కలలోని ప్రేమ వరమై ఎదురొస్తే..
కలలోని ప్రేమ వరమై ఎదురొస్తే..


సందీప్ తెలివైన మంచి బిజినెస్ మాన్. పైగా అందగాడు. తన తల్లిదండ్రులకు ఏకైక సంతానం. అమెరికాలో ఎమ్మెస్ చేసి ఈమధ్య ఇండియా తిరిగి వచ్చాడు. తన తండ్రికి బిజినెస్లో చేదోడువాదోడుగా ఉంటూ, తన తల్లి,తండ్రిని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. తల్లి సౌందర్య దేవికి కొడుకు అంటే ప్రాణం.
నోరు తెరిచి అమ్మా నాకు ఇది కావాలి అనే లోపే మార్కెట్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ తెచ్చి సందీప్ కళ్ళముందు పెట్టేది.అల్లారుముద్దుగా పెంచుకుంది. అందుకే సందీప్ తన తల్లిదండ్రుల్ని వదిలి విదేశాల్లో ఉండలేక తిరిగి వచ్చేసాడు .
రోజు మార్నింగ్ లేచి జాగింగ్కి వెళ్లి వచ్చి కాసేపు టీ తాగుతూ పేపర్ చదివి ఆఫీస్కి రెడీ అయి వెళ్ళటం సందీప్ దినచర్య.
అదే విధంగా ఆ రోజు కూడా జాగింగ్కి తెల్లారి జామునే అయిదింటికి లేచి బయల్దేరాడు సందీప్.
అలా రోడ్డు మీద జాగింగ్ చేస్తూ వెళ్తుండగా దారిలో ఒక పెద్దాయన కుప్పకూలిపోతు కనిపించాడు.
వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి అంకుల్ ...అంకుల్.. ఏమైంది అని అడిగాడు. అతడు నోట మాట రాక వాటర్ వాటర్ అని అడిగాడు.
అది మెయిన్ రోడ్డు కావడంతో చుట్టూ ఎక్కడ షాప్స్ ఏమీ లేవు అందుకని పరిగెట్టుకుంటూ దగ్గర్లో ఏదైనా ఇల్లు ఉంటుందేమో అని వెళ్ళాడు.
ఆ మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి వెళ్లి తలుపు కొట్టాడు సందీప్.
అప్పటికే అమృత వాళ్ళ అమ్మ పూజ గదిలో పూజ చేసుకోవడం వల్ల కాలింగ్ బెల్ ఎంత సేపు కొడుతున్న తను పూజ మధ్యలో లేవడం ఇష్టంలేక తలుపు తీయట్లేదు.
అమృత... అమృత... చూడు వెళ్లి ఎవరో తలుపు కొడుతున్నారు... వెళ్ళి చూడు అమ్మ... అని కేకలు వేసింది అమృత తల్లి.
నాన్నకు చెప్పొచ్చుగా నేను పడుకున్నాను. అని అంటుంది అమృత.
నాన్నగారు బాత్రూంలో ఉన్నారు అమ్మ... చూడు వెళ్లి అని మళ్ళీ చెప్పింది.
అంతలోనే నిద్ర మొహంతో కళ్ళు నిలుపుకుంటూ వెళ్లి తలుపు తెరిచింది అమృత.
తెల్లని వస్త్రాలు, నల్లని కురులు, పెద్ద పెద్ద కళ్ళు చూడటానికి చందమామలా ఉంది.
అమృతానీ చూసిన సందీప్ ఒక నిమిషం నోటమాట రాక అలాగే చూస్తూ ఉండిపోయాడు.
ఎవరు కావాలండి అంటూ విసుగ్గా అడిగింది అమృత.
ఒక బాటిల్ వాటర్ ఉంటే ఇస్తారా అంటూ తడబడుతూ .....అక్కడ ఒక పెద్దాయన కళ్ళు తిరిగి పడిపోయారు చుట్టూ షాప్స్ ఏమి లేవు కొంచం వాటర్ ఉంటే ఇస్తారా ప్లీజ్ అని అడిగాడు.
లోపలికి వెళ్లి ఒక వాటర్ బాటల్ తీసుకొని వచ్చి సందీప్కి ఇచ్చింది అమృత.
మొదటిసారి చూసినపుడు సందీప్ని సరిగ్గా గమనించలేదు... రెండోసారి వాటర్ ఇస్తూ సందీప్ వంక చూస్తూ అబ్బా ఎంత అందంగా ఉన్నాడు. ఇది కలా నిజమా అన్నట్లు చూస్తూ ఉంది.
అంతలోనే వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళిపోయాడు సందీప్. అమృత తల్లి ఎవరు అమృత వచ్చింది. అని అడిగింది .
ఎవరో అబ్బాయి అమ్మ మంచినీళ్లు కావాలని అడిగాడు ఇచ్చాను అని చెప్పింది.
సర్లే మళ్ళి పడుకోక తెల్లారింది లేచి రెడీ అవ్వు పెళ్లికి టైం అవుతుంది అని అన్నది వాళ్ళ అమ్మ.
పెళ్ళా ...? ఎవరిది నేను రాను నువ్వు నాన్న ఎల్లండి అంది అమృత...అదేంటే మర్చిపోయావా మన సీత ఆంటీ వాళ్ళ కూతురు పెళ్లి కదా ఈరోజు.... నిన్ను మరి మరి తీసుకు రమ్మని చెప్పింది సీత ఆంటీ... రాకపోతే ఫీలవుతారు అంటూ బ్రతిమాలింది అమృత వాళ్ళ అమ్మ జానకి.
సరేలే వస్తాను అని చెప్పి రెడీ అవడానికి వెళ్ళింది అమృత. అంతలోనే అమృత చక్కగా ముస్తాబై అందంగా కుందనపు బొమ్మలా చీర కట్టుకుని నగలు పెట్టుకుని వచ్చింది. మళ్లీ కాలింగ్ బెల్ శబ్దం వినిపించింది.
అప్పటికే హాల్లోనే ఉండడం వల్ల అమృతనే వెళ్లి తలుపు తీసింది....." మళ్లీ సందీప్నే"...
ఈసారి అయితే సందీప్ అమృతని చూసి ఫ్లాట్ అయిపోయాడు ...అబ్బ ఎంత అందంగా ఉంది అని మనసులో అనుకొని ....థాంక్స్ అండి మీరు చాలా హెల్ప్ చేశారు సమయానికి మంచినీళ్లు ఇచ్చి అంకుల్ ప్రాణాలు కాపాడారు అని చెప్పి వెళ్ళిపోయాడు.
మనసులో అమృత కూడా నవ్వుకుని బలే ఉన్నాడు ఈ పిల్లాడు, అని అనుకుంది.
అంతలోనే అందరూ తయారయి పెళ్లికి వెళ్లారు.అదే పెళ్లికి సందీప్ వాళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు. పెళ్లి చాలా ఘనంగా వైభవంగా జరుగుతుంది. పెళ్లిలో సంగీత్ కూడా ఏర్పాటు చేశారు.సౌందర్య దేవి, సందీప్కి కాల్ చేసి మధ్యాహ్నం లంచ్కి వచ్చి వెళితే బాగుంటుందిరా... అందరూ వచ్చారు ఆంటీ అంకుల్ కూడా నిన్ను అడుగుతున్నారు అని అన్నది.
లేదులేమ్మా . మీరు చూసుకొని రండి నాకు కొద్దిగా పని ఉంది అన్నాడు సందీప్. అలా పెళ్లి అంత ముగిసే సరికి రాత్రి 11 అయ్యింది. ఇంతలో సందీప్ వాళ్ళ నాన్నగారు అయిన మహేంద్ర వర్మ గారి కారు చెడిపోయింది. ఆ టైంలో రిపేర్ చేసే వాళ్ళకి కాల్ చేసినా ఎవరూ రారు... ఏం చేయాలో తెలీక సందీప్కి ఫోన్ చేస్తున్నారు.
కానీ సందీప్ ఫోను స్విచ్ఛాఫ్ వస్తుంది. అంతలోనే అమృత వాళ్ళ కారు అటువైపుగా వెళ్తూ సౌందర్య దేవి వాళ్ళని చూసి కారు ఆపారు. పెళ్లి లో అమృత వాళ్ళ అమ్మ జానకినీ, సౌందర్య దేవికి పరిచయం చేసింది సీత .
అలా మొకపరిచయంతో వాళ్ళు ఏదో ఇబ్బంది పడుతున్నట్లు ఉన్నారు అని కారు ఆపారు.
ఏంటి సౌందర్య గారు మీ కార్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా..? అని అడిగింది జానకి.అవునండి సడన్గా ఆగిపోయింది. ఏమైందో తెలియదు మా అబ్బాయికి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పింది సౌందర్య. మీకు ఏమీ ఇబ్బంది లేకపోతే మా కార్లో రండి... మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని పిలిచింది జానకి.
ఇబ్బంది ఏమి ఉంటుంది అండి . అంత హెల్ప్ చేస్తాను అంటే వద్దంటానా అంటూ నవ్వుతూ వచ్చి జానకి వాళ్ళ కారు ఎక్కారు భార్యభర్తలిద్దరు.
అమృత వాల నాన్న శంకర్ వాళ్ళిద్దర్నీ వాల ఇంటి ముందు డ్రాప్ చేశారు. కొంచెం లగేజ్ ఎక్కువ ఉండటంతో నేను సాయం చేస్తాను అంటూ అమృత చేతిలో బేగ్ అందుకొని సౌందర్యతో పాటు ఇంట్లో కి వెళ్ళింది.
ఇంట్లోకి వెళ్లిన తరువాత సౌందర్య మంచి నీళ్లు కావాలా అని అడిగింది. వద్దు ఆంటీ... థాంక్యూ అని చెప్పి వెళ్ళిపోతుండగా ...అమ్మ ఏంటి ఇంత లేటు అనుకుంటూ వచ్చాడు సందీప్.
సందీప్ని చూసిన అమృత ఈ అబ్బాయిని మార్నింగ్ చూసాను కదా ....తనే కదా... ఇక్కడున్నాడు ఏంటి అని సందేహంగా చూసింది. అమృతనీ చూసిన సందీప్ కళ్ళలో మెరుపులు మెరిసాయి. ఏంటిది మళ్ళీ మళ్ళీ తనే కనిపిస్తుంది ఇది డెస్టినీనా అని అనుకున్నాడు.
సరే ఆంటీ నేను వెళ్ళొస్తా అని చెప్పి...అమృత వెళ్ళిపోయింది.ఎవరమ్మా తను అని అడిగాడు సందీప్. అదా... నీకు ఎన్నిసార్లు కాల్ చేసినా లాండ్ ఫోన్ నువ్వు లిఫ్ట్ చేయట్లేదు... నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మన కారు ట్రబుల్ ఇస్తే పెళ్లిలో పరిచయమయ్యారు జానకి ఆంటీ వాళ్ళు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి అని చెప్పింది సౌందర్య.
ఆ రోజు నుండి రోజు జాగింగ్కి వెళ్ళినప్పుడు అమృత వాళ్ళ ఇంటి మీదుగా వెళ్ళటం అమృత కనిపిస్తుందేమో అని చూడటం చేసేవాడు సందీప్. అమృత కూడా మార్నింగ్ జాగింగ్కి రోజు ఈ టైంకి వస్తాడు కదా సందీప్ , కనిపిస్తాడేమో అని మేడపై ఎదురు చూస్తూ ఉండేది.
అలా ఒకరికి ఒకరు చెప్పుకోకుండా మనసులో ఒకరంటే ఒకరు అభిమానాన్ని పెంచుకున్నారు .
ఒక రోజు మహేంద్ర ఏదో పని పడింది అని అర్జెంటుగా సింగపూర్ వెళ్లాలి. కానీ అంతకన్నా ఇంపార్టెంట్ బోర్డింగ్ మీటింగ్ ఉందని తను వెళ్లలేను అని సందీప్నీ వెళ్ళమన్నాడు తన తండ్రి.
ఇక తప్పని పరిస్థితుల్లో సందీప్ సింగపూర్ వెళ్ళాడు.
మూడు రోజులుగా రోజు తెల్లవారుజామునే లేచి మేడపై సందీప్ కోసం ఎదురుచూస్తూ ఉంది అమృత . కానీ సందీప్ రావటం లేదు. అమృత.... నేనే తన మీద ప్రేమ పెంచుకున్నాను...!! కానీ తనకి నా మీద ఇష్టం లేదేమో...!! అందుకే రావట్లేదు అని అనుకొని మనసు బాధ పెట్టుకుని సందీప్ కోసం చూడటం మానేసింది.
ఒక వారం తర్వాత సందీప్ సింగపూర్ నుంచి తిరిగి వచ్చాడు. ఎప్పట్లాగే తెల్లారు జాగింగ్ కోసం బయలుదేరాడు. కానీ ఈ సారి అమృత కనిపించలేదు. అడుగుదామంటే తన ఫోన్ నెంబర్ లేదు. తనను చూసి వారం రోజులు అయింది. ఎందుకో తనని చూడాలనిపిస్తుంది. ఇది ప్రేమే ఏమో అని అని తనలో తాను నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు
అలా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా తమ ప్రేమను చెప్పుకోకుండా ఒకరి కోసం ఒకరు ఎదురు చూస్తూ ఉండిపోయారు.
ఒకరోజు అమృతాకి తెల్లారుజామునే ఎవరో తలుపు కొట్టినట్టు ....వెళ్లి చూస్తే సందీప్ తనకోసం వచ్చినట్టు ..."ఐ లవ్ యు అమృత "అని చెప్పి తనను ఎత్తుకుని గిరగిరా తిప్పి నట్టు.... కల వచ్చి ఉలిక్కిపడి లేచింది.
అయ్యో ఇది కలేనా అనుకొని మరలా పడుతుంది. కానీ నిద్ర రావటం లేదు... సందీప్నీ చూడాలి అనిపిస్తుంది. కానీ ఎలా ఇంటికి వెళ్దాం అనుకున్నది. కానీ అబ్బాయి చుట్టూ అమ్మాయి తిరిగితే చీప్గా చూస్తాడని వద్దని విరమించుకుంది.
రెండు వారాలు ఒకరి నొకరు చూసుకోకుండా మొహమాటంతో కాలం గడిపేశారు. ఒకరోజు సందీప్ అమ్మ నేను ఎవరినైనా ప్రేమిస్తే మీరు మా పెళ్లికి అనుమతి ఇస్తారా అని అడిగాడు. అందుకు సౌందర్య నీ సంతోషమే నా సంతోషం... నీకు నచ్చిన ఏ అమ్మాయి అయినా నాకు నచ్చుతుంది ఎవరు ఆ లక్కీ గర్ల్ అని అడిగింది.
నాకు నచ్చింది కానీ.... ఇంకా నేను ఆమెకు చెప్పలేదు. ఆమె మనసులో నేను ఉన్నానో లేదో తెలుసుకొని రేపు మీకు పరిచయం చేస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఇంతలో సీత అమృతాకి ఒక సంబంధం తీసుకొని వచ్చింది. అది మరెవరో కాదు సౌందర్య గారి అబ్బాయి సందీప్. అమృతాన్ని సందీప్కి ఇస్తే బాగుంటుందని నీ అభిప్రాయం ఏంటి జానకి అని తెలుసుకోవాలని జానకి ఇంటికి వచ్చింది సీత.
అంతకన్నా అదృష్టమా...!! అంత గొప్ప సంబంధం నా బిడ్డ కు రావడం అంటే మాటలా సీత ...నా కూతురు వారికి నచ్చితే అంతకన్నా భాగ్యం ఏముంది చెప్పు అని అంటుంది జానకి.
ఈలోగా సందీప్ అమృత కోసం వస్తాడు.... సందీప్నీ చూసి .... రా బాబు రా ... అంటూ ఆహ్వానిచింది జానకి
ఆంటీ అమృత ఉందా..!! అని అడిగాడు సందీప్
ఉంది బాబు... అని అమృత...! అమృత..! అని పిలిచింది.
ఏంటమ్మా అనుకుంటూ కిందకు దిగి వచ్చింది అమృత.
సందీప్ని చూసి పట్టలేని ఆనందంతో సందీప్... అనుకుంటూ అడుగులు వేస్తూ పరుగులు తీసి... అంతలోనే సిగ్గుతో అమృత ఆగిపోయింది .
నీతో కొంచెం మాట్లాడాలి అమృతా అని పిలిచాడు సందీప్. తీసుకెళ్ళు అమృత అని పంపించింది.
అలా పైన టెర్రస్ పైకి వెళ్ళారు ఇద్దరు.
అమృత నేను నీతో ఒక మాట చెప్పాలి..!!
హ చెప్పు సందీప్...!!
నిన్ను చూసిన మొదటి రోజే నాకనులు అదుపుతప్పి నీ వశమై పోయాయి.
నిన్ను చూడాలని ప్రతి క్షణం పరితపిస్తూనాయి.
నువ్వు లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేక పోతున్నాను. ఇది ప్రేమో లేక ఆకర్షణో నాకు తెలియదు.
ఐ లవ్ యు అమృత నీకు నచ్చితే నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఉంగరం తీసి తన ముందు మోకరిల్లాడు.
అలా సందీప్ ప్రపోజల్ చేయగానే...ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా" ఐ లవ్ యు టూ సందీప్ "నాకు కూడా నువ్వు మొదటి చూపులోనే నచ్చావ్ కానీ ఆ మాట నీకు చెప్పాలని ఎన్నో సార్లు అనుకున్నా నువ్వు నన్ను స్వీకరిస్తేవో లేదో అనే అనుమానం... కొంచెం మొహమాటంతో ఆగిపోయాను.... ప్రతిక్షణం నీకోసం రోజు వేచి చూసే దాన్ని అంటూ చెప్పింది.
అలా వారి ప్రేమను పెద్దలకు తెలియజేశారు పెద్దలు కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని అనుకున్నారు కనుక అందరూ సంతోషించి సందీప్కి అమృతాకి పెళ్లి చేశారు. అల అమృతకి వచ్చిన....కల నెరవేరింది.
***************
సర్వేజనా సుఖినోభవంతు..!!
మీ...
జ్యోతి మువ్వల