STORYMIRROR

Jyothi Muvvala

Abstract Classics

4  

Jyothi Muvvala

Abstract Classics

పరిమళించే అక్షరం!

పరిమళించే అక్షరం!

1 min
408

అక్షరపూదోటలో 

పరిమళించే పుష్పం 

అవలీలగా అక్షరాన్ని కురిపించే 

పారిజాత వృక్షం!


నిరంతర సాధనతో 

కలిగినా అక్షర జ్ఞానం

అది దైవ అనుగ్రహం

అది కొందరికే సాధ్యం!


రగిలే కడుపు మంటలకో

వ్యధ కన్నీటి బొట్లుకో 

ఆవహించిన నిస్సత్తువుకో 

అన్యాయపు ఆగడాలకో 

విరబూసేను మల్లెల సొయగం! 


గాయానికి లేపనంగా 

ఓదార్పుకి నేస్తం గా 

ముక్తికి మార్గంగా 

భావాలను కలగలుపుకున్న అక్షరం 

అవనిలో అవతరించిన అద్భుతం


జ్ఞానాని వెలిగించే దివ్య దీపం 

భావాలకు భాష్యం 

మాటలకు రూపం

మానవుడికే దక్కిన అరుదైన వరం!


పూర్వజన్మ పూజలో నువ్వు అర్పించిన పుష్పం 

నడియాడే నెలపై నేడు... నీవు 

అక్షరాన్ని పరిమళింపజేసే వికసించే వృక్షం !!


- జ్యోతి మువ్వల



Rate this content
Log in

Similar telugu story from Abstract