కల్పించుకొని అవసరం లేకపోయినా వారితో మాటలు కలిపే వాడు

అనవసరంగా ఇక్కడికి వచ్చానా వీరితో..

లేదు లే అలా అనుకోకూడదు........

అందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు

హుస్సేన్ :

బాగా ఆకలిగా ఉంది తిందామా......

సుల్తాన్ :

మా బాబా నాకు బన్ ఇచ్చారు ఎవరైనా తింటారా అని తన దగ్గర ఉన్న బన్ను ముక్కలు వారికి కూడా ఇచ్చాడు..

తినేసిన తరవాత అందరూ నిద్ర రాకపోయినా నిద్రపోధము అని చెప్పి నిద్రపోతున్నట్టు నటించడం మొదలు పెట్టారు....

కానీ వారిలో ఎవరు నిద్రపోలేదు ఆ విషయం తెలియక సుల్తాన్ కూడా నిద్రపోవడానికి ప్రయత్నించాడు...

కానీ ఎంత ప్రయత్నించినా అసలు నిద్ర రాకపోవడంతో సరే ఆ డోర్ దగ్గరకు వెళ్ళి కాస్త చల్ల గాలినీ పీల్చుకొని వస్తాను అప్పుడైనా నిద్రపట్టోచు అని వారిని తప్పించుకొని బయటకు వెళ్ళాడు...

హుస్సేన్ కు సుల్తాన్ వెళ్ళడం తెలిసింది....

రేయ్ వాడు ఇప్పుడే బయటకు వెళ్ళాడు ఇదే మనకి మంచి సమయం పదండి అని మిగిలిన వారిని కూడా తీసుకోని మెల్లగా బయటకు వెళ్ళాడు...

సుల్తాన్ ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ తల బయట పెట్టీ నించున్నాడు

ఇదే అనువైన సందర్భంగా చూసి అటువైపు చూస్తున్న సుల్తాన్ ను హుస్సేన్ తన స్నేహితులు ఆమాంతం ఆవతలికి తోసేశాడు

చీకటిలో వారు సుల్తాన్ ను ఎక్కడకి తోసారో తెలియలేదు కానీ అక్కడినుంచి తోసారు కాబట్టి చచ్చిపోతాడు లే అని ఆనందంగా అక్కడే డాన్సులు కడుతు ఉండగా

రైల్ నుంచి పడుతున్న సుల్తాన్ వారిని చూసాడు

కానీ అదృష్టవశాత్తు సుల్తాన్ ఒక పెద్ద ఇసుక తిప్ప మీద పడ్డాడు

అలా పడడం వల్ల దెబ్బలు తగలలేదు కానీ స్పృహ తప్పిపోయాడు.....

రాత్రంతా అలానే అక్కడే ఉండిపోయాడు...

ఉదయం లేలేత శరీరం మీద రాత్రిని ఎదిరించి గెలిచి గర్వంగా పైకి వస్తున్న సూర్యుని కిరణాలు సుల్తాన్ మీద పడిన వెంటనే కళ్ళు నలుపుకుంటూ లేచి చూసాడు...

నేను ఏం తప్పు చేశాను అని వారు నన్ను అక్కడినుంచి తోసేశారు.....

వాళ్ళు మంచి వారు అని నమ్మి వారితో వెళ్ళడం నా తప్పు బాబా అప్పటికే చెప్పాడు వారు నీకు స్నేహితులు ఎంటి రా అని కానీ నేనే నమ్మి వచ్చాను

కానీ నేను ఎప్పుడు వారిని మోసం చెయ్యలేదు బాధ పెట్టలేదు మరి ఎందుకు అలా చేశారు....

నేను తప్పుగా అనుకుంటున్నాను ఏమో వారి కావాలి అని తోయ్యాలేదు అనుకుంటా నా వెనక వచ్చి పిలవబోయాడు ఏమో జారీ నేనే పడిపోయి ఉంటాను...

ఏది ఏమైనా ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అసలు ఇక్కడినుంచి నేను ఇంటికి వెళ్ళాలి

ఇక్కడ ఏటుచూసిన ఇసుక తప్ప ఇంకేం కనిపించడం లేదు నేను ఏటుఅని పోవాలి......

అని చాలా దూరం నడుచుకుంటూ ముందుకు వెళ్లాడు

సుమారు అరగంట పైనే నడిచిన ఇసక తప్ప ఆ ప్రదేశంలో ఇంకేం కనిపించడమే లేదు.....

హేయ్ అల్లాహ్ ఏదోక దారి చూపించవా ఇక్కడినుంచి నేను బయటపడడానికి

బాగా దాహంగా ఉంది గొంతు ఎండిపోతుంది కనీసం ఇక్కడ ఒక చెట్టు కూడా లేదు కాసేపు చెట్టు కింద కూర్చుందాము అంటే...

చమటలు పడుతున్నాయి ఆకలిగా ఉంది నోరు ఎండిపోయింది అమ్మో చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఉండడం

బాగా నీరసంతో ఉండడం అది ఇసక కొండ మీదకు వెళ్లే సరికి అక్కడినుంచి అదుపు తప్పి సరాసరి కొండ అవతలికి దొల్లుకుంటు కిందకి పడ్డాడు....

సుల్తాన్ కిందకి పడిన వెంటనే తన తలకు ఇనుము లాంటి ఒక వస్తువు ఏదో తగిలి టింగున శబ్ధం వచ్చింది.....

ఒక కన్ను తెరిచి ఇదేంటీ అని ఇసుక తవ్వి ఆ వస్తువుని బయటకు లాగాడు....

లాగిన వెంటనే షాక్ అయ్యాడు....

ఇదేంటీ అద్భుత దీపంలా ఉంది...

అవును ఇది అద్భుత దీపమే నాకు బాబా చిన్నప్పుడు చెప్పిన కథ గుర్తుంది అల్లావుద్దీన్ గురించి

ఇది అలాంటి దీపమే అనుకుంటా

అవును దీపాన్ని ఏం చెయ్యాలి హా గుర్తొచ్చింది రుద్దాలి కదా అని బర బర రుద్దాడు...

ఇదేంటీ అలా రుద్దిన వెంటనే దానిలోపలి నుంచి జీనీ వస్తాడు గా మరి రాలేదు ఎంటి

ఇది వేరే రఖం దీపం అయి ఉంటాది నేను ఏం చేస్తే లోపల జీన్ బయటకు వస్తాడు అని అతి ఇటు తిప్పి నేలకేసి కొట్టినా లోపల నుంచి ఏటువంటి చలనం లేదు....

ఉఫ్ ఇంకా ప్రయత్నించడం నా వల్ల అయ్యేలా లేదు అయిన సరే ప్రయత్నించడం మాత్రం వదిలి పెట్టాను

పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉంటాను

అని తనలో తాను అనుకుంటూ దీపానికి పైన ఉన్న ఒక చిన్న ముతలా ఉంది దానిని తెరిచే ప్రయత్నం చేశాడు

అది అసలు స్పందించడం లేదు

ఇదేంటీ ముత కూడా తెరుచుకోవడం లేదు

అయ్యో జీన్ చూసే అదృష్టం దొరుకుతుంది అని అనుకున్నా కానీ అలా అవ్వడం లేదే...

పోనీలే మనకి ఈ అదృష్టం లేదు ఏమో దీనిని ఎక్కడైనా భద్రంగా దాచేస్తాను లేకపోతే నిజంగానే అద్భుత దీపం అనుకొని విరగొట్టిన విరగొడతారు

అసలే మనుషులు ఆశవాదులు అని అంటు దూరంగా ఒక గుహలా కనిపిస్తే దానిలో పెట్టడానికి వెళ్ళాడు

వెళ్లి నెల మీద పెట్టాబోయాడు

అంతే ఆ దీపం ఒక్కసారిగా దాని ముందు ఆకారం కన్న పెద్దగా మారింది

సుల్తాన్ :

ఇదేంటీ ఉన్నపళంగా ఇంత పెద్దగా మారింది....

చూస్తుండగానే ఆ దీపం చాలా పెద్దగా అయిపోయింది..

సుల్తాన్ కి కాస్త భయంగా అనిపించి అక్కడినుంచి బయటకు అడుగులు వేస్తున్నాడు

అతని కళ్ళముందే ఆ దీపం ఒక ఆడ జీనిగా మారిపోయింది...

కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి చాలా ఆశ్చర్యంగా ఆమెను చూడసాగాడు....

ఆమె చూడడానికి భుతంలా ఉంది కానీ భూతం కాదు

మొత్తం నీలంగా ఉంది పెద్ద జాడ పెద్ద పెద్ద కళ్ళు చేతికి పెద్ద కడియాలు ఉన్నాయి

సుల్తాన్ భయంగా నువ్వు ఎవరు..????

నువ్వు జినివా.???

నిన్నే నువ్వు జినీ వా ఎంటి..???

జీనీ :

అహా ఎన్ని రోజులు అయింది భూమి మీదకు వచ్చి

చాలా థాంక్స్ అబ్బాయి నన్ను బయటకు రప్పించినందుకు...

సుల్తాన్ :

ఇంతకీ నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానాలు చెప్పలేదు

ఎవరు నువ్వు జీన్ వా..??

జీన్ :

అవును నేను జీన్ నే..

సుల్తాన్ :

ఇదెక్కడి వింత అమ్మాయిలో కూడా జీనిలు ఉంటారా ఇలాంటి విడ్డూరం నేను ఎక్కడ వినలేదు సుమీ..

జినీ :

అదేంటి అమ్మాయిలు జీనీలు అవ్వారా ఎంటి ??

సుల్తాన్ :

తన చేతిని గట్టిగా గుచ్చుకొని హా నేను కలలో లేను

అది కాక బ్రతికే ఉన్నాను

కానీ ఈ వింతలను నేను నమ్మలేకపోతున్నాను

జీనీ :

చూడు నేను అందరి జీనిలా నిన్ను వరాలు కోరుకోమని చెప్పలేను ఎందుకంటే నా దగ్గర ఆ శక్తులు లేవు

నేను బందీగా ఉన్న ఒక శపించబడిన జీనిని మాత్రమే

కేవలం ఇక్కడినుంచి బయట పడలనే కోరికతో బ్రతుకుతున్నాను....

సుల్తాన్ :

బయట పడడం ఎంటి నీకు ఏమైనా బాధలు ఉన్నాయా..????

జీని :

కొన్ని వేల సంవత్సరాల ముందు మనోహర్ అనే ఒక అతనిని నేను ప్రేమించాను కానీ అతను నన్ను ఎప్పుడు ఇష్టపడలేదు కానీ నేను అతనిని పొందాలి అనే కోరికతోనే బ్రతికే దానిని

ఒక రోజు మనోహర్ నన్ను ఎలా అయిన వదిలించుకోవాలి అనే ఉదేస్యంతో నా దగ్గరకు వచ్చాడు అని నేను గ్రహించలేదు

నాతో ఏం చెప్పాడు అంటే ఇదిగో అని ఒక అద్భుత దీపం నాకు ఇచ్చి దీనిలో ఉన్న అతనితో కనక నువ్వు పెళ్లి చేసుకుంటే అప్పుడు అతనికి విముక్తి అవుతాది ఆ తరవాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు

నేను అతని మాటలు నిజమే అని నమ్మి ఈ అద్భుత దీపం నుంచి వచ్చిన వ్యక్తితో పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను

నేను చాలా ప్రయత్నించాను కాని దీని నుంచి ఎవరు రాలేదు

రావడం లేదు అని కింద పెట్టే సరికి ఒక వ్యక్తి బండగా నీలం రంగులో పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చేతికి కాళ్ళకి పెద్ద కాడియలతో ఉన్న వ్యక్తి బయటకు వచ్చాడు....

అతను వచ్చిన తరవాత ముందుగా ఆ దీపం నుంచి వచ్చిన జీని అన్నాడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను (కుబూల్ ) అని నేను కూడా జినీ చెప్పిన తరవాత నాకు ఈ పెళ్లి అంటే ఇష్టం అని చెప్పిన

అలా మా వివాహం అయిన రెండు నిమిషాలకే అతని రూపం నాకు నా రూపం అతనికి వెళ్ళిపోయింది

అంటే నేను జీన్ కింద మారిపోయాను అతను నా శరీరాన్ని పొంది మనిషి లా మారిపోయాడు...

అప్పటినుంచి నన్ను చాలా బయటకు రప్పించారు కానీ ఎవరు కూడా నన్ను ఇక్కడినుంచి విడిపించలేదు..

సుల్తాన్ :

అయ్యో పాపం ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఇక్కడ బందిలా ఉన్నావు.....

జీని :

సుమారు కొన్ని వేల సంవత్సరాల నుంచి బందిగానే ఉన్నాను...

నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఇక్కడినుంచి నన్ను విముక్తి రాలిని చేస్తావా......

సుల్తాన్ :

పాపం ఎన్నో సంవ్సరాలుగా ఈమె ఇలానే ఉందా ఎంత దారుణం అని మనసులో అనుకుంటూ ఉండగా....

జీని :

ఈ పని చెయ్యడం అంత సులువు అయినది కాదు

నేను నీ లాంటి వారిని ఇప్పటివరకు సుమారు ఒక ఇరవై మందిని చూసాను ఒక్కరూ కూడా నాకు సహాయం చెయ్యలేదు నాకు తెలిసినంత వరకు నువ్వు కూడా చెయ్యవు ఇంకా ఆలస్యం ఎందుకు ఇక్కడినుంచి వెళ్ళిపో అని బాధగా మొఖం పెట్టీ అక్కడే కూర్చుని ఉండిపోయింది..

సుల్తాన్ :

అయ్యో మీరు బాధ పడకండి

నేను మీకు కర్చితంగా సహాయం చేస్తాను

మిమల్ని నేను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే నేను ఒకరికి భారంగానే బ్రతుకాను ఇప్పటివరకు కానీ ఈరోజు మీ భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాను కచ్చితంగా... నాకు అమ్మ నాన్న కుటుంబం ఎవరు లేరు కాబట్టి నేను ఈ దిపంలోకి వెళ్లిపోయిన నాకోసం ఎవరు బాధ పడేవారు ఉండరు

కానీ మా బాబా మాత్రం నేను ఏం అయిపోయాను అని కంగారు పడతారు నువ్వు నాకు ఒక సహాయం చేస్తావా నువ్వు విడుదల అయిన తరవాత మా బాబాకి నేను ఎక్కడికో వ్యాపారానికి వెళ్ళిపోయాను ఇంకెప్పుడు తిరిగి రాను అని చెప్పు సరిపోతుంది.....

జీని :

నిజంగా సహాయం చేస్తారా నాకు చాలా సంతోషంగా ఉంది...

నేను విడుదల అయిన తరవాత కచ్చితంగా మీ బాబాకు తెలియజేస్తాను....

సుల్తాన్ :

ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి..

జీని :

మీరు నా చేతులలో మీ రెండు చేతులు ఉంచండి

ముందుగా మీరు నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం అని సుల్తాన్ అనబడే నేను అరియాన ను నా భార్యగా స్వీకరిస్తున్నాను అని చెప్పాలి....

జీని చెప్పినట్టే సుల్తాన్ కూడా పల్లుపోకుండ చెప్పాడు

ఆ తరవాత జీని కూడా ఈ వివాహం నాకు సమత్తం

అరియాన అనబడే నేను సుల్తాన్ ను నా భర్తగా స్వీకరిస్తున్నాను అని చెప్పింది....

అరియాన వెంటనే తన జీన్ రూపం నుంచి మనిషి రూపం లోకి మారిపోయింది....కానీ సుల్తాన్ మాత్రం జీని రూపంలోకి మారలేదు....

సుల్తాన్ :

అదేంటి నేను జీని కింద మారలేదు ఎంటి...

అరియాన :

మీరు మారారు

ఒక్కసారి నా చేతిని పట్టుకొండి అని తన చేతిని సుల్తాన్ ముందు పెట్టింది

సుల్తాన్ ఏమీ ఆలోచించకుండా తన చేతిని పట్టుకున్నాడు

అలా చేతిని పట్టుకున్న వెంటనే వారు ఉన్న ప్రదేశం మొత్తం మారిపోవడం మొదలు పెట్టింది ఆ ఇసుక కాస్త పెద్ద భవణంగా మారింది

ఏటూ చూసిన బంగారం వెండి వజ్రాలు దగ దగ మెరిసిపోతు ఉంది ఆ ప్రదేశం మొత్తం....

ఆ ఏడారి మొత్తం పచ్చని మొక్కలు పూల పరిమలంతో నిండిపోయింది

సుల్తాన్ :

ఇది అంతా ఎంటి అండి

అరియాన :

ఇది నా రాజ్యం ఇప్పటినుంచి ఈ రాజ్యానికి మీరే రాజు

సుల్తాన్ :

రాజ్యం ఎంటి నేను రాజు ఎంటి నాకు ఏమి అర్ధం కావడం లేదు ఇక్కడ అసలు ఏం జరుగుతుంది

అరియాన :

నేను మీకు జీనిగా ఉన్నప్పుడు చెప్పినది అంతా అబద్దం

అసలైన కథ ఇప్పుడు చెప్తాను నేను ఈ రాజ్యాన్ని ( అరియన్ ) ను పాలిస్తున్నప్పుడు ఒక మాంత్రికుడు నా స్వయంవరానికి వచ్చాడు

అయితే మోసం చేసి స్వయంవరంలో నన్ను గెలుచుకున్నాడు .....

అయితే మాకు పెళ్లి జరిగే సమయానికి అతను మాంత్రికుడు అని నాకు మా సహచరుల ద్వారా సమాచారం తెల్సింది

నేను అతనిని పెళ్లి చేసుకోను అని తెగేసి చెప్పాను దానితో బాగా కోపించిన ఆ మాంత్రికుడు నన్ను ఈ దీపంలోకి పంపి

కేవలం మోసం చేసి నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకుంటేనే నీకు విముక్తి లభిస్తుంది అని నన్ను పెళ్లి చేసుకున్న వారు దీపంలో శాశ్వతంగా ఉండిపోతారు అని అబద్దం చెప్పాలి అని శపించి అతను నా రాజ్యాన్ని కూడా నాతో పాటు ఈ దీపంలోకి పంపేశాడు....

సుమారు అందరూ నేను ఈ విషయాలు చెప్పిన తరవాత నన్ను వదిలేసి పారిపోయేవారు.....

అలా ఇన్ని సంవత్సరాలు నేను ఈ దీపంలో ఉండిపోయాను.....

కాకపోతే నువ్వు నిజంగా నా జీవితాన్ని మళ్లీ నాకు ఇచ్చావు ఇన్ని సంవత్సరాలకు విముక్తి కలిగించావు

చాలా ధన్యవాదాలు సుల్తాన్ జి.....

సుల్తాన్ :

అయ్యో మీరు యువరాణి ఆ..????

ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మీరు మీ రాజ్యాన్ని సంతోషంగా పాలించుకోండి

నేను మీకు తగిన వాడిని కాదు

నేను మా ఊరికి వెళ్లిపోతాను

అరియాన :

చూడు సుల్తాన్ నువ్వు నాకు తగిన వాడిని కాదు అంటున్నావు

నిజానికి నేనే నీకు తగిన దానిని కాదు

అబద్దం ఆడి నిన్ను మోసం చేసి ఈ వివాహం చేసుకున్నాను కానీ ఒక రాణి గా కాకుండా ఒక అమ్మాయిగా నిన్ను నేను అడుగుతుంది ఏమిటంటే నా భర్తగా నువ్వు నాతో పాటు ఉండాలి అని కోరుకుంటున్నాను

ఏ అమ్మయికైన తన భర్త అందగాడు అవ్వాలి అని కోరుకోవడంలో తప్పు లేదు కానీ నీ లాంటి మంచి వాడిని వదులుకుంటే జీవితాంతం ఎవరికైనా బాధలే మిగులుతాయి అందుకనే నేను నిన్ను వదిలేయాలి అని అనుకోవడం లేదు....

దయచేసి నువ్వు నన్ను స్వీకరించు...

సుల్తాన్ కాసేపు ఆలోచించి తప్పకుండా అని వారి అనుబంధానికి జీవితానికి పచ్చ జెండా ఊపాడు.....

ఇలా రాజ్యం గురించి తెలిసిన చుట్టూ ప్రకల గ్రామాల జనాలు అందరూ అక్కడికి రావడం మొదలు పెట్టారు

సుల్తాన్ ఆ రాజ్యాన్ని ఎంతో సస్యశ్యామలంగా చూసేవాడు ఆ వార్త అందరికి తెలియడంతో చాలా దేశ విదేశాల నుంచి కూడా జనాలు అక్కడికి వచ్చి స్థిరపడ్డారు

వారిలో సుల్తాన్ పుట్టి పెరిగిన ఊరినుంచి కూడా జనాలు వచ్చారు వారిలో సుల్తాన్ బాబా ఇంకా తనను చంపాలి అని చూసిన తన స్నేహితులు కూడా వచ్చారు....

వారిని ఏ మాత్రం అవమనించకుండా సుల్తాన్ రాజ్య దర్బారులో వారికి స్థానం ఇచ్చి అక్కడే ఉండడానికి గదులు కూడా ఇచ్చాడు.... అది ఒక ఏడారి అయినప్పటికీ కూడా తిండికి నీటికి మాత్రం కొలత లేకుండా ఉండేది

సుల్తాన్ ను చంపాలి అని చూసిన తన స్నేహితులు సుల్తాన్ దగ్గరకు వచ్చి వారు చేసిన తప్పును క్షమించమని ప్రాధేయపడ్డాడు....

సుల్తాన్ :

అయ్యో నేను వాటి గురించి ఎప్పుడో మర్చిపోయాను మీరు వాటిని మనసులో పెట్టుకోకండి సంతోషంగా ఉందండి ఇక్కడే నాతో పాటు మీరు కూడా ఉండాలి అని చెప్పి నవ్వుతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు.....

ఇలా కాలం గడుస్తూ ఉంది అలాగే అతని పేరు కూడా పెరుగుతూ వచ్చింది.....

నీతి :

ఎప్పుడు నీ మనసుని మంచి మార్గంలోనే నడిపించు ఎప్పుడైన ఒకరికి నువ్వు మంచి చేసినట్టు అయితే నీకు తెలియకుండానే ఆ మంచి నీకు రెట్టింపుగా దొరుకుతుంది

నీ వెక్తిత్వని వదలకు మంచి నడవడికతో మెలుగుతూ ఉంటే సుల్తాన్ వలె నీ జీవితం కూడా ఏమీ లేదు అనే స్థాయి నుంచి అందరికీ అన్ని ఇచ్చే స్థాయికి పెరుగుతుంది...

నా కథను ఇంత ఓపికతో చదివినందుకు చాలా ధన్యవాదాలు...


సమాప్తం.


ప్రేమతో

అంబికా లక్ష్మి ( చిట్టి )



Rate this content
Log in