Ambica Lakshmi

Abstract Children Stories Tragedy

3  

Ambica Lakshmi

Abstract Children Stories Tragedy

పిల్లల మనసు

పిల్లల మనసు

2 mins
221


అనగనగా ఒక ఊరిలో

అందాలను ఒలకబోస్తూ చందమామకే అసూయ పుట్టేలా 


కుందనపు బొమ్మలా ఉండేది ఒక అమ్మాయి.

అదే ఊరు మొత్తం జలేడి పట్టినా దొరకలేనంత అందగాడు కూడా నివసిస్తూ ఉండేవాడు.

ఊరిలో ఆడవాళ్ళు అందరూ ఆ అబ్బాయికి వల వేస్తే మగవాళ్ళు అందరూ ఆ అమ్మాయికి వల వేసేవారు


చివరకు ఆ అందగాడు ఆ కుందనపు బొమ్మ పెళ్లి చేసుకున్నారు 

పెళ్లి చేసుకున్న తరవాత వారి ఆశలకు అంతు లేకుండా పోయాయి మనమే అందంగా ఉంటాము మనకి పిల్లలు పుడితే వారు ఇంకా చాలా అందంగా ఉంటారు కదా 

నాకు అయితే అత్యంత అందగాడు అయినా పిల్లాడు కావాలి అంది భార్య

నాకు అయితే అతిలోక సుందరి లాంటి పాప కావాలి


అయితే మనం ఒక్కటి కోరుకుంటే దేవుడు మరొకటి నిశ్చయించాడు అన్నటు

వారి కోరికలకు బిన్నంగా వారి రంగులకు వేతిరేకంగా 

నల్లగా ఒక పాప పుట్టింది

అది చూసిన తల్లితండ్రి ఆమెను ఆసహించుకున్నారు

అయితే వారి ప్రయత్నం ఆపలేదు మళ్ళీ తల్లి అయింది ఆమె.అయితే ఈ సారి కూడా వారినీ దేవుడు కరుణించలేదు మళ్ళీ నల్లగా ఉన్న అమ్మాయే పుట్టింది

వారికి పిల్లల మీద మరింత చిరాకు పుట్టింది 

అలా వరుసగా తొమ్మిది మంది పిల్లలను కన్నారు

తొమ్ముదుగురు నల్ల అమ్మాయిలే పుట్టారు

ఒక్కో బిడ్డ పుట్టడం వారి మీద చిరాకు ఆసహ్యం పెరిగిపోతూ ఉండడం

అయితే చిట్ట చివరకు మెరిసిపోతూ తెల్లని పాలరాతి బొమ్మ లాంటి ఆడపిల్ల పుట్టింది


వారి కోరిక నెరవేరింది.

ముందు పుట్టిన తొమ్మిది మందిని ఒకలా చూసేవారు ఆ తల్లి తండ్రులు, అప్పుడు పుట్టిన ఆ బిడ్డను వేరేలా పెంచేవారు. ఆ తెల్లగా పుట్టిన పిల్ల మీద అపారమైన ప్రేమను కురిపిస్తూ సంతోషంగా చూసుకుంటూ ఉండేవారు ఆమె ఆడగక ముందే ఆమెకు కావలసినవి ఇవ్వడం ముద్దులు పెట్టడం బాగా అల్లారు ముద్దుగా పెంచేవారు


మిగిలిన ఆ తొమ్మిది మంది పిల్లలను కనీసం సొంత బిడ్డలుగా కూడా చూసేవారు కాదు ఇంట్లో పని మనుషులుగా పని మొత్తం వారి చేతనే చేయించేవారు

పెద్ద అమ్మాయికి పెళ్లి వయసు వచ్చిన ఆమెకు పెళ్లి చెయ్యము అని నీ మొఖాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని ఎప్పుడూ కించపరుస్తూ ఉండేవారు


పదోవ అమ్మాయి కూడా కాస్త పెద్దది అయింది

అలా అవ్వగానే నా కూతురికి రాజకుమారుడు లాంటి వరుడిని తీసుకొని వస్తాను అని ఎంత సేపు ఆమె అందాన్ని పొడుతు ఉండేవారు


చివరికి ఒక రోజు ఉదయాన్నే పెద్ద అమ్మాయి కాలవ దగ్గరకి నడుచుకుంటూ ఒక్కతే వెళ్ళుతుంది

ఆమె , నేను ఇంకా ఎవరికి భారం కాకూడదు అని బ్రతికి సంతోషించేది ఏమి లేదు కనీసం చస్తే నరకంలో అయినా సంతోషంగా ఉంటా అని దుకాబోతుంటే ఆమె చేయి రెండో చెల్లి పట్టుకుంది ఆమె చేయి మూడో చెల్లి పట్టుకుంది అలా తొమ్మిదో చెల్లి వరకు అలా ఒక్కరూ చేయి ఒక్కరూ పట్టుకొని అందరం ఒకలానే పుట్టము చావు కూడా ఒకేలా చేస్తే స్వర్గంలో అయినా మనం కలిసి సంతోషంగా ఉందాం అని అందరూ ఒక్కేసారి కాలువలోకి దూకేశారు...


విషయం తల్లి తండ్రులకు తెలిసే లోపే సమయం మించిపోయింది ఆ తొమ్ముదుగురు అమాయకపు ఆడపిల్లలు చనిపోయారు

అయితే చివరి పిల్ల కూడా కనిపించడం లేదు అని వాళ్ళకి తెలిసింది 

ఏం అయిపోయింది అయిపోయింది అని అనుకుంటుంటే ఊరిలో ఒక అతను వచ్చి మీ అమ్మాయి ఎవరో అబ్బాయితో వెళ్ళిపోయింది అని చెప్పాడు 


తల్లి తండ్రులు ఇద్దరు అక్కడే కుప్పకూలిపోయారు

కనడానికి పది మందినే కన్న చివరి దశలో ఆనదల్లా బ్రతికే దుస్థితి వారికి ఏర్పడింది


నీతి :

అందం ఆకారంలో ఏం ఉంటుంది చెప్పండి హాయిగా పది మందితో జీవించకుండా.

అందంగా లేరు అని ఆ తొమ్మిది మందిని పట్టించుకోలేదు పోనీ ఎంతో అల్లారు ముద్దుగా పెంచిన అమ్మాయి ఏం చేసింది.అందరినీ సమానంగా చూసి ఉంటే జీవితం ఎంతో సంతోషంగా సాగిపోదును ఆ తల్లి తండ్రులకు 

పిల్లలను ఎవరితో అయినా పోలిస్తే వారి మనసులు శోబిస్తాయి అలా ఎట్టిపరిస్థితుల్లోనూ అలా చెయ్యకండి.

ఆ తల్లి తండ్రులు అలా చెయ్యకపోయి ఉంటే వారు వారి జీవితాలను కోల్పోయేవారు కాదు కథ ఒక్కసారి ఆలోచించండి



Rate this content
Log in

Similar telugu story from Abstract