Jyothi Muvvala

Children Stories Drama Fantasy

4.5  

Jyothi Muvvala

Children Stories Drama Fantasy

అడవి రాజు పెళ్ళి

అడవి రాజు పెళ్ళి

5 mins
306



అడవంత భయంతో వణికి పోతుంది. ఏ క్షణాన సింహ రాజకి కోపం వస్తుందో ఎవరు బలైపోవాల్సి వస్తుందో అని వణికిపోతున్నారు. రాజుని కలవడానికి కూడా వెళ్లాలంటే భయంతో గుటకలు మింగుతున్నారు. ఎక్కడి జంతువులు అక్కడే తమ గృహాలలో నక్కినక్కి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నాయి. మరికొన్ని వేటకి కూడా వెళ్ళటం మానేశాయి.

ఎన్నాలిలా గృహాలలోనే ప్రాణాలు బిగబెట్టుకొని ఉండటం. ఈ కష్టానికి మార్గమే లేదా అని ఒకదానితో ఒకటి చర్చించుకుంటున్నాయి. "ఎందుకు లేదు నా దగ్గర ఒక చక్కటి ఉపాయం ఉంది అంది నక్క." "మరింకెందుకు ఆలస్యం " ఆ ఉపాయం ఏదో చెప్పి ఈ గండం నుంచి మమ్మల్ని గట్టెక్కించు అన్నాయి మిగిలిన జంతువులన్నీ."

'మరి నాకేంటి లాభం అంది నక్క' "ఏం కావాలో చెప్పు నీకు ఏం కోరిన ఇస్తాం! కానీ మా ప్రాణాలను మాత్రం రక్షించు అని వేడుకున్నాయి." ఇదే మంచి అవకాశం గా భావించింది నక్క. అయితే మీలో రోజుకు ఒక జంతువు నాకు ఆహారంగా రావాలి. ఆ షరతు ఒప్పుకుంటేనే నేను మిమ్మల్ని అందరినీ కాపాడే ఉపాయం చెప్తాను అంది నక్క.

అన్నీ జంతువులు ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. వాళ్ళ ముఖ కవళికలు గమనించిన నక్క... పోనీ రెండు రోజులకు ఒకటి అని కాస్త బెట్టు తగ్గింది.

ముందు వెళ్తే నుయ్య వెనుక వెళ్తే గోయ్య అన్నట్టు అయ్యింది ఆడవి జంతువులకు.

ఆ అడవిలో హిరణ్యడు అనే సింహరాజు ఉన్నాడు. అతడి భార్య కౌస్తభం అనే ఆడ సింహం మరణించింది. అప్పటినుంచి అతడు మనోవేదకి గురై పిచ్చి పట్టిన వాడలా అయ్యాడు. పైగా ముక్కోపి. కోపం వచ్చినప్పుడు అతడి ఆవేశాన్ని అనుచుకోలేక తన చుట్టుపక్కల ఎవరున్నా పీక కొరికేసి చంపేసే వాడు. కానీ తినేవాడు కాదు. ఆకలి వెసినప్పుడు మాత్రమే తినేవాడు. కానీ దాని కోపం రోజురోజుకీ మోతాదు మించడంతో ఒకపూటకి పది జంతువులు బలైపోతున్నాయి. అలా అడవి మొత్తం దాని కోపాగ్నికి ఆహుతై ఖాళీ అయిపోతుంది. ఇక మిగిలిన జంతువులన్నిటికీ భయం పట్టుకుంది. పూటలో ప్రాణాలు వాడిపోయిన ఆకుల రాలిపోతున్నాయి.

ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ మనుగడ కష్టమని ఆందోళనకు గురైయాయి. ప్రాణ భయంతో ఇళ్లల్లోనే నక్కినక్కి ప్రాణాలను కాపాడుకుంటున్నాయి.

అదే సమయంలో ఇలా ఒకరితో ఒకరు చర్చించుకుంటూ చివరికి ఈ మాట నక్క చెవిలో పడింది, అతి తెలివైన నక్క ఈ అవకాశాన్ని వాడుకోవాలని ఉపాయం పన్నింది.

ఇప్పుడు వారందరి ముందు ఉన్నవి రెండే రెండు మార్గాలు.

ఒకటి సింహరాజుకి బలి అవటం. రెండవది ఈ నక్కకు బలి కావడం. ఏదైనా కష్టం మాత్రం మిగిలిన జంతువులకే.

ఇలాంటి పరిస్థితుల్లో మార్కండేయం అనే కోతి మిగిలిన జంతువులన్నిటికీ ఒక ఉపాయం చెప్పింది.

అక్కడ హిరణ్యడు ( సింహం) పూటకే 10 మంది జంతువుల్ని బలి తీసుకుంటుంది. ఈ నక్క రెండు రోజులకు ఒక ప్రాణాన్ని మాత్రమే కోరుకుంటుంది. దీనిని మెల్లగా ఒప్పించి ఉపాయాన్ని తీసుకుంటే ఆ ఉపాయంతో మనం హిరణ్యుడి కోపాన్ని తగ్గించవచ్చు. అప్పుడు హిరణుయుడు కాస్త శాంతి పడితే మన అడవికి పూర్వపు స్థితికి వస్తుంది.

హిరణ్యుడే రాజు కనుక  మన సమస్యని మాట్లాడి పరిష్కరించుకోవచ్చు అని సలహా ఇచ్చింది. అన్ని జంతువులు నక్క షరత్కి ఒప్పుకున్నాయి.

ఇప్పుడు హిరణ్యుడు తన భార్యను కోల్పోయిన బాధలో తను ఏం చేస్తున్నాడో తెలియక ఇలా అయిపోయాడు. కనుక మళ్ళీ అతడికి పెళ్లి చేస్తే అతడు కుదురు పడతాడు అని చెప్పింది నక్క. అతడి ఎదురుగా నిలబడే ధైర్యమే లేదు ఎవరికి. అతడితో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎవరి పీక కొరుకుతాడో అనే భయంతో వణికిపోతున్నారు అందరూ ఇలాంటి పరిస్థితుల్లో అతనికి మళ్లీ పెళ్లి చేయటమా బుద్ధిలేని పని అంది జింక.

అది తప్ప మరో మార్గమే లేదు. అతడికి మళ్ళీ పెళ్లి చేస్తే తన భార్య ప్రేమలో అతడు మునిగిపోతాడు. అప్పుడు అతని కోపం తగ్గిపోతుంది అప్పుడు మనందరం ప్రశాంతంగా ఉండగలుగుతాం అంది నక్క.

కానీ హిరన్యుడికి తగిన జంట ఎక్కడి నుంచి తీసుకురాగలం. అతనికి ఎవరు నచ్చుతారు. ఇదో పెద్ద సమస్య అని అన్నాయి మిగిలిన జంతువులు.

"అనుకుంటే అన్నీ సమస్యలే. మన తూర్పు కొండల్లో పెద్ద అడవి ఉంది. అక్కడ సకీర్తి అని ఆ అడవికి రాజు ఉన్నాడు.అతడి కుమార్తె దమయంతి చాలా అందగత్తె. నేను అన్ని ప్రదేశాలను సంచరిస్తూ వస్తుండగా ఒకనాడు ఆమెను నేను చూశాను. ఆమె అందం చూశాక ఎవరు ఆమెను తిరస్కరించరు అని అన్నాడు. "

మనం దక్షిణాన ఉన్నాము. తూర్పు కొండల్లో ఆమె ఉంది ఇప్పుడు అంత దూరం ప్రయాణం చేసి ఆమెను ఒప్పించి మన అడవికి తీసుకొని వచ్చి మన రాజుని పెళ్ళికి ఒప్పించటం అనేది కల. అది ఎన్నటికీ జరగని పని. అయినా ఆమెకి ఏమిటి అవసరం? ఇంత దూరం వచ్చి ఈ రాజుని పెళ్లి ఎందుకు చేసుకుంటుంది అని జంతువులు అన్ని నిరాశ చెందాయి. కానీ మార్కండేయనికి ఒక ఉపాయం తట్టింది.

అన్ని జంతువులు ఆ షరత్కి ఒప్పుకోకపోయినా మార్కండేయ మాత్రం ఒప్పుకుంది. సరే నీవన్నట్లే చేద్దాం కానీ ఆమెను మన అడవికి తీసుకువచ్చే బాధ్యత మాత్రం నీదే అని షరత్ పెట్టాడు మార్కండేయుడు.

ఎందుకంటే ఆమెని మా అడవిలో ఎవరూ చూసిందే లేదు నీ ఒక్కరి దానివే దానిని చూశానని చెప్పావు. పైగా నువ్వే మా అందరి కన్నా తెలివైన దానివి. మా సమస్యను గట్టేక్కించడానికి ఇంత గొప్ప ఉపాయం చెప్పావు. కనుక నువ్వే వెళ్లి ఆమెను తీసుకొని వస్తే నీ షరత్కి మేము అంగీకరిస్తాం అని అంది.

తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలచినట్టు. ఈ హిరన్యుడి భారి నుంచి తప్పిస్తానని మభ్యపెట్టి అడవిలో జంతువులను వేటాడకుండా సులభంగా తినవచ్చు అని పథకం వేసిన నక్కకి చుక్కెదురయింది. కుదరదని చెప్పడానికి వీలు లేకుండా ఇరుక్కుంది. నక్క తెలివిని ప్రదర్శించబోయింది. నేను పిలిస్తే వస్తుందా పైగా మా జాతి అంటే కిట్టదు ఈ సింహజాతికి. అక్కడే నా పీక కొరికి చంపేస్తుంది. అని తప్పించుకోవడానికి ప్రయత్నించింది. మరి మేము వెళ్ళితే మాతో వస్తుందా? మమ్మల్ని పీక కొరికి చంపేస్తుంది. ఇక్కడ ఉంటే ఈ రాజుకి అక్కడికి పోతే ఆ రాణికి ఆహారంగా మారాల్సిందేగా మా బతుకులు అంది మార్కండేయం. నువ్వు చాలా తెలివైన దానివి కనుక మాటలతో మబి పట్టి నువ్వే తీసుకురాగలవు అని అంది. అందుకు అడవిలో జంతువులన్నీ అవును నువ్వే సరైన దానివి నువ్వే వెళ్ళాలని ఏకకంఠంతో తీర్మానించారు.

దిక్కులేని పరిస్థితులలో నక్క తూర్పు కనుములకు దమయంతిని తీసుకురావడం కొరకు ప్రయాణమైంది.

అలా నక్క పీడను తొలగించుకున్న జంతువులు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. ఇక రాజు సంగతి చూడాలి అని అనుకున్నాయి. మార్కండేయుడి తెలివికి అన్ని జంతువులు మెచ్చుకున్నాయి. గొప్ప ప్రమాదం నుంచి తమలని రక్షించినందుకు మార్కండేయుడునే తమ గురువుగా భావించి రాజు భారి నుంచి కూడా రక్షించాల్సిందిగా కోరాయి. మార్కండేయుడు ధైర్యం చేసుకొని రాజుగారు కాస్త స్థిమితంగా ఉన్న సమయం చూసుకొని మాట్లాడడానికి వెళ్లాడు.

"ఏంటి మార్కండేయ ఇలా వచ్చావు అని అడిగాడు హిరణ్యడు." 'ఏమి చెప్పమంటారు ప్రభు ఏమి చెప్పినా మీరు కోపగించుకుంటారనే భయంతో మాట పెదవి దాటడం లేదు అన్నాడు మార్కండేయుడు.

"దేనికోసం పరవాలేదు చెప్పు అన్నాడు హిరణ్యడు"

'చెప్పిన తర్వాత మీరు కోపగించుకోకూడదు అని మాట ఇస్తేనే నేను చెప్తాను అని మాట తీసుకున్నాడు మార్కండేయడు.'

"సరే అలాగే నిన్ను ఏమి చెయ్యను అని మాట ఇచ్చాడు హిరణ్యడు. "

"ఏమి చెప్పమంటారు ప్రభు తల్లి లేని బిడ్డలు అనాథలే కదా! మా రాణి కౌస్తభం పోయినప్పటి నుంచి తల్లి లేని బిడ్డలమయ్యాము. తల్లిగాని ఉంటే పిల్లల ఆలనా పాలనా చూసుకుంటాది. తండ్రికి కోపం వచ్చినా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తుంది. "

మీతో మాట్లాడే ధైర్యం మాకు ఎవరికీ లేదు. మీరేమో రాణిని తలుచుకొని పిచ్చివారైపోయారు. అందుకనే అంటూ నాన్చింది.

"చెప్పు మార్కండేయ ఏమి చెప్పు దలుచుకున్నావు అన్నాడు హిరణ్యడు."

ఏమీ లేదు ప్రభు! మీకు మళ్లీ పెళ్లి చేస్తే బాగుంటుందని, మీకు ఒక తోడు మాకు ఒక తల్లి దొరుకుతుందని అడవిలో జంతువులన్నీ అనుకుంటున్నాయి.

ఒంటరితనంతో బాధపడుతున్న హిరణ్యడికి ఆ మాటలు ఓదార్పునిచ్చాయి. జంతువులన్నిటికీ తాను హాని చేస్తున్న తన సుఖాన్ని కోరుకుంటున్నా వాటి మీద దయ కలిగింది.

రాజు ఆలోచనలో పడటం చూసిన మార్కండేయుడు దమయంతి వివరాలను చెప్పి రాజు గారి మనసుని మార్చే ప్రయత్నం చేశాడు. తన అందాన్ని వివరిస్తూ పొగడటం మొదలుపెట్టాడు. మీది దమయంతిది చూడముచ్చటి జంట.. మీ తర్వాత మన అడవిని పాలించదగ్గ సమర్ధురాలు.అని ఆకాశానికి ఎత్తేశాడు.ఇక అది విన్న హిరణ్యడు దమయంతిని ఎలాగైనా పెళ్లాడాలని నిశ్చయించుకున్నాడు.

ఇక ఆలస్యం చేయకూడదని దమయంతిని వివాహం చేసుకొని తన వెంట తీసుకువస్తానని తూర్పు కొండలకు పయనమయ్యాడు. అలా మార్కండేయుడు తన తెలివితో అటు నక్క నుంచి ఇటు హిరణ్యడి నుంచి అడవి ప్రాణులను కాపాడాడు.హిరణ్యుడి భారి నుంచి అడవి జంతువులను రక్షించాడని సంబరాలు చేసుకుంటున్నయి.


- జ్యోతి మువ్వల 


Rate this content
Log in