Ambica Lakshmi

Horror Inspirational Thriller

4.3  

Ambica Lakshmi

Horror Inspirational Thriller

రక్త పిశాచి సహాయం

రక్త పిశాచి సహాయం

3 mins
291


    వినాశకాలే విపరీత బుద్ధి అంటారు ఈ సామెతను అందరూ వినే ఉంటాం.రాజు రవి అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు వయస్సు పెరిగిన ఇద్దరు పనిపాట ఏమీ లేకుండా ఊరిలో కాలిగా తిరిగేవారు.


ఊరిలో ఎంతమంది ఏమని అన్న పట్టించుకోకుండా ఆటలు పాటలతో గడిపేసేవరు.వారి తల్లదండ్రులు ఎన్ని తిట్టినా సరే వారికి ఏమీ పటనట్టు గడిపేసెవారు.



ఒక రోజు శ్యామ్ అనే అబ్బాయి వారి ఊరికి వచ్చాడు.ఆ అబ్బాయి ఎవరో కాదు రాజు రవితో చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు.



శ్యామ్ విదేశాలకు వెళ్లి మంచి పేరు డబ్బును సంపాదించి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.శ్యామ్ వచ్చిన వెంటనే ఊరి జనాలు అందరూ అతనికి స్వాగత సత్కరాలతో ఊరిలోకి తీసుకోని వెళ్ళారు.



అది చూసిన రాజు రవి ,శ్యామ్ దగ్గరకు వెళ్లి ఎలా ఉన్నావ్ బాగున్నావా అని అడగగా మీరు ఎవరు అని సమాధానం ఇచ్చాడు శ్యామ్ మేము రాజు రవిలం నీకు గుర్తులేదా చిన్నప్పుడు మనం కలిసి అడుకున్నాం స్కూల్ కి కూడా కలిసే వెళ్లే వాళ్ళంగా అని అనగా నేను అవసరం లేని వాటిని గుర్తుపెట్టుకొను మీరు ఇంకా బయలుదేరండి అని అవమానించి పంపించేసాడు.



బయటకి వచ్చిన రాజు రవితో చూసావా వాడు డబ్బు సంపాదించాడు అని పొగరు.అవునురా రాజు నువ్వు అన్న మాట నిజమే డబ్బు సంపాదిస్తే ఇంతలా అయిపోతారు అని నేను ఎప్పుడు అనుకోలేదు.



రేయ్ రాజు అయితే మనుము ఏదోక రకంగా డబ్బును సంపాదించాలి అని అనడంతో రాజు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు కలిసి సంపాదించాలి అని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.



ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇద్దరు రాత్రికి రాత్రి సంచిలో బట్టలు తిండి పట్టుకొని బయలుదేరారు.



వారు ఊరికి దగ్గరలో ఉన్న ఒక అడవి నుంచి ప్రయాణం మొదలుపెట్టారు.



కొంత దూరం వెళ్ళిన తరవాత ఇద్దరు ఒక చెట్టుకింద నిద్రపొదాం అని పక్క సిద్ధం చేసుకొని కునుకు తీశారు.అనుకున్నట్టు అన్ని జరగాలి అని కోరుకోని ఇద్దరు పడుకున్నారు.



మరుసటి రోజు చూసేసరికి ఊరిలో రాజు రవి ఇద్దరు కనిపించలేదు వాళ్ళ తల్లితండ్రులు అంతా వెతికి చూసిన వారికి ఎక్కడ కనిపించలేదు. ఎక్కడికో వెళ్లి ఉంటారు లే వచ్చేస్తారు అని ఊరిలో వారు వాళ్ళని ఉరుకోబెట్టరు.



లేచి మళ్ళీ వారి ప్రయాణం కొనసాగించారు రాజు రవి.కొంత దూరం వెళ్ళిన తరవాత వారికి బాగా ఆకలి వేసి తెచ్చుకున్న సద్దన్నం తిని మళ్లీ విశ్రంతి తీసుకున్నారు.



ఇద్దరు కూర్చుని ఇలా ఆలోచించారు అసలు మనం ఏమి చెయ్యగలం ఏమీ చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఊరి నుంచి చాలా దూరం వచ్చేశాం ఇప్పుడు ఏమి చెయ్యాలో నాకు అర్ధం కావడం లేదు అన్నాడు రాజు.



బాధపడకు రాజు మనం ఏదోకటి చేద్దాం అని రవి అనడంతో ఇద్దరు మళ్లీ ప్రయాణం మొదలు పెట్టారు.కొంత దూరం వెళ్లే సరికి వారికి ఒక మాట వినిపించింది ఆగండి ఆగండి అని ఎవరా అని వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఒక పిశాచి కనిపించింది



భయంతో ఇద్దరు పరుగులు పెట్టారు.అయిన పిశాచి ఆగకుండా వారిని వెంబడించింది.చివరికి వారు ఇద్దరు దానికి చిక్కారు.నేను మిమల్ని ఏమీ చెయ్యను దయచేసి నా మాట వినండి అని ఆ పిశాచి అనడంతో వారు ఆగి ఎమిటో చెప్పు అన్నారు.



పిశాచి ఇలా చెప్పింది నాకు ఒక ముని శాపం వల్ల ఇలా పిశచిలా మారిపోయాను కానీ నేను ఎవరికైనా సహాయం చేస్తే మళ్లీ మామూలు వ్యక్తిని అవుతాను అని చెప్పింది.



దానితో వారికి ఒక ఉపాయం తట్టింది.మేము ఎందుకు పనికిరాని వాళ్ళం అని డబ్బు సంపాదించడం మా వల్ల కాదు అని మా ఊరిలో వాళ్ళంతా మా ఇద్దరినీ చూసి నవ్వేవారు కాబట్టి నువ్వు మాకు సహాయం చేయి నీకు ఉపయోగ పడుతుంది అని వాళ్ళు ఇద్దరు చెప్తారు.



బాగా ఆలోచించాక పిశాచి వారి ఇద్దరికీ డబ్బు ఇవ్వలేదు కానీ సంపాదించుకోవడానికి తెలివితేటలు ఇచ్చింది.దానితో పిశాచి యొక్క శాపం పోయింది.



తెలివితేటలు పెరిగిన వారు ఇద్దరు పట్టణానికి వెళ్లి అక్కడ ఇల్లులు లేని వారికి అందమైన ఇళ్లులు కట్టి చాలా డబ్బు సంపాదించి మళ్లీ ఊరికి బయలుదేరి వెళ్లి వాళ్ళ తల్లితండ్రులకు వారు సంపాదించిన డబ్బును ఇచ్చి వారు డబ్బును సంపాదించగలం అని నిరూపించారు.



ఊరిలో ఉన్న వారు కూడా రాజు రవి గొప్పదనం గురించి పొగడ్తలు మొదలుపెట్టారు.రాజు రవి ఊరిలో ఇల్లు లేని వారికి డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఇల్లులు కట్టి ఇచ్చారు.


(సమాప్తం)




Rate this content
Log in

Similar telugu story from Horror