Varun Ravalakollu

Horror Thriller

4.7  

Varun Ravalakollu

Horror Thriller

శాంతి

శాంతి

6 mins
1.8K


నేను తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టో కాదో నాకు తెలీదు.కానీ ఈ నరకం అనుభవించే ఓపిక లేక ఈ నిర్ణయం తీసుకుంటున్న అని మనసులో అంటుంది.

                          కళ్ళు తెరవాలన్న,కళ్ళు మూయాలన్న భయమేస్తుంది అని మనసులో అంటుంది.

                              సారీ నాన్న! సారీ అమ్మ! లవ్ యూ రవి ! అని మనసులో అనుకుంటుంది.

                                                      కొన్ని నెలల క్రితం..

      ఈ అమ్మాయి పేరు వర్ష వాళ్ళ నాన్నగారి కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకుంటూ ఉంటుంది.వెంకటాచలం దగ్గరలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తుంది.

    ఈరోజు త్వరగా కన్స్ట్రక్షన్ సైట్ నుంచి బయటపడాలి అని అనుకుంటుంది.అంతక ముందు ఆ సంఘటన జరిగినప్పటి నుంచి సైట్ కి వెళ్లాలని లేదు అని మనసులో అనుకుంటుంది.కానీ,తన నాన్నగారి హెల్త్ బాగోకపోవడంతో తప్పటం లేదు అని అనుకుంటుంది.కానీ,మనసు మనసులో లేదు నేను చేసినది సరిదిద్దుకోలేని తప్పు ఇంత పెద్ద చదువు చదివి పిచ్చి దానిలా ఆలోచించాను,అవును నేను మనిషిని కాను రాక్షసిని ,నాకు బతికే రైట్ లేదు అని అంటుంది.

     "షట్ అప్ వర్ష,పిచ్చి దానిలా ఆలోచిస్తున్నావు,ఇదంతా పార్ట్ అఫ్ ది లైఫ్ ,బీ ప్రాక్టికల్ .కొన్ని కోట్లు పెట్టి ఈ ప్రాజెక్ట్ కట్టిస్తున్నాడు మీ నాన్న,అలాంటిది కన్స్ట్రక్షన్ ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తే ? దివాలా తీసే పరిస్థితి రావచ్చు,నీ కోసం నీ కుటుంబం కోసం అలోచించి నువ్ చేసిన పని తప్పేమి కాదు." అని అంటాడు రవి ఆ అమ్మాయి వర్షతో.

                          తనకి తాను సర్ది చెప్పుకుంటుంది! కార్ ఆపి సిగరెట్ తాగుతూ ఆలోచనలోకి వెళ్తుంది.

                                                  ( సరిగ్గా నెలరోజుల క్రితం... )

                   సైట్ కి సౌత్లో వున్నా ఒక మర్రిచెట్టు కొట్టేసి పిల్లర్స్ తవ్వుతుండగా ఒక విగ్రహం బయట పడుతుంది.

     చూడటానికి భయపెట్టేలా ఉన్న ఆ విగ్రహాన్ని చూసి క్రేన్ ఆపరేటర్ "కపాలికుడి విగ్రహం బయట పడింది అంటే సైట్ కింద స్మశానం వుండి ఉంటది,ఇక ఈ ప్రాజెక్ట్ అయ్యినట్లే " అన్న మాటలు ఆ అమ్మాయికి ఇంకా గుర్తుంటాయి.అప్పుడు సైట్ ఇంజనీర్ వరుణ్ క్రేన్ డ్రైవర్ చేతిలో 5000/- పెట్టి "ఈ విషయం బయటకు రాకూడదు ,వచ్చిందో నువ్ వుండవు " అని బెదిరించి పంపేస్తాడు.

                                            కానీ లోపల వరుణ్ కూడా భయపడతాడు.

     "మేడం,కొండకి ఆ పక్కన కడుతున్న రిసార్ట్స్ లో కూడా ఇలానే విగ్రహం ఏదో బయట పడింది,మిగతా పార్టనర్స్ చెబుతున్న వినకుండా ,శాంతి చేయించకుండా కన్స్ట్రక్షన్ కంటిన్యూ చేసారు,చౌదరి గారు హార్ట్ ఎటాక్ తో పోయారు.మిగతా పార్టనర్స్ బిజినెస్లు దెబ్బతిని ప్రాజెక్ట్ నిలిచిపోయింది,ఆలోచించండి మేడం" అంటూ ఏదో చెప్పబోతున్నా వరుణ్ను ..

                        "షట్ అప్ వరుణ్,డోంట్ బీ సో స్టుపిడ్" అన్న ఆ అమ్మాయి అరుపుతో భయపడతాడు.

                                      శనివారం పొద్దున్నే 10 గంటలకు వరుణ్ ఫోన్ చేస్తాడు.

        "మేడం సౌత్ పక్క పిల్లర్స్ తీస్తుంటే రెండు స్కెలిటన్స్ బయట పడ్డాయి ,మీరు త్వరగా సైట్ కి రండి "అని ఫోన్ పెట్టేస్తాడు.

     బై గాడ్స్ గ్రేస్ ఇష్యూ బయటికి రాలేదు,వరుణ్ ఇస్ సో స్మార్ట్ అని అనుకుంటుంది.వరుణ్ ! క్రేన్ ఆపరేటర్ని,అక్కడ పని చేసే వాళ్ళని మేనేజ్ చేస్తాడు ఆ అమ్మాయి వెళ్లే సరికి.

                                      "ఇప్పుడు ఏం చేద్దాం వరుణ్?" అని అంటుంది వర్ష.

                           "నేను చెప్పాల్సింది మొన్ననే చెప్పాను మేడం ,ఇక మీ ఇష్టం"అని అంటాడు.

                       "మనసు వొప్పుకోవట్లేదు వరుణ్,బట్ హూ?ఎవర్ని?ఎలా?ఎప్పుడు?" అని అంటుంది.

          "నాకు వదిలేయండి మేడం,ఐ విల్ టేక్ కేర్ అఫ్ ఎవ్రి థింగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ క్రేన్ ఆపరేటర్ కిరణ్"అని అంటాడు.

                "మేడం రోజు ఆ చెట్లమ్మటే ఆదుకోవడానికి పిల్లలు వస్తారు మేడం,ఒక పిల్లను..ఈ నైట్ కి."అని అంటాడు.

                                       "హుమ్! but be careful కిరణ్." అని అంటుంది.

                                                     రాత్రి 11.45:

      అప్పుడు ఆ చెట్టు దగ్గరికి ఒక పాప వస్తుంది.ఆ పాప చాల ముద్దుగా ఉంటుంది.వర్షకు మనసు వప్పుకోదు.కానీ స్వార్థం ముందు మనసు   ఓడిపోయింది అని మనసులో అనుకుంటుంది.

                                                12 కి ఇంకో 5 నిమిషాలే ఉంటుంది.

            "అక్క ప్లీజ్ అక్క అమ్మ కావాలి నన్ను వదిలేయండి.ఇంటికి వెళ్ళాలి.ప్లీజ్ అక్క "అని ఏడుస్తూ అంటుంది ఆ పాప.

                               వర్ష కాళ్ళుపట్టుకొని వదిలేయమని బతిమాలు కుంటుంది.

                  "అక్క,అక్క ప్లీజ్ అక్క అమ్మ నాన్న దగ్గరకు పంపండి"అని గట్టి గట్టిగా ఏడుస్తుంది ఆ పాప.

    ఒక్కసారిగా థప్ మన్నచప్పుడుతో ఆ పాప ఏడుపు ఆగిపోతుంది.వర్షకి తన కాళ్ళ గోరు వెచ్చగా అనిపిస్తాయి,పాప రక్తం ఏమో అనుకుంటుంది,సరిగ్గా కిందికి చూసే ధైర్యం కూడా చేయదు వర్ష.

                                  పాప బాడీని కాంక్రీట్ మిక్సర్లో వేసి పిల్లర్ లో పోసేస్తాడు కిరణ్.

    ఇది జరిగి రెండు రోజులవుతుంది.వర్షకి తనని తాను చూసుకోవటానికి కూడా ధైర్యం సరిపోదు,మనిషిగా చచ్చాననుకుంటుంది.వర్ష మౌనంగా ఉండడం చూసి తనకి రవికి గొడవ అయిందేమో అని అనుకుంటుంది వాళ్ళ అమ్మ.

                                                        ప్రస్తుతం......

       చురుక్కున కాలిన వేలును విదిలిస్తూ సిగరెట్ విసిరేస్తుంది వర్ష.సడన్ గా తనకి ఎందుకో లెఫ్ట్ లెగ్ ఎక్కువగా నొప్పి పుట్టడం స్టార్ట్ అవుతుంది రెండు రోజుల నుంచి.

      కాళ్ళు విదిలిస్తుంది కానీ కాళ్ళు మాత్రం చాలా బరువుగా ఉంటుంది.కనీసం అడుగు వేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది వర్ష.

          పక్కకి తిరిగిన తనకు గుండె ఆగిపోయినెంత పని అవుతుంది.ఇబ్బందికరంగా తన వైపే చూస్తున్న నల్ల కుక్కను చూడగానే తను,

   "అమ్మ"అని అరుస్తుంది కానీ గొంతు మాత్రం బయటికి రాదు.ఆ అమ్మాయి వైపు చూసి ఆ కుక్క ఏడుస్తుంది,వింటున్న తనకి గుండె   జలదరిస్తుంది,చుట్టూ చూస్తుంది కానీ ఎవరు వుండరు ,ఇంతలో ఇంకొన్ని కుక్కలు గట్టిగా ఏడుస్తూ తనని చూసి తన వైపే వస్తూ ఉంటాయి.

   కాళ్ళు సహకరించక పోయిన బలవంతంగా నడిచి వచ్చి కార్ లో కూర్చుని ఇంజిన్ స్టార్ట్ చేస్తుంది.ac లోను తనకి చెమటలు పట్టడం తనని   ఆశ్చర్యం చేస్తుంది.

                                  చీ...కుక్కల్ని చూసి నేను భయపడటం ఏంటి ! అని అనుకుంటుంది.

   తన చెవుల్లో కుక్కలా ఏడుపు మాయం అవుతుండగా ప్రాజెక్ట్ రోడ్ నుంచి గుంతలోకి తిరుగుతుంది తన కారు.వొళ్ళంతా వేడిగా చెమటలు పట్టేస్తాయి  తనకి. ac కూడా పెంచుతుంది.అప్పుడు తన మెడ మీద ఓ వెచ్చటి శ్వాస తగులుతుంది,డిస్ట్రాక్షన్లో ఉన్న తన గుండె ఒక్కసారిగా   ఉల్లిక్కిపడుతుంది.తనకి అప్పుడు తన వెనక ఎవరో వున్నారు అని అనుకుంటుంది.

                                      "ఎవరు,ఎవరు,వరుణ్,is that you??"అని అంటూ ఉంటుంది.

                                     సడన్ బ్రేక్ వేసాను అని అనుకుంటుంది గాని కార్ మాత్రం ఆగదు.

      తన కాళ్ళు కదలకుండా,ఐస్ గడ్డ లాగా ఉంటుంది.మొద్దు బారిపోతుంది.కాళ్ళు కూడా కదలకుండా ఉంటుంది.అమ్మా,what happened, డాష్ బోర్డ్ కిందుగా తన కాలు వైపు చూసిన తనకి గుండె ఆగిపోతుంది.భయంకరంగా రక్తం మరకతలతో,తెల్లటి మొహంతో,తెల్లని కను గుడ్లతో ఆ పాప...ఆ పాప...తన కాలు పట్టుకుని ఆ వైపే చూస్తుంది.గాడ్ సేవ్ మీ..అరుస్తూ ఉన్న తన మాట తనకే వినపడదు ఆ పాప తన కాలు పట్టుకుని పైకి పాకుతుంది,ఆ అమ్మాయి బాడీ కదలకుండా ఉంటుంది.ఒక్కసారిగా వైట్ లైట్...

                                          చూస్తే,ఎదురుగా తన అమ్మనాన్న,వరుణ్,రవి ఉంటారు.

                           "ఏమైంది అసలు నాకు,పాప ఏది అని అరుస్తూ ఉన్న" తన వైపు చిరాగ్గా చూస్తాడు రవి.

                             "ఎక్కువ తాగేసి కార్ తీసుకెళ్ళి పిల్లర్ కు గుద్దారు మేడం"అని అంటాడు వరుణ్.

                           "వాట్ ద హెల్ ఆర్ యూ టాకింగ్ వరుణ్ నేను అసలు తాగలేదు"అని అంటుంది వర్ష.

                                        "కూల్ వర్ష,టేక్ రెస్ట్"అని చెప్పేసి అందరు వెళ్ళిపోతారు.

                           "వొళ్ళంతా నొప్పులుగా ఉంది,ఐ మస్ట్ టేక్ ఏ బాత్"అని అనుకుని సానానికి వెళ్తుంది.

    షవర్ లోంచి చల్లగా నీళ్ళు తన తల మీద పడుతుంటే కొంచెం ఎనర్జీ వచ్చినట్లు అనిపిస్తుంది తనకి.అసలు నిన్న రాత్రి ఏమైంది?కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్న తనకి ఏదో ఏడుపు వినపడుతుంది.

                                                వినపడగానే "ఎవరు"అని అంటుంది.

              బాత్రూములోనే ఎవరో ఏడుస్తున్నారు అని తనకి అర్థమవుతుంది మళ్ళీ "ఎవరు?" అని అంటూ చుట్టూ చూస్తుంది.

  ఇంతలో తనకి భయపెట్టే లాగా ఒక ఏడుపు వినపడుతుంది.వొళ్ళంతా చెమటలు పట్టేస్తాయి తనకి.చూస్తే తను పెంచుకుంటున్న కుక్క ఏడుపు అది.గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది.కానీ,తన కుక్క ఇంత భయంకరంగా ఏడవటం తను ఎప్పుడు చూడదు.

  అప్పుడు చూస్తుంది తన లెఫ్ట్ లెగ్ వైపు ,చూస్తే నల్లగా మారిపోయి ఉంటుంది."అంటే,అంటే నిన్న రాత్రి నేను చూసింది అనుభవించింది అంతా నిజమా?"అని మనసులో అనుకుంటుంది.

  ఒక్కసారిగా తన గుండె జారిపోయినట్టు అనిపిస్తుంది తనకి."ఆ పాప దయ్యం అయిందా?అర్జెంటు గా వరుణ్ ని కలవాలి"అని అనుకుంటుంది.

హడావిడిగా కప్ బోర్డులో చేయి పెట్టిన తనకి చల్లగా ఏదో తగులుతుంది."ఆఆ.."అని గట్టిగా అరిచి చేయి బయటికి లాగాలని చూస్తుంది.ఎవరో తన చేయి పట్టుకుని వదలనట్టు అనిపిస్తుంది తనకి.మాంసం కుళ్లిపోయిన వాసన,ఏముకులు విరుగుతున్న చప్పుడు,తన చేతిని లాగేస్తూ ఉంటుంది.

                         గట్టి గట్టిగా అరుస్తూ "సేవ్ మీ!" అని అంటున్న గొంతు లోంచి సౌండ్ మాత్రం బయటికి రాదు.

 మళ్ళీ భయంకరంగా ఏడుపు,తన చెవులు బద్దలైపోతున్నాయి,సడన్ గా ఎగిరి దూరంగా పడుతుంది.కప్ బోర్డులోంచి రక్తం,ఆ రక్తం తన కాళ్ళ వైపు వస్తూ ఉంటుంది.

 ఏముకులు విరుగుతున్న చప్పుడు,ఆ ఆకారం తన వైపు పాకుతూ వస్తుంది.తెల్లగా మొహం,కళ్ళు లేవు,విరబోసుకున్న జుట్టు ,రక్తంతో తడిసిన బట్టలు ,కట కట మని ఎముకల చప్పుడు అలా ఉంటుంది ఆ ఆకారం. "మమ్మీ,డాడీ దయ్యం,దయ్యం"అని పెద్దగా అరుస్తుంది.తన మీద కూర్చొని ఉంటుంది అది,తనకి సరిగ్గా ఊపిరి కూడా ఆడదు.

                              "ఏమైంది నాన్న అసలు,లెగు నాన్న లెగు"అంటున్న శబ్దం వినిపిస్తుంది తనకి.

                                వర్ష కళ్ళు తెరిచి చుస్తే ఎదురుగా తన అమ్మ,నాన్న,కుక్ మూర్తి ఉంటారు.

    తను తల పైకి ఎత్తి చూడగా ఆ దయ్యం అటక పైన కూర్చొని తన వైపే చూస్తూ ఉంటుంది."అమ్మ అమ్మ దయ్యం"అని గట్టిగా అరుస్తుంది.

 చేయి ఎత్తి అటక వైపు చూపిస్తున్న తనని పిచ్చిదానిలా చూస్తున్న తన అమ్మ నాన్న లకి ఆ దయ్యం కనబడటం లేదు అని విషయం అర్థమవుతుంది తనకి.

           అన్నం తినబుద్ది కాదు తనకి,వొళ్ళంతా నీరసంగా ఉంటుంది.ఆక్సిడెంట్ వల్ల షాక్ అయ్యింది అని డాక్టర్స్ చెబుతారు.

                              ఇంతలో తనకి నిద్ర పట్టేస్తుంది.చెవిలో తనకి చిన్నగా ఒక శబ్దం వినిపిస్తుంది.

                                       "అక్క,లే.మమ్మీ ని చూడాలి లే"అని శబ్దం వినిపిస్తుంది.

  ఊపిరి ఆడకా సడన్ గా పైకి లేసి,చుట్టూ చూస్తుంది కానీ ఎవరు వుండరు.కరెంటు పోయినట్టు రూమ్ అంతా చీకటి అయిపోతుంది.కళ్ళు తెరవాలంటే భయంతో,పక్కకి తిరిగి సద్దుకొని పడుకుంటుంది.

 చల్లటి గాలి,హాయిగా తన మొహానికి తగులుతుంది,నిద్ర లోనే ఏసీ రిమోట్ వెతుకుతూ ఉంటుంది."అవును కరెంటు లేదు,మరి నా మొహానికి చల్లటి గాలి???"అని మనసులో అనుకుంటుంది.

   "ఏంటి మంచం ఇంత చల్లగా ఉంది,మంచు లాగా....మంచం కాదు ఇది,మరి ఏంటి"అని వచ్చిన తన ఆలోచనకి తనకు భయమేస్తుంది.

          "అక్క,లే అక్క....చచ్చిపో అక్క"చిన్నగా ఏడుపు వినపడుతుంది..రాను రాను ఆ ఏడుపు భయంకరంగా మారుతుంది.

 "అవును నా పక్కన పడుకుంది ఆ పాపనే,కాదు ఆ దయ్యమే"అని మనసులో అనుకుంటుంది.కళ్ళు గట్టిగా మూసుకుంటుంది తను కానీ తనకి తెలీకుండానే తన కళ్ళు తెరుచుకుంటాయి.

  ధైర్యం తెచ్చుకుని ఇంకో పక్కకి తిరుగుతుంది.కళ్ళు తెరిచి తలుపు వైపు పరిగెత్తాలని చూస్తుంది కానీ,కొంచెం దూరంలో పడుకుని తన వైపే చూస్తూ ఉంటుంది ఆ ఆకారం.ఒక్కసారిగా తనని మంచం కిందకి లాగుతుంది.భయంకరమైన శబ్దం,భయంతో చచ్చిపోతూ గట్టిగా అరుస్తూ ఉంటుంది వర్ష.

                                     "అమ్మా,అమ్మా.."అని అరిచి స్పృహ తప్పి పడిపోతుంది.

                                                     కొద్ది రోజుల తరువాత:

                తనని చూసి భయపడిన వరుణ్ తన నాన్నకి అంతా చెప్పేస్తాడు.తన పేరెంట్స్ ఎంతో మంది డాక్టర్స్ కి చూపిస్తారు.

 కొద్ది రోజులు సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ లో ఉంటుంది.తను షాక్ వల్ల భ్రమ పడుతుంది అని డాక్టర్స్ చెబుతారు."కానీ,నేను కుంటుకుంటూ ఎందుకు నడుస్తున్నాను అనేది ఏ డాక్టర్ చెప్పలేకపోతున్నాడు"అని మనసులో అనుకుంటుంది.

                            "తను నా కాళ్ళు వదిలితేనే కదా నేను సరిగ్గా నడిచేది" అని అనుకుంటుంది.

                 "ఆరోజు కాలు పట్టుకుని అక్క నన్ను వదిలేయండి అని ఏడ్చింది"అని అనుకోని బాధపడుతుంది.

                "ఈరోజు దాకా రోజు 'అక్క చచ్చిపో...అక్క చచ్చిపో'అని ఏడుస్తుంది"అని మనసులో అనుకుంటుంది.

                    ఆ పాప ఏడుపు వింటూ భయంతో పిచ్చి దానిలా అయిపోయాను అని అనుకుంటుంది వర్ష.

            "yes I should die!I don't deserve to be alive!"అని మనసులో బలంగా అనుకుంటుంది.                     

                                             ******

        ఒక్కగానొక్క కూతురు వర్ష చావుని తట్టుకోలేక షాక్ తో వర్ష వాళ్ళ అమ్మ చనిపోతుంది,వర్ష వాళ్ళ నాన్న చక్రవర్తి గారికి పిచ్చెక్కుతుంది.

   కన్స్ట్రక్షన్ సైట్ లో శవాలు బయట పడ్డాయి అని,శాంతి చేయక పోవటం వల్లనే చక్రవర్తు గారి ఫ్యామిలీ ఇలా అయిపొయింది అని అనుకుంటారు జనం.

                               కానీ,శాంతి చేయటం వల్లనే ఇలా జరిగిందని తెలీదు జనానికి.

                                                            అక్కడ:

     అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు ఆడుకోవటానికి వెళ్లి ,కొన్ని నెలలు అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ,తను వస్తుందనే   పిచ్చి ఆశతో నిజంగానే పిచ్చిదైపోతుంది ఆ పిల్ల తల్లి.

     నిజానికి వర్ష నిజంగా మానసిక వ్యాధితో చనిపోయిందా లేదా ఆ పాప దెయ్యంగా మారి చంపేసిందా అనేది ఆ దేవుడికే తెలియాలి కానీ ఒకటి మాత్రం నిజం మనిషి మానవత్వాన్ని స్వార్థం చంపేసింది !

                                        ఇంతకీ ఆ పాప పేరు చెప్పలేదు కదూ! ఆ పాప పేరు "శాంతి".......

 

                                                          **** అయిపోయింది****

                                                                                                                    

  

        

          


Rate this content
Log in

Similar telugu story from Horror