Divya Pandeti

Romance

4.8  

Divya Pandeti

Romance

నా పయనం...ఎటు వైపు?6

నా పయనం...ఎటు వైపు?6

18 mins
4.6K


శీనుతో గొడవపడి ఆటోలో ఇంటికి వెళ్లిన హసీనా....కోపంలో చనిపోవాలని నిర్ణయం తీసుకుంది.

అనుకున్నదే తడవుగా,లేచి టేబుల్ పైన ఉన్న పేపర్ కటర్ చేతిలోకి తీస్కుంది....

దాన్ని తీక్షణంగా చూస్తూ....ఆవేశంగా ఊపిరి బలంగా తీసుకుంటూ, చేతి మణికట్టు మీద కటర్ ఉంచి....కళ్ళు మూసుకుంది.

తన నిర్ణయం ఎన్ని విపరీతాలకి దారి తీస్తుందో అన్న ఆలోచనలేదు.తనకి ఏమైనా అయితే తల్లిదండ్రుల బాధ గుర్తురావడం లేదు.అతని మాటలే పదేపదే చెవిలో జోరీగలా ఇబ్బంది పెడుతుంటే.....

మూసి ఉంచిన కళ్ళని మరింత గట్టిగా ముసుకుంటు...కుడి చేతిలోని కటర్ పై తన పట్టు బిగించి...ఒక్కసారిగా...........


రాత్రి ఏదో నిర్ణయం తీసుకుని ప్రశంతంగా నిద్రపోయిన శీను....ఏదో కల కలవర పెట్టేసరికి ఉలిక్కిపడి లేచాడు.

పక్కన ఫోన్లో టైం చూసాడు....ఆరు అవుతోంది.లేచి ఫ్రెష్ అయ్యి....అద్దం ముందు నిలుచున్నాడు.

రాత్రి హసీనా అన్న మాటలు,ఆ సమయంలో తన మానసికస్థితి ...తెల్లవారుజామున వచ్చిన కల గుర్తొచ్చి...శీనుని స్థిమితంగా ఉండనివ్వడంలేదు.

'ఛా.. ఛా.. హసీనా చాలా తెలివైన అమ్మాయ్.....అలాంటి పిచ్చి పని ఎప్పటికి చేయదు.చేయదు...'

అనుకుంటూ హాల్ లోకొచ్చి కూర్చున్నాడు.ఎంత వద్దనుకున్నా కల పదే పదే గుర్తొస్తూ ఉంటే.ఇక ఆగలేక హసీనా కి కాల్ చేసాడు.

రింగ్ అవ్వడంలేదు.చాలాసార్లు ట్ర్య్ చేసి అసహనంగా కూర్చున్నాడు.ఒక పక్క భయం....బాధ...ఎవరికి కాల్ చేయాలో అర్థం కాక....ఆలోచిస్తూ లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటే...

ఫోన్ మోగింది.ఆత్రంగా ఫోన్ చూసి......నిరాశగా చెంది.....లిఫ్ట్ చేసాడు.

"చెప్పు సింధు."

"........"

"హాస్పిటల్ ఆ.ఏమైంది?"అతని గొంతులో కంగారు..

"......."

"ఇప్పుడే వస్తున్నా."

గబగబా ఇంటికి లాక్ వేసి...గేటు దాటి బైటికొచ్చేసరికి.రాత్రి హసీనా వచ్చిన బైక్ కనిపించింది.కీస్ కూడా దానికే ఉండటంతో....దాని మీదే హాస్పిటల్ కి బయల్దేరాడు.

అరగంటలో హాస్పిటల్ చేరుకున్న శీను.....రిసెప్షన్ లో కనుక్కుందాం అనుకుంటే అక్కడ చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు.

సింధు కోసం చూస్తూ....వెళ్తుంటే..వెనక నుండి పిలిచింది సింధు.వడివడిగా తనని చేరి..

"ఏమైంది సింధు?"

"లోపలికి రా."అని రూమ్ లోకి తీసుకెళ్లింది.

లోపల శారదా పిన్ని,సింధు భర్త ఒక పక్క కూర్చోని ఉంటే....బెడ్ మీద నీరసంగా పడుకొని ఉన్నాడు బాబు.

"ఏమైంది?"

"రాత్రి వద్దన్నా వినకుండా ఐస్ క్రీములు తినిపించేశారు మీ బావ గారు.జ్వరం పట్టుకుంది.....ఎంతకీ తగ్గకపోతే చాలా భయం వేసింది.వెంటనే హాస్పిటల్ కి తీసుకొచ్చాం."

ఒక పక్క ఏడుస్తూనే....మరో పక్క భర్తని కొరకొర చూస్తోంది సింధు.

"ఇప్పుడేం పర్లేదు కదా.డాక్టర్ ఎమ్మాన్నారు?"

"మన డాక్టరేలే....హసీనా.రాత్రి పన్నెండుకి కాల్ చేసినా వెంటనే వచ్చింది.రాత్రంతా ఇక్కడే ఉంది..నాకు ధైర్యం చెప్తూ నిద్రపోకుండా."అని బాబు పక్కన కూర్చుంది సింధు.

ఉదయం వచ్చిన కల గుర్తొచ్చి...హసీనా ఇక్కడే క్షేమంగా ఉంది అని తెలిసి శీను మనసు తెలీకైంది.

"హో...."అని ఊరుకున్నాడు.

"అవునూ.....రాత్రి హసీనా ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చింది.నిన్ను అడిగితే ఇంటికెళ్లావ్ అని చెప్పా.వెంటనే బయల్దేరింది నీతో ఏదో మాట్లాడాలి అని వచ్చిందా?"

"హ్మ్..."

"ఎంటంటా అంత అర్జెంట్ గా మాట్లాడాల్సిన విషయం?"

"ఎం లేదుగాని.ఇంతకి హసీనా ఎక్కడా?"

"నైట్ అంతా ఇక్కడే ఉందిగా...ఇంటికెళ్తా అని ఇప్పుడే తన క్యాబిన్ కి వెళ్ళింది."

"సరే నేను తనని కలిసొస్తా."అని హసీనా రూమ్ ఎక్కడో కనుక్కుని అటు వెళ్ళాడు శీను.

Dr.Hasina.pediatrician.అని రాసున్న డోర్ ముందు నిలబడి....తలుపు తట్టబోయి ఆగిపోయాడు.

గట్టిగా ఊపిరి పీల్చుకుని....సడెన్గా డోర్ నెట్టుకుని లోపలికి వెళ్లగానే...

ఆ సౌండ్ కి అటు తిరిగి బుర్కా వేసుకుని ఉన్న ఒక అమ్మాయి,రెండు చేతులు తల వెనుక్కి పెట్టి...మొహానికి ముసుగు వేసుకుంటు వెనక్కి తిరిగింది.

శీను కళ్ళలో ఆశ్చర్యం,ఆనందం.....ఆ అమ్మాయి కళ్ళలో కంగారు.

"మేడం..."అప్రయత్నంగా శీను నోటి నుండి వచ్చిన పిలుపు విని....సర్దుకుని....చిన్నగా నవ్వుతూ..

"ఎలా ఉన్నావ్ శీను?"అంది మేడం.

"బాగున్నాను.మీరెలా ఉన్నారు?ఇక్కడేం చేస్తున్నారు?"

"అదీ....డాక్టర్ ని కలవడానికి వచ్చాను."

"ప్రాబ్లెమ్ ఏంటి?"

"అదీ లేడీస్ ప్రాబ్లెమ్."అంది కొంత ఇబ్బందిగా.

"మరి ఈ డాక్టర్ దగ్గరికి ఎందుకొచ్చారు.హసీనా చిన్నపిల్లలా డాక్టర్ కదా."

"హ...హా తెలుసు.హసీనా గారు నాకు తెలిసిన డాక్టర్ అందుకే.నువ్వెంటిలా.... ఇక్కడా..."

"మిమ్మల్ని కలవడానికి వచ్చాను."

"నన్నా...ఎందుకు.అయినా నేను ఇక్కడ ఉన్నా అని ఎవరు చెప్పారు నీకు."

"సేతు సార్."

"హో...సరే ఏంటి విషయం?"

బుర్కాలో కళ్లు మాత్రమే కనిపిస్తున్న మేడంనే చూస్తూ....దగ్గరగా వెళ్ళాడు.

అతను అలా దగ్గరికి వస్తుంటే...కంగారుగా....బేరుగ్గా చూస్తూ....వెనక్కి వెళ్లే దారిలేక....అలాగే నిలుచుంది.

ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ.....ఆమె కుడి చెయ్ పట్టుకుని....చేతిలో ఏదో పెట్టి....ఆమె గుప్పిట మూసి...గట్టిగా పట్టుకుని..

"ఇవి మీకు ఇద్దామని వచ్చాను.ఇచ్చేసాను....ఇక వెళ్తాను."అని వేగంగా బైటకి వెళ్ళిపోయాడు శీను.

అప్పటివరకు ఊపిరిబిగబట్టి ఉన్న ఆమె....ఏదో భారం దిగినట్టు...గట్టిగా ఊపిరి పీల్చుకుని వదిలి...చేతిలో శీను పెట్టింది చూసి...

"హో షిట్..."అని తల కొట్టుకుని,కంగారుగా బైటికి వచ్చి...వెళ్తున్నా శీను ని గట్టిగా పిలిచింది.

ఆమె పిలుపందుకుని టక్కున ఆగిపోయాడు శీను.శీను నే కాదు అక్కడ ఉన్న కొంత మంది....వింతగా ఆమెని కాసేపు చూసి....మళ్ళీ వారివారి పనిలో పడ్డారు.

వడివడిగా నడుస్తూ....శీను ముందుకు వచ్చి నిలుచుంది ఆమె.

"శీను... నేనూ..."ఆమె ఏదో చెప్పబోతుంటే.

"మేడం ఇక్కడేం చేస్తున్నారు.మీకు బ్యాండేజ్ వేయాలి.రండి."

అని వాళ్ళ దగ్గరికి వచ్చి....మేడం ని చూస్తూ పిలిచింది నర్స్.

భయంగా శీను వైపు చూస్తూ...."సిస్టర్ మీరు వెళ్ళండి.నేనొస్తాను."అంది మేడం.

"అదేం కుదరదు.నైట్ కూడా మీరు నా మాట వినలేదు. చెయ్ ఎంతలా వాచింది. రండి ముందు."అని బలవంతంగా డాక్టర్ హసీనా రూమ్ లోకి లాక్కుపొయింది.

ఏదో అనుమానం వచ్చి....వాళ్ళ వెనకే రూంలోకి వెళ్లిన శీను ని చూసి..

"ఏంటి సార్ పెర్మిషన్ లేకుండా వచ్చేస్తున్నారు.బైట వెయిట్ చేయండి."అని కసిరింది సిస్టర్.

"సిస్టర్ తను...తను నా ఫ్రెండ్."కొద్దిగా కొప్పడింది మేడం.

"హో సారీ సార్.కూర్చోండి."అని

ఆమె బుర్కా మోచేతివరకు పైకి జరిపి....ఎడమ చేతి మణికట్టు దగ్గర ఉన్న రక్తంతో తడిచిన ఒక కర్చీఫ్ ని మెల్లగా తీసింది.

నొప్పికి తాళలేక....మంట భరించలేక....తట్టుకుంటు....ఓరకంట శీను ని గమనించింది మేడం.

బాధగా,కంగారుగా చూస్తున్నాడు అతను.

"ఇలా ఎలా కట్ అయ్యింది మేడం అసలు.ఈ ప్లేస్ లో ఇంత షార్ప్ గా తెగింది అంటే...."అని ఆలోచిస్తూ...

"హా....సూసైడ్ చేసుకునేలా ఉంటేనే ఇలా కట్ అవుతుంది."అని ఆగి.....ఏదో అయింట్మెంట్ వెతుకుతూ ఉంది సిస్టర్.

సిస్టర్ మాట విని....నిటారుగా అయిన శీను....కోపంగా చూసాడు మేడం వంక.అతని చూపుని తట్టుకోలేక,భయంగా గుటకలు మింగుతూ....కూర్చుంది ఆమె.

అయింట్మెంట్ రాసి....బ్యాండేజ్ వేసి.ఏదో ఇంజక్షన్ తెస్తానని వెళ్ళింది సిస్టర్.

ఆమె అలా వెళ్లగానే....సడెన్గా లేచి డోర్ లాక్ చేసాడు శీను.మేడం కంగారుగా లేచి నిలబడి చూస్తోంది అతన్ని.

ఆమెనే సూటిగా చూస్తూ....వేగంగా వెళ్లి....ఆమె చెంప చెల్లుమనిపించాడు.

అతని గుండెలు ఆవేశంతో ఎగసిపడుతున్నాయ్.కోపంగా ఆమెనే చూస్తూ...

"ఇంకా ఎందుకు ముసుగు తీయ్."అని అరిచాడు.

మెల్లగా ముసుగు తొలగించి.....మంటపెడుతున్న ఎడమ వైపు చెంప రుద్దుకుంటూ....కళ్ళ నుండి వస్తున్న కన్నీళ్లని తుడుచుకుంటు ఉంది.

"నీకు బుద్దుందా.నువ్వో డాక్టర్ వి.ప్రాణం విలువ తెలిసిన దానివి.....ఇలాంటి పిచ్చి పని ఎలా చేశావ్."

అతను అంత ఆవేశంగా అడుగుతూ ఉంటే...గొంతు పెగలక కాంగా నిలుచుంది.

అసహనంగా చైర్లో కూర్చోని....తల పట్టుకున్నాడు శీను.

విసురుగా లేచి...ఆమె రెండు భుజాలు బలంగా పట్టుకుని..

"ఆరోజు పార్క్ లో అన్నావే....ఈ ప్రపంచంలో నువ్వు అసహ్యించుకునే మొదటి,ఆఖరి మనిషిని నేనే అని.ఇప్పుడు చెప్తున్నా విను...నువ్వు చేసిన పనికి నేను అసహ్యించుకునే మొదటి,ఆఖరి మనిషివి నువ్వే."

అని విసురుగా వదిలి....లాక్ ఓపెన్ చేసి....బైటికి వెళ్ళిపోయాడు.

ఆమె అక్కడే కింద కూర్చుండిపోయింది....ఏడుస్తూ...

తన భుజంపై ఎవరో చెయ్ వేయడంతో....

తలఎత్తి చూసిన ఆమెకి సింధు కనిపించింది.ఆమెని హత్తుకుని తన గుండెల్లో భారం దింపుకొంటోంది హసీనా

@@@@@@

హసినకి ఇంజక్షన్ చేసి వెళ్ళింది అప్పుడే సిస్టర్ .

"అంటే అన్నయ్య చెప్పే మేడం....నువ్వేనా?"

ఆశ్చర్యంగా అడుగుతున్నా సింధుని చూసి అవును అన్నట్టు తల ఊపింది.

"నమ్మలేకపోతున్నా హసి.అన్నయ్య నీ గురించి అంతలా చెప్తుంటే....ఆ మేడం ఎవరో చూడాలని చాలా అనిపించేది."

కొంత సంతోషన్గా,ఆశ్చర్యంగా..ఎక్సయిటింగ్ గా అంటున్న సింధు ని చూసి...

"భయంగా ఉంది సింధు.శీను కి నా మీద చాలా కోపంగా ఉంది."

"ఓయ్ హసి.అన్నయ్య కోపం...నువ్వు నీ డ్యూయల్ రోల్ గురించి చెప్పలేదని కాదు.ఇలా చావలనే పిచ్చి నిర్ణయం తీసుకున్నందుకు."

"హసి...నువ్వే మేడం అని అర్థమై,మేడం చేతిలో..రాత్రి హసీనా వచ్చిన బైక్ కీస్ పెట్టాడు గానీ ఎం అనలేదుగా.నువ్వు చెయ్ కోసుకున్నావ్ అనే అన్నయ్య కి కోపం వచ్చి కొట్టాడు.అంతే."

సర్దిచెప్తున్న సింధుని చూసి...నిటూర్చి,ఏదో కేస్ ఫైల్స్ తిరగేస్తోంది హసీనా.

"ఏంటే....నాపాటికి నేను వాగుతుంటే.ఎం పట్టించుకోవు."

"సింధు....నేను చేసింది తప్పు.అది ఏదైనా సరే,ఎందుకైనా సరే.....శీను కి కోపం వచ్చింది.నిన్న రాత్రి తన నిర్ణయం చెప్పేసాడు.నేనూ నిర్ణయించుకున్నాను.....ఇక తనని డిస్టర్బ్ చేయకూడదని."

"అంటే....అన్నయ్యతో మాట్లాడవా?"

"ఎం మాట్లాడను?"

"అసలు నువ్వెందుకీల చేశావో ఎక్స్ప్లెయిన్ చెయ్.నువ్వు తనని ఎంత ప్రేమిస్తున్నావో తెలియజేయి."

"అన్ని రకాలుగా చెప్పాను.అడిగాను.ఇంక అడగలేను.అడగను."

"అది కాదు హసి...ఇంకోసారి..."అంటున్న సింధు ని ఆగమని

"తనని అడుక్కోమంటావా సింధు.తనని బలవంతం చేయమంటావా.అప్పుడది ప్రేమవుతుందా.తను తీసుకున్న నిర్ణయంతో శీను హ్యాపీగా ఉంటాడు అంటే...తన హ్యాపీనెస్ కి నేను అడ్డురాను సింధు.అది తన ఇష్టం."

"అది కాదు హసి.."

"ఆపవే....పదా బాబుని చూద్దాం.అని లేచింది హసీనా.ఇ"ద్దరు బాబు ఉన్న రూమ్ కి వెళ్లారు.

"టెంపరేచేర్ నిర్మల్ అయ్యింది.ఇంటికి తీసుకెళ్లండి. రేపు ఒక ఇంజక్షన్ చేయాలి...ఈవెనింగ్ తీసుకురండి."అని మెడిసిన్స్ రాసి ఇచ్చింది డాక్టర్ హసీనా.

సింధు వాళ్ళు బాబు ని తీసుకుని ఇంటికి వెళ్లిపోయారు.

@@@@@@@

శీనుని కదిలించలేదు సింధు.అందరూ అనీల్ పెళ్లికి చేయాల్సిన పనులు చూసుకుంటూ బిజీ గా ఉన్నారు.ఇంట్లో కొంత మంది బంధువులతో సందడిగా ఉంది.

సింధు....హసీనా చెప్పిన విషయాలన్నీ అనీల్ కి,మేఘా కి చెప్పింది.ఇద్దరు ముందు షాక్ అయ్యారు.

"నిజమా సింధు.ఆ మేడం,హసీనా ఒక్కరేనా.ఎంత ఆక్ట్ చేసిందే అది.దాన్ని ఊరికే వదలకూడదే...దొంగ మొహంది.ఇంత పనిచేస్తుందా."దులిపేస్తోంది మేఘన.

"అబ్బా ఆపవే బాబు.ఇప్పుడు జరిగింది కాదు...అన్నయ్య హసి మీద కోపంగా ఉన్నాడు. అదేమో ఇంక అన్నయ్యను అడగను అంటోంది."

అనీల్ వీళ్ళ మాటలు వింటూ సైలెంట్గా ఉన్నాడు.అది చూసి...

"నువ్వేం మాట్లాడవేంటి అనీల్."

"మాట్లాడాల్సింది.....మాట్లాడుకోవాల్సింది మనం కాదు సింధు.వాళ్లిద్దరూ."

"కానీ అది ఇక మాట్లాడను అంటోందే ఎలా."

"హ్మ్....."అని ఏదో ఆలోచించి....సింధూకి ఏదో చెప్పాడు.

సాయంత్రం అయ్యింది...హసినాకి కాల్ చేసింది సింధు.

"ఏంటే ఎక్కడున్నావ్?"

"హాస్పిటల్ లో....బాబు ని తీసుకురమ్మానా కదా.మీరు వస్తే నా డ్యూటీ అయిపోతుంది.నేను ఇంటికి వెళ్తాను."

"నేను కాదు నువ్వేరా."

"నేనా ఎం?"

"ఇంట్లో ఎవరు లేరు.షాపింగ్ కి వెళ్లారు.నేనొక్కదాన్నే ఉన్న.వాడిని తీసుకుని రాలేను..నువ్వేరా.ఇంజక్షన్ వేసి ఇటు నుండి ఇటే ఇంటికి వెల్దుగాని."

"అది కాదు సింధూ."

"హే చెప్పాకదా.....ఇంట్లో ఎవరూ లేరు అని.నువ్వేం భయపడకు రా."అని పెట్టేసింది సింధు.

గంటలో సింధు వాళ్ళ ఇంటికి చేరుకున్న హసీనా డోర్ బెల్ కొట్టి నిల్చుంది.

కాసేపటికి డోర్ తీసిన మనిషిని చూసి....ఇబ్బంది పడి....ఎం మాట్లాడకుండా నిల్చుంది.

"ఎవరన్నయ్య?"అంటూ వచ్చిన సింధు.హాసినాని చూసి...

"హో రావే."అంటూ తనని లోపలికి తీసుకెళ్లింది.

"ఇంట్లో ఎవరూ లేరన్నావ్?"

"నీకు కాల్ చేసినప్పుడు ఎవరు లేరు.శీను అన్నయ్య ఇందాకే వచ్చాడు.నువ్వు పని కానీ.....వీడు నిద్రపోతున్నాడు.లేస్తే వేయించుకొడు ఇంజెక్షన్. నేను కాఫీ తేస్తా."అని వెళ్ళింది సింధు.

ఒక కప్ హాల్ లో ఉన్న శీనుకి ఇచ్చి...హసీనా దగ్గరికి వచ్చింది సింధు.

"హ్మ్..."సింధు ఇచ్చిన కాఫీ తాగుతూ..

"ఎక్కడికి వెళ్లారు అందరు?"ప్రశ్నించింది హసీనా.

"పిలవాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారట.వెళ్లారు.అనీల్ ఏదో షాపింగ్ అన్నాడు..మేఘాతో."

"మరి శీను ఇంట్లోనే ఉన్నాడే?"

"ఏమో..."అంటూ తన ఫోన్ రింగ్ అవ్వడంతో చూసింది సింధు.

"చెప్పు మేఘా."

"....."

"ఎలా రానే."

"....."

"సరే వస్తున్న ఉండు."అని కట్ చేసి..

"హసి నువ్వు వెళ్లిపో.మేఘా రమ్మంటోంది.నేను వెళ్తా."అని లేచి,చకచకా రెడీ అయ్యి..బ్యాగ్ తీసుకుని..బైటికి వెళ్తూ..

"అన్నయ్య నేను అరగంటలో వచ్చేస్తా.వాడు లేస్తే చూసుకో."అని చెప్పుల్లో కాళ్ళు దూర్చి..స్కూటీలో వెళ్ళిపోయింది సింధు.

ఇంట్లో హసీనా,శీను...నిద్రపోతున్న బాబు మిగిలారు.

అక్కడ ఉండలనిపించక...కప్ కిచెన్ లో పెట్టి...బైటకి వెళ్లబోతు ఆగింది హసీనా.

హాల్ లో కూర్చోని పేపర్ చదువుతున్న శీనుని చూసి....'వన్ లాస్ట్ టైం'అనుకుంటూ...అతని ముందు నిలబడి..

"శీను నీతో మాట్లాడాలి."అంది.

పేపర్ టిపాయ్ మీద విసిరి....లేచి లోపలికి వెళ్లబోతున్న అతన్ని చూసి..

"అట్లీస్ట్ ఒక్క చాన్స్ ఇవ్వచ్చుగా శీను."అంది.

ఏమనుకున్నాడో నెమ్మదిగా కూర్చున్నాడు శీను.

తను కూర్చోని....అతని చూసి..ఒక నీటూర్పు విడిచి...

"శీను... నీకు గుర్తుందా మనం మొదటిసారి ఎక్కడ కలిసామో?"

అని ఆగి అతన్ని చూసింది.గుర్తుంది అన్నట్టు తల ఊపాడు.

"బస్ స్టాప్ లో.నా ఫోన్ చూస్తూ ఉంటే మ్యానేర్స్ లేని వెధవ అని తిట్టుకున్నా అప్పుడు."అంది నవ్వుతూ.

తనకి నవ్వు వచ్చిన....ఆపుకున్నాడు శీను.

"ఆ తరువాత షాప్ లో చూసా.నేను వచ్చింది కూడా గమనించకుండా పని చేసుకుంటూ ఉన్నావ్.అప్పుడు చూసి వీడెంటి ఇక్కడ అనుకున్న.నువ్వు వచ్చి పలకరించినప్పుడు....కోపంగా చూసా."

"కానీ శీను....నేను పడబోతుంటే నన్ను పట్టుకున్నావే....."అని ఆగి అతన్ని చూసింది.

'దానికే ప్రేమించావా?'అన్నట్టు చూసాడు శీను.అతని మొహంలో కదలాడుతున్న భావం అర్థమై..

చిన్నగా నవ్వేస్తూ...."అంత మాత్రం దానికే ప్రేమ అనుకునే పిచ్చిదాన్ని కాదు శీను.ఆరోజు నీ ప్లేస్ లో చందునో,గిరినో .....లేక ఇంకెవరో అయుంటే ఎం చేసేవారో తెలుసా.నీలా నా చెయ్ పట్టుకుని,పడకుండా కాపాడే అవకాశం ఉన్నా....నా నడుం చుట్టూ చేయి వేసేవారు."

"నేను బాగానే ఉన్నా....ఎం కాలేదు కదా మేడం,అని నా ఒళ్ళంతా తడిమెసేవారు.కానీ నువ్వాలా కాదు.నేను పడబోయా అని నువ్వెంత కంగారుపడ్డావో....నీ అరచేతిలో పట్టిన చెమటే చెప్పింది."

"నువ్వెంత భయపడ్డావో....వేగంగా కొట్టుకున్న నీ గుండె చెప్పింది.నేను నీ కళ్ళలోకి చూడగానే....ఏదో తప్పుచేసిన్నట్టు,నాకు దూరం జెరగడంలో నీ సంస్కారం తెలిసింది."

"ఎంత పద్దతిగా బట్టలు వేసుకున్న....ఇబ్బందిపెట్టే చూపులను,ఎక్కడబడితే అక్కడ ఎదుర్కొంటూనే ఉంటాం శీను.మమ్మల్నే కాదు పసిపాపలను సైతం వక్రబుద్దితో.... తినేసేలా చూసే మృగాళ్ల మధ్య....నువ్వు ఒక మగడిలా,మనిషిలా కనిపించావ్."

"నన్ను ఆశ్చర్యపరిచావ్.మొదటిసారి అబ్బాయిల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉంటారా అని అనిపించింది.నిన్ను అపార్ధం చేసుకున్నా అని బాధపడ్డాను."

"ఆరోజు నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను.నువ్వు చందు వాళ్ళలా కాదు....కష్టపడుతున్నావ్ అని అర్ధమైంది.నీమీద పోసిటివ్ ఒపీనియన్ ఏర్పడింది."

హసీనా చెప్పేది శ్రద్ధగా వింటూ....తననే చూస్తూ ఉన్నాడు శీను.

"ఒకరోజు నేను వచ్చేసరికి...చందు వాళ్లు,ఎవరో అమ్మాయి విషయంలో నిన్ను తక్కువ చేసి మాట్లాడుతూ ఉండటం విన్నా.చాలాకోపం వచ్చింది వాళ్ళ మీద."

"నిన్ను చూస్తే భయమేసింది.శీను...చెడు వ్యాపించినంత తేలిగ్గా మంచి విస్తరించదు అంటారు.ఎందుకో వాళ్ళతో ఉంటే నువ్వూ చెడిపోతావేమో అని భయమేసింది."

"అందుకే నిన్ను వాళ్లకి దూరంగా....నాకు దగ్గరగా ఉండేలా చేసాను.కొన్నిరోజుల్లోనే నీ ప్రతిభ అర్ధమైంది.నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదనిపించింది.చదువుకుంటే....మంచి పొజిషన్ లో ఉంటావన్న నమ్మకం కలిగింది.అందుకే చదువుకోమని చెప్పాను."

"నువ్వు సరే అన్నావ్.ఇన్స్టిట్యూట్ కి వెళ్లడం మొదలు పెట్టావ్.రోజు నీతో మాట్లాడుతూ.... నీ డౌట్స్ క్లారిఫై చేస్తూ.....నిన్ను తిడుతూ,కసురుకుంటు...."అంటూ చిన్నగా నవ్వింది...

"రోజులు చాలా సాఫీగా సాగిపోతున్నాయ్ అనుకుంటున్నా టైంలో....నువ్వు కేఫ్ లో కనిపించావ్.ఒక్కక్షణం నాకేం అర్ధమా కాలేదు.అక్కడ ఉన్న వాళ్లలో ఎవరికి నువ్వేం అవుతావో తెలియక.ఇప్పుడు ఎం చేయాలో పాలుపోక....అరగంట కేఫ్ బైటే ఉండిపోయాను."

"ఆ అరగంట నిన్ను గమనిస్తూనే ఉన్నాను...నవ్వుతూ,సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నా నువ్వు కొత్తగా కనిపించావ్.నువ్వు అలా నవ్వడం నేనెప్పుడూ చూడలేదు శీను."

"బుర్కాలో ఉన్న నేను అలాగే నీ ముందుకు వస్తే నువ్వేం చేసేవాడివి.మేడం...మీరా...అని హడావిడి చేసి,నాకు మర్యాద చేసేవాడివి.అప్పటివరకు నీ మొహంలో ఉన్న నవ్వు స్థానంలో భయం,భక్తి వచ్చేసేవి."

"మేడం దగ్గర నువ్వు ఎంత వినయంగా ఉంటావో తెలుసు.కానీ కేఫ్ లో నీలా నువ్వుంటావ్.అలాగే నాకు నచ్చావ్.అందుకే.....బుర్కా తీసి,బైక్ లో పడేసి.నాన్నకి కాల్ చేసాను...వచ్చి నా బైక్ తీసుకెళ్లమని."

"చదువుకునేప్పుడు తప్ప పెట్టుకోని సోడబుడ్డి లాంటి కళ్ళద్దాలను పెట్టుకుని నీ ముందుకు వచ్చాను.ఎందుకంటే....మేడంలో నీకు తెలిసింది తన కళ్ళు.బుర్కా లేకపోయినా నా కళ్ళు చూస్తే ఎక్కడ గుర్తుపడతావో అని."

"ఎవరో వెంటపడుతున్నారని నేను కంగారు పడుతూ బైటకి చూడలేదు శీను....నాన్న బైక్ తీసుకెళ్లారా లేదా అని చూసాను.మేడం బైక్ నీకు తెలుసు కాబట్టి.అది నీకు కనిపించకూడదని."

ఆరోజు కేఫ్ లో జరిగింది అంత ఒకసారి గుర్తు చేసుకున్నాడు శీను... హసీనా రాగానే వచ్చిన పెర్ఫ్యూమ్ స్మెల్ దగ్గరి నుండి....హసీనా తనని చూడగానే పడిన టెన్షన్ వరకు అన్ని...

"నువ్వు నన్నేం అడగకపోయిన ఏదో చిన్న అనుమానం మాత్రం వచ్చే ఉంటుంది అనిపించింది.అందుకే ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా ఉండటానికి ప్రిఫెర్ చేసాను."

"షాప్ లో మేడంగా,కేఫ్ లో హసీనాగా..మేనేజ్ చేయడానికి చాలా కష్టపడ్డా.ఇంతలో ఎక్సమ్స్ రాశావ్....పాస్ అయ్యావ్.చాలా....చాలా సంతోషంగా అనిపించింది."

"ఆరోజు ఇన్స్టిట్యూట్ లో ప్రేఫ్యూమ్ ఒకరికి గిఫ్ట్ ఇవ్వాలి అని నువ్వు చెప్పగానే కోపం వచ్చింది నాకు.ఎందుకో అర్ధం కాలేదు.సింధుకి అని చెప్పేసరికి నార్మల్ అయ్యాను."

"కేఫ్ లో అందరికి ట్రీట్ ఇస్తూ ఉంటే....అనీల్ లవ్ లో పడ్డావా అనగానే....నాకు పొరబోయింది.చాలా టెన్షన్ గా అనిపించింది.భయమేసింది.మొదటిసారి నాకు నేను కొత్తగా అనిపించాను."

"నువ్వు ఎవరికో గిఫ్ట్ ఇస్తా అంటే..నాకెందుకు కోపం.నువ్వు ఎవరిని లవ్ చేస్తే నాకేంటి....అర్ధం కాలేదు...ఎం అర్ధం కాలేదు."

"ఆ తరువాత మీరంతా తిరుమల వెళ్లారు.ఆ మూడు రోజులు నిన్ను చాలా మిస్ అయ్యాను శీను.ఆ రోజుల్లోనే....నువ్వెందుకో నాకు దూరమైపోతున్నట్టు.నన్ను వదిలి వెళ్లిపోతున్నట్టు అనిపించింది."

"నాకు తెలియకుండానే ఏడ్చేసేదాన్ని.... నాకేం అవుతోందో.ఎందుకు నీ గురించి అంతలా ఆలోచిస్తున్నానో....అంతు చిక్కకా....నీ తలపులతోనే గడిపేసా ఆ మూడు రోజులు."

ఆ సమయం లోనే తాను అంకిత గురించి ఆలోచించడం గుర్తొచ్చింది శీనుకి.ఆశ్చర్యంగా చూసాడు హాసినాని.

"మీరు తిరిగొచ్చారు....నిన్ను చూడగానే ఏదో తెలియని సంతోషం.మళ్ళీ నీతో మాట్లాడుతూ ఉంటే.....మనసుకి ప్రశాంతంగా అనిపించింది.అంతలోనే మళ్ళీ భయం....దగ్గరగా ఉన్న నువ్వు దురమైపోతావేమో అని."

"అందుకే....తరువాత నువ్వేం చేయలనుకుంటున్నావో తెలుసుకుని....నువ్వు కొంచెం సెటిల్ అయ్యాకా నీకు నిజం చెప్పాలని అనుకున్నాను."

"ఇంతలో నువ్వు బ్యాంక్ ఎక్సమ్స్ రాస్తా అనడం.నాకు పీజీ అని...అందరం కొంత బిజీ అయ్యాం.సరే ఎక్సమ్స్ ముందు నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని ఆగాను."

"నీకన్నా ముందు ఇంట్లో వాళ్ళకి నీ గురించి చెప్పాలని.అమ్మ,నాన్నలని బాబాయ్ ని కూర్చోబెట్టి...అంత చెప్పాను.నిన్ను ప్రేమిస్తున్న విషయం కూడా."అని ఆగింది.

'అంటే మీ ఇంట్లో అందరికి తెలుసా?'అన్నట్టు చూసాడు శీను.

"హ్మ్....తెలుసు.నాన్న వెంటనే ఒప్పుకున్నారు.కానీ అమ్మ ససేమిరా అంది.బాబాయ్ నిన్ను చూస్తూ ఉన్నాడుగా.....తేలిగ్గానే అమ్మని ఒప్పించేసాడు.మా ఇంట్లో ఎవరికీ ఏ అభ్యంతరం లేదు."

"ఇక తెలుసుకోవాల్సింది నీ అభిప్రాయమే.నిజం చెప్తే నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలియదు.కొప్పడవని తెలుసు.....కానీ ప్రేమిస్తున్న అంటే ఏమంటావో అని భయం.కానీ ఆలస్యం చేయడం మంచిది కాదనిపించింది."

"సింధు బర్త్డే అని అందరం మూవీకి వెళ్ళినప్పుడు...నువ్వు సేపేరేట్ గా కూర్చున్నావ్.నీ పక్కన కూర్చుని అంత చెప్పేదాం అనుకున్నా.కానీ నా బ్యాడ్ లక్ మేఘా కూర్చుంది."

"ఇంటికి వచ్చాకా....అక్కడ ఉన్నతసేపు ఏదో అలజడి.... ఎందుకో భయం.నువ్వు మేడమీద ఉన్నావ్ అని తెలిసి.ఏదైతే అదయిందని... వెంటనే పైకి వెళ్దామని...మెట్లెక్కాను..."అని ఆగిపోయింది.

'హో నో....'అనుకుంటూ హసీనాను చూస్తూ గుటకలు మింగాడు శీను.

"అప్పుడే....నేను భయపడినట్టుగానే....నువు నాకు దురమైపోయే మాట అన్నావ్ అంకితతో.నేను విన్నాను."ఆమె గొంతులో ఏదో అడ్డుపడినట్టు ఆగిపోయింది.

"విని అక్కడే కూలబడ్డాను.కోపం..బాధ..వచ్చి నిన్ను చడామడా వాయించేద్దామనిపించింది.నువ్వు అంకితతో చెప్తున్నా ఒక్కోమాట...నన్ను చంపేసింది.ఇక అక్కడ ఉండలేకా ఇంటికి వెళ్ళిపోయాను."

హసీనా ఆ సమయంలో ఎంత బాధపడి ఉంటుందో అర్ధమైనా శీను ఎం మాట్లాడలేకపోయాడు.

"అమ్మా....అమ్మా..."లోపల పడుకొని ఉన్న సింధు కొడుకు లేచి ఏడుపందుకున్నాడు.

వెంటనే హసీనా లేచి వాడి దగ్గరికి వెళ్లి...వాడిని బుజ్జగిస్తూ,మాట్లాడుతూ...కిచెన్ లోకి వెళ్లి పాలు వెచ్చబెట్టి తాగించింది.

వాడు బుద్దిగా తాగి...టీవీ లో కార్టూన్స్ పెడితే....సోఫాలో పడుకొని చూస్తూ ఉన్నాడు.వాడి పక్కనే కూర్చుని తల నిమురుతూ ఉంది హసీనా.

అప్పటినుండి తను చేసిన ప్రతి పనిని గమనిస్తూ ఉన్న శీను.పరాయి ఇంట్లో ఉన్నాం అని ఆలోచించకుండా....తను ఎం చేయగలదో అది చేసిన హాసినాని చూస్తుంటే....గౌరవం మరింత పెరిగింది శీనుకి.

కాసేపటికి మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు.వాడిని అలాగే సోఫాలో పడుకోబెట్టి...ఇంటి వెనుక పెరటి లోకి వెళ్లి మంచం పైన కూర్చుంది హసీనా.

తన వెనకే వెళ్లిన శీను....అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.

"నెల రోజులు శీను....ఆ నెల రోజులు నాలో నేను లేను.సరిగ్గా తిండి నిద్ర లేదు.....చాలా డీలా పడిపోయాను.నాన్న నన్ను చూసి....నీతో మాట్లాడతా అన్నారు.ఎంత ఫ్యూలిష్ నెస్ అది.వద్దన్నాను."

"నీకు ఏది మంచిదో,కరెక్ట్ అనిపిస్తుందో అదే చెయ్ అని చెప్పిన నేనే...ఇప్పుడు నీ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాను...నేను ఆలోచిస్తోంది తప్పనిపించింది.నీ హ్యాపీనెస్ అంకితతో ఉంది అని నువ్వు అనుకున్నప్పుడు..నేనిల నీ గురించి ఆలోచిస్తూ,నాన్న వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో అర్ధం లేదనిపించింది."

"నన్ను నేను సముదాయించుకున్నాను.నిన్ను మర్చిపోడానికి అట్లీస్ట్ ట్ర్య్ చేసాను.మిమ్మల్ని కవలకుండా....నీ ముందుకు రాకుండా ఉన్నాను.మేడంగా కూడా.చెన్నై వెళ్లే ముందు రోజు...మనం కలిసిన చోట కాసేపు గడపాలనిపించి కేఫ్ కి వెళ్తే నువ్వొచ్చావ్."

"మన ఇద్దరమే ఉండటంతో....నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక,వెళ్లిపోదాం అనుకుంటే.నన్ను ఆపేసావ్.నిన్ను ఇష్టపడటం కాకపోయినా కనీసం నేనే మేడంని అని చెప్పబోతుంటే....అంకిత వచ్చింది."

"ఆగిపోయాను.ఇక మీ మధ్య ఉండలనిపించక....షాప్ కి వెళ్లిపోయా.ఆలోచించాను ఒకవేళా నేనే మేడంనే అని చెప్తే...ఎందుకిలా నాటకం ఆడావు అని అడుగుతావ్."అని శీనుని చూస్తూ....

"అప్పుడు....నీకు అబద్ధం చెప్పలేను...అలా అని నిజము చెప్పలేను.చెప్పి...నిన్ను డిస్టర్బ్ చేయలేను.షాప్ కి వెళ్తే.....నువ్వు మేఘాతో వచ్చావ్.వస్తే వచ్చావ్...చందు వాళ్లు అడుగుతూ ఉంటే,తను నీ చెల్లెలి ఫ్రెండ్ అని చెప్పకుండా ఎందుకు బిల్డప్ ఇచ్చావ్?"

"కోపం వచ్చింది అరిచాను.కానీ అంతలోనే...నిన్ను ఎందుకు బాధపెట్టడం అనిపించి....మేడంగా నీతో మాట్లాడే ఆఖరి రోజు ఇదే అవ్వాలని...నార్మల్ గా మాట్లాడా."

"ఆ తరువాత చెన్నై వెళ్లిపోయా.....అక్కడికి వెళ్లిన నిన్ను మర్చిపోలేకపోయాను.రెండు రోజులు కూడా స్థిమితంగా ఉండలేకపోయా.నీకేదో జరిగినట్టు,నువ్వేదో బాధగా ఉన్నట్టు అనిపించేది.నిన్ను చూడలనిపించేది."

"కానీ నాన్నకి మాట ఇచ్చా శీను.ఏది ఏమైనా సరే...నా చదువు అశ్రద్ద చేయనని.నిన్ను తలుచుకుంటూ.....నన్ను పట్టించుకోకుండా ఉండనని.అందుకే.....నిన్ను చూడాలని ఎంత అనిపిస్తున్నా ఆగిపోయాను."

"ఒకరోజు అంకిత బర్త్డే అని తనని విషెస్ చెబుదాం అని కాల్ చేస్తే.....చెప్పింది తనకి పెళ్ళైన విషయం.నమ్మలేకపోయా....నువ్వెలా ఉన్నావో అని టెన్షన్ మొదలైంది."

"సింధూకి కాల్ చేశా....అంకిత గురించి అడగకుండా మాములుగా మాట్లాడుతూ ఉంటే....తనకి పెళ్ళయిందని చెప్పింది.మరి నాకు ఎందుకు చెప్పలేదు అని అరిస్తే....అనుకోకుండా ముహుర్తాలు పెట్టేసారు.హడావిడిగా జరిగిపోయింది.ఎవరికి చెప్పలేదు అంది.కానీ అంకిత గురించిగాని,నీ గురించిగాని ఎం చెప్పలేదు."

"నువ్వెలా ఉన్నావో అని....ఇక అక్కడ ఉండలనిపించక వచ్చేసాను.షాప్ కి వెళ్తూ ఉంటే....నువ్వు పార్క్ లో కనిపించావ్.మాట్లాడావ్,జరిగింది చెప్పావ్....కోపం వచ్చింది....తిట్టాను, కొట్టాను...."

"ముందు అంకితకి పెళ్లవ్వడంతో...ఆ బాధలో తాగావేమో అనుకున్నా.కానీ షాప్ లో చందు వాళ్ళ మాటలు విన్నాకే అర్ధం అయ్యింది.వాళ్ళు రెచ్చగొడితే తాగేస్తావా శీను....సెన్స్ లేదా."

హసీనా గొంతులో కోపం,బాధ.....తనని చూడలేకా తల దించుకున్నాడు శీను.

"ఇకపై మేడం ని పూర్తిగా నీ లైఫ్ నుండి దూరం చేసి....హసీనా గా మాత్రమే ఉండాలని అనుకున్నాను.అందుకే....సింధు ద్వారా జరిగింది తెలుసుకున్నాను.నీతో మాట్లాడాను...."

హసీనా తనని ఎంత మోటివేట్ చేసిందో..ఎంత సపోర్ట్ చేసిందో......ఆ సమయంలో మేడం గుర్తు రావడం....కాకతాళీయం కాదు.మాట తీరులో తేడా ఉన్నా...ఇద్దరు ఒకరే కాబట్టే,హసీనా మాట్లాడుతుంటే మేడం గుర్తొచ్చింది శీను కి.

"జాబ్ వచ్చింది....నువ్వు నార్మల్ అయ్యావ్ అని....నీకు నా మనసులో మాట చెప్పేదాం అనుకున్నా.పార్క్ లో నీకు షూ ఇచ్చిన రోజు...నేను చెప్పబోతుంటే.అంకిత పెళ్లి గురించా అన్నావ్."

"అంకిత విషయంలో నీ అభిప్రాయం ఎంటో అర్ధం అయ్యింది.ఇప్పుడప్పుడే నిన్ను కదిలించడం మంచిది కాదని ఊరుకున్నాను.నువ్వు భువనేశ్వర్ వెళ్లిపోయావ్.ఏడాది తరువాత తిరిగొచ్చావ్.అప్పుడు నీతో మాట్లాడుదాం అనుకుంటే....ఆ అవకాశం రాలేదు.పైగా మూడు రోజులుంటానన్న నువ్వు రెండు రోజులకే వెళ్లిపోయావ్."

"మనసు ఉండబట్టలేక....నీకు మెసేజ్ చేసాను.చూశావ్....కానీ రిప్లై ఇవ్వలేదు.నీకు చాలా సార్లు కాల్ చేసాను.రెస్పాన్డ్ అవ్వలేదు.తరువాత స్విచ్చాఫ్ వచ్చింది.నీకు కోపం వచ్చిందేమో అని...ఆలోచిస్తున్నావ్ ఏమో అని...నీ నిర్ణయం ఎప్పుడు చెప్తావా అని ఎదురుచూసాను."

"ఇంకా ఎదురుచుస్తూనే ఉన్నా.మొన్న నువ్వు అంతగా చెప్పిన తరువాత....ఇంకా నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు శీను.నీ లైఫ్ నీ ఇష్టం."

"జరిగింది చెప్పాను....నీ విషయంలో నేను చేసింది,అదే...మేడంగా,హసీనాగా డ్యూయల్ రోల్ చేయడం తప్పైతే నన్ను క్షమించు."అని లేచి....

"ఇంక నిన్ను డిస్టర్బ్ చేయను శీను.నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి.ఉంటావ్ కూడా.గుడ్ బాయ్ శీను." అని వెళ్తున్నా హసీనాని చూస్తూ...

"ఆగు."అన్నాడు శీను.

ఆగింది గాని తిరగలేదు హసీనా.

మెల్లగా లేచి.....తన దగ్గరికి వెళ్లి నిల్చున్నాడు.....

"నీ నుండి ఆ విషయాలు తెలుసుకోవలని నేను అనుకోలేదు హసి."అన్నాడు.

అర్ధం కాక తిరిగి చూసింది శీనుని....

హసీనా ఎడమ చెయ్ సున్నితంగా పట్టుకుని....

"ఇలా ఎందుకు చేశావ్?"అడిగాడు సూటిగా తన కళ్ళలోకి చూస్తూ.

"నీతో మాట్లాడి.....ఆవేశంగా ఇంటికి వెళ్ళాను.చేతి మీద కట్టర్ పెట్టాను.ఒక్క సెకండ్....ఇంకొక్క సెకండ్ అయ్యుంటే....నా ప్రాణం గాల్లో కలిసిపోయేదే.ఆ ఒక్క సెకండే నన్ను....అలాంటి పిచ్చి పని చేయకుండా ఆపింది."

"నాన్న,అమ్మ....నువ్వు....అందరూ గుర్తొచ్చారు.నేను లేకపోతే,నా మీదే ఆశలు పెట్టుకున్న నాన్న వాళ్ళు ఏమైపోతారు.అంకిత ఏదో చేసుకోబోయింది అంటేనే సహించలేకపోయిన నువ్వు...నేను పోతే తట్టుకోగలవా.నేను ఏదైనా చేసుకుంటే.....జీవితాంతం మిమ్మల్ని బాధపెట్టినదాన్ని అవుతాను."

"దేనికైనా ఒక్క క్షణం చాలు శీను.ఒక్క క్షణం ఆగి ఆలోచించా కాబట్టే....ఈరోజు ఇలా ఉన్నాను."

తను తొందరపడలేదని తెలిసి ఒక పక్క సంతోషన్గా ఉన్నా...ఈ దెబ్బ ఎలా తగిలిందా అని అనుమానంతో..

"మరి ఇది?"అని అడిగాడు.

"ఇదీ....సింధు బాబు గురించి కాల్ చేసింది.నా బైక్ ఇక్కడే మర్చిపోయాగా.ఆటోలో వెళ్దామ్ అని స్టాప్ దగ్గరికి వెళ్తుంటే...ఎవరు ఇద్దరు కత్తితో బెదిరించారు.బ్యాగ్, ఫోన్....చైన్ అన్ని ఇవ్వమని.ఇచ్చేసాను.కానీ....వాళ్ళు నాతో తప్పుగా ప్రవర్తించారు."

"వాళ్ళ నుండి తప్పించుకునే ప్రయత్నంలో....వాళ్ళ చేతిలోని కత్తి వల్ల నాకు గాయం అయ్యింది.ఎలాగో తప్పించుకుని...అటుగా వస్తున్న ఆటోలో హాస్పిటల్ కి చేరుకున్నాను."

అప్పటివరకు హసీనా చెయ్ పట్టుకుని...తను చెప్పేది కంగారుగా వింటున్న శీను.టక్కున తన మొహం పట్టుకుని....

"నీకేం కాలేదుగా."అంటూ ఆతృతగా అడిగాడు.

శీను కళ్ళల్లో ప్రేమ,తనకేమైన అయ్యిందేమో అని కంగారు...ఆశ్చర్యంగా చూసింది హసీనా.

తను ఎం చేస్తున్నాడో గమనించి.....తనని వదిలి దూరం జరిగాడు.

"నేనూ....నేను వెళ్ళొస్తా శీను."అని గబగబా వెళ్ళిపోయింది హసీనా.

అక్కడే కూర్చోని ఆలోచిస్తూ ఉండిపోయాడు శీను.

@@@@@

అనీల్,మేఘన ల పెళ్లి వైభవంగా జరిగింది.పెళ్లిలో శీను, హసీనా ఎదురు పడినా మాట్లాడుకోలేదు.

అన్ని తంతులు పూర్తయిన తరువాత.....నవదంపతులు తిరుమల వెళ్లారు.

ఇంట్లో అందరూ కొంత కుదురుకున్నాకా.....తల్లిదండ్రులను తీసుకుని...ఒక ఇంటికి వెళ్ళాడు శీను.

డోర్ బెల్ సౌండ్ వినిపించి తలుపు తీసిన వ్యక్తిని చూసి...షాక్ అయ్యారు శీను వాళ్ళు.

కానీ తలుపు తీసిన వ్యక్తి మాత్రం ఆశ్చర్యంగా,ఆనందంగా చూస్తూ...

"రండి..రండి..లోపలికి రండి."అని ఆహ్వానించాడు.

ముగ్గురు లోపలికి వెళ్లగానే....లోపలి నుండి వచ్చిన ఒక ఆడ మనిషి వచ్చిన వాళ్ళని ఎవరా అని చూస్తూ ఉంటే...

"శీను.....తన అమ్మ,నాన్న."అని పరిచయం చేసి..."నా భార్య."అని వీళ్ళకి పరిచయం చేసి......

"కాఫీ తీసుకురా."అని ఆమెతో చెప్పి వారి ముందు కూర్చున్నాడు.

"సార్..మీరు."అంటున్న శీనుని ఆగమని.

"శీను....నీతో వంటరిగా మాట్లాడాలి.లోపలికి వెళదామా."అని లేచాడు అతను.

సరే అని తాను లేచి....అమ్మ వాళ్ళ వైపు చూసి.అతని వెనకే లోపలికి వెళ్ళాడు శీను.

"ఎందయ్య ఇది.ఈయన ఈడా ఉండాడేంది.అసలు ఈడు ఇక్కడికి ఎందుకొచ్చాడు?"

"అదే నాకు అర్థం కావట్లేదే.చూద్దాం ఉండు."అని భార్యకి చెప్తూ ఉండగా..

కాఫీ కప్పులతో వచ్చిన అతని భార్యని చూసి....నవ్వుతూ....కాఫీ తాగుతూ ఉన్నారు శీను అమ్మ,నాన్న.

@@@@@@

"ఏంటి శీను...మేడం హసీనా అయినట్టు.హసీనా తండ్రి నీకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎలా అయ్యాడా అని ఆలోచిస్తున్నావా."

"సార్..అంటే నేను మీకు ముందే తెలుసా.ఐ మీన్ ఆక్సిడెంట్ అప్పుడే నేను మీకూ.."

"తెలుసు.నీ గురించి హసీనా చెప్పింది.నిన్ను ప్రేమిస్తున్న అని.నా అల్లుడు ఎలా ఉంటాడో చూద్దామని రెండు మూడు సార్లు షాప్ కి కూడా వచ్చాను.కానీ నువ్వు నన్ను చూడలేదు."

"నీకు,మేడంకు అలాగే హసీనాకు మధ్య జరిగిన ప్రతి విషయం నాకు తెలుసు.ఆఖరికి నువ్వు..రెండు సార్లు తనని కొట్టడంతో సహా."

"అంటే అదీ....తనూ.."

"నో నో శీను.నువ్వు చేసింది కరెక్టేలే....మీరు మాట్లాడుకున్నది చెప్పగానే,నేనూ ముందు చావబోయిందని అనుకున్నాను."

"నాకు ట్రీట్మెంట్ చేసింది మీరే అని హసీనా కి తెలుసా?"

"ముంధు తెలియదు.కానీ మొన్న అంతా చెప్పిందంటగా నీకు.నువ్వేం చెప్పలేదని అంది.నేను మాట్లాడతా అంటే వద్దు..అతను ఒప్పుకోడు అంది.తనకి ట్రీట్మెంట్ చేసింది నేనే...నేను అడిగితే కాదనడు అన్నా వినలేదు.సారీ.ఈ విషయాన్ని అడ్డుపెట్టుకుని నేను నిన్ను ఇబ్బంది పెట్టనులే శీను."

శీను ఎం మాట్లాడలేదు.అసలు తను అనుకొని వచ్చింది ఒకటి....ఇప్పుడు ఇక్కడి పరిస్థితి చూసి ఎం మాట్లాడాలో అర్ధం కావడంలేదు అతనికి.

"అవునూ అసలు ఇక్కడికి ఎందుకొచ్చారు మీరు?"

అసలు విషయం అడగటం మార్చిపోయానే అన్నట్టు చూసాడు హసీనా తండ్రి.

"నాకో విషయం చెప్పండి.ఇప్పటికి మీరు మీ అమ్మాయి ఇష్టానికే మొగ్గుచూపుతున్నారా?"అని అడిగాడు శీను.

"నీ డౌట్ నాకర్ధమైంది శీను.హసీనా నీ గురించి చెప్పినప్పుడు..ఇంకేం ఆలోచించకుండా ఒప్పుకున్నాను. నా కూతురు ఇంతలా చెప్తోంది అంటే...నువ్వు ఎలాంటి వాడివో అర్ధమైంది.అది నా బిడ్డ నిర్ణయం మీద నాకున్న నమ్మకం."

"తను ఒక నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోను వెనుకడుగు వేయదు.అలాంటిది....ప్రేమించిన నిన్ను ఈ ఒక్క కారణంతో ఎలా మర్చిపోగలదు."

"అలాగే నేను,నా భార్య కూడా తన ఇష్టాన్ని కాదనలేం.మాకు తన సంతోషమే ముఖ్యం.నీతో ఆనందంగా ఉండగలదు అంటే....మాకింకేం కావాలి చెప్పు."

ఆయన అలా మాట్లాడుతూ ఉంటే....లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు శీను.

ఆయన పెద్ద డాక్టర్.కూతురు డాక్టరే...గొప్ప సంభంధం చూసి ఘనంగా పెళ్లి చేసే స్థోమత ఉంది.కానీ....కూతురి సంతోషం కోసం...తనలాంటి సాదాసీదా మనిషికి,అందునా లోపం ఉన్నవాడికి,తన బిడ్డని ఇవ్వడానికి సిద్ధపడిన అతన్ని చూస్తూ...

రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు శీను.

"అరేయ్ ఏంటి శీను.నేను నీ కాళ్ళు కడగాలి.....ఆ నీళ్లు నెత్తిన జల్లుకోవాలి.మరి ముహుర్తాలు పెట్టించేయమంటావా."అన్నాడు శీను చేతులు పట్టుకుని నవ్వుతూ

"అమ్మ వాళ్ళకి నేనేం చేప్పలేదు సార్."

"అవునా సరే నేను మాట్లాడతా.అయినా ఇంకా సార్ ఏంటయ్యా.మామయ్యా అని పిలువ్."

ఇద్దరు నవ్వుకున్నారు.

@@@@@

"రారా పింకీ."

అప్పుడే లోపలికి వస్తున్న కూతుర్ని చూసి అంది....హసీనా తల్లి.

వస్తూనే సోఫాలో ఉన్న శీను తల్లి దండ్రులను చూసి...ఆశ్చర్యంగా..

"అంకుల్,ఆంటీ..మీరు ఇక్కడా?"అంది.

"ఇది మీ ఇల్లా?"వాళ్లిద్దరూ అయోమయంగా చూస్తున్నారు.అసలిక్కడ ఎం జరుగుతోందో అర్ధం కాక.

"అమ్మ ఏంటి.ఏమైంది?"

అని తల్లిని అడుగుతూ ఉంటే...లోపలి నుండి వచ్చిన హసీనా తండ్రి.

"పింకీ.శీను నీకోసం వెయిట్ చేస్తున్నాడు.వెళ్లు."అని....

శీను తల్లిదండ్రుల ముందు కూర్చోని....

"మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి."అన్నాడు.

"హ చెప్పండి."అన్నారు వాళ్ళు.

ఇంకా అక్కడే ఉన్న హసీనా ని చూసి...

"వెళ్లు పింకీ."అనడంతో లోపలికి వెళ్ళింది హసీనా.

@@@@@

"సో...నేనేదో నీకు హెల్ప్ చేశా అని.మా నాన్న నిన్ను సేవ్ చేశారు అని నా ప్రపోసల్ ఆక్సిప్ట్ చేస్తున్నావా శీను. "

చేతులు కట్టుకుని,టేబుల్ కి ఆనుకొని...బెడ్ మీద కూర్చొని ఉన్న శీనునే సూటిగా చూస్తూ అడిగింది హసీనా.

చిన్నగా నవ్వుతూ...."నీకు అలా అర్ధం అయ్యిందా."అన్నాడు.

"ఇంకెల అర్ధం చేసుకోమంటావ్.నిన్నటివరకు లేని ప్రేమ సడెన్గా ఎలా వచ్చింది."

"నిన్ను ప్రేమిస్తున్నా అని నేను చెప్పలేదే."

"మరి ఎందుకిది?"

"పెళ్లికి ప్రేమతో పనిలేదనుకుంటా?"

"ఎందుకు లేదు.ఉంది."

"ఏంటి హసీనా....అరేంజ్డ్ మ్యారేజెస్ లో ప్రేమ ఎందుకుంటుంది.పెళ్ళైయ్యాక ప్రేమ మొదలవుతుంది."

"అంటే.ఇప్పుడేమంటావ్?"

"నిన్ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను."

"నేను ఒప్పుకొను.నువ్వు మా నాన్న కోసం ఇదంతా చేస్తున్నావ్.ఎం చెప్పారు నాన్న నీకు.నాకు తెలుసు ఆయన సంగతి....కచ్చితంగా నిన్ను బెదిరించి ఉంటారు...."

అంటూ కోపంగా "నాన్నా.... నాన్నా..."అని బైటికి వెళ్తున్నా హసీనా చెయ్ పట్టుకుని ఆపాడు శీను.

"వదులు శీను.ఈరోజు ఆయనో నేనో తేలిపోవాలి."

"పట్టుకుంది వదిలేయడానికి కాదు."అంటూ ఇంకా గట్టిగా పట్టుకున్నాడు.

ప్రశ్నార్థకంగా చూస్తున్న హసీనా కి కొంచెం దగ్గరగా జరిగి.

"ఇక్కడికి వచ్చేవరకు డాక్టరే మీ నాన్న అని నాకు తెలియదు."

"ఇప్పుడు తెలిసే ఒప్పుకుంటున్నావుగా."

"హసీనా....అసలు నేను అమ్మ వాళ్ళని తీసుకుని ఇక్కడికి ఎందుకొచ్చానో ఆలోచించవా?"

"ఎందుకు...."అంటూనే ఆగిపోయింది.

"మీ నాన్న గారిని అడగటానికి వచ్చాను.మన పెళ్లి చేయమని."అన్నాడు ఆమె మొహంలో కదలాడుతున్న భావాలను చదివే ప్రయత్నం చేస్తూ.

కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటాగా...."ఎందుకు?"అంది.

ఆమె కన్నీళ్లని తుడుస్తూ.....మరింత దగ్గరగా జరిగి....

"నువ్వు నాకు కావాలి హసీనా."అన్నాడు ఆర్తిగా.

"ఎందుకు?"

"నేను తప్పుదోవ పడుతుంటే...మేడంగా నన్ను మందలించడానికి.బాధపడుతుంటే....హసీనాగా ఓదార్చడానికి.

నీ కళ్ళలో నన్ను నేను చూసుకోడానికి.నువ్వు కల కంటే అది నెరవేర్చడానికి.నా గుండెల్లో నిన్ను దాచుకోడానికి."

"ఒక్క క్షణం...దేనికైనా ఒక్క క్షణం చాలు అన్నావుగా.ఆ ఒక్క క్షణం ఆగి నీ గురించి మాత్రమే ఆలోచించాను.నిన్ను కాదు అనుకోడానికి నాకో ప్రాపర్ రిసన్ కనిపించలేదు."

"ఇదిగో ఇది ఒకట్టి తప్పా."అని కాలు చూపించాడు.

"ఇది సమస్యే కాదు అని ముందే చెప్పాను శీను."

"హ్మ్....జీవింతాంతం నా భారం మోయలనుకునే అమ్మాయి పిచ్చిదే అవుతుంది అనుకున్నా.నిజమే నీకు పిచ్చే."అని తనని చూస్తూ నవ్వాడు.

"శీను...."అంటూ చిరుకోపంగా అతన్ని నెట్టేసరికి....

నిలదొక్కుకోలేక పడబోయినా శీనుని...గట్టిగా పట్టుకుని....

"సారీ....సారీ శీను."అంది భయంగా.

"రిలాక్స్ హసి.నేను పడను...నువ్వు పడనివ్వవ్."అంటూ తన చెయ్ గట్టిగా పట్టుకున్నాడు.

"అనీల్ ఒక మాట అన్నాడు హసీనా......మనం ప్రేమించేవాళ్లతో కన్నా...మనల్ని ప్రేమించేవాళ్లతో జీవితం బాగుంటుంది అని..."

"ఇప్పుడు నీ మీద అంతులేని ప్రేమ పుట్టుకొచ్చింది అని చెప్పలేను.కాని నా భార్యని ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించగలను.కంట నీరు పెట్టనీకుండా చూసుకోగాలను."

"చెప్పు హసీనా....నన్ను పెళ్లి చేసుకుంటావా?"

ప్రేమలేదు అంటూనే.....తనని గుండెల్లో దాచుకుంటా అంటున్న అతని అమాయకత్వాన్ని చూసి మురిసిపోతూ....ఏదో ఆలోచిస్తూ....

"అవునూ నేనే అని ఎలా కనిపెట్టావ్?"అని అడిగింది హసీనా.

"నువ్వు నాకు మెసేజ్ పంపించావ్ కదా.అది నా పాత నంబర్ కి పంపావ్.ఆ ఫోన్ పాడవ్వడంతో ఇక్కడే వదిలేసాను,తీసుకెళ్లలేదు.అందుకే ఆ మెసేజ్ గురించి నాకు తెలియలేదు.నేను కొత్త నంబర్ యూస్ చేసాను ఇన్నాళ్లు."

"సరే...నేనే అని ఎలా తెలిసింది?బైక్ వల్లే కదా?"

"కాదు....హసీనా నంబర్ నుండి మెసేజ్ చేయబోయి....మేడం నంబర్ నుండి నార్మల్ మెసేజ్ చేశావ్.నువ్వు నాతో మాట్లాడి వెళ్లిన రాత్రే....చెక్ చేసాను.అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నాను."

"హో షిట్."అని తల కొట్టుకుని నవ్వింది.

"మేడంగా దూరమవుదాం అనుకున్నావ్...కానీ మేడం గానే నాకు ఎక్కువ దగ్గరైయ్యావ్.ఇంతకీ నాకు సమాధానం చెప్పలేదు నువ్వూ..."

"ఏంటి?"

"నన్ను జీవితాంతం భరిస్తావా?"

"ఉహు.....జీవితంతం ప్రేమిస్తా."

@@@@@

"చాలా మంచి న్యూస్ చెప్పావురా.నాకు చాలా హ్యాపీగా ఉందిరా శీను."

తిరుమల నుండి వచ్చి రాగానే శీను చెప్పిన విషయం విని....సంతోష పడ్డాడు అనీల్.

అందరూ కూర్చోని భోజనం చేస్తూ ఉన్నారు.

అక్క అన్యమనస్కంగా ఉండటం చూసి...ఏంటని అడిగింది శారద.

"ఎం లేదు.ఈ ఇసయం ఊళ్ళో తెలిస్తే అందరూ ఏమనుకుంటారో అని..."

"అంటే నీకు ఇష్టం లేదా అక్కా?"

"అది కాదు శారదా.ఊళ్ళో..."

"ఎహే ఆపు.ఊళ్ళో వాళ్ళతో ఎం పని.ఎం చేసినారు ఊళ్ళో వాళ్ళు మనకి.శెట్టి అప్పు కట్టలేదని ఇంటి మీదకి వస్తే ఎం జేసినారు.బిడ్డ చావుబతుకుల మధ్య ఉన్నాడు...డబ్బు సర్దండయ్యా అంటే...ఏమి జేసినారే. ఆఖరికి భూమి అమ్ముకుంటున్నా అని తెలిసి కూడా ఎం చేయలే."

"ఆళ్ల గురించి ఆలోచిస్తా....మన బిడ్డ సుఖం వదిలేస్తామా.అనే వాళ్ళు అంటానే ఉంటారు.అయ్యాన్ని పట్టించుకుంటే ఎట్లాగా."

ఆవేశంపడ్డాడు శీను తండ్రి భార్య మీద అరుస్తూ.

"నాన్న నువ్వూరుకో."అని తండ్రిని వారించిన శీను,తల్లి ముందు కూర్చోని.

"అమ్మ ...అందరి గురించి వద్దు.నువ్వు చెప్పు.నేను హసీనా ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా...కదా?"

"నాకు ఇష్టమే అయ్యా.పెండ్లి వద్దనవాడివి ఇప్పుడు జేసుకుంటా అంటే...ఎట్లా వద్దంటా.నీకు ఏది మంచిదనిపిస్తే అదే జెయ్ అయ్యా."

తల్లి చెయ్ పట్టుకుని....సున్నితంగా నొక్కి వదిలి..ఒకసారి తండ్రిని చూసి వెళ్లి పడుకున్నాడు శీను.

తండ్రి అంతలా ఆవేశపడటానికి కారణం లేకపోలేదు.ఊళ్ళో కొంత మందికి వ్యవసాయ బావులు గాని....బోర్లు గాని లేవు.ఉన్న వాళ్ళు డబ్బు తీసుకుని నీళ్లు వదిలేవారు.కానీ శీను తండ్రి మాత్రం... ఊళ్ళో పొలాలు ఎప్పుడు పచ్చగా ఉండాలని....తమ బోరు నీళ్లు ఉచితంగానే వదిలేవాడు.

ఊరు వదిలి వచ్చేప్పుడు కూడా.....బోరు నీళ్లు వాడుకోమని చెప్పే వచ్చాడు.

అలాంటిది...శీను హాస్పిటల్ లో ఉన్నాడని....డబ్బు సర్దమంటే ఎవరు ఆదుకోకపోవడంతో.....పొలం అమ్మక తప్పలేదు.కొడుకులా కాచుకుని.....తల్లిలా భావించిన నేలను పోగొట్టుకున్నానే అని అతని బాధ.

'లేదు నాన్న...నా వల్ల నువ్వు పోగొట్టుకుంది చాలు.నీ కన్నకొడుకుని చూసి ఈరోజు నువ్వు ఎంత గర్వపడుతున్నావో.అలాగే...నువ్వు పెంచిన కొడుకుని తిరిగి తీసుకొచ్చి నీ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తాను.'అనుకున్నాడు శీను.

@@@@@@

ఏడేళ్ల తరువాత.....

పచ్చని పంట పొలాల మధ్య....కలుపు మొక్కలు ఏరిపారేస్తూ....ఇంకో వారంలో కోతలు కోయడానికి సిద్ధంగా ఉన్న....పంటని చూస్తూ కూర్చున్నాడు శీను.

తాను అనుకున్నట్టుగానే....వాళ్ళ నాన్నకి తన రెండో కొడుకుని తిరిగి ఇచ్చాడు శీను.అప్పుడు ఆయన కళ్ళలో కనిపించిన ఆనందం ఎన్ని కోట్లిచ్చినా దొరకనిది.

పనివాళ్ళని పెట్టుకుని పొలం పనులు చేయిస్తున్నాడు శీను..... తండ్రి పర్యవేక్షిస్తుంటాడు.

"ఏవండోయ్ శ్రీవారు...."తనని దూరం నుండి కేకేసిన భార్యని చూస్తూ...

"ఏంటండి శ్రీమతి గారు."

"టైమ్ ఎంతయిందో తెలుసా తమరికి....ఉదయం అనగా వచ్చారు.అదీ ఎం తినకుండా....ఇలా అయితే ఎలాగండి."

"ఏదో తెచ్చినట్టు ఉన్నావుగా....పెట్టు వస్తున్నా."అని లేచి బోరు దగ్గర కాళ్ళు,చేతులు కడుక్కుని వచ్చాడు.

"హ్మ్...."తింటూ భార్యని చూసాడు.తను కొంచెం కోపంగా చూస్తోంది.

"ఎందుకలా చూస్తున్నావ్?"

"లేకపోతే ఏంటి.ఆదివారం వచ్చిందంటే చాలు ఇదే వరస.ఇక్కడికి వస్తే ఇంకేం గుర్తురాదా మీకు."

నవ్వి ఊరుకున్నాడు.....

"ఎమ్మన్నా మాట్లాడు నవ్వే సమాధానామా."

"ఏంది అల్లుడు....పాప అరుస్తా ఉంది."అటుగా వెళుతున్న ఒక ఆడ మనిషి పలకరించింది శీను ని.

"హ అత్త....తినకుండా వచ్చా అని."

"మరీ డాక్టరాయే....పెండ్లాం మాట ఇనకపోయినా డాక్టరమ్మ మాట ఇనాలి కదా మరి."అని నవ్వుతూ పోయింది ఆవిడ.

"నీకు మంచి ఫాలోయింగ్ ఉన్నట్టు ఉందిగా."

"హ్మ్....మరేం అనుకున్నారు."అని కళ్ళెగరేసి నవ్వింది హసీనా.

"సరే మధ్యాహ్నం సినిమాకి వెళ్దామ్ రెడిగా ఉండు."

"మధ్యాహ్ననమా......కుదరదండి."

"ఎం?"

"వసంత పిన్ని వాళ్ళ అల్లుడు వస్తున్నాడంటా...మటన్ బిర్యానీ చేయమంది.ఇప్పుడు అటే వెళ్తున్నా."

అని లేచి,నవ్వుతున్న శీను ని చూసి....ఏంటి అన్నట్టు చెయ్ ఊపింది.

"నువ్వో డాక్టర్ ల లేవు.....పక్కా పల్లెటూరి ఆడపడుచుల ఉన్నావ్."

"హ్మ్...మీరు మాత్రం బ్యాంక్ మేనేజర్ ల ఉన్నారా....పక్కా రైతులా ఉన్నారు.అయినా బి ఏ రోమన్ ఇన్ రోమ్ అన్నారు.ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి."

అని పొలం గట్టు మీద వెళుతూ.....ఆగి...

"అన్నట్టు ఆ కోతి ఎక్కడ పోయింది.ఉదయం అనగా మీతో వచ్చింది.ఇంకా ఇంటికి రాలేదు."

"ఓయ్...నా కుతుర్నేమ్ అనకు."

"మీ కూతురే ఎవరు కాదన్నారు.ఎక్కడ ఉంది అది....ఇటు వస్తే ఇంటికి రమ్మని చెప్పండి.మధ్యాహ్నం అన్నా ఇంటికి వస్తారా....లేక ఇక్కడికే తెమ్మన్టారా."

"వస్తానులే.."

"హ్మ్..."అని వెళ్తున్నా హసీనా ని చూస్తూ.....అక్కడే కూర్చున్నాడు శీను.

'హసీనా.....పెద్ద పెద్ద కార్పోరేట్ హాస్పిటల్స్ లో అవకాశం వచ్చినా....తన కోసం ఇక్కడే ఉండిపోయింది.కేవలం తన కోసం....సిటీ లైఫ్ ని వదిలి,పల్లెటూరికి వచ్చి....పల్లెపడుచుగా మారింది.'

'ఎం ఇవ్వను హసీనా.ఎం ఇచ్చి నీ రుణం తీర్చుకోగలను.నీకు ఎంత ఇచ్చినా,ఎం ఇచ్చినా తక్కువే అవుతుంది.'

"నాన్న..."అంటూ పరిగెడుతూ వస్తున్న నాలుగేళ్ల కూతురు వెన్నెలని మురిపెంగా చూస్తూ.... తనతో కాసేపు ఆడుకుని ఇంటి బాటపట్టారు ఇద్దరు.

@@@@@@

"హసీనా త్వరగా రండి."బైటి నుండి బైక్ స్టార్ట్ చేసి కేకేశాడు శీను.

"హ వస్తున్నాం" అంటూనే వెన్నెలని తీసుకుని వచ్చింది హసీనా.

"అబ్బా ఎప్పుడు లేటేనా."కొంత విసుగ్గుగా అంటున్న కొడుకుని చూసి..

"నా కోడలు కాదు...నీ కూతురే లేటు.తినకుండా తిరుగుతోంది...ఊరంతా పెత్తనాలే కదా దానికి."అంది అక్కడే ఉన్న శీను తల్లి.

"హ్మ్...కోడల్నెమ్ అననీవుగా.వెన్నీ దా."అని కూతుర్ని బైక్ ఎక్కించాడు.

"అమ్మ పనులన్ని అయ్యిపోయాయ్.మీరు మధ్యాహ్నం అన్ని వేడి చేసుకుని తినేయండి."అని అత్తకి చెప్పి తాను బైక్ ఎక్కింది హసీనా.

వెన్నెలని స్కూల్ దగ్గర వదిలి.....స్విమ్స్ లోని పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ లో చైల్డ్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న హసీనా ని బస్ ఎక్కించి.....తను బ్యాంక్ కి వెళ్ళాడు శీను.

ఉదయం ఎంత హుషారుగా బ్యాంక్ లో అడుగు పెడతాడో.... సాయంత్రం పని ముగించుకుని వెళ్లెప్పుడు అంతే హుషారుగా ఉంటాడు శీను.

కష్టమర్లతోను....బ్యాంక్ సిబ్బందితోను చాలా మర్యాదగా,ఓపికగా,స్నేహాపూర్వకంగా నడుచుకుంటూ....మంచి పేరు తెచ్చుకున్నాడు.

రెండుసార్లు ప్రమోషన్లు ట్రాన్సఫర్లు వచ్చినా....కన్నవాళ్ళకి,ఊరికి దూరంగా ఉండటం ఇష్టంలేక....వదులుకున్నాడు.ఈ విషయంలో హసీనా సహకారం చాలా ఉంది.

ఎప్పటిలాగే సాయంత్రం పని ముగించుకుని..బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్న హసీనాని పీకప్ చేసుకుని...స్కూల్ కి వెళ్లి వెన్నెలని తీసుకుని ఇంటికి వెళ్లారు అందరూ.

రాత్రి భోజనాల తరువాత....వెన్నెలను పడుకోబెట్టి.....మేడ మీద ఉన్న శీను దగ్గరికి వచ్చింది హసీనా.

"పడుకుందా?"

"హ్మ్....ఈ మధ్య బాగా అల్లరిపోయింది.నా మాట అస్సలు వినడంలేదు.మీరిచ్చిన అలుసే."

అంది అతని పక్కనే మంచం మీద కూర్చుంటూ.నవ్వాడు శీను...

"నవ్వకండి."

"పోనీలే హసి.చిన్నపిల్ల.ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తుంది అల్లరి."అని ఎటు చూస్తూ ఉన్నాడు శీను.

"ఏమైందండీ.అలా ఉన్నారు?"

"ఎం లేదు హసి.లైఫ్ ఎంత ఫాస్ట్ గా పరిగెడుతోందో కదా.నిన్న మొన్న నేను బ్రతుకుదెరువు కోసం సిటీ కి వెళ్లినట్టు ఉంది."

"సిటీకి వెళ్లడం....పని నేర్చుకోవడం...మేడంని కలవడం.."అని ఆగి హాసినాని చూసాడు.

"ఆవిడ మాట మీద చదువుకోవడం.ఫ్రెండ్స్ తో సరదాగా గడపడం....అంకిత తో ప్రేమ.."అని మళ్ళీ హాసినాని చూసాడు.

తను అదోలా ఉండటం చూసి..

"ఓయ్ ఏంటి ఫీల్ అయ్యావా.ఫేస్ అలా పెట్టావ్."అని నవ్వాడు.

"ఎం తెలియని అమ్మాయి అయితే ఫీల్ అవుతుంది.నేనెందుకు ఫీల్ అవుతా.తరువాత ఎంటో చెప్పండి."

"తరువాతా......ఆక్సిడెంట్...హాస్పిటల్...హసీనా గారి మాటల గారడి.జాబ్ అని అందరికి దూరంగా వెళ్లిపోవడం....నీతో గొడవ....ప్రేమ....పెళ్లి...వెన్నెల...."

అలా చెప్పుకుపోతున్న శీను ని ఆగమని...

"మధ్యలో కొన్ని మర్చిపోయారు తమరు."

"ఎం మర్చిపోయా?"

"గొడవ..ప్రేమ..పెళ్లా..మధ్యలో ఎం జరగలేదా."

"అబ్బా వదలవా నువ్వు.."

"నో ఎందుకు వదలాలి.పెళ్లి చేసుకుందాం అంటే....లేదు హసీనా ముందు ఇల్లు బాగా కట్టాలి అన్నారు.సరే అని ఆగాను.ఇళ్లు పూర్తయ్యిందిగా,పెళ్లి చేసుకుందాం అంటే..."

"లేదు హసీనా....చేజారిపోయిన పొలం కొనాలి అన్నారు.సరే అని మళ్ళీ ఆగాను....అలా రెండేళ్లు వెయిట్ చేశా.కాదు కాదు...టోటల్ గా ఏడేళ్లు వెయిట్ చేశా."

"ఏడేళ్లలేంటి?రెండేల్లే కదా."అయోమయంగా అడిగాడు.

"మీకు మెసేజ్ చేసిన దగ్గరి నుండి వెయిట్ చేస్తూనే ఉన్నాగా.సో టోటల్గా ఏడేళ్లు."

"అబ్బా...మళ్ళీ కొత్త పాయింట్ పట్టావా.ఇక నేనైపోయా.రోజుకోసాయారైనా గుర్తుచేసి సాధిస్తావ్ ఇంక."

"ఎమ్మన్నారు?"కోపంగా చూస్తున్న హాసినాని చూసి...

"ఎంలేదు."అంటూ వెనుక నుండి హత్తుకున్నాడు శీను.

"వదలండి."విడిపించుకుంటున్న తన భుజం మీద గడ్డం ఆనించి....ఇంకా గట్టిగా పట్టుకుని...

"థాంక్యూ హసీనా."అన్నాడు.

"ఎందుకు?"

"నా లైఫ్ లోకి వచ్చినందుకు.నన్ను నడిపించినందుకు.నువ్వు లేకుంటే నేను ఏమయ్యేవాడినో."

"అన్ని వదిలి నాకోసం ఇక్కడికి వచ్చేశావ్.అమ్మ వాళ్ళని బాగా చూసుకుంటున్నావ్.ముఖ్యన్గా నన్ను.....ఈ అవిటి..."

టక్కున వెనక్కితిరిగి, శీను నోరుమూసి...బాధగా,కోపంగా చూస్తూ...

"ఇంకోసారి అలా అన్నారో...."అంది తడికళ్ళతో చూస్తూ.

హసీనా చెయ్ పట్టుకుని,ముద్దుపెడుతూ..."సారీ.ఇంకెప్పుడు అలా అనను."అన్నాడు.

"ఏంటి కొత్తగా మాట్లాడుతున్నారు.థాంక్సులు,సారీలు చేప్తున్నారు.ఏమైంది మీకు?"అంది.

"ఎం కాలేదురా.చెప్పాలనిపించింది.నీకేమైన ఇవ్వాలనిపిస్తోంది.కానీ ఎం ఇవ్వాలో తెలీడంలేదు.నువ్వు చెప్పు ఎం కావాలో."

"నాకేం వద్దు."

"అలా కాదు చెప్పు.ప్లీస్."

"ఎం అడిగినా ఇస్తారా.మాట మార్చకూడదు."

"లేదులే అడుగు."

"మరీ..వెన్నెలకి చాలా బోర్ కొడుతోందట.ఆడుకోడానికి ఎవరు లేకా."

"ఎవరు లేకే....ఊరిలో పిల్లలంత తనకి ఫ్రెండ్సే కదా."

"వాళ్లతో సాయంత్రం వరకు ఆడుకుంటుంది.ఇంటికొస్తే బొరె కదా."

"ఇంట్లో మనం,అమ్మ వాళ్ళు ఉన్నాముగా.ఇంకేంటి?"

"అబ్బా....ట్యూబ్ లైట్...అన్ని అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు చెప్తే గాని అర్ధం కాదా మీకు."అని అతని నుండి విడిపించుకుని, లేచి పిట్టగోడ ఆనుకుని నిల్చుంది.

నవ్వుకుంటూ....లేచి హసీనా దగ్గరికి వెళ్లి..... తనని గాఢాంగా హత్తుకుని...

"నేను నీకేం కావాలో అడిగా.వెన్ని కి కాదు."అన్నాడు.

"నాకు ఇస్తే దానికి ఇచ్చినట్టేగా."

"హ్మ్....సరే.మరి ఎవరు కావాలి.పాప..బాబా.."

"అమ్మో మళ్ళీ ఆ రాక్షసి నాకొద్దు.నాకు మీలాంటి గుడ్ బాయ్ కావాలి."అంది.

హసీనాని ప్రేమగా చూస్తూ....ఆమెని తన గుండెలో దాచుకున్నాడు శీను.

తన పయనం మొదలు పెట్టిన శీను.....ఎటు వైపు తన అడుగులు వేయాలో తెలుసుకుని.....ఎన్ని మలుపులు,ఎన్ని ఇబ్బందులు ఎదురైనా....చివరికి తన గమ్యం చేరుకున్నాడు.

తల్లిదండ్రులకు మంచి బిడ్డగా....భార్యకి మంచి భర్తగా...వెన్నెలకి తండ్రిగా.తన వృత్తిని పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తూ....

ఒక పరిపూర్ణమైన,సంతృప్తికరమైన జీవనం కొనసాగిస్తున్నాడు.

మరి మీ పయనం .....ఎటు వైపు?

సమాప్తం.Rate this content
Log in

Similar telugu story from Romance