STORYMIRROR

Ambica Lakshmi

Tragedy Classics Inspirational

4  

Ambica Lakshmi

Tragedy Classics Inspirational

ఆ రాత్రి ఇంకా గుర్తుంది

ఆ రాత్రి ఇంకా గుర్తుంది

1 min
398

ఆ రోజు రాత్రి రోజులానే ఆఫీస్ నుంచి హాస్టల్ రూం కి వెళ్తున్నాం.

మా ఫ్రెండ్స్ తినేసి వస్తాము అంటే నేను ఒక్కదాన్నే బయలుదేరాను.

ఆ రోడ్ కాస్త ప్రమాదకరంగా ఉంటుంది అయినా కాస్త దైర్యం చేసి ఒక్కదాన్నే వెళ్ళిపోతున్నాను.

హాస్టల్ కాస్త దూరంలో ఉంటుంది అనగా ఎవరో బండి మీద ఫాలో అవుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు

అడుగుల వేగాన్ని పెంచాను

వాళ్ళు కూడా నా పక్కనే వస్తున్నారు అనే భావన నాకు బాగా తెలుస్తుంది దైర్యన్ని అంతా కూడగట్టుకొని పరుగు తీశాను.

నా వెనక వస్తున్న వ్యక్తి నా ముందుకు వచ్చి ఆగాడు.

నా చేయి పట్టుకోవాలి అని చూస్తుంటే నేను మళ్ళీ వెనక్కి పరుగు తీశాను.

చాలా భయం వేసింది అయినా సరే ఏ మాత్రం కంగారు పడకుండా ఆ వ్యక్తి నుంచి తప్పించుకోని ఒక చోట దాక్కున్నాను.

అతను అటు ఇటు చూస్తున్నాడు

నేను ఎక్కడ ఉన్నాను అని ఇలా ఇక్కడే ఉంటే పని అవ్వదు అని నా బ్యాగ్ లో ఉన్న పెప్పర్ స్ప్రే బయటకి తీసి అతని ముందుకు వెళ్లి నించుని మొఖం మీద కొట్టేసి అక్కడి నుంచి పారిపోయాను.

హాస్టల్ కి వెళ్ళిన తరవాత జరిగినది అంతా వార్డెన్ కి చెప్పాను ఆమె తరవాత రోజు పోలీస్ వారికి కబురు పంపి జరిగింది అంతా చెప్పారు.

అలా చెప్పడంతో ఆ రోజు నుంచి రాత్రి ఒక పోలీస్ వ్యక్తి మాకు భద్రతగా ఆ స్ట్రీట్ లో ఉంటున్నారు.

నా జీవితంలో ఇలాంటి సంఘటన ఎప్పుడూ జరగదు అనుకున్నాను కానీ జరిగింది నేను దైర్యంగా దాన్ని ఎదిరించి నిలబడ్డాను.

ఒక్కోసారి ఆ విషయం గుర్తుకు వస్తెనే నాకు చెమటలు పట్టి కంగారు వస్తుంది.

అందుకనే అవసరం ఉన్న లేకపోయినా అమ్మాయిలు అందరూ భద్రత కోసం పెప్పర్ స్ప్రే లాంటివి బ్యాగ్ లో ఉంచుకోవడం శ్రేయస్కరం...



Rate this content
Log in

Similar telugu story from Tragedy