Ambica Lakshmi

Children Stories Classics Fantasy

4  

Ambica Lakshmi

Children Stories Classics Fantasy

కోరిక

కోరిక

2 mins
402


ఒక బాబు రేయి పగలు తేడా లేకుండా రోజంతా ఏడుస్తూనే ఉంటాడు అలా చాలా రోజులు గడిచిపోయాయి 


ఒక రోజు అతనికి ఒక మంత్రగత్తె ఎదురు పడింది 

ఏడుస్తున్న ఆ బాబు పక్క నుంచి వెళ్ళిపోయింది కానీ ఎందుకు ఏడుస్తున్నావు అని మాత్రం కూడా అడగలేదు


ఆ బాలుడు మంత్రగత్తె తో నువ్వు నన్ను ఎందుకు ఏడుస్తున్నావు అని అడగలేదు పోనీ అడగలేదు కనీసం పట్టించోవు ఎందుకు 


మంత్రగత్తె ఇలా చెప్పింది అలా అడగడం వల్ల నాకు ఏం ఉపయోగం చెప్పు నేను ఉపయోగం లేనిదే ఏ పని చెయ్యను అలాంటిది నువ్వు ఎందుకు బాధ పడుతున్నావు అని ఎలా అడుగుతాను 

నువ్వు నాకు ఏమైనా ఇస్తే దానికి బదులు నేను నీకు ఏమైనా ఇస్తా అని సమాధానం ఇచ్చింది.


దానికి ఆనందించిన బాలుడు ఏమైన ఇస్తావా 

అయితే నాకు ప్రపంచంలోనే ఎవరు చూడలేనంత సంతోషం కావాలి దాని కోసమా నేను ఏం అయినా చేస్తాను అని నాకు సంతోషాన్ని ఇవ్వు అని అడిగాడు

ఎందుకంటే చిన్నప్పటినుంచి నేను ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేవాడిని అందుకనే.


మంత్రగత్తె సరే ఇస్తాను కానీ నువ్వు మాట మీద నిలబడాలి కొన్ని సంవత్సరాల తరవాత నేను నీ దగ్గరకు వస్తాను నువ్వు నీ ప్రాణాలను నాకు అప్పగించాలి 

గుర్తుంచుకో అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది.


కొన్ని సంవత్సారాల తరవాత ఎంతో ఆనందం నిండిన జీవితాన్ని బ్రతుకుతున్నాడు ఆ బాలుడి దగ్గరకు మంత్రగత్తె వచ్చింది నువ్వు నాతో వచ్చే సమయం వచ్చేసింది నువ్వు నీ ప్రాణాలను నాకు అప్పగించు అని చెప్పింది.


ఆ బాలుడి మనసంతా అహంతో నిండిపోయి నువ్వు ఎవరు నీకు నా ప్రాణాలను ఎందుకు ఇవ్వాలి ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని మొఖం మీద చెప్పేశాడు.


ఆ మాటలకు కోపం వచ్చిన మంత్రగత్తె అమాంతం అతని ప్రాణాలను అపహరించేసింది

చనిపోయిన అతనితో ఇలా చెప్పింది నేను అడిగిన వెంటనే నువ్వు ఇస్తాను అని ఉంటే నేను సంతోషంగా నీకు ఈ జీవితాన్ని ఇచ్చేసే దానిని కానీ నువ్వు అంత పొగరుగా సమాధానం చెప్పడం నాకు నచ్చలేదు అందుకనే చంపేశాను ఇక జీవితాంతం నీ ఆత్మ నాకు దాసరికం చెయ్యాలి పదా అని తనతో తీసుకొని వెళ్ళిపోయింది.


నీతి :

ఈ కథ నుంచి మీకు నీతి ఏం తెలిసింది కాస్త హోదా పెరిగినంత మాత్రానా మన బ్రతుకు మర్చిపోకూడదు మనం పెరిగిన వాతావరణం సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు అలా మర్చిపోతే ఎంత సంతోషం దక్కిన చివరికి ఏమి లేకుండా పోవాలిసిందే.


Rate this content
Log in