Jyothi Muvvala

Tragedy Inspirational Others

4.3  

Jyothi Muvvala

Tragedy Inspirational Others

మట్టి మనిషి జీవిత వాస్తవాలు!

మట్టి మనిషి జీవిత వాస్తవాలు!

5 mins
541


తెలవారుఝామున ఆ సూర్యుని కిరణాలు అప్పుడే నేలను తాకినంతనే భూమి పరవశించి నట్టుగా, విరబూసిన ఆ పువ్వుల అందం, మరోపక్క పచ్చని చేలు పచ్చటి తివాచీ పరచినట్లుగా కనుచూపుమేరలో కనిపిస్తుంటే, పచ్చని తోరణాలు కట్టినట్టుగా చెట్టులు నాట్యం చేస్తూ ఉంటే ఆ స్వచ్ఛమైన ఆ గాలికి తనువంతా పులకరిస్తు, మనసులో ఏదో తెలియని ఆనందం కళ్ళకి ఆహ్లాదం...." అబ్బా ఏముంది రా! మీ ఊరు" అన్నాడు రవి.

"ఏంట్రా నువ్వు కూడా కవి అయిపోయావు మా ఊరు గాలి తగలగానే అన్నాడు శేఖర్".

"ఏ మాట కా మాట చెప్పుకోవాలి గానీ ఈ పల్లెటూరిలో స్వచ్ఛమైన గాలి మన పట్టణాల్లో దొరకదురా" 

"నువ్వు ఏదైనా చెప్పు ఇక్కడున్న ఆనందమే వేరు నువ్వు లక్కీ రా అన్నాడు రవి."

"ఈ అమాయకపు మనుషుల మనసుల్లో ప్రేమాభిమానాలు, ఆత్మీయతలు తప్ప కుళ్లు కుతంత్రాలు కల్మషాలు తెలియదు."

" దారిపొడుగునా వస్తుంటే నిన్ను అందరూ ఎప్పుడొచ్చావ్ శేఖర్? బాగున్నావా? అని అందరూ అడుగుతుంటే వాళ్ల ప్రేమని చూసి నాకు భలే ముచ్చట అనిపించింది రా అన్నాడు రవి."

"అవున్రా మా ఊరులో అందరూ ఒకటే కుటుంబంగా కలిసిమెలిసి ఉంటారు. ఏమైనా పండగలు పబ్బాలు కలిసి జరుపుకుంటారు. మా ఊరి రాములోరి కళ్యాణం అయితే చాలా ఘనంగా చేస్తారు. నిజంగా పక్కఊర్లో వాళ్లు కూడా మా ఊరు తిరణాలకి రావాల్సిందే. అంత బాగా జరిపిస్తారు అని చెప్పాడు శేఖర్."

అంతలో ఆ ఊరి ప్రెసిడెంట్ ఎదురుగా నడుచుకొని వస్తున్నాడు. అతడిని చూసిన శేఖరు" నమస్తే బాబాయ్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అని పలకరించాడు".

"ఎవరు? బాబు గుర్తు పట్టలేదు ? అన్నాడు ప్రెసిడెంట్ రాఘవయ్య."

"నేను బాబాయ్ శేఖర్ని, కృష్ణ కొడుకుని అన్నాడు"

ఓరి.. ఓరి.. శేఖరు నువ్వువాటారా! ఎంత పెద్దవాడివైపోయావు.

"మీ నాన్న నువ్వు పట్టణంలో చదువుకుంటున్నావని అని చెప్పాడు... చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడడం కదా! గుర్తు పట్టలేక పోయాను, ఎలా ఉన్నావు" అన్నాడు రాఘవయ్య. 

"పర్లేదు బాబాయ్ నేను బానే ఉన్నాను అని చెప్పాడు శేఖర్." "ఎంటి ఇట్టా వచ్చావు? మన ఊరు గాలి మళ్ళిందా ఏంటి" అని అడిగాడు రాఘవయ్య.

"లేదు బాబాయ్...మా కాలేజీలో ప్రాజెక్ట్ వర్క్ ఉంటే చేయడానికి వచ్చాను బాబాయ్! మన ఊరు అయితే బాగుంటుంది కదా! రైతులు, రైతు కూలీలా కష్టాలు మీద డాక్యుమెంటరీ మూవీ తీర్థమని అనుకుంటున్నాను అని చెప్పాడు శేఖర్."

"ఓ అలాగా మంచిదే, తీయండి బాబు, మా రైతుల భాధలు, ఏ గవర్నమెంట్కి పట్టదు. కనీసం జనాలకు అయిన తెలిస్తే , ఏదైనా మంచి జరుగుతుంది. మంచి పని చేస్తున్నావ్" శభాష్" అని మెచ్చుకున్నాడు".

"థాంక్యూ బాబాయ్ నాకు మీ సహాయం కావాలి అన్నాడు శేఖర్.""ఓ అలాగే నీకు ఏ సాయం కావాలన్నా నా దగ్గరకు రా! నేను చేసి పెడతాను అని మాట ఇచ్చాడు రాఘవయ్య."

మరుసటి రోజు నుంచి శేఖరు, రవి రైతులని కలిసి వారి లోటుపాట్లు తెలుసుకోవడం మొదలుపెట్టారు.

అక్కడ దగ్గరలో ఒక పొలంలో ఒక పూరిగుడిసె కనిపించింది. రవి అటువైపుగా వెళ్ళాడు. ఆ గుడిసైలో ఒక వృద్ధురాలు ఒక చిన్న పాపా ఉన్నారు. పొలం అంతా బీడువారి పోయి ఉంది. కొంచెం స్థలంలో మాత్రం  మొక్కజొన్న మొక్కలు నాటి ఉన్నాయి.

"రవి ! ఆ బామ్మ దగ్గరికి వెళ్లి, బామ్మ !ఎవరూ లేరా ఇంట్లో? అని అడిగాడు. ఆ మాటలు విన్న ఆ బామ్మ మంచం మీద నుంచి నెమ్మదిగా లేచి ఎవరు బాబు నువ్వు అని అడిగింది."

"బామ్మ! నేను ఈ ఊర్లో రైతులు కోసం తెలుసుకోవడానికి వచ్చాను. అందుకే మీకు ఏమైనా కష్టాలు, బాధలు ఉంటే మాకు చెప్పండి అని అన్నాడు రవి."

"మా కష్టాలు తీర్చడానికి వచ్చావా బాబు! అని అడిగింది బామ్మ.....అయ్యో బామ్మ! నేను మీ కష్టాలు తీర్చలేను గాని నేను ఒక సినిమా తీస్తున్నాను. ఆ సినిమాలో మన రైతుల బాధలు అన్నీ ప్రభుత్వానికి, నాయకులకు తెలిసేలా చేస్తే రేపొద్దున మీకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా సాయం వస్తుందని మా చిన్న ప్రయత్నం అన్నాడు రవి.""సర్లే గాని నీకు ఎంతమంది పిల్లలు అని అడిగాడు."

అంతలో శేఖరు "ఒరేయ్ ఇలాగేనా అడిగేది? పక్కకు తప్పుకో అని రవిని పక్కకి పిలిచి, బామ్మ దగ్గరికి వెళ్ళాడు శేఖర్."

"బామ్మ నేను రంగం అమ్మ తల్లి మనవడు శేఖర్ని. కృష్ణ కొడుకుని అని చెప్పాడు.బాబు నువ్వు రంగం అమ్మతల్లి మనవడువా? ఎట్లా ఉన్నావ్ బాబు? బాగున్నావా అని అడిగింది బామ్మ."

"అదేంట్రా మీ ఇంటి పేరు రంగమా! కాదు కదా అన్నాడు రవి. మా తాతని అందరూ రంగం అమ్మతల్లి అని పిలిచేవారురా అని చెప్పాడు శేఖర్."అది ఏంట్రా అలా ఎందుకు పిలిచేవారు అని అడిగాడు ఆశ్చర్యంగా రవి.

"అప్పట్లో మాకు పెద్దగా పొలాలు ఏమీ లేవు పండించుకోవడానికి భూమి లేక రోజు కూలీకి మా తాత వాళ్ళు పని చేసేవాళ్ళు. పొలాలు దున్నిన సరిగ్గా పండక, వర్షాలు పడక , నానా కష్టాలు పడుతూ ఉండేవాళ్ళంట. పొలాలు పండకపోతే ఇక రోజు కూలీలకి, కూలి పనులు ఎలా ఉంటాయి? వర్షం పడితేనే పొలం పండేది. పొలం పండితేనే కోతలు, ఉడుపులు ఉండేది.

ఆ క్రమంలోనే మా తాతగారు ఊరు వదిలి వెళ్ళిపోయారు. కూలి పనుల కోసం మన విశాఖపట్నం పోర్ట్ నుంచి కొన్ని వేల మందిని రంగూన్ తీసుకుని వెళ్లేవారు. అలానే మా తాతగారు కూడా వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్లి పని చేసుకుని డబ్బులు సంపాదించుకొని తిరిగి మళ్లీ ఊరు వచ్చి ఆ డబ్బులతో పొలం కొన్నారు. అందుకే మా తాత గారికి రంగం అమ్మ తల్లి అని పేరు వచ్చింది. అని చెప్పాడు శేఖర్.


"ఓ సూపర్ ఇంత స్టోరీ ఉందా! మీ తాతగారికి జీవితంలో అని అన్నాడు రవి."

అప్పుడు ఆ బామ్మ అవును బాబు మా ఊరి నుంచి చాలా మంది ఆ రంగం వెళ్లిపోయారు. అక్కడికి వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించుకొని పాడి పంట కొన్నారు.కానీ ఏం లాభం చెప్పు? వర్షాలు పడవు నదులు ఎండిపోయాయి, కాలువలోకి నీరు రావటం లేదు. పొలం ఉన్న వాళ్ళకి అదే బాధలు లేని వాళ్ళకి అదే బాధలు అని చెప్పుకొచ్చింది బామ్మ.

"మరి నీకు కొడుకు, కూతుర్లు ఎవరూ లేరా బామ్మ? అని అడిగాడు శేఖర్."

"నాకు ఒక కొడుకు బాబు... ఆడు కూడా ఎనిమిదేళ్ల కిందట మట్టిలో కలిసి పోయాడు. వాడికి ఒక్కే కూతురు అదే నా మనవరాలు చిన్న పిల్ల, నేను అది ఈ గుడేసేలో బతుకుతున్నాం అని చెప్పింది.

"నీ ఇంటి ముందున్న ఈ పొలం అంతా ఎవరిది అని అడిగాడు శేఖర్. నాదే బాబు అని సమాధానం ఇచ్చింది ఆవిడ."మరి ఇంత పొలం పెట్టుకొని నువ్వు ఎందుకు ఇలాంటి గుడిసెలో ఉంటున్నావ్ ?అని అడిగాడు రవి."

ఏం చెప్పమంటావు బాబు కాలం కలిసి రాక అయిన వాళ్లే... కోడి నాగులై కటేసారు. నా కొడుక బతుకుని బుగ్గిపాలు చేశారు. అని చెప్పింది.

"ఏమైంది బామ్మ !అని అడిగాడు శేఖర్. నాకు మా ఆయన వాట కింద రెండు ఎకరాల పొలం వచ్చింది బాబు. కానీ ఆ రోజుల్లో ఇంటి పెద్దోడు పేరు మీద పొలం రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు. అలా మా మామ పేరు మీద ఉంది పొలం అంతా, మా మామ చనిపోయిన తర్వాత మేము ఆస్తులు పంచుకోలేదు. ఎక్కడికి పోతాయి అంటూ వచ్చాడు నా పెనిమిటి. ఆ తర్వాత కాలంతో పాటు ఆయన పోయాడు. నా బిడ్డకి పెద్దగా చదువు సంధ్య లేదు బాబు ....

మా బావ మనవళ్ళు్ పెద్ద అయ్యారు. బాగా చదువుకున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చాయి. పట్నం వెళ్లి పోయారు. తెలివితేటలు బాగా నేర్చుకున్నారు. ఒక రోజు వచ్చి మన పొలం కాగితాలు ఇవ్వండి చూస్తాను అంటే తేలిక ఇచ్చాడు నా కొడుకు, ఆ పొలం అంతా తాత పేరు మీద ఉంది. అని తెలుసుకున్నారు. కానీ ఆ రోజుల్లో నా పెనిమిటినీ మా చిన్న మావగారికి పిల్లలు లేక దత్తత ఇచ్చారంట.

ఆ సంగతి మాకు తెలీదు ఎందుకంటే అందరు కలిసి ఉండే వాళ్ళు, అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు. వాళ్లు పెద్దయ్యాక బాగా చదువుకున్నారు ఎవరి ఇళ్ళులు వారివి అయిపోయినాయి. చదువుకున్నవాళ్లు కదా బాబు లాయర్ దగ్గరికి తీసుకెళ్లి మాట్లాడారు. ఆ భూమ్మీద మాకు హక్కు లేదని కోర్టులో కేసు వేశారు.


కోర్టు భూమి ఎవరి పేరు మీద ఉంటే వాలే వారసులని తీర్పిచ్చింది. కింద కోర్టులో ఓడిపోయాము.

ఆ లాయరు ఖర్చులకి నా కొడుకు ఇల్లు వాకిలి అన్ని అమ్మి మదపు పెట్టాడు.

అయినా కేసు గెలవలేదు. ఆధారాలేవీ లేక నోటు కట్టలకే విలువిచ్చే ఈ రోజుల్లో పెద్దల మాటలకు కట్టుబడి ఉండే వాళ్ళు ఎవరు?

న్యాయం జరిపించాలంటూ నా కొడుకు హైకోర్టులో కేసు వేశాడు అందుకే కోర్టు కేసు తేలేంతవరకూ ఈ పొలాన్ని ఎవరు దున్నుకో టానికి వీల్లేదని ఆర్డర్ పాస్ చేసింది.

పైగా సంవత్సరానికి పాతిక వేలు కోర్టుకి కట్టాలనే చెప్పింది.

పనులు చేసుకుంటూ బతికే మేము సంవత్సరానికి పాతిక వేలు ఎక్కడ కట్టగలం బాబు. అలా అయిదు ఏళ్ళు నా కొడుకు పోరాడి పోరాడి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. 

ఆ తర్వాత నా కోడలు పురిటిలో చంటి బిడ్డను నా చేతిలో పెట్టి చనిపోయింది.  పనులు చేసి ఇన్నాళ్లు పోషించాను. ఇప్పుడు నాకు వయసు అయిపోయింది నిలబడలేను, నా మనవరాలు పనికి కెళ్ళి దాని వయసుకి రోజుకు 100  తెస్తుంది. ఆ డబ్బుతోనే మా కడుపు నింపుకుంటున్నము. అని చెప్పింది.

ఆ మాటలు విన్న శేఖర్, రవి చాలా బాధపడ్డారు. ఆ బామ్మ కష్టాలు విని కన్నీరు పెట్టుకున్నారు.

నేను ఉన్నన్ని రోజులు నా మనవరాలుకి తోడుగా ఉంటాను. నేను పోతే దాని బతుకు ఏమౌతుందో అని కన్నీరు పెట్టుకుంది.

ఆ మాటలు విన్న శేఖర్ మనసు చలించిపోయింది. ఇలాంటి రైతుల బాధలు ఎన్నో ఇంకెన్నో ఉన్నాయి. పొలం ఉన్న పండించుకో లేక కొందరు పండించుకునే శక్తి ఉన్న పొలం లేక మరికొందరు వలస కూలీలుగా మారిపోతున్నారు. ఉన్న ఊరిని అయిన వారిని వదులుకొని దూరంగా పొట్టకూటి కోసం ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు.

అందుకే శేఖర్ ఈ రైతుల కష్టాలను ఒక డాక్యుమెంటరీగా చిత్రీకరించాడు. అది జనంలో మంచి ఆదరాభిమానాలు కల్పించింది. ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. రైతులకు ఎన్నో పథకాలను అమలు చేశారు.


కానీ అన్ని పథకాలను రైతులకు ప్రభుత్వం ఇస్తున్న అవి ఎంత మంది రైతులకు చేరుతున్నాయి అన్నది ఇప్పటికీ ప్రశ్నార్ధకమే. మారాల్సింది ప్రభుత్వ విధానం. చదువు లేని ఆ బీద రైతులకు ప్రభుత్వం పథకాలు సవ్యంగా అందటం లేదు ఎప్పుడో తాతముత్తాతల పేర్ల మీద ఆస్తులు ఉండటంవల్ల వాటిని వారి పేరుమీద మార్చుకోవడానికి చనిపోయారని ధ్రువ పత్రాలు కావాలని, ఇంకా ఏవో డాక్యుమెంట్స్ కావాలని, లంచాలు తీసుకుంటూ కాళ్లు అరిగేలా తిప్పే స్తున్నారు .

చదువుకున్న వాళ్లు తెలిసిన వాళ్ళు తిరిగి తమ పనులు చేసుకొని తమ ఆస్తిని నిలబెట్టుకున్నారు. చదువు లేని అమాయకులు ఇలాంటి పనులు చేసుకోలేక రోజు కూలీకి వలస వెళ్లి జీవితాన్ని గడుపుతున్నారు.


జ్యోతి మువ్వల.



Rate this content
Log in

Similar telugu story from Tragedy