Jyothi Muvvala

Horror Tragedy Thriller

3.2  

Jyothi Muvvala

Horror Tragedy Thriller

ఆ ఇంట్లో...

ఆ ఇంట్లో...

11 mins
388



ప్రతాప్ శృతిలు కొత్తగా ఇల్లు కొనుక్కున్నారు. ఎంతో అందంగా కట్టుకున్న ఇల్లు గృహప్రవేశం చేసుకొని సంతోషంగా కొత్త ఇంట్లో కాపురం పెట్టారు.

వచ్చిన కొన్నాళ్లకే అర్ధరాత్రి పూట ఏదో తెలియని చప్పులు, ఎవరో వెనక నుండి వచ్చినట్టు, ఉన్నట్టుండి కరెంటు పోవడం ఇలా జరుగుతూ ఉండేది.

రోజు బాబు 12 అయితే ఒకటే ఏడుపు.

కానీ ఇవేవీ పట్టించుకునే వాడు కాదు ప్రతాప్.


ఒకే గదిలో ప్రతాప్ శృతి ఉన్నా కూడా కరెంటు పోయినప్పుడు శృతి భయపడి ప్రతాప్ని పిలిచిన ప్రతాప్ పలికేవాడు కాదు.

కరెంటు వచ్చాక "నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు పలకలేదు అని అడిగితే నువ్వు ఎప్పుడు పిలిచావు అనేవాడు."


మొదట్లో శృతి ఇంటిలో ఒంటరిగా ఉండేందుకు చాలా భయపడేది.


ఒకరోజు ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవో అవసరమై కాల్ చేసి ప్రతాప్ చూడమన్నాడు. శృతి ఇల్లంతా వెదికింది. అయినా కనపడలేదు.ఇల్లు మారినప్పుడు కొన్ని పాత సామాన్లు అవసరమైన ఫైల్స్ బ్యాగ్ లో పెట్టినట్టు గుర్తొచ్చి సన్ సైడ్ కబోర్డ్ మీద పెట్టిన పాత బ్యాగ్ని దింపి చూసింది.


ఆరోజు శృతికి ఒక బ్యాగులో గుప్పెడు తాయెత్తులు కనిపించాయి.


 ప్రతాప్ ఇలాంటివి నమ్మడు శృతి పెట్టలేదు మరి ఇంట్లోకి ఇవి ఎలా వచ్చాయి అని భయపడి పోయింది శృతి.

 వెంటనే భర్తకు ఫోన్ చేసి చెప్పింది.

శృతి ఎంత చెప్తున్నా... వినకుండా పారేసే శృతి, పతి దాని భూతద్దంలో పెట్టి చూస్తావు దానిలో ఏముంది ?బై మిస్టేక్ ఎక్కడో కలిసిందేమో అన్నాడు ప్రతాప్ .


కానీ శృతి ఆ విషయం అంత తేలిగ్గా తీసుకోలేక పోయింది.

అది కొత్త ఇల్లు. ఆ ఇంట్లోకి ఎవరు వచ్చే అవకాశం లేదు.

"తనకు తెలియకుండా సన్ సైడ్ మీద ఉన్న బ్యాగులో ఎవరు పెడతారు అని భర్తని రెట్టించి అడిగింది."


"అంటే నేనే పెట్టానా అంటూ గొడవపడ్డాడు ప్రతాప్."


అలా వారి ఇరువురి మధ్య గొడవలు మొదలయ్యాయి.


ప్రతాప్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత బాబుని చూసుకుంటూ శృతి ఇంట్లో ఒంటరిగా ఉండేది.

తను వంట గదిలో ఉన్నప్పుడు హాల్లో టీవీ ఉన్నట్టుండగా ఆన్ అయిపోయేది.


శృతి వెళ్లి ఆఫ్ చేసినా... మళ్లీ ఆన్ అయిపోయేది.


మధ్యాహ్నం పూట బాబుని పడుకోబెడదామని రూమ్కి వెళితే

బయటి నుంచి రూమ్ లాక్ అయిపోయేది.

శృతి ఎంత గట్టిగా అరిచి హెల్ప్ హెల్ప్ అని కేకలు వేసిన డోర్ వచ్చేది కాదు. ఉన్నట్టుండి కాసేపు పోయాక ఓపెన్ అయిపోయేది.


 ఒక్కొక్కసారి బాత్రూం కి వెళ్ళినప్పుడు కూడా బాత్రూం డోర్ లాక్ అయిపోయేది.

 బయట బాబు గుక్క పెట్టి ఏడ్చేవాడు. తలుపు తీయాలని ఎంత ప్రయత్నించినా తలుపు వచ్చేది కాదు.


ఇవన్నీ ప్రతాప్కి చెప్తే ప్రతాప్ నమ్మేవాడు కాదు.

కొత్త ప్రదేశం కొత్త ఇల్లు అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది ఇదంతా నీ ఫీలింగ్ అని కొట్టి పడేసేవాడు.

  

అలా ఒకరోజు ఉన్నట్టుండి శృతి వంట గదిలో కళ్ళు తిరిగి పడిపోయింది. హలో టీవీ చూస్తున్న ప్రతాప్ , "శృతి భోజనం చేసేద్దాం అన్నం పెట్టే "అన్నాడు. అని చాలా సేపైనా ఉలుకు పలుకు లేదు.


 హలో ఆడుకుంటున్న బాబు ఒక్కసారిగా ఏడవటం మొదలు పెట్టాడు. బాబు ఏడుపు విని కూడా శృతి రాకపోవడంతో వంటగదిలోకి వెళ్లి చూశాడు ప్రతాప్.

 

 వంట గదిలో కింద పడి ఉన్న శృతిని చూసి ఏం చేయాలో అర్థం కాక కంగారు పడిపోయాడు. అమాంతం శృతిని ఎత్తుకొని బెడ్ రూమ్లో మంచం మీద పడుకోపెట్టాడు.

ముఖం మీద కాసిన్ని నీళ్లు చిలకరించి "శ్రుతి శృతి అని పిలిచాడు "

అయినా శృతిలో చలనం కనిపించలేదు. అప్పటికే గుక్క పట్టి ఏడుస్తున్న బాబుని దగ్గర తీసుకొని సముదాయించాడు.

అయినా పిల్లవాడు ఏడుపు ఆపలేదు.

ఏమి చేయాలో తోచని స్థితిలో గాబరాగా పక్కింటి తలుపు తట్టాడు.

పక్కింట్లో ఉంటున్న రాదా తలుపు తీసి "ఏమయింది అన్నయ్య అని అడిగింది."

శృతి పరిస్థితి చెప్పాడు ప్రతాప్. వెంటనే కంగారుపడి తన భర్తను పిలిచింది. ఇద్దరు వెళ్లి శృతిని చూశారు. చాలా విధాలుగా లేపడానికి ప్రయత్నించారు. కానీ శృతిలో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో 

"సరే నేను బాబును చూసుకుంటాను మీరు కార్లో శృతిని హాస్పిటల్కి తీసుకు వెళ్ళండి అని చెప్పింది."


ప్రతాప్, సురేష్ సహాయంతో శృతిని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు.

వెళ్లిన వెంటనే శృతి పరిస్థితి చూసి ఎమర్జెన్సీ వారిలో అడ్మిట్ చేశారు అక్కడ ఉన్న డాక్టర్.

 తన తల్లిదండ్రులకు, అత్తమామలకు ఫోన్ చేసి విషయాన్ని తెలియజేశాడు.

 శృతిని పరిశీలించిన డాక్టర్కి ఏమీ అర్థం కావడం లేదు. తన శరీరంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. మరి ఎందుకు తను మెలకువలోకి రావటం లేదో అర్దం కాలేదు.

ఇక్కడ శృతి పరిస్థితి ఇలా ఉంటే...

అక్కడ బాబు అసలు ఏడుపే ఆపలేదు.

నయానో భయానో ఆడిపించి కాసంత నిద్రపుచ్చిన ఉన్నట్టు ఉండి ఉలిక్కిపడి లేచి ఏదో చూసి భయపడినట్టు ఏడుస్తున్నాడు. అదే మాట ప్రతాప్ కి ఫోన్ చేసి చెప్పింది రాదా.


ఇంటిలో సడన్గా ఏర్పడిన ఈ ఉపద్రవం ఏంటో అర్థం కాలేదు ప్రతాప్కి. సురేష్, రాధా ప్రతాప్ పరిస్థితికి జాలి పడుతున్నారు.


శృతి అమ్మానాన్న వెంటనే బయలుదేరి వచ్చారు.

ఎన్ని మందులు వాడుతున్నా శృతి పరిస్థితిలో ఫలితం కనపడలేదు .


ఇక ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆమె కోమాలోకి వెళ్లిపోయి ప్రాణాలు కోల్పోతుందని డాక్టర్లు తేల్చి చెప్పేశారు.


 అలా చూస్తుండగా 15 రోజులు గడిచిపోయాయి.

 ఆరోజు కూడా బాబు అర్ధరాత్రి కింక మొదలుపెట్టాడు.

 శృతి అమ్మకు ఎందుకో అనుమానం వచ్చింది. గాలి ధూళి గాని సోకిందా? ఏంటి? ఎందుకు ఇలా పిల్లాడు ఉన్నఫలంగా ఏడుస్తున్నాడు అని అనుకోని అదే మాట తన భర్తతో చెప్పింది.

అందుకు తన భర్త జగదీష్ కూడా అవునన్నట్టే సమాధానం ఇచ్చాడు. 


ఒకసారి పూజారి గారిని కలిసి వస్తే బాగుంటుందండి. అన్ని సమస్యలు డాక్టర్ మందులతోనే నయమైపోవు కదా? ఇదేదో కొంచెం తాంత్రిక యవ్వారం లాగే ఉంది. ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి నాకు మనసు ఎందుకు ఆందోళనగా ఉంటుంది. ఏదో జరుగుతుందన్న భయం. పిల్లాడు ఉన్నట్టుండి  ఏడవటం. శృతి అలా మంచాన పట్టడం. ఏదో తెలియని భయమేస్తుందండి. ఈ సమస్యకు ఓ పరిష్కారం పూజారి గారిని అడగాలి అని చెప్పింది అన్నపూర్ణ.


అందుకు జగదీష్ నిజమే ఒకసారి వెళదాం అన్నాడు.

ఆ మాటలు విన్న ప్రతాపు "ఏంటి అత్తయ్య చాదస్తంగా మాట్లాడుతున్నారు. మీ బుద్ధులే శృతికి వచ్చినట్లు ఉన్నాయి. తను అంతే ఇంట్లో ఏదో ఉంది దయ్యం ఉంది, అని నా ప్రాణాలు తోడేసేది. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతారా?

పిచ్చి ఆలోచనలు పెట్టుకొని మీ మనసు పాడు చేసుకోకండి అనవసరంగా లేనిపోని భయాలకు పోయి మీరు వాళ్ళని ఆశ్రయిస్తే... ఇదే అదునుగా డబ్బులు గుంచడమే ఈ మాంత్రికులు తాంత్రికలు పూజలు చేసేవారి పని" అని కొట్టి పడేశాడు.


"అది కాదు బాబు అని ఏదో చెబుతుండగా అన్నపూర్ణని మాట్లాడనివ్వలేదు" ప్రతాప్.


రోజురోజుకీ బాబు పరిస్థితి కూడా క్షీణించిపోతూ వచ్చింది. భోజనం చేయడం కూడా మానేశాడు. రోజంతా ఏడుస్తూనే ఉంటున్నాడు.


అంతలో ఆ వీధి వెంట వెళ్లిన చిలక జ్యోతిష్యుడు ఒకడు మంచినీళ్లు కోసమని తలుపు తట్టాడు.

బాబుని ఎత్తుకొని తలుపు తీసింది అన్నపూర్ణ.

"కాసిన్ని మంచినీళ్లు ఉంటే ఇస్తారా అమ్మ అని అడిగాడు అతడు."


అప్పటికే ఏడుస్తున్న బాబుని సముదాయిస్తూ వంటగదిలోకి వెళ్లి మంచి నీళ్లు తీసుకుని వచ్చి ఇచ్చింది అన్నపూర్ణ.

"ఏమయిందమ్మా బాబు ఇలా కింకా పెడుతున్నాడు అని అడిగాడు" అతడు.

"అదే తెలియటం లేదు బాబు మా ఇంటి పరిస్థితిలే బాలేవు"

నా కూతురు హాస్పిటల్లో కన్ను తెరవని పరిస్థితుల్లో ఉంది ఈ పిల్లాడు తల్లి మీద బెంగ పెట్టుకున్నాడో ఏటో ఏడిపే ఆపటం లేదు. తినటం మానేశాడు అని తన గోడు చెప్పుకుంది.


"చిన్నపిల్లలకి ఈ వయసులో బాలారిష్టాలని ఉంటాయి అమ్మ. ఒక్కసారి జ్యోతిష్యం చూపించుకోండి. నేను చూసి చెప్తాను అలాంటివి ఏమైనా ఉంటే వాటికి విరుగుడు మందులు కూడా నా దగ్గర ఉన్నాయి" అని చెప్పాడు.


డబ్బులు కోసం ఏదో చెబుతున్నాడులే అని అన్నపూర్ణ "వద్దులే బాబు మరొకసారి చూద్దాం" అని తలుపు వెయ్యబోయింది.

అమ్మ నాకు ఒక్క రూపాయి కూడా వద్దు తల్లి .నా దాహాన్ని తీర్చావు. నీ పిల్లాడిని చూసి నా మనసులో జాలి కలిగింది. నేను ఉచితంగానే చెబుతాను అన్నాడు.


"అయ్యో బాబు నీ కష్టం నాకెందుకు? ఇప్పుడు చూపించుకునే ఉద్దేశం లేదు అని చెప్పింది అన్నపూర్ణ."

"ఏమవుతుందమ్మా అయితే సమస్య ఉంటే తెలుస్తుంది. లేకుంటే లేదు నేనేమీ భయపించి డబ్బులు తీసుకునే రకం కాదమ్మా అన్నాడు ఆ కొండదొర"


ఇక అతని మాటలను నమ్మిన అన్నపూర్ణ ఒకసారి చూపించకుంటే ఏమవుతుందిలే అని బాబు పేరు మీద చూపించింది.


చిలక బాబు పేరు మీద ఒక కార్డు తీసింది.

అది చూసి చిలక జోస్యుడి కళ్ళు ఎరుపెక్కాయి.

అతని మొఖ కవళికలు మారిపోయాయి.


అది చూసి అన్నపూర్ణ భయపడింది." ఏమైంది బాబు? ఏమొచ్చింది? ఎందుకలా అయిపోయావు" అని అడిగింది.


అమ్మ బాబుకి బాలరిష్ట దోషాలు లేవు. బాబుకి ఎవరో క్షుద్ర పూజ చేయించారు. బాబుకే కాదు ఈ ఇంటికి ఆ ఇంటి ఇల్లాలికి ఆపద ముంచుకొస్తుంది అని చెప్పాడు.


అది విని అన్నపూర్ణ భయభ్రాంతులకు లోనయింది. ఏం చెప్తున్నావు బాబు? నాకేం అర్థం కావడం లేదు. మా పాపకి బాబుకి ప్రమాదమా అని ఆశ్చర్యంగా మళ్ళీ అడిగింది.


అవును తల్లి ఈ ఇంటి ఆడబిడ్డకి ఈ పసి పిల్లాడికి కలిపి ఎవరో క్షుద్ర పూజ చేయించారు. వాళ్ళ ప్రాణాలకే అపాయం ఉంది. నువ్వు వెంటనే ఎవరైనా పెద్ద మాంత్రికుడిని లేక పూజారినో కలిసి త్వరగా దీనికి విరుగుడు చేయించుకో తల్లి. లేకపోతే తల్లి పిల్ల ప్రాణాలకే ప్రమాదం అని చెప్పాడు.


అమ్మ నాకు తెలిసినా ఒక అఘోర ఉన్నాడు. అతని దగ్గరికి తీసుకు వెళ్తాను మీ సమస్యకు పరిష్కారం చెప్తాడు. అని చెప్పాడు కొండదొర.


కానీ అప్పటికే ఆ మాటలు విన్న అన్నపూర్ణ భయపడి ఇంట్లో కనుక్కొని చెప్తాను బాబు నీ ఫోన్ నెంబరు ఇవ్వు అని చెప్పి పంపించేసింది.అది విన్న అన్నపూర్ణ తట్టుకోలేకపోయింది.


అతను చెప్పిన మాటలు నిజమా అబద్దమా తేల్చుకోలేని పరిస్థితి.అందుకే ప్రతాప్ కి తెలియకుండా బాబుని జగదీష్ దగ్గర పెట్టి, పక్కింటి రాదని తీసుకొని పూజారి దగ్గరికి వెళ్ళింది.


జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్లు పూజారికి వివరించింది అన్నపూర్ణ.

పూజారి గారు పూజలకు ఏర్పాటు చేసి అమ్మవారికి పూజ చేసి అంజం వేశాడు.

సమస్య ఉందని చెప్పారు పూజారి గారు.


మీ అల్లుడిని తీసుకు రమ్మని తనతో కొన్ని విషయాలు మాట్లాడాలని అన్నారు.


కానీ ప్రతాప్ ఇలాంటివన్నీ మూఢనమ్మకాలని కొట్టి పడేస్తాడు. మాట్లాడితేనే ఒప్పుకోడు అలాంటిది పూజారి దగ్గరికి రమ్మంటే వస్తాడా? ఎలా ప్రతాప్ ని తీసుకురావాలో అర్థం కాలేదు అన్నపూర్ణకు 

విషయం తన భర్తకు చెప్పి బాధపడింది. అక్కడ హాస్పిటల్లో శృతి పరిస్థితి రోజురోజుకీ దిగజారి పోవడంతో తట్టుకోలేని అన్నపూర్ణ అల్లుడుతో గొడవ పడింది.


"నువ్వే కావాలని నా కూతురికి ఏదో చేయించావు. అందుకనే నీ అసలు రంగు బయటపడిపోతుందని అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపడేసినట్టు నటిస్తున్నాం."


"నీ హస్తం లేకపోతే 15 రోజుల నుంచి నా కూతురు హాస్పిటల్ లో ఉంటే నీ ఇంటి తరఫు వాళ్ళు ఒక్కలైనా వచ్చారా?

ఏరి మీ అమ్మానాన్న? ఏరి నీ తోబుట్టువులు? అందరూ కలిపి నా బిడ్డను చంపేద్దాం అనుకున్నారు. నా కూతుర్ని నా మనవడిని చంపేసి కట్నం కోసం మళ్లీ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని నిలదీసింది."


ఒక్కసారిగా అన్నపూర్ణ అలా మాట్లాడేసరికి తట్టుకోలేకపోయాడు ప్రతాప్.

"అనుమానానికి కూడా ఒక హద్దు ఉంటుంది అత్తయ్య."

నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదు.

"నా భార్యని నా బిడ్డని నేను ఎందుకు చంపుకుంటాను."

"ఇన్ని లక్షలు పెట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే నేనే కావాలని చంపేస్తానని అంటారా అని మండిపడ్డాడు."


"ఆ ఎందుకు ఇప్పించవు? జనాలని మోసం చేయాలి కదా!"

" హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నావు అని సానుభూతి పొందడానికి తప్ప ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపించిందా?"


" నా కూతురు రోజురోజుకీ ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికీ వచ్చింది. అందుకు కారణం పూజారి గారు చెప్తాను అన్నా కూడా నువ్వు రావటం లేదంటే నా కూతురు బతకడం నీకు ఇష్టం లేదు అని అంది అన్నపూర్ణా "


అలా ఇద్దరికీ వాదన జరిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు ప్రతాప్. ఇద్దరు పోటీ పోటీగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగుకి ఆ మాటలు వినపడ్డాయి 

అప్పటి వరకు వారి వాదనలు వింటున్న రాధా ప్రతాప్ వెళ్లిపోయిన వెంటనే ఇంటికి వచ్చింది.


రాధన చూసి అన్నపూర్ణ..."చూసావా రాదా నేను చెప్పానా! నా మాట వినలేదు" పూజారి గారేమో ఆ అబ్బాయి వస్తే తప్ప సమస్యని చెప్పలేను అంటున్నాడు."

" ఈ అబ్బాయి ఏమో రావడం లేదు నా కూతురు ఏమైపోతుందో అన్న భయం నాలో రోజురోజుకీ పెరిగిపోతుంది అని కన్నీరు పెట్టుకుంది."


"ఊరుకోండి ఆంటీ"

ప్రతాప్ అన్నయ్య చాలా మంచివాడు. ఇరుగుపొరుగుతో అసలు మాటే ఆడరు. దించిన తల ఎత్తకుండా వెళ్ళిపోతారు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదు.


"ఇప్పుడు అతని ప్రవర్తన చూస్తుంటే నాకెందుకో అనుమానం వస్తుంది.అప్పుడప్పుడు శృతికి అన్నయ్యకి ఇలానే పెద్దపెద్ద గొడవలే జరిగేవి."


"భార్యాభర్తల మధ్య రోజు జరిగేవే కదా ఏం అడుగుతామని నేనెప్పుడూ అడగలేదు " అని చెప్పింది.


"అంటే నా కూతుర్ని బాధపెట్టేవాడా అమ్మ అని అడిగింది అన్నపూర్ణ"


"ఏమో ఆంటీ అప్పుడప్పుడు రాత్రి పూటా శబ్దాలు ఏడుపులు వినిపించేవి మళ్లీ మామూలుగా ఉదయం పూట కనిపించినప్పుడు నవ్వుతూ మాట్లాడేది అని బదులిచ్చింది రాదా.


అత్తగారు అన్నమాటలు తట్టుకోలేక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు ప్రతాప్.


డల్గా ఉన్న ప్రతాప్ని చూసి తన ఫ్రెండ్ రవి "విషయం ఏంటి రా అని అడిగాడు."


జరిగిన విషయం అంతా చెప్పాడు ప్రతాప్.

అది విని "నువ్వే తప్పు చేశావు రా అన్నాడు రవి."

"వాళ్ల కూతురు మీద వాళ్లకి కన్సర్న్ ఉంటుంది కదా. పైగా శృతి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏదో ఒక దారి దొరికితే కూతుర్ని బతికించుకోవాలని ఏ తల్లిదండ్రులైన అనుకుంటారు."


"ఏ దారి లేనప్పుడు ఏదో ఒక దారి ! చేస్తే తప్పేముంది?"

మూఢనమ్మకాలు అని కొట్టి పడేసే బదులు ఒకసారి కలిస్తే ఫలితం ఉంటుందేమో ఆలోచించు అన్నాడు రవి."


స్నేహితుడి మాట విన్న ప్రతాప్ తన తప్పు తను తెలుసుకున్నాడు. ఇంటికి వెళ్లి అత్తగారిని క్షమాపణ కోరాడు. మరుసటి రోజు ఉదయాన్నే పూజారి దగ్గరికి వెళ్దామని చెప్పాడు.


అల్లుడిలోని మార్పును చూసి సంతోషించింది అన్నపూర్ణ.

అనుకున్న విధంగానే మరుసటి రోజు పూజారి దగ్గరికి వెళ్లారు.


పూజారి గారు ఏదో మంత్రించిన నీళ్లు చల్లారు. పూజలో కూర్చోబెట్టి పూజ చేయించారు.

"ఎప్పటినుంచి ఈ సమస్య అని అడిగారు పూజారి"

"అందుకు ప్రతాప్ అసలు ఏ సమస్య లేదు సడన్గా ఆ రోజు తను వంటగదిలో పడిపోయింది అంతే అన్నాడు.


"మీ ఇద్దరి మధ్య గొడవలు మాట మాట అనుకోవడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా అని అడిగాడు."

కొద్ది కాలంగా జరుగుతున్నాయని చెప్పాడు.


"రాత్రిపూట అనుమానస్పదంగా అమ్మాయిలోని ఏవైనా మార్పులు గమనించావా అని అడిగారు పూజారి."


అందుకు బాగా ఆలోచించి ప్రతాప్... 

అవును నాకు బాగా గుర్తొచ్చింది. రాత్రిపూట నేను ఎప్పుడూ మెలుకువ వచ్చి చూసిన హాల్లో ఒంటరిగా కూర్చునేది.ఇంత అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నావ్ అని అడిగితే గుర్రున నా వైపు చూసేది.

కొన్నిసార్లు మేడ మీదకి వెళ్లేది. కొన్నిసార్లు నిద్రలోనే గట్టిగ అరుస్తూ కేకలు వేసేది.

లేపి అడిగితే ఎవరో తన పీక నొక్కేస్తున్నారు అని 

ఎవరో తెల్లని బట్టలు వేసుకున్న ఆత్మ తన మీద పడిపోతుందని చెబుతూ ఉండేది.



అప్పటికే నవ్వేది, అప్పటికే ఏడ్చేది. వింత వింతగా ప్రవర్తించేది.

మళ్లీ తెల్లవారుజామున మామూలుగానే ఉండేది.


ఆమె రాత్రిపూట లేచింది అన్న సంగతి నీకు ఎలా తెలిసేది అని అడిగారు పూజారి గారు.


ప్రతిరోజు బాబు 12' 12:30 సమయంలో లేచి కింక పెట్టేవాడు.

 లేచి చూస్తే పక్క మీద శృతి ఉండేది కాదు.

 రోజు బాబు ఏడుస్తున్న కూడా శృతి వచ్చేది కాదు.శృతిని చూసి ఇంకా ఎక్కువగా ఏడ్చేవాడు. అని చెప్పాడు ప్రతాప్. 


ఈ పరిస్థితి ఎన్నాళ్ళ నుంచి ఉంది అని అడిగారు పూజారి.


ఒక మూడు నాలుగు నెలల నుంచి ఇదే పరిస్థితి అని చెప్పాడు.


 రేపు ఒకసారి మీ ఇంటికి నన్ను తీసుకు వెళ్ళండి అన్నాడు పూజారి గారు.

సరే అని చెప్పి ఇంటికి వెళ్లిపోయారు అన్నపూర్ణ, ప్రతాప్లు.


అన్న విధంగానే మరుసటి రోజు ప్రతాపు పూజారి గారిని ఇంటికి తీసుకువచ్చాడు.ఇంటికి వచ్చిన పూజారి గారికి రావడం రావడంతోనే ఇంటిలోని నెగటివ్ వైబ్రేషన్స్ తగిలాయి.


"ఈ ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉంది. వీలైతే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోండి అని చెప్పాడు పూజారి.

ఆ మాట విని ప్రతాప్ ఎన్నో లక్షల పోసి కొత్తగా ఇల్లు కొనుక్కున్నానండి. నా భార్య ట్రీట్మెంట్ కి లక్షల ఖర్చు పెడుతున్నాను. ఈ పరిస్థితుల్లో వేరే ఇంటికి వెళ్ళడం అంటే చాలా కష్టం అన్నాడు."


"ఈ ఇంటితోనే నీకు సమస్య మొదలయ్యింది అన్నాడు పూజారి.

ఇంట్లో దిగిన రోజు నేను సత్యనారాయణ స్వామి వ్రతం నవగ్రహాలు పూజ అన్ని చేయించే దిగాను పూజారి గారు అన్నాడు ప్రతాప్."


"నువ్వు చేయించావు నాయనా! కానీ నీ ఇంటికి నీ భార్యకి నీ బిడ్డకి కలిపి ఎవరో క్షుద్ర పూజ చేయించారు. ఈ ఇంట్లోకి వచ్చి ఎన్నాళ్ళు అయింది అని అడిగాడు."

"ఐదు నెలలు అవుతుందని సమాధానం ఇచ్చాడు ప్రతాప్."


చూసావుగా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాతే నీ భార్యలోని మార్పు మార్పు మొదలైంది.

నువ్వంటే గిట్టని వాళ్లు ఎవరో ఈ పని చేశారు.

పైకి అందరూ మనవాళ్లలాగే మంచి వాళ్ళలాగే ఉంటారు మనకు తెలియకుండా వెనుక ఎన్నో పనులు చేయిస్తారు అని చెప్పారు పూజారి.


మరి సమస్యకి పరిష్కారం లేదా పూజారి గారు అని అడిగింది అన్నపూర్ణ.


ఎందుకు లేదమ్మా ! సృష్టిలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం దేవుడు ఎప్పుడో రాసిపెట్టి ఉంటాడు. ఆ సమస్యకి పరిష్కారం దొరికేంతవరకు మనము ఈ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు.నాకు తెలిసి మోదకొండమ్మ గుడిలో ఒక పూజారి ఉంటారు. అతనిని వెళ్లి కలవండి మీ సమస్యకి పరిష్కారం చెప్తాడు. కాకపోతే ఆయన బయట వాళ్ళతో ఎవరితోని మాట్లాడాడు. ఎందుకంటే ఇలాంటివి చాలా ప్రమాదకరమైన విషయాలు తెలిసిన వాళ్ల ద్వారా వెళ్తే తప్ప అందరికీ ఆయన సహాయం చేయడు అని చెప్పాడు.



సమస్యకి పరిష్కారం దొరికినట్టే దొరికి చివరిలో పూజారి చెప్పిన మాట విని నిరుత్సాహపడిపోయింది అన్నపూర్ణ.

మన ప్రయత్నం మనం చేద్దాం అత్తయ్య.మీరు అలా నిరాశ పడకండి అని ధైర్యం చెప్పాడు ప్రతాప్.

మరుసటి రోజు పూజారి గారి ఇచ్చిన అడ్రస్ పట్టుకొని ఆ గుడికి వెళ్లారు.


అలా వరుసగా మూడు రోజులు వెళ్ళిన వాళ్లని కలవడానికి పూజారి అనుమతించలేదు.

అంతలో అన్నపూర్ణకి కొండదొర గుర్తొచ్చాడు.

అతని ఇచ్చిన నంబరుకి ఫోన్ చేసింది. కొండదొర తనకు తెలిసిన అఘోర దగ్గరికి తీసుకు వెళ్ళాడు.


జరిగిందంతా వివరించారు అఘోరాకి. అది విని లోపలికి వెళ్లి ఏవో పూజలు చేసి బయటకు వచ్చిన అఘోర

"నీ రక్తసంబంధీకులే నీ భార్యను బిడ్డని చప్పడానికి క్షుద్ర పూజ చేయించారని చెప్పాడు."


 ప్రతాప్ నమ్మలేదు. నేను నమ్మను అలా ఎలా చేస్తారు అని అన్నాడు ప్రతాప్. మీ ఇంటికి సీసీ కెమెరా ఉందా? ఉంటే మీ ఇంటికి ఎవరు వచ్చారో చూసుకో నీ రక్తసంబంధికులు కాకపోతే నీ తరుపు వాళ్లే ఆ ఇంట్లోకి ఎవరు వచ్చారో ఆ మనుషుల్లో ఎవరో తాయత్తులను ఇంట్లో పెట్టారు. వాటిని నీ భార్య తాకడం వల్ల ఆ శుద్రశక్తి నీ భార్యలో దూరిపోయింది అని చెప్పాడు.



సాక్షాదారాలను పరిశీలించిన తర్వాతే నేను నమ్ముతాను అన్నాడు ప్రతాప్. నీ ఇష్టం జరిగిందయితే అదే అన్నాడు అఘోర.

 అప్పటికే అన్నపూర్ణ శోకాలు మొదలుపెట్టింది. నాకు తెలుసు నా కూతుర్ని మనవడిని చంపేయడానికి మీరందరూ కలిపి ఆడుతున్న నాటకం అని దీర్ఘాలు తీసింది.


ఇంటికి వెళ్లి ప్రతాప్ సీసీ కెమెరా చెక్ చేశాడు. గృహప్రవేశం ఫంక్షన్కి ఎవరికీ చెప్పుకోలేదు వాళ్ళు. ప్రతాప్ అమ్మానాన్న, వదిన, అక్క, శృతి అమ్మానాన్న ,శృతి అక్క మాత్రమే వచ్చారు.


ఆ తర్వాత నెలరోజుల డేటా వరకు చెక్ చేసిన ఆ ఇంటికి వేరే వాళ్ళు వచ్చినట్టే కనిపించలేదు.


శృతి అమ్మానాన్న, శృతి అక్కని అనుమానించడానికి కూడా లేదు. ఎందుకంటే అఘోరా ప్రతాప్ రక్తసంబంధికులే చేశారని నిక్కించి మరి చెప్తున్నాడు.


కానీ తన ఫ్యామిలీ ఇంత ఘాతకానికి పాల్పడిందా అని తట్టుకోలేకపోయాడు ప్రతాప్.


అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాడు ప్రతాప్.

నిజమే శృతికి ఆరోగ్యం బాలేదని చెప్పి ఇన్ని రోజులు అవుతున్నా చూడటానికి ఎవరూ రాలేదు.


అత్తయ్య అన్నదని నేను అనవసరంగా ఆవేశపడ్డాను కానీ ఇందులో ఎంతో కొంత నిజము ఉండే ఉంటుంది అనుకున్నాడు.

వెంటనే బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. తల్లిని నిలదీశాడు.


మొదటి నాకేమీ తెలియదు అని దబాయించింది. అయితే శృతిని చూడడానికి ఎందుకు రాలేదు అని అడిగాడు. తప్పించుకోవడానికి ఏవో కారణాలు చెప్పింది. కోడలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా నీకు మిగతా పనులు ఎక్కువైపోయయా అని రేట్టించి అడిగాడు.


నాకు అంత తెలుసు నువ్వు సాక్షాలతో సహా దొరికిపోయావు. తాయెత్తులు నువ్వే పెట్టావు మా సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి అని బెదిరించాడు. ప్రతాప్ తల్లి భయపడింది. ఇక తప్పించుకోవడానికి మార్గం లేదని దోరికి పోయానని నిజం చెప్పింది.


ప్రతాప్కి పెళ్లి కాకముందు ఇంటికి డబ్బులు పంపేవాడు. ప్రతాప్ అన్నకి ఉద్యోగం లేకపోయినా తండ్రి పెన్షన్తో, తమ్ముడు పంపిస్తున్న డబ్బులతో కుటుంబంలో కలిసి ఉండటం వల్ల నెట్టుకుంటూ వచ్చాడు.


పెళ్లయిన తర్వాత ప్రతాప్కి ఒక కుటుంబం ఏర్పడి బాధ్యతలు పెరిగి బాబు పుట్టాక ఖర్చులు పెరిగి మెల్లమెల్లగా ఇంటికి డబ్బులు పంపడం మానేశాడు.


 ప్రతాప్, శృతి హైదరాబాదులో ఉండటం వల్ల శృతి అన్ని మోడ్రన్ గా కొనుక్కునేది. అన్ని మంచి మంచి బట్టలు మంచి మంచి వస్తువులు వేసుకునేది. ప్రతాప్ కూడా శృతిని చాలా బాగా చూసుకునేవాడు. పెళ్లయిన కొత్తలో హనీమూన్కి విదేశాలకు కూడా తీసుకువెళ్లాడు.


ప్రతాప్ భార్యని ప్రేమగా చూసుకోవడం చూసి తన అక్క, వదిన ఉడికిపోతూ ఉండేవాళ్ళు. అలా పెళ్లయిన రెండేళ్లకి పండంటి మగ పిల్లడికి జన్మనిచ్చింది శృతి.

 

శృతి తోటి కోడలు రజిని శృతితో పోటీ పడుతూ నీకు సంపాదించడం చేతకాదని, మీ తమ్ముడు తన భార్యని ఎలా చూసుకుంటున్నాడో చూడు అని భర్తని వేధిస్తూ వచ్చేది. అలా వారి కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి.

వేరే కాపురం పెట్టమని గోల చేసింది.

ప్రతాప్ అన్న వేరే కాపురానికి అంగీకరించలేదు.


 అలా రోజు రోజుకి తోటి కోడల మీద ఈర్ష, ద్వేషం పెంచుకున్న రజిని తనకు దక్కలేని సుఖం తన తోటి కోడలికి దక్కకూడదని అనుకుంది.

  

 ఇంతలోనే శృతి ప్రతాప్లు కొత్త ఇల్లు కొనుక్కున్నామని చెప్పారు. ఇక రజిని ఈర్ష పరాకాష్టకు చేరింది.

తోటి కోడలతో నవ్వుతూ మంచిగా మాట్లాడుతూనే అత్త దగ్గర చాడీలు చెప్పేది. ప్రతాప్ అక్క కూడా తనకు దక్కని ఆనందం తమ్ముడు పెళ్ళాం సుఖపడుతుందనే ఉక్రోషంతో వదిన మాటలకు వంత పాడేది.


మనకి డబ్బులు పంపడానికి డబ్బులు లేవుగాని ఇల్లు కొనుక్కున్నాడు అని లేనిపోని మాటలు అన్నీ మప్పింది.

ప్రతాప్ మంచివాడే గాని శృతి మార్చేసింది. నాకు తెలిసినా పూజారి ఉన్నాడు అతను చెప్పినట్టు చేస్తే ప్రతాప్ మళ్లీ మీ మాట వింటాడు అని నమ్మించింది.


అలా వాళ్ళిద్దరూ చెప్పిందే విని ఆవిడ తీసువెళ్లిన అతని దగ్గరికి వెళ్ళాను. అతని ఇచ్చినవి ఇంట్లో పెట్టమంటే పెట్టాను అంతకుమించి నాకేమీ తెలియదు అని చెప్పింది ప్రతాప్ తల్లి.

జరిగిందంతా విని తల్లిని అసహ్యించుకున్నాడు ప్రతాప్.

ఆవిడ కంటే బుద్ధి లేదు నీకు బుద్ధి లేదా అని తల్లికి గడ్డి పెట్టాడు.


మరుసటి రోజు అఘోర దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. తన భార్యను బతికించమని ప్రాధేయపడ్డాడు.

 ఏమి చేయడానికి అయినా తన సిద్ధమని చెప్పాడు.

 ప్రతాప్ బాధ చూసి అఘోర మనసులో జాలి కలిగింది తనకు సాయం చేస్తానని మాట ఇచ్చాడు.

పూజకు కావలసిన సామాన్లు అన్నీ తెప్పించి పూజ మొదలుపెట్టారు.


అక్కడ పూజ మొదలు పెట్టిన మూడు రోజులకి శృతిలో చలనం మొదలైంది. బాబు కూడా ఈ ఏడవటం తగ్గించాడు.

40 రోజులు దీక్షగా ప్రతాప్ తో పూజ చేయించాడు అఘోర.

ఒక రక్ష ఇచ్చి శృతికి కట్టమని చెప్పాడు.

కొన్నాళ్లు ఆ ఇంటిని మూసేసి వేరే ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు.ఆ ఇంటిలో పూజలు చేసి ఇంటికి రక్షలు కట్టారు. 


శృతి కళ్ళు తెరిచింది. బాబు ఏడుపు ఆపేసాడు. ఒక అద్దె ఇంట్లో మళ్లీ తమ నూతన జీవితాన్ని ప్రారంభించారు.





జ్యోతి మువ్వల

బెంగుళూరు


Rate this content
Log in

Similar telugu story from Horror