STORYMIRROR

Jyothi Muvvala

Comedy Drama Classics

4  

Jyothi Muvvala

Comedy Drama Classics

రంగమ్మ వ్యాధి

రంగమ్మ వ్యాధి

4 mins
395


ఇంటిలోకి అడుగుపెట్టిన వెంటనే పక్కనున్న పెరటిలో బట్టలు ఉతుకుతూ అటుగా తిరిగి ముసుగు వేసుకున్న వ్యక్తిని చూసి ఎవరబ్బా? ఈ కొత్త వ్యక్తి అని అనుకుంటూ ఇంట్లోకి అడుగు పెట్టింది రంగమ్మ.

కొంపదీసి అమ్మగారు కొత్త పనివాడిని పెట్టేసుకున్నారా ఏంటి? అని ఆలోచిస్తూ 

అయ్యో అయ్యో ఒక రెండు రోజులు రాకపోతే అప్పుడే కొత్తపని వాడిని పట్టేసుకుంటారా అమ్మగారు

అంటూ శోకాలు పెట్టుకుని ఇంటిలోకి వచ్చింది రంగమ్మ!

అప్పుడే పూజ ముగించుకొని పూజ గదిలో నుంచి బయటకు వస్తున్న భాగ్యం 

"అబ్బా! ఏంటే తెల్లారు నీ గోల" ముందు ఆ శోకాలు ఆపు 

వారం రోజుల నుంచి అడ్రస్ లేకుండా పోయావు. ఒక కబురు లేదు కాకరకాయ లేదు" అని మండిపడింది.

"ఎన్నిసార్లు సెలవులు పడతావు. నేను చేసుకోలేక నిన్ను పెట్టుకున్నాను. నువ్వేమో వారంలో రెండు రోజులు రావు. ఇప్పుడు ఏకంగా వారం రోజులు డుమ్మా కొట్టావు.

 ఇలా అయితే నాకు కుదరదు అని గట్టిగా చెప్పింది భాగ్యం."

"ఏం సేయను అమ్మ! రాత్రులు నిద్ర పట్టదు. ఒక్కోపాలి రేతిరంతా కళ్ళు నిలబడి పోతాయి. కాలు చేతులు ఒకటే సొలుపులు. ఆరోగ్యం బాగోలేక రాలేకపోతున్నాను గానీ కావాలని మానేతున్నానా? అర్థం చేసుకోండి అమ్మగారు అని అంది రంగమ్మ."


"బాగుందే సంబరం అలాంటప్పుడు ఎందుకు నీకీ పని, చక్కగా ఇంటిపట్టునే ఉండి ఆరోగ్యం చూసుకో రాదు.నా ప్రాణాలు ఎందుకు తీస్తున్నావ్ అంటూ మొఖం తిప్పుకుంది భాగ్యం".


"ఇల్లు గడవాలంటే ఏదో పని చేసుకో పోతే ఎలా అమ్మగారు. నేను పడుకుంటే నాలుగు మెతుకులు పెట్టే నాధుడే లేడు. నా మొగుడు సక్కగుంటే నాకెందుకీ పాటులు. ఆ తాగుబోతు సచ్చినోడు తాగి ఎక్కడ పడిపోతాడో... ఎటో, కాయకష్టం చేసుకోకపోతే మా బతుకులు సాగేదేంట చెప్పండి. అస్సలు ఒంట్లో బాగోక ఇంటి దగ్గరే పడుకొని ఉంటే మా చెల్లెలు డాక్టర్ దగ్గరికి తోలుకొని పోయింది.డాక్టర్ బోలెడు టెస్ట్ల రాశాడు.


 రిపోర్ట్స్ అన్ని చూసి చక్కెర వ్యాధి అని చెప్పాడు. రక్తంలో ఏవో తగ్గిపోయాయి అంట. నాలుగురోజులు రెస్ట్ తీసుకోమని చెప్పాడు. అందుకే రాలేకపోయాను అమ్మ" అని దీనంగా మొహం పెట్టి చెప్పింది రంగమ్మ.

 భాగ్యం మాత్రం ఏమాత్రం కనికరించలేదు. "ఏవో సాకులు చెబుతావులే. నీ మాటలు ఎప్పుడు నమ్మాలి! అని నిష్టూరంగా మాట్లాడింది భాగ్యం."


"ఈ ఒక్క పాలి క్షమించండి అమ్మా!" అని బతిమాలుతుంది రంగమ్మ. బయటనుండి భాగ్యం, రంగమ్మ సంభాషణంతా వింటున్నాడు దుర్గారావు.

"సర్లే! ఇదే ఆఖరి సారి. మళ్లీ సెలవు పెట్టావ్ అనుకో ఊరుకునేది లేదు అని గదామాయించింది భాగ్యం.


భాగ్యం మాటలకి చిన్నబుచ్చుకున్న ఎట్లాగోల కరుణించారు అంతే చాలు అని మనసులో అనుకుని గబగబా పేరటిలోకి వెళ్ళింది రంగమ్మ. అంతలోనే అవును ఈ ముసుగు మనిషి ఎవడు? ఇందాక ఇంట్లోకి వస్తున్నప్పుడు ఇక్కడే చూశాను. ఒక్క రెండు రోజులు పనికి రాకపోతే నా పనినే లాగేసుకుంటాడా? వీడి పని చెప్తాను చూడు ,ఈ రంగమ్మ పనిలోనే వేలు పెట్టాలి అంటే ఆడికి ఎన్ని గుండెలు ఉండాలా? అని చుట్టూ చూసింది. బన్నీలు వేసుకొని లింగి కట్టుకొని ముసుగులో బట్టలు ఉతుకుతున్న దుర్గారావుని వెనక నుండి వెళ్లి అమాంతం జబ్బ పైన చర్చింది రంగమ్మ.


 దెబ్బకి కళ్ళు వూడోచ్చినంత పనయింది దుర్గారావుకి. కోపంగా ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు దుర్గారావు. దుర్గారావుని చూసిన రంగమ్మకి పై ప్రాణాలు పైనే పోయాయి. పట్టపగలే చుక్కలు కనిపించాయి. "అయ్యగారు మీరా... తప్పై పోనాది! క్షమించండి అని కాళ్ళ మీద పడింది. ఎవడో కొత్త పని వాడు అనుకున్నాను." అని గజగజ వణికి పోసాగింది.


 "ఆ నీకేం, నీకు కావలసిన అన్ని రోజులు సెలవులు పెట్టుకుంటావ్". "ఇక్కడ బలైపోయింది నేనే కదా!నువ్వు సెలవు పెట్టి నప్పుడల్లా నాతో సెలవు పెట్టించి మొత్తం ఇంట్లో పని చేయిస్తుంది మీ అమ్మగారు 

పైగా నా జబ్బ ఉడివచ్చేలా నన్నే కొడతావా ?" అని బావురుమన్నాడు దుర్గారావు.


దుర్గారావు పరిస్థితికి జాలిపడింది రంగమ్మ. ఊరుకొండి బాబు గారు మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు.

"ఎప్పుడూ తెల్ల చొక్కా లాగు వేసుకొని రాజకీయ నాయకుడులాగా హుందాగా ఉండే మిమ్మల్ని ఈ బట్టల్లో చూసి పోల్చుకోలేక పోయాను అయ్యగారు అంది రంగమ్మ." అదా! ఏం చేయమంటావ్? మీ అమ్మగారికి తింటే ఆయాసం తినకపోతే నీరసం. మరి తప్పదు నాకు అందుకే ఎవరు గుర్తు పట్టకూడదని ఈ అవతారంలో పని చేసుకుంటున్నాను" అని వాపోయాడు దుర్గారావు.


క్షమించండి బాబు గారు! తప్పై పోయింది. షుగరు వ్యాధి వల్ల ముడుకులు నొప్పులు, ఒళ్ళు నొప్పులు. మా అయ్యాకి ,అమ్మకి ఇదే జబ్బు ఉందంట. ఈ మధ్యే తెలిసింది. ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా రోగాలు మాత్రం వారసత్వంగా వస్తాయి అంట కదా! తెల్లారగట్ల లేవలేకపోతున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్లాను, అందుకే రాలేక పోయాను అని చెప్పింది రంగమ్మ.


 రంగమ్మ బాధను విన్న దుర్గారావు ఇంటి లోపలికి వెళ్లి ఒక మాత్రని తెచ్చి ఇదిగో రంగమ్మ అని ఇచ్చాడు.

అది చూసి రంగమ్మా !" ఏంటి బాబు ఇది? ఎందుకు" అని అడిగింది. రోజు ముడుకులు నొప్పులు ఒళ్ళు నొప్పులుతో బాధపడుతున్నాను అంటున్నావు కదా. ఈ మాత్ర వేసుకుంటే నీకు ముడుకులు నొప్పులు ఒళ్ళు నొప్పులు పోతాయి. చక్కగా రాత్రి పూట నిద్ర పడుతుంది. మనిషికి మంచి నిద్రే ఆరోగ్యం. శరీరానికి తగినంత నిద్ర, వ్యాయామం లేకపోతే అనారోగ్యమే వస్తుంది. వేల పట్టున తిండి కూడా చాలా అవసరం.


 ఇళ్ళల్లో పని చేసుకొని సమయానికి తినక పోవడం వల్లే నీకు ఈ వ్యాధి వచ్చి ఉంటాది. వేల తప్పి భోజనం చేయడం కొవ్వు పదార్థాలు, మాంసాహారాలు తినటం వల్ల నీకు వచ్చి ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి వంశ పరంగా కొన్ని అనారోగ్యాలు సంక్రమించిన తగిన జాగ్రత్తలు తీసుకొని అలవాట్లు మార్చుకుంటే సరిపోతుంది అని చెప్పి ఆ మాత్ర రంగమ్మ కి ఇచ్చాడు.

ఇంతలో భాగ్యం ఏంటి అక్కడ కబుర్లు పని అయిందా లేదా అని కేక వేసింది. టక్కున ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు.


అలా కొన్ని రోజులు పోయిన తర్వాత రంగమ్మ చాలా చలాకీగా పని చేసుకుంటుంది. ఈ మధ్య సెలవులు కూడా పెట్టడం లేదు. ఒకరోజు దుర్గారావు ఏంటి రంగమ్మ ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం అని అడిగాడు. మీరు ఇచ్చిన మందు బాగా పని చేసింది బాబు గారు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉంది. అని చెప్పింది. ఆ మాట విని దుర్గారావు ఫక్కున నవ్వాడు. దుర్గారావు అలా నవ్వడం చూసి ఎందుకు నవ్వుతున్నాడో రంగమ్మ కి అర్థం కాలేదు.

ఎందుకు బాబు అలా నవ్వుతున్నావ్ అని అడిగింది.

మరేం లేదు రంగమ్మ... నేను నీకు ఇచ్చింది ఒళ్ళు నొప్పులు మాత్ర! అది వేసుకోగానే నీ ఒళ్ళు నొప్పులు తగ్గి పోయాయి.దానికి తోడు సమయానికి ఆహారం తీసుకుంటున్నట్లు ఉన్నావ్, మంచిగా పడుకుంటున్నావు అందుకే నీకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. ఆరోగ్యం అనేది మన మానసిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. మన మనసు దేనినైతే ఆలోచిస్తుందో అదే మనకి తిరిగి వస్తుంది. మానసిక ఆరోగ్యం మనిషిని కుంగదీస్తుంది.


ఆ మాత్ర వేసుకోవడం వల్ల నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని భావిస్తున్నావు అందుకే నీకు ఆరోగ్యంగా అనిపిస్తుంది. అని చెప్పాడు. ఆ మాట విని రంగమ్మ ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టింది. మన శరీరానికి మన ఆరోగ్యాన్ని బాగుచేసుకునే శక్తి ఉంటుంది. ఈ మాత్రలు మన శరీరంలోని భాగాలకు తమ వంతు పని చేసుకునే శక్తిని కోల్పోతే పని చేసుకోవడానికి సాయంగా మాత్రమే నిలుస్తాయి. ఈ విషయం తెలియక చాలామంది మాత్రలు వేసుకోవడం వల్లే ఆరోగ్యం కుదుటపడిందని భావిస్తారు. నాచురల్గా శరీరం బాగు పడాల్సిన స్థితిని కోల్పోయి ఈ మందుల ఆధారంగానే శరీరభాగాలు పనిచేయడం మొదలుపెడతాయి. అందుకే ఎక్కువగా మందులు వాడకూడదు. డాక్టర్ పర్యవేక్షణలో మోతాదులో తీసుకోవడం మంచిది అని చెప్పాడు.

అయ్యగారు మీరు చాలా గొప్పవారు అండి. ఈరోజు మీవల్ల నాకు చాలా విషయాలు తెలిసాయి అని సంతోషపడింది. సర్లే మళ్లీ నా జబ్బా విరగకొట్టకుండా ఉంటే చాలు అన్నాడు దుర్గారావు. భాగ్యం, రంగమ్మ ఫక్కున నవ్వారు.



---జ్యోతి మువ్వల 










Rate this content
Log in

Similar telugu story from Comedy