Ambica Lakshmi

Tragedy Classics Crime

4  

Ambica Lakshmi

Tragedy Classics Crime

ప్రాణదాత

ప్రాణదాత

4 mins
290


రోజులానే ఇంటికి ఆఫీస్ పని పూర్తి చేసుకుని వచ్చాడు కిరణ్

కిరణ్ అలా డోర్ తీసేసరికి ఎదురుగా అమ్మ నించుని అతని బ్యాగ్ తీసుకొని మంచినీళ్ళు తాగుతావా అని అడిగేది తల్లి

కానీ కిరణ్ డోర్ తీశాడు లోపల అంతా చీకటిగా ఉంది అమ్మ అమ్మ అని పిలిచినా తల్లి పలకలేదు

ఏం అయిందో కిరణ్ కు అర్థం కాలేదు

లైట్స్ ఆన్ చేసి బ్యాగ్ అక్కడే పెట్టేసి లోపలకి వెళ్ళి తన తల్లి గదిలో చూసాడు తల్లి కనిపించలేదు.

అమ్మ ఎక్కడికీ వెళ్ళింది నన్ను వదిలేసి వెళ్లిపోయిందా అని ఒక్కసారి తను అన్న మాటలు గుర్తుతెచ్చుకున్నాడు

" చాలా కోపంగా ప్రాజెక్ట్ పూర్తి అవ్వలేదు అనే చిరకులో ఉన్న కిరణ్ , తల్లి టిఫిన్ తినమని అడిగితే ఇష్టం వచ్చినట్టు తిట్టేసాడు. ఒక్క రోజు టిఫిన్ తినకపోతే నేను ఏం చచ్చిపోను లే అది కాకుండా నువ్వు నన్ను దయచేసి రోజు విసిగించకు నీతో పడలేకపోతున్నాను" అంటూ విసుగ్గా చిరాకుగా అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు

తల్లి ఆ మాటలకు ముందు కృంగిపోయినా అన్నది నా కొడుకే కదా అని పెద్దగా పట్టించుకోలేదు.

కిరణ్ ఇల్లుమొత్తం వెతుకుతున్నాడు పైకి వెళ్లి చూసాడు అయిన తల్లి ఎక్కడ ఉందో కనిపించలేదు

ఏడుస్తూ తన గదికి వెళ్ళాడు , కిరణ్ గదిలో మంచం మీద పడుకుని ఉంది తల్లి

దగ్గరకి వెళ్లి చేయి పట్టుకొని నన్ను క్షమించు అమ్మ తప్పుగా మాట్లాడాను నీ మనసుని నొప్పించాను ఇక మీదట ఆఫీస్ తలనొప్పులు ఇంటి వరకు తీసుకొని రాను , సరే ఇక పైకి లేగు నీకు ఇష్టం అని బయట నుంచి బజ్జీలు పట్టుకొని వచ్చాను అని పైకి లేపాడు

తల్లి ఉలుకు పలుకు లేకుండా పడుకుని

గుండెల మీద కొడుకు చిన్ననాటి ఫోటో పట్టుకొని ఉంది

కొడుకు ఎంత లేపిన లేవకపోవడంతో తల్లిని హాస్పిటల్కి

తీసుకొని గబగబా బయలుదేరాడు

అక్కడినుంచి హాస్పిటల్ చాలా దూరం అయిన అరగంట పట్టవలిసిన ప్రయాణం పావు గంటలోనే పూర్తి చేశాడు.

హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళిన తరవాత

డాక్టర్ చెకప్ చేసి కిరణ్ ను ఒక్కసారి లోపలికి రమ్మని చెప్పారు

వొళ్ళంతా చెమటలు పట్టి ప్రాణాన్ని అరచేతితో పట్టుకొని లోపలికి వెళ్ళాడు

" డాక్టర్ ! మా అమ్మ బాగానే ఉన్నారా ఏం పెద్ద ప్రాబ్లెమ్ కాదు కదా " అని అడుగుతుంటే

డాక్టర్ " మీ అమ్మ గారికి చాలా సీరియస్ గా ఉంది ఆమె గుండె కొన్ని రాజులకి కొట్టుకోవడం ఆపేస్తుంది చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు అన్నాడు "

కిరణ్ డాక్టర్ రెండు చేతులు పట్టుకొని ఎంత ఖర్చు అయినా పరవాలేదు డాక్టర్ నా ఆస్తి మొత్తం అమ్మి అయినా బ్రతికించుకుంటాను దయచేసి ఏదోక మార్గం ఆలోచించండి అని అడిగాడు

దానికి డాక్టర్ కేవలం ఒక్క మార్గం మాత్రమే ఉంది

ఆమెకు గుండె మార్పిడి చెయ్యాలి అప్పుడే ఆమెను బ్రతికించగలము అన్నాడు

మారు ఆలోచించకుండా సరే నా గుండె మా అమ్మకు మెచ్ అవుతుందో లేదో చూడండి అని అన్నాడు

డాక్టర్ అయ్యో అలా చెయ్యకుడదు మేము దానికి అంగీకరించము అని అన్నాడు

అయినా కిరణ్ డాక్టర్ ను బ్రతిమలాడి ఒప్పించాడు

కొద్ది సేపటి తరవాత టెస్ట్ లు అన్ని చేసి మేచ్

అవుతుంది అనే శుభవార్తను అందించాడు

కిరణ్ మనసులో మా అమ్మ బ్రతికి ఉంటే చాలు నాకు ఇంకేం అక్కర్లేదు నాకు అనుకొని నేను అమ్మతో పాటు లేకపోయినా పరవాలేదు అమ్మ బ్రతికి ఉంటే చాలు

అమ్మ ఇన్ని రోజులు నాకోసమే కష్టపడింది ఇక మీదట అయినా సుఖపడాలి అని ఐసియు బయట కూర్చుని బాధపడుతూ ఉంటాడు

అది గమనించిన మరొక డాక్టర్ కిరణ్ ను అక్కడినుంచి పక్కకి తీసుకొని వెళ్లి " చూడండి మీరు ఎవరో నాకు తెలియదు కానీ నేను మీరు చుపించుకుంటున్న డాక్టర్ మాటలు విన్నాను మీ అమ్మ గారికి వంట్లో పెద్ద ప్రాబ్లెమ్ లేదు చిన్న స్టంట్ వేస్తే ఆమె మామూలు మనిషి అయిపోతారు కానీ వాళ్ళు మీతో అబద్దం చెప్పి మీ గుండెను వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నం చేస్తున్నారు , దయచేసి నా మాట విని మీ అమ్మ గారిని తీసుకొని వేరే ఆసుపత్రికి వెళ్ళిపొండి " అని చెప్పాడు

కిరణ్ నా దగ్గర ఒక పథకం ఉంది వీళ్ళని ఇలానే వదిలేస్తే భవిష్యతులో చాలా ప్రమాదంగా మారతారు అని డాక్టర్ సహాయం తీసుకొని పనిని మొదలు పెట్టాడు

మరుసటి రోజు ఆపరేషన్ కు సిద్దం అయ్యాను అని వచ్చాడు కిరణ్

డాక్టర్స్ చాలా సంతోషంగా మొదలు పెడదాం అని అన్నారు.

కిరణ్ దానికన్నా ముందు నేను మా అమ్మతో మాట్లాడలి అని తల్లి దగ్గరకి వెళ్లి జరిగింది అంతా చెప్పాడు.

ఈలోగా అక్కడికి ఒక అతను స్పృహలో లేని తన తండ్రిని తీసుకొని వచ్చాడు

డాక్టర్ మళ్ళీ అతనికి కిరణ్ తో ఏం చెప్పాడో అదే చెప్పాడు

మళ్ళీ ఒక ఒక పది నిమిషాలకు ఇంకొక వ్యక్తి ఒక స్పృహలో లేని ఆమెను తీసుకొని వచ్చాడు

ఆమెకు కూడా గుండె సరిగ్గా పనిచెయ్యడం లేదు అని చెప్పడం వాళ్ళు కూడా వాళ్ల తల్లులకు తండ్రులకి గుండెలను ఇచ్చేస్తాము అని ఒప్పుకోవడంతో

డాక్టర్స్ అన్ని ఒక చోట గుమ్ముగుడి మాట్లాడుకుంటున్నారు మనకి మంచి జాక్పట్ దొరికింది అని వాళ్ళని అమాయకులను చేసి మోసం చేసాము అని చెప్పుకుంటున్నారు అలా చెప్పుకొని ఆపరేషన్ కి రమ్మని కిరణ్ వాళ్ళని పిలిచాడు

వాళ్ళు అందరూ ఒక్కసారిగా రాము మీరే ఇక్కడినుంచి బయటకి వెళ్ళాలి అని చెప్పి వీడియో చూపించాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు వీడియో తీశాడు కిరణ్ కు సహాయం చేసిన డాక్టర్

అది చూసిన డాక్టర్స్ ఒక్క నిమిషం నిబ్రంతపోయారు

ఏమి మాట్లాడకుండా అలానే నిలబడి ఉండిపోయారు


కిరణ్ :

ఈ గొప్పతనం నాది కాదు నాకు సహాయం చేసిన ఈ డాక్టర్ ది ఎందుకంటే నాకు కనక ఆయన సహాయం చెయ్యకపోయి ఉంటే ఈ రోజు నేను ఒక శవంలా మారిపోయేవాడిని

ఆయన కూడా మీలా డబ్బుల కోసం నాకు సహాయం చేసి ఉండకపోతే ఒక మనిషి చనిపోయెవాడు ఒక మనిషి అనాధగా మారిపోయేవాడు దయచేసి ఇలాంటి పనులు మళ్ళీ చెయ్యొద్దు ఎవరిని ఒంటరి చెయ్యకండి వాళ్ల ప్రాణాలతో ఆడుకోవద్దు అని చెప్పి నాకు ఈ డాక్టర్ ప్రాణదాత అతని మేలు జీవితంలో మర్చిపోలేను అంటూ తల్లిని తీసుకొని అక్కడినుంచి వెళ్ళిపోయాడు


ప్రతి వృత్తిలో తప్పులు జరుగుతాయి మంచి జరుగుతాది కానీ తప్పులను కూడా మన మంచికొసమేనేమో అనుకునేది కేవలం వైద్య వృత్తిలో మాత్రమే దేవుడి తరవాత నన్ను కాపాడండి అనే అడిగేది కేవలం డాక్టర్ ని మాత్రమే అలాంటి డాక్టర్లను ఈరోజుల్లో కొంత మంది

దుర్బుద్ధి వల్ల నమ్మలేకపోతున్నాము , ఏది ఏమైనా ఒక వైద్యుడు బాగుంటే ఒక దేశానికే మంచి జరుగుతుంది .

అలాంటి వైద్యులను గౌరవించి మంచి స్థానంలో ఉంచడం మన అందరి ధర్మం.

( వైద్యులు అందరూ ఇలానే ఉంటారు అని నా ఉద్దేశ్యం కానే కాదు కేవలం కొంత మంది మాత్రమే అలా ఉంటున్నారు అని వారు కూడా మారితే దేశం ఇంకా బాగుపడుతుంది అని చిన్న ప్రయత్నం )



Rate this content
Log in

Similar telugu story from Tragedy