Ambica Lakshmi

Comedy Classics Inspirational

4.8  

Ambica Lakshmi

Comedy Classics Inspirational

అనుకుంటే కానిది ఏమున్నది

అనుకుంటే కానిది ఏమున్నది

6 mins
295


ఎన్నో హడావిడుల మధ్య హోరా హోరీగా పూర్తి అయ్యాయి ఎలక్షన్స్.


VNIT లో జరిగిన ఈ ఎలక్షన్స్ కొంత మందిని భయపెట్టాయి.కొంత మందిని బాధ పెట్టాయి.మరికొంత మందిని ఇబ్బంది పెట్టాయి.ఒకరికి విజయాన్ని ఇచ్చి సంతోషాన్ని అందిస్తే.మరొకరికి అపజయాన్ని ఇచ్చి కాస్త నిరుత్సాహాన్ని మిగిల్చింది.

ఒక ఘట్టాన్ని పూర్తి చేసుకున్న వాళ్ళు అందరూ మళ్ళీ ఎదా విధిగా తమ తమ బిజీ లైఫ్లోకి మళ్ళీ అడుగు పెట్టారు.


ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి అని ఎవరికి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు.


శ్రీని రాహుల్ లంబు అయితే చెప్పనవసరం లేదు ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు.


ఇది అంతా అలా ఉండగా ఒక రోజు శ్రీనికి తన తండ్రి ఫోన్ చేశారు.వెంటనే ఇంటికి రమ్మని.


తనకి పెళ్లి సెట్ అయింది అని ఆ మాటలకి షాక్ అయ్యాడు శ్రీనివాస్ రావు.


శ్రీని ఉండేది తమిళ్ నాడులోని ఒక చిన్న పల్లెటూరులో తన తండ్రి తల్లి పెద్దగా చదువుకోలేదు దాని మూలంగా వాళ్ళు ఇంకా పాత ఆచారాలు పద్దతులను బాగా పాటిస్తారు.


చూడండి నాన్న నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను మీకు తెలుసు నేను ఎంత కష్ట పడ్డానో ఈరోజు ఈ స్థాయికి రావడానికి.


మరో పది రోజుల్లో ఎగ్జామ్స్ పెట్టుకొని ఇంటికి వస్తె ఎలా చెప్పండి.కాస్త అర్థం చేసుకోండి.


నాకు ఏం పెద్ద వయసు అయింది అని నేను జాబ్ చెయ్యాలి మంచి స్థాయికి వెళ్ళాలి మన పాడు బడిన ఇంటిని బాగు చేయించాలి ఇప్పుడు మీరు పెళ్లి అంటే అన్ని తికమక అయిపోతాయి నాన్న అంటుంటే.


చూడు శ్రీనివాస్ నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకు పెళ్లి అయి నువ్వు కూడా పుట్టేసావు నువ్వేమో నాకు ఏం పెద్ద వయసు అయింది అంటున్నావా.చదువు లేదు ఏమి లేదు ఇప్పటికే చాలా కాలం ఎదురు చూసాను మంచి సంబంధం వచ్చింది కుందనపు బొమ్మ లాంటి అమ్మాయితో పాటు మంచి కట్నం కూడా వస్తుంది అని తండ్రి అంటుంటే.


నాన్న మీకు నా సిద్దాంతాలు బాగా తెలుసు నేను కట్నం తీసుకోను అది కాకుండా మీరు నన్ను విసిగించకండి మరొక ఇరవై రోజులు నా ఫోన్ కూడా అందుబాటులో ఉండదు అని చెప్పి ఫోన్ పెట్టేసి స్విచ్ ఆఫ్ చేశాడు శ్రీనివాస్.


అబ్బా విసిగిస్తారు ఇంత చదువు చదివింది దేనికి మంచి ఉద్యోగం చేసి వాళ్ళని బాగా చూసుకోవాలి అని కదా ఏం అర్థం చేసుకోకుండా మంచి సంబంధం వచ్చింది రా అంటే ఏం అనుకోవాలి అసలు అని తనతో తాను మాట్లాడుకోవడం చూసిన లంబు ( అమిత్ ) వెళ్ళి ఎంటి శ్రీని తెగ తిట్టేస్తున్నావు ఎంటి విషయం అని అడిగాడు.


ఏం చెప్పమంటావు.


మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూసారు అంట వచ్చి పెళ్లి చేసుకోమని అంటున్నారు అన్నాడు కాస్త విచారంగా మొఖం పెట్టీ.


ఎంటి పెళ్లా మా శ్రీని పెళ్లి కొడుకాయనే అంటూ పాటలు పడుతున్నాడు.


శ్రీని వెంటనే చెవి పట్టుకొని ఆగరా బాబు నీ గోలకి యూనివర్సిటీ అంతా తెలిసేలా ఉంది సైలెంట్గా ఉండు అని కూర్చోబెట్టాడు.


అదే నేనే నీ పరిస్తితిలో ఉంటేనా వెళ్ళి పెళ్లి చేసుకొని శుభ్రంగా నా పెళ్ళాంతో హానీ మున్కి హిమాలయాస్ వెళ్ళేవాడిని అని నవ్వుతూ అంటుంటే శ్రీని మాత్రం నవ్వకుండా బెల్లం కొట్టే రాడులా కూర్చున్నాడు.


మా ఇంట్లో పరిస్తితి అలా ఉండదు రా.


అమ్మకి హెల్త్ అసలు బాగోదు నాన్నకి కాస్త చాదస్తం ఎక్కువ ఇలా చదువులు ఉద్యోగాలు అంటే అసలే ఇష్టం ఉండదు.


అమ్మే నాన్నని నా చదువు కోసం ఒప్పించింది.


నేను ఎలా అయినా మంచి ఉద్యోగం చేసి వాళ్ళని బాగా చూసుకోవాలి అనేది నా కోరిక.


అంతే కానీ పెళ్లి చేసుకొని వచ్చిన అమ్మాయి తెచ్చిన కట్నంతో బ్రతకడం అంటే ఎంగిలి ఇస్తరిలో తినడం లాంటిది అని నా ఉద్దేశ్యం.


అది నాకు ఇష్టం లేదు అన్నాడు.


ఏం కాదు లే వాళ్ళే అర్థం చేసుకుంటారు.


నాకు నమ్మకం ఉంది నువ్వు మంచి పొజిషన్కి వెళ్తావు అని భుజం తట్టి బయటకి వెళ్ళిపోయాడు.


ఇది ఇలా ఉండగా శ్రీనివాస్ తండ్రి నేరుగా యూనివర్సిటీకి వెళ్లాలి అని సన్నాహాలు చేస్తున్నారు.


రెండు రోజులు గడిచిపోయాయి క్యాంపస్ ఇంటర్వ్యూలు బాగా జోరుగా సాగుతున్నాయి.


రాహుల్కి సొంతగా కంపెనీ పెట్టాలి అని కోరిక దానికోసమే కష్టపడుతూ ఉంటాడు ఎప్పుడు.

ఈ సంవత్సరం పూర్తి అయితే నేను నా బిజినెస్ ఐడియా పట్టుకొని బయటకి వెళ్తాను అని కలలు కంటు ఉంటాడు.


ఒకరి కింద పని చెయ్యడం రాహుల్కి అసలు ఇష్టం ఉండదు దాని కోసమే కంపెనీ పెట్టాలి అనుకుంటాడు.


తండ్రి దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి ఇంక బాధే లేదు.

కానీ వారసత్వంగా వస్తున్న తన బిజినెస్ కొడుకు చెయ్యాలి అని తండ్రి కోరిక.


అనుకున్నట్టుగానే శ్రీని తండ్రి యూనివర్సిటీకి రానే వచ్చారు.


కింద రిసెప్షనిస్ట్తో శ్రీనివాస్ రావుని పిలిపించమని చెప్పారు.


శ్రీనికి కథ అర్థం అయింది.


ఎలా అయినా ఒప్పించాలి అనే ఆలోచనతోనే కిందకి వెళ్ళాడు.


శ్రీనివాస్ తండ్రిని క్యాంటీన్ దగ్గరకి తీసుకొని వెళ్ళాడు.


చూడు శ్రీని నువ్వు కనక ఈ పెళ్లి చేసుకోక పోతే నీకు ఇక అమ్మ నాన్న లేరు అనుకో అన్నాడు.


నాన్న మీరు నన్ను ఈ ఒక్కసారికి అర్ధం చేసుకోండి.


కొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి ఆ తరవాత కొన్ని నెలలు ఉద్యోగం చేసి పెళ్లి చేసుకుంటాను మీరు చెప్పిన అమ్మాయినే చేసుకుంటాను కొంత కాలం ఆగితే నా కలలు కూడా పూర్తి చేసుకుంటాను కదా అని బ్రతిమిలాడాడు.


అంతే కాదు నాన్న మిమల్ని అమ్మని హ్యాపీగా చూసుకోవాలి మన పాడు బడిన ఇంటిని బాగు చేయించాలి. నా కాలి మీద నేను నిలబడాలి దానికి మీ అంగీకారం నాకు కావాలి అని అడుగుతుంటే.


శ్రీని తండ్రి అసలు వినే పరిస్తితిలో లేరు.


నువ్వు వస్తావా లేదా మమల్ని వదులుకో అనే మాట మీద గట్టిగా పట్టు పట్టి కూర్చున్నారు.


ఆ మాటలు అన్ని వెనక నుంచి విన్న రాహుల్ వారి దగ్గరకి వచ్చి " ఎంటి అంకుల్ ఆ మాత్రం టైమ్ మీ అబ్బాయికి ఇవ్వలేరా మా కాలేజ్లోనే అత్యంత తెలివైన వాడు శ్రీనివాస్.అతనికి ఈ కాలేజ్లో ఎక్కువ ప్యాకేజ్ ఉండే జాబ్ వస్తుంది అని చెప్పుకుంటున్నారు.ఇప్పుడు కనక మీరు తీసుకొని వెళ్తే జీవితంలో మళ్ళీ ఇలాంటి ఛాన్స్ శ్రీనికి రాదు అది కూడా ఒక్కసారి ఆలోచించండి.


రోజులు మారాయి అంకుల్ ఎప్పుడు ఒకేలా ఉంటాను అంటే కాస్త కష్టమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.


రాహుల్ అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు.కానీ ఆ మాటలు శ్రీని తండ్రి గుండెలకి బాగా హత్తుకున్నాయి.


సరే శ్రీని నాకు నీ బాధ అర్థం అవుతుంది నీకు నేను కరెక్ట్గా సంవత్సరం అంటే సంవత్సరం సమయం ఇస్తున్నాను ఈలోగా నిన్ను మేము కలవము నువ్వు మమల్ని కలవకు.


సంవత్సరం తరవాత నువ్వు మమల్ని వచ్చి కలువు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.


తండ్రి వెళ్లిన తరవాత శ్రీనివాస్ నేరుగా రాహుల్ దగ్గరకి వెళ్ళాడు.


ఎంటి రాహుల్ ఇంతకు ముందు నువ్వు మాట్లాడిన మాటలు నీ నోటిలో నుంచి వచ్చినవేనా అని అడిగాడు కాస్త ఆశ్చర్యంగా.


రాహుల్ నవ్వుతూ ఏమో నేను ఎప్పుడు ఏం చేస్తానో ఎందుకు చేస్తానో ఎలా చేస్తానో నాకే తెలియదు ఇది కూడా అంతే అని చెప్పి అక్కడి నుంచి తన రూంకి వెళ్ళిపోయాడు.

తన రూంకి వెళ్లి కూర్చుని నీ మాటలు నా గుండెలకు హత్తుకున్నాయి శ్రీనివాస్ నేను కూడా మా డాడీని ఒప్పించి నా కాలి మీద నేను నిలబడతాను అనుకుంటాడు.


లంబు శ్రీనివాస్ ఇద్దరు ఎగ్జామ్స్ అదరగొట్టారు అనుకున్న విధంగానే శ్రీనికి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది.


నెలకు రెండు లక్షల సాలరీ ఢిల్లీలో పోస్టింగ్.


లంబుకి కూడా ఉద్యోగం వచ్చింది నెలకి ఏబై వేలు జీతం.


ఇద్దరు జాగర్తలు చెప్పుకొని బయలుదేరారు.


నాన్నకి చెప్పిన విధంగానే ఇంటికి కూడా వెళ్లకుండా ఉద్యోగంలో పడిపోయాడు.


సంపాదన మీద శ్రద్ద పెట్టీ అనుకున్న దాని కన్నా ఎక్కువగానే సంపాదించాడు.


గర్వంగా తన ఇంటికి బయలుదేరాడు.


ఇంటికి వెళ్లేసరికి అప్పటికే అక్కడ చాలా హడావిడిగా ఉంది


ఇదేంటి ఇక్కడ ఇంత హడావిడిగా ఉంది అని ఆశ్చర్యంగా లోపలికి వెళ్ళాడు.


కొడుకు రావడం చూసిన తల్లి వెంటనే వెళ్లి గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తుంది.


నువ్వు వస్తావు అని నాకు తెలుసు అని కంగారు కంగారుగా భర్తని పిలుస్తుంది.


అమ్మ ఒక్క నిమిషం ఇంతకీ ఈ హడావిడిగా ఎంటి అని అడిగాడు కాస్త కంగారుగా.


మాకు తెలుసు నువ్వు వస్తావు అని అందుకని మీ నాన్నగారు

జమీందారు గారి అమ్మాయి వనలక్ష్మితో నీ ఎంగేజ్మెంట్ చెయ్యాలి అనుకుంటున్నారు అని చెప్పింది.

ఒక్క నిమిషం ఏం చెయ్యాలో ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు శ్రీనివాస్కి.

అమ్మ ఒక్కసారి నాతో పాటు రా అని లోపలికి తీసుకొని వెళ్లి అమ్మ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఏదోకటి చేసి ఆపించే అమ్మ అని అడుగుతుంటే శ్రీని తండ్రి కలవడానికి వచ్చారు.


వెంటనే మాటలను కట్టడి చేశాడు శ్రీనివాస్.


నాకు చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే ఆ రోజు కనక నిన్ను వనలక్ష్మితో పెళ్లి చేసి ఉంటే ఈరోజు నీ స్థాయిని మేము చూసే వాళ్ళమే కాదు.


నీతో వనలక్ష్మి మాట్లాడాలి అని తోటలో ఎదురు చూస్తుంది.


ఒక్కసారి వెళ్ళి కలిసి రా అన్నాడు తండ్రి.


శ్రీనివాస్ తల్లి వైపు వెళ్ళను అని సైగ చేసాడు.


తల్లి వెళ్ళు అని చెప్పడంతో తప్పక అక్కడి నుంచి తోటకి బయలుదేరాడు.


దూరంలో ఒక అమ్మాయి అవతలలికి తిరిగి నించుని ఉంది.


శ్రీనివాస్ అక్కడికి వెళ్లి వన అని పిలిచాడు.


తను హా అని సమాధానం ఇచ్చింది.


అది ఏదో మాట్లాడాలి అనుకున్నావు అంట ఎంటి ? అని అడిగాడు కాస్త గొంతుని చిన్నది చేసి.


నాకు నువ్వు అంటే చాలా ఇష్టం శ్రీనివాస్ నిన్ను పెళ్లి చేసుకొని నలుగురు పిల్లల్ని కనాలి అనేది నా ఆశ అని అంటుంటే అమ్మో నలుగురే అన్నాడు ఆశ్చర్యంగా.


వెంటనే ఆ అమ్మాయి శ్రీనివాస్ వైపు తిరిగి ఎంటి అయితే పెళ్లికి రెఢీ అయ్యవా అని అడిగింది.


శ్రీనివాస్ తన వైపు చూసి ఆశ్చర్యంగా రితు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంటే అక్కడికి రాహుల్ వచ్చాడు.


రితు నవ్వుతూ రాహుల్ నన్ను ఒప్పించాడు నన్నే కాదు మీ ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించాడు అంది.


శ్రీనివాస్ రాహుల్ వైపు చూసి ఇది అంతా ఎందుకు రాహుల్.


ఏమో నాకు తెలియదు నువ్వు ఎందుకో నాకు నచ్చేసావు.


నా మూలంగా ఎలక్షన్స్ మూలంగా నీకు రితు దూరం అయింది అని నాకు తెలుసు అందుకనే తనని నీకు దగ్గర చెయ్యాలి అనిపించింది అన్నాడు.


శ్రీనివాస్ ఆనందంగా థాంక్స్ అన్నాడు.


ఎంటి థాంక్స్తో సరిపెట్టుకుందాం అనుకుంటున్నావా అలా కుదరదు నేను బిజినెస్ స్టార్ట్ చేశాను దానిని ముందుకు నడపాలి అంటే నీలాంటి మాస్టర్ మైండ్ నాకు కావాలి నాకు సహాయం చేస్తావా అని అడిగాడు రాహుల్.


శ్రీనివాస్ రాహుల్ వైపు చూసి దాని కన్నా భాగ్యమా చెప్పు తప్పకుండా అని రాహుల్ చేతిలో చేయి వేశాడు.


అలా రాహుల్ సహాయంతో శ్రీనివాస్ రితు పెళ్లి జరిగింది

శ్రీనివాస్ సహాయంతో రాహుల్ బిజినెస్ సూపర్ డుపర్గా సాగుతుంది.



Rate this content
Log in

Similar telugu story from Comedy