Divya Pandeti

Drama

3.6  

Divya Pandeti

Drama

నా పయనం...ఎటు వైపు? 4

నా పయనం...ఎటు వైపు? 4

12 mins
619



అనీల్ ని బస్ ఎక్కించి...రేపు అంకిత ఎం చెబుతుందా అనే....

ఆలోచనాలతో బుర్ర వేడెక్కిపోయి....తాగినా మైకం తలకెక్కి...కళ్ళు మూతలు పడుతున్నాయ్.బైక్ హ్యాండిల్ పైన చేతులు పట్టుతప్పుతున్నాయ్.ఎదురుగా వస్తున్న...వాహనాల వెలుగు...కళ్ళలో పడగానే...కళ్ళు మంటపెడుతున్నాయ్.

తెలియకుండానే.....స్పీడ్ పెంచేసాను....ఒక మలుపు తిరిగేసరికి.....నిస్సత్తువ ఆవహించి....కళ్ళు బైర్లుకమ్మేసరికి...సరైన రూట్ లోనే వస్తున్న...ఒక లారీకి....ఎదురెళ్లి గుద్దుకున్నాను.

లారీ స్పీడ్ తో పాటు.....నా బైక్ కూడా స్పీడ్ గా ఉండటంతో....చాలా బలంగా గుద్దుకున్నాను.

బైక్ పైనుండి.....పక్కకి పడ్డాను.....తల బలంగా నేలను తాకడం తెలిసింది.ఎడమవైపుకి పడటంతో....ఆ పక్కంతా భరించలేని నొప్పిగా అనిపించింది.మత్తు వల్లో....దెబ్బలు తగలడం వల్లో.....చాలా నిస్సత్తువగా అనిపించింది.

కళ్ళు మూతలు పడుతున్నాయ్.వొళ్లు గాల్లో తేలిపోతున్న భావన.

ఆ క్షణం....ఇదే నా చివరి క్షణాలా అని భయంవేసింది.నేను మళ్ళీ చదువుకుంటున్న అని చెప్పినప్పుడు...అమ్మ మొహంలో విరిసిన నవ్వు గుర్తొచ్చింది.నాన్న ఆప్యాయంగా.....హత్తుకున్న,ఆ ఆలింగనంలోని తడి గుర్తొచ్చింది.

నా మీద అభిమానంతో....నాకో ఉపాధి కలిపించినా బాబాయ్ గుర్తొచ్చాడు.నా మీద నమ్మకంతో...నా ఆలోచనని మార్చి,నాకు దిశానిర్ధేశం చేసి...నాకో గమ్యాన్ని చూపించిన మేడం గుర్తొచ్చారు.

ఆటోలో వెళ్లు అని కంగారుగా పదేపదే జాగర్త చెప్పిన అనీల్.నేను జీవితం పంచుకోవాలని ఆశపడినా అంకిత.....

మళ్ళీ వీళ్ళందరిని చూడగలనా....నేను అనుకున్నది సాధించగలనా.మళ్ళీ తాను వచ్చేసరికి...నేను మంచి పొజిషన్ లో ఉండాలి అని అడిగిన మేడం ఆశ తీరుతుందా.ఒకవేళ అంకిత నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయం తీసుకుంటే......నేననే వాడినే లేకపోతే తన పరిస్థితి ఏంటి.

ఇంకా ఆలోచించలేకపోయాను....నా చుట్టు చేరిన జనాల మాటలు లీలగా వినిపడుతున్నాయ్.కొందరు జాలిగా మాట్లాడుకుంటుంటే,మరికొందరు తాగి లారీ కింద పడ్డాడు,తాగుబోతోడు....అని చీదరంగా అంటున్నారు.

నేను తాగుబోతునా....ఆ మాటే తట్టుకోలేకపోయాను.మగతలోకో లేక శాశ్వత నిద్రలోకో....మెల్లగా జారుకున్నాను.

@@@@@@

నా వైపు దూసుకొస్తున్న లారిని చూసి...గుండెజారీనటై...గబుక్కున కళ్ళు తెరిచాను.పదే పదే అదే దృశ్యం నా కళ్ళ ముందు మెదులుతూ ఉంటే...ఒళ్ళంతా చెమటలు పట్టేశాయ్.

కానీ చల్లని గాలి నన్ను తాకుతు,శరీరాన్ని సెదతీరుస్తుతుంటే......హాయిగా అనిపించి,కళ్ళు గట్టిగా మూసుకుని....నిశ్శబ్దంగా ఉన్న...ఆ ప్రదేశంలో....టింగ్,టింగ్ మని బీప్ సౌండ్ చేస్తున్నదేమిటా అని కళ్లు తెరిచాను.

తల పక్కకు తిప్పాలని చాలా ప్రయత్నించాను...కానీ నావల్ల కావడంలేదు.కష్టంగా తిరిగి చూసా....నేను బ్రతికే ఉన్నా అని చెప్పడానికి,నా గుండె చప్పుడుని,నా రక్తప్రసరణ వేగాన్ని చూపిస్తున్న మెషిన్ ల శబ్దాలు అవి.

నేను హాస్పిటల్ లో ఉన్నాను అని త్వరగానే అర్ధం అయింది.ఆ రాత్రి జరిగిన సంఘటన ఇంకా నా కళ్ళ ముందే ఉంది.తల భారంగా అనిపించి...నరం మెలిపెట్టినటై...భరించలేక తల పట్టుకోవాలని అనుకుంటే...నా చేయి నా మాట వినడంలేదు.

ఎటు కదలలేకపోతున్నాను.నా శరీరం నా ఆధీనంలో లేదు.ఎంత ప్రయత్నించినా....వీలు కావడంలేదు.ఎందుకో భయంవేసింది.....బాధ,కోపం....ఉన్నపళంగా వచ్చేసాయ్.

ఇంతలో ఎవరో తలుపు తెరిచినట్టు అనిపించి...

"ఎవరు?"అడిగా....నా గొంతు నాకే వినిపించలేదు.

నా ముందుకు వచ్చి,నేను కళ్ళు తెరిచి ఉండటం చూసి....చిన్నగా నవ్వుతూ...

"ఇప్పుడు ఎలా ఉంది సార్?"అడిగింది సిస్టర్.

హ్మ్...కళ్ళు ఆర్పాను

"మీరు కదలకుండా పడుకోండి....కాసేపట్లో డాక్టర్ గారు వస్తారు."అని నాకు పెట్టిన సెలైన్ ని తీసేసి....వెళ్ళింది.

సిస్టర్ చెప్పినట్టుగానే డాక్టర్ వచ్చాడు.

"హౌ అర్ యు ఫీలింగ్ మై యంగ్ బాయ్."అంటూ చాలా ఫాస్ట్ గా వచ్చాడు....డాక్టర్.

వస్తూనే నన్ను చెక్ చేసి.....నా మెడికేషన్ చేంజ్ చేసి.పక్కన ఉన్న స్టూల్ ని....నా బెడ్ పక్కకి జరుపుకుని రిలాక్స్ గా కూర్చుంటూ చేతులు కట్టుకుని నన్ను చూసాడు.

అప్పటికే సిస్టర్ నేను ఉన్న బెడ్ ని....సిట్టింగ్ పొజిషన్ కి మార్చింది.

"వెల్....ఇప్పుడు నేను చెప్పేది,జాగర్తగా విను.టెన్షన్ పడకు సరేనా."అన్నాడు నా చేతిని,తన చేతిలోకి తీసుకుంటూ.

సరే అన్నట్టు తల ఊపి ఆయన్నే చూస్తూ ఉన్నా.

"చూడు శీను.నీకు జరిగింది మేజర్ ఆక్సిడెంట్.నీ తలకి బలమైన గాయం అయింది.బ్లడ్ క్లాట్ అయ్యింది.ఇప్పుడు దాని వల్ల ఎం ప్రాబ్లెమ్ లేదు.నీ ఎడమ మోచేతి పైన,ఫ్యాక్చర్ అవ్వడం వలన...ఆపరేషన్ చేసి,అక్కడ రాడ్ పెట్టాం."అని ఆగాడు.

ఆయన ఇప్పటివరకు చెప్పింది వినేసరికే...నా మెదడు మొద్దుబారిపోయింది.ఇంకా ఎం చెప్తాడా అని భయం పట్టుకుంది....అతను అలా ఆగేసరికి.

"శీను.....నీ కాలికి ఇప్పటికి మూడు సర్జిరీలు చేసాం కానీ...ఎలాంటి ఉపయోగంలేదు.ఇకపై నువ్వు సరిగ్గా నడవలేవ్."అన్నాడు నా కళ్ళలోకి చూస్తూ....నా చేతిని గట్టిగా నొక్కుతూ.

సరిగ్గా నడవలేను.....అంటే నేనిప్పుడు అవిటివాడినా.ఆ మాట....ఆ మాటకె....నా తలలోని నరాలు చిట్లిపోతునంత బాధ.అది నా మొహంలో కనిపించిందేమో.

"రిలాక్స్ శీను.అంత పెద్ద ఆక్సిడెంట్ జరిగినా,నువ్వు బ్రతకడమే...గొప్ప.రెండు నెలలుగా మృత్యువుతో పోరాడి....బ్రతికావ్.శరీరం....ఈ మందులకి,ఆపరేషన్ లకి తట్టుకోలేకపోయినా....బ్రతకాలి అనే నీ మొండితనం,నీ పట్టుదలే నిన్ను ఇలా మళ్ళీ కొలుకునేల చేసింది."

ఆశ్చర్యంగా,బాధగా....డాక్టర్ మాటలు వింటున్న నాకు..... రెండు నెలలు అన్న మాట కలవరపెట్టింది.

"అవును శీను. నీకు ఆక్సిడెంట్ జరిగి సరిగ్గా ఈరోజుకి రెండు నెలల....ఒక్క వారం గడిచింది.బ్లడ్ క్లాట్ అవ్వడం వలన.....ఇన్నిరోజులు నువ్వు కోమాలో ఉన్నావ్.రెండు నెలలుగా కదలకుండా ఉండటం వల్ల....మసేల్స్ రెస్ట్ లో ఉన్నాయ్ కదా.సో...వెంటనే కదలాలి అని ట్ర్య్ చేయకు.ఫీషియోథెరపిస్టు వచ్చి.....నిన్ను మెల్లగా నడిపిస్తారు."

"ఒక నెలరోజులు జాగర్తగా ఉంటే....ఇదివరకటిల నార్మల్ అవుతావ్.అల్ థి బెస్ట్ శీను.ఎక్కువ ఆలోచించకు.రెస్ట్ తీసుకో."అని వెళ్ళిపోయాడు డాక్టర్.

ఆలోచించకుండా ఎలా ఉండను.రెండు నెలలుగా నేను ఈ బెడ్ మీదే పడి ఉన్నానా.ఇకపై సరిగ్గా నడవలేను....అసలు నా ట్రీట్మెంట్ కి డబ్బు ఎలా వచ్చింది.అప్పు చేసి ఉంటారు.నాన్న....అమ్మ....ఎక్కడా?

నేను అలా ఆలోచిస్తుండగానే...అమ్మ కొంత ఆనందంగా,కొంత బాధగా చూస్తూ లోపలికి వచ్చింది.

వస్తూనే కన్నీళ్లని ఆపుకుంటు...నా తల దువ్వుతూ...."ఇప్పుడు ఎట్లుందిరా?"అని అడిగింది.

హ్మ్....అని తల ఊపి.అమ్మని పరిశీనాలగా చూసాను.సరైన తిండి,నిద్ర లేనట్టు....మోహమంత పిక్కుపోయింది.అమ్మ ఎప్పుడు మహాలక్ష్మిల కళకళలాడుతూ ఉండాలని అనుకుంటే....ఈరోజు తన వల్లే అమ్మ ఇలా ఉండేసరికి నా మీద నాకే కోపం వచ్చింది.

ఒక్కొక్కరు వచ్చి నన్ను చూస్తున్నారు....కానీ నాతో ఎం మాట్లాడటంలేదు.వాళ్ళ కళ్ళలో బాధ కనబడుతోంది కానీ....కోపం లేదు.నిజానికి అందరికి నా మీద కోపం ఉండాలి.నేను చేసిన పనికి.తప్పతాగి ఆక్సిడెంట్ చేసినందుకు.కానీ...వీళ్ళ జాలిని నేను తట్టుకోలేకపోతున్నాను.

రోజు ఫీషియోథెరపిస్టు వచ్చి.....నాతో ఎక్సర్సైలు చేయిస్తూ....నన్ను మెల్లగా నడిపిస్తూ ఉండేది.వారంరోజుల్లో ఎవరు పట్టుకోకపోయినా నిలబడగలిగాను.ఒకరి సాయంతో నడవగలుగుతున్నాను.కానీ లేవాలన్న.....కూర్చోవాలన్న ఒకరు సాయం చేయాల్సిందే.

నేను సృహలోకి వచ్చిన పదిరోజులకి డిశ్చార్జ్ చేశారు.

@@@@@@

ఇంటికి వచ్చాకా....ఒక్కో ప్రశ్న నన్ను తొలిచేస్తు వచ్చాయి.డబ్బు ఎక్కడిది?నేను కళ్ళు తెరిచినా అంకిత ఎందుకు నన్ను చూడటానికి రాలేదు.అసలు సింధు ఎక్కడా?తను కూడా కనిపించలేదు.

"శీను....బోంజేయరా.లేయ్."అని నన్ను లేపి కూర్చోబెట్టింది అమ్మ.

నాకు తినిపించబోతే వద్దని నేనే తిన్నాను.

"పడుకుంటావా అయ్యా?"

"లేదమ్మా.ఇలా కూర్చో....నీతో మాట్లాడాలి."అంటే అక్కడే కూర్చుంది.

"ఏంట్రా అయ్యా?"

"అమ్మ నా ట్రీట్మెంట్ కి డబ్బు ఎలా వచ్చింది.శెట్టి దగ్గర అప్పు చేసారా.లేక బాబాయ్ ఇచ్చాడా?"

అమ్మ మాట్లాడలేకపోతోంది....చీర కొంగు,నోటికి అడ్డు పెట్టుకుని,బాధని ఆపే ప్రయత్నం చేస్తోంది.

"అమ్మ ఏమైంది చెప్పు."ఆతృతగా అడిగా.

"మన పొలం అమ్మేసాం రా."అంది ఇంక ఆపుకోవడం వీలుపడక ఏడుస్తూ.

అయిపోయింది...అంతా అయిపోయింది.ఏ పొలం మా చెయ్ జారిపోకూడదు అని నేను ఇక్కడికి వచ్చానో. ఇప్పుడు ఆ పొలం నావల్ల...కేవలం నేను చేసిన పని వల్ల...మాకు దూరమైంది.

"శెట్టిని అప్పు అడిగితే...పొలం తాకట్టు పెట్టమని అడిగాడు.ఆస్పత్రిలో ఎంత అవుతాదో తెలియకపాయా.....శెట్టి ఇంతా అని పత్రం రాసిస్తేనే,పైకం ఇస్తా అన్నాడు."

"బాబాయ్....అప్పు చేయకండి,నేను డబ్బు సర్దుతాను అని కొంత తెచ్చి ఆస్పత్రిలో కట్టాడు. బ్యాంకులో ఉన్న డబ్బు కూడా తేబోయాడు.ఈ ఇల్లు తాకట్టు బెట్టబోయాడు.కానీ అప్పుడే సింధు కోసం చూసిన సంబంధం కుదిరింది.ఆ అబ్బాయి...ఇరవై రోజుల్లో వేరే దేశం ఎల్లిపోవాలి అని...పెళ్లి త్వరగా జరిపించమని తొందరజేశారు."

"పాపం మీ బాబాయ్ ఎటు తేల్చుకోలేకపోయాడు.సింధు కి మరో మంచి సంబంధం వస్తుంది....కానీ ఆలస్యం చేస్తే,శీను కొలుకోలేడు అని.....వాళ్ళకి సంబంధం వద్దని చెప్పబోయాడు."

"మీ అయ్యా వారించి....సింధు జీవితం బాగుండాలి అని....శెట్టి కి మన పొలం అమ్మేసి డబ్బు తెచ్చినాడు.ఆడా ఇంకేం పని ఉండాదని....అక్కడ ఉండటం అని బాబాయ్ మమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పాడు."

"సింధు ఇప్పుడు వాళ్ళ అత్తవారింట ఉంది.ఆ అబ్బాయి....వేరే దేశం పోయాడు.రెండు దినాల్లో వస్తది సింధు."

"నువ్వు బాధపడమాకయ్య.నువ్వు కొలుకో ముందరా.పోయినవన్ని మళ్ళీ సంపాయించుకోవచ్చు."అని నన్ను మెల్లగా పడుకోబెట్టి,తలుపు వారగా లాగి వెళ్ళింది అమ్మ.

@@@@@

ఆ రాత్రి కంటి మీద కునుకులేదు.మనసుకు ప్రశాంతత లేదు.నా మీద నాకే కోపం,అసహ్యం....అసలు నేను ఎందుకు బ్రతికాను.

అక్కడే చచ్చి ఉంటే.....ఒక నెల ఏడ్చి,అందరూ మర్చిపోయేవారు.ఇంత మందిని బాధపెట్టడానికా నేను బ్రతికింది.ఇంకా ఎం సాధిద్దాం అని...

అసలు ఇంక నేను ఎం చేయగలను..కనీసం సరిగ్గా నడవలేని నేను....ఎం చేస్తా....నాకేం చేతనవుతుంది.

ఊరిలో చాలామంది....దిగుబడి రాక,అప్పు కట్టలేక....ప్రభుత్వం అందించే సాయం సరిపోక.ప్రాణాలు తీసుకున్నారు.తాము పోతే.....ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో కనీసం తమ కుటుంబమైనా....ఒడ్డున పడుతుందని.

ప్రాణం తీసుకునేంత ధైర్యం లేని వారు.....పొలం అమ్ముకుని...బ్రతుకుతెరువు వెతుక్కుంటూ....సిటీలోని అపార్ట్మెంట్లల్లో వాచ్మాన్లుగా మారారు.

కానీ నాన్న ఎన్ని కష్టాలు వచ్చినా.....మమ్మల్ని వదిలి వెళ్లాలని కానీ,పొలం అమ్మాలనే ఆలోచన గాని చేయలేదు.కానీ ఇప్పుడు నాకోసం అమ్మేశాడు.అలా చేసినందుకు నాన్న ఎంత బాధపడి ఉంటాడు. నన్ను ఎంత ప్రేమగా పెంచాడో.....అంతకన్నా ప్రేమగా మా పొలాన్ని కాపుకాసిన నాన్నకి...తన రెండో బిడ్డని దూరం చేసాను.ఛా...

చివరిసారి నేను ఊరు వెళ్ళినప్పుడు,నేను పని చేసుకుంటూనే చదువుకుంటున్నా అని తెలిసి అందరూ మెచ్చుకున్నారు.ఊరిలో కుర్రాలకి నన్ను ఉదాహరణగా చూపిస్తూ,శీను ల ఉండండిరా అంటుంటే...ఎంత పొంగిపోయారు అమ్మ వాళ్ళు.

ఇప్పుడు ఈ విషయం తెలిసి....ఊళ్ళో ఎన్ని మాటలు అనుకుంటూ ఉంటారో.అందుకే నాన్న అక్కడ ఉండలేకా ఇక్కడే ఉండాలని అనుకోని ఉంటాడు.చా....ఏదో చేద్దామని వచ్చి....చివరికి ఎం చేసాను.అమ్మ,నాన్నల్ని.....చూసుకోవాల్సిన నేను.ఇప్పుడు వాళ్ళ మీదే ఆధారపడవలసిన పరిస్థితి వచ్చింది.

@@@@@@

రోజంతా ఇంట్లోనే,అదీ గదిలోనే ఉంటున్నాను.కనీసం హాల్ లోకి కూడా వెళ్లడంలేదు.బాబాయ్ కి ఎదురుపడాలన్న మొహం చెల్లడంలేదు.ఆయనే వచ్చి మాట్లాడించినా ముక్తసరిగా మాట్లాడి ఊరుకుంటున్నా.

ఒకరోజు రాత్రి బోజనమ్ చేసి,అమ్మ ఇచ్చిన టాబ్లెట్ వేసుకుని అలా కళ్ళు మూసుకున్నానో లేదో...

"అన్నయ్య."అంటూ పిలిచింది సింధు.

సింధుని చూడగానే ఎక్కడలేని...ఆనందం,ఉత్సాహం వచ్చాయ్.కొత్తపెళ్లి కూతురు.....ఇంకా ఆ మెరుపు,ఆ కళ తగ్గలేదు తన మొహంలో.

నేరుగా వచ్చి.....బెడ్ పైన కూర్చోని,"ఎలా ఉన్నావ్ రా?"అంది నన్నే చూస్తూ.

ఎలా ఉన్నా అని చెప్పనూ.తన పెళ్లికి ఏదేదో చేయాలని....బాబాయ్ కి ఒక కొడుకుగా,సింధు కి అన్నగా....నా బాధ్యత నెరవేర్చాలని అనుకున్నాను.కానీ...కనీసం సింధు పెళ్లి కళ్లారా చూడలేకపోయాను.

ఇప్పుడు నేను బాధపెడితే సింధు కూడా ఏడుస్తుందని....

"నేను బాగున్నారా.బావ గారు ఎలా ఉన్నారు?ఎప్పుడొస్తారు?"

"ఇంకో ఆరు నెలలు రారు.అంతవరకు....నేను ఖాళిగా ఉండటం ఎందుకు అని.నన్ను ఇక్కడే ఉండి జాబ్ చేయమన్నారు.ఆయన తిరిగొచ్చాకా...... విజయవాడ తీసుకెళ్తా అన్నారు."

"హో బావగారిది విజయవాడ.అక్కడేగా అనీల్ వాళ్ళు ఉండేది..నీకు కొంచెం దైర్యంగా ఉంటుందిలే.అవును ఒక్కదనివే వచ్చావా?"

"లేదు అనీల్ వచ్చాడు."అంది.

"ఏడి వాడు?"అని నేను గుమ్మం వైపు చూస్తే,తలుపు పక్కనే నిలబడి ఉన్నాడు అనీల్.

"అదేంట్రా అక్కడ ఆగిపోయావ్?రా."

వచ్చాడు గాని.....నన్ను చూడడంలేదు.వాడి చెయ్ పట్టి లాగి కూర్చోబెట్టా.

"ఏంట్రా అలా ఉన్నావ్?"

"నన్ను క్షమించారా శీను. నావల్ల...నావల్ల..నీకిలా..అయ్యింది.నేను ఆ రోజు బార్ కి వెళ్లకుండా ఉనుంటే....నువ్వూ..."

వాడికి మాట్లాడ్డం కావడంలేదు.తన వల్లే నాకిల అయ్యిందని..కుమిలిపొతున్నాడు.ఏన్నిరోజులుగా,ఈ మాటలు నాకు చెప్పాలని అనుకుంటున్నాడో..

తీరా చెప్పే సమాయనికి....గొంతు పెగలడం లేదు.బాధ నోరు నొక్కేస్తోంది.వాడు అలా ఏడవటం మొదటిసారి చూస్తున్నా నేను.

"రేయ్.ఊరుకోరా.నువ్వు తాగమని అనలేదుగా.పైగా...నన్ను ఆటోలో వెళ్ళమని చెప్పావ్.నేనే వినలేదు.తప్పు నాది.నువ్వేం చేయలేదురా."వాడి భుజం చుట్టూ చెయ్ వేసి ఓదార్చే ప్రయత్నం చేసాను.

తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు.నా చెయ్ గట్టిగ పట్టుకుని....చాలాసేపు ఉండిపోయాడు.

వాడితో కబుర్లు చెప్తూ....వాడి చదువు గురించి అడిగి తెలుసుకుంటూ...రాత్రి ఎప్పటికో నిద్రపోయాను.

మధ్యరాత్రి ఉలిక్కిపడి లేచిసరికి....నామీద చెయ్ వేసి,నిదట్లోనే నాకు జోకొడుతున్నాడు అనీల్.వాడిని నవ్వుతూ చూసి....

తన తప్పు లేకపోకపోయినా....అనీల్ అంతలా బాధపడటం.నా గురించి ఏడవటం....తలుచుకుని ఒకపక్క బాధ,మరోపక్క సంతోషం.

మరి అంకిత ఏదీ.... నేను ఇంటికొచ్చి ఇన్నిరోజులైనా ఎందుకు రాలేదు.తన గురించి ఎవరిని అడగాలి.తన ఫోన్ నెంబర్ కూడా పనిచేయడంలేదు.

అవునూ అనీల్ కి మా గురించి తెలుసు కదా.ఉదయం వీడిని అడగాలి....అనుకుని,ప్రశాంతంగా పడుకున్నాను.

@@@@@@

సింధు,అనీల్ ఉండటంతో ఇంట్లో సందడిగా ఉంది.సింధు.....ఆఫీస్ కి వెళ్ళింది.తను ఇన్నిరోజులు లీవ్ లో ఉందట.సాయంత్రం అనీల్ టీవీ చూస్తూ ఉంటే..

"రేయ్ అనీల్.నన్నలా....బైటికి తీసుకెళ్లారా."అని అడిగా.

"హ పదరా."అని నన్ను జాగర్తగా బైక్ ఎక్కించుకుని పార్క్ కి తీసుకెళ్లాడు.

మబ్బులు ముసురుకుని ఉన్నాయ్.చల్లటి గాలి వేస్తోంది.మూడునెలల తరువాత బైటికి వచ్చాను.ఇంట్లో వాళ్లను కాకుండా బైటి వారిని చూస్తున్నాను.

పక్కన ఉన్న గుడి నుండి....భక్తి గీతాలు వినిపిస్తున్నాయ్.వాటిని వింటూ....తాజా గాలిని ఆస్వాదిస్తూ ఉంటే....మనసుకు చాలా హాయిగా అనిపించింది.

"రేయ్ అనీల్. ఒకటి అడుగుతా నిజం చెప్తావా?"

"అడగారా."

"అంకిత ఏదీరా?"

వాడు తడబడటం గమనించా.

"నిజం చెప్పరా.నాకు ఇలా అయినా తను రాలేదు,ఇంటికి వచ్చాకా కూడా రాలేదు.ఏమైంది?"

"ఇప్పుడు అవ్వన్ని ఎందుకురా.పదా ఇంటికి వెళ్దామ్."అని లేచాడు.

"రేయ్..."అని నేను ఏదో అడిగేలోగా..వాడి ఫోన్ మోగింది.

"చెప్పు బాబాయ్......శీనుని తీసుకుని పార్క్ కి వచ్చా బాబాయ్.....అవునా,సరే శీనుని ఇంట్లో వదిలి వస్తా."అని కట్ చేసి నన్ను చూసాడు.

"నేను రాను.కాసేపు ఇక్కడే ఉండాలని ఉంది.నువ్వేలు అనీల్."

"అది కాదురా.వర్షం పడేలా ఉంది.బాబాయ్ అర్జెంట్ గా రమ్మన్నాడు.పదా."

"చెప్పానూ కదరా.రాను అని.వెళ్లు."అని అరిచా.

చెప్తోంది అర్థం చేస్కోట్లేదని వాడికీ కోపం వచ్చిందేమో....నా పాకెట్ లో డబ్బు పెట్టిపోయాడు.

వాడు వెళ్లిన కాసేపటికే చిన్న తుంపర మొదలైంది.ఆ వానలో తడుస్తూ....నా కన్నీళ్లని కలిపేసాను.

@@@@@

"శీను...."

ఆ గొంతు....ఆ గొంతు విని....మొదట ఆశ్చర్యం, తరువాత సంతోషం.....అంతలోనే భయపడ్డాను.

పక్కకి తిరిగి చూడాలన్న....గాభారా, తప్పు చేసినా పశ్చాత్తాపం.

తను వచ్చి నా పక్కన కూర్చుంది.నేను తనకి మొహం చూపలేక....అటు తిప్పుకున్నన్నాను.

"ఏంటి శీను.పిలుస్తుంటే పలకవు."అంది చనువుగా నా భుజంపై చెయ్ వేస్తూ.

నా నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో...మళ్ళీ తనే.

"ఎలా ఉన్నావ్?ఇప్పుడేం చేస్తున్నావ్?"అంది.

ఇంకా మౌనంగా ఉండటంతో అర్ధంలేదని...

"ఏమి చేయలేని పరిస్థితిలో.....ఇలా నిర్జీవంగా ఉన్నాను మేడం."అన్నాను.

ఆ మాటలు చెప్పడానికి కూడా నాకు కాస్త సమయం పట్టింది.

"ఏంటి శీను అలా మాట్లాడుతున్నావ్?ఏమైంది?"కంగారుగా అడిగింది మేడం.

"ఒకసారి లేస్తారా మేడం."అన్నాను ఆవిడని చూడకుండానే.

లేచి నిల్చొని నన్ను చూస్తున్న ఆవిడకి....నా చెయ్ ఇచ్చాను.ఆవిడ పట్టుకోగానే....అతి కష్టం మీద లేచి నిల్చున్నాను.

ఆవిడ అయోమయంగా చూస్తూ ఉంటే....తల దించుకుని,జరిగింది చెప్పాను.

"మీరు నన్ను ఎలా చూడాలనుకున్నారు.చివరికి నేనెలా అయ్యాను.సరిగ్గా నిలబడలేని స్థితికి వచ్చాను.మీకు మొహం చూపలేను."

"మీరు నా మీద ఎంత నమ్మకంగా ఉన్నారో నాకు తెలుసు.అలాంటిది ఇలా నన్ను చూస్తే మీకు కచ్చితంగా కోపం వస్తోందని నాకు తెలుసు.మీరు నన్ను..."

అని నేను ఇంకా ఏదో చెప్పబోయేలోగా...నా చెంప చెళ్లుమనిపించింది మేడం.

"ఛి....చేయాల్సిందంతా చేసి.ఇప్పుడు బాధపడితే ఎమ్మోస్తుంది.నాకు కోపం కాదు...నీ మీద అసహ్యం వేస్తోంది.నీలాంటి వాడికోసమా ఇన్నాళ్లు నేను ఆలోచించింది అని.ఇలాంటి వాడినా నేను....ప్రా..."అని టక్కున ఆగిపోయింది.

"ఒడిపోయావ్ శీను...నువ్వు ఓడిపోయి,నన్ను వెర్రిదాన్ని చేశావ్.నాకు చాలా బాగా బుద్దిచెప్పావ్.నిన్ను పైకి తీసుకురావాలని....అందరూ నిన్ను మెచ్చుకుంటు ఉంటే,నేను గర్వపడాలని....అనుకున్న నా ఆశని చంపేశావ్."

"ఐ హేట్ యు శీను.ప్రపంచంలో నేను అసహ్యించుకునే మొదటి ఆఖరి మనిషివి నువ్వే.నువ్వు మాత్రమే."

అంటున్న మేడం గొంతులో బాధ,నామీద కోపం....నన్ను చూస్తూనే,అక్కడి నుండి...చాలా వేగంగా వెళ్ళిపోయింది.

బెంచ్ మీద కష్టంగా కూర్చుని....అప్పటివరకు నిలబడే ఉండటంతో,మోకాలి దగ్గర మొదలైన నొప్పి.....ప్రాణం పోతేబాగుండు అనిపించేంత బాధ.

అది కాలి నొప్పికా....లేక మనసుకి తగిలిన గాయనికా. ఆ క్షణం అంకిత ఎందుకు రాలేదు అనే బాధకన్న....మేడం మాటలే నా గుండెని మెలిపెడుతున్నాయ్.ఆవిడ దృష్టిలో ఇంత దిగజారిపోతానని ఏనాడు ఊహించలేదు.

క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోయాను.కొంతలో కొంత ఊరట....అందరూ నేను చేసిన దానికి,తిట్టలేదని....కుమిలిపొతుంటే,మేడం కొట్టిన చెంప దెబ్బ....వెయ్యి దెబ్బలకి సమానంగా తోచాయి.

చాలసేపటి తరువాత వచ్చిన అనీల్.....నేను వర్షంలో తడుస్తూ ఉండటం చూసి,నన్ను తిట్టి ఇంటికి తీసుకెళ్లాడు.

@@@@@@

మరుసటిరోజు జ్వరం పట్టుకుంది బాగా.కళ్ళు కూడా తెరవలేకుండా,ఏమి తినలేక పోతుంటే.....అమ్మ మెల్లగా జ్యూస్ తాగించి....టాబ్లేట్లు వేసింది.

మాగన్నుగా నిద్రపోతున్న నాకు.....ఎవరివో మాటలు లీలగా వినిపిస్తున్నాయ్.నేను ఉన్న గది...ఇంటి వెనుక వైపు పెరడు దగ్గర ఉంది.

కిటికీ దగ్గర మంచం వాల్చుకుని....సింధు ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపించింది.

మందుల ప్రభావంతో ఒంట్లో కొద్దిగా సత్తువ వచ్చింది.ఇంక నిద్ర పట్టలేదు.....ఇప్పుడు కాస్త గట్టిగానే వినిపిస్తోంది వాళ్ళ మాటలు.

"ఎలా జరిగింది సింధు?"

ఆ గొంతుని గుర్తుపట్టడానికి ప్రయత్నించాను.

"ఏంటో..... ఎం అర్ధం కావడంలేదు.ఒక్క రాత్రిలో అంతా జరిగిపోయింది."

"విషయం తెలిసి నమ్మలేకపోయాను.శీను...శీను... తాగడం.ఇలా ఆక్సిడెంట్."

ఆ గొంతులో ఎంత బాధ.ఎవరిదా గొంతు...ఆలోచిస్తూనే...గుర్తుతెచ్చుకున్నాను...అది... మేడం దా....కాదు హసీనా స్వరం.

"ఇప్పుడు ఎలా ఉంది శీను కి?"

"పూర్తిగా కొలుకున్నాడు.కానీ ఇకపై సరిగ్గా నడవడం కష్టం.ఎడమ కాలు...కొద్దిగా వంగి ఉంది.అందుకే."

హసీనా గొంతు వినిపించలేదు...కాసేపు ఇద్దరు మాట్లాడలేదు.తరువాత హసీనా....

"అన్నట్టు అడగడం మర్చిపోయా.అంకితకి పెళ్ళయిందంట.నాకు చెప్పనే లేదు ఎవరు...."

"హే షూ....గట్టిగా మాట్లాడకూ.అన్నయ్య వింటాడు."కంగారు పడింది సింధు.

కానీ అప్పటికే ఆ మాట నా చెవులను చేరి....మనసు నమ్మలేక....గుండె తట్టుకోలేక కొట్టుమిట్టాడుతోంది.నాలోని ప్రాణాన్ని ఎవరో చేత్తో తీసిపడేసినట్టు.....తల పగిలిపోతున్నట్టు.కళ్ళ నుండి బాధ కన్నీళ్లు రూపంలో నన్ను తడిపేస్తున్నాయ్.

"నిద్రపోతున్నాడుగా.అయినా.....శీను వింటే ఏంటి?"

"హసి...నీకు చాలా విషయాలు తెలియావు.అన్నయ్య,అంకిత ప్రేమించుకున్నారు."

"అవునా...!"

"హ్మ్...అన్నయ్యకి ఆక్సిడెంట్ జరిగిన రోజు రాత్రి అంకిత వాళ్ళ ఇంట్లో అన్నయ్య గురించి చెప్పిందటా.వాళ్ళ నాన్న...చదువులేదు,ఆస్తి లేదు..మంచి ఉద్యోగం లేదు అని ఒప్పుకోకపోవడంతో...చాలా బ్రతిమాలిందట."

"వాళ్ళ నాన్న ఏమాత్రం కరగపోవడంతో.....ఆ పిచ్చిది,చావడానికి ప్రయత్నించింది.ఎలాగో దాన్ని కాపాడి.....మా నాన్నతో మాట్లాడతానని చెప్పారంట."

"ఆ రోజు రాత్రే అన్నయ్యకి ఆక్సిడెంట్ అయ్యిందిగా.....మాకు తెలియదు అసలు.ఉదయం విజయవాడ చేరుకున్న అనీల్....అన్నయ్యకి కాల్ చేస్తే ఎవరో చెప్పారు.వెంటనే మాకు చెప్పడంతో హాస్పిటల్ కి వెళ్ళాం."

"అసలే అన్నయ్యకి అలా జరిగిందని ఏడుస్తుంటే...అక్కడికి అంకిత వాళ్ళ నాన్న వచ్చారు.నానాగోడవ చేశారు.ఈ తాగుబోతోడి కోసమా...నా బిడ్డ చావడానికి కూడా సిద్ధపడింది.ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వను అని...అరిచి వెళ్ళాడు."

"మాకేం అర్ధంకాలేదు...అనీల్ కి కాల్ చేసి అడిగితే విషయం చెప్పాడు అప్పుడే మాకు తెలిసింది.అన్నయ్య కి చెప్పలేదు.తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని భయంగా ఉంది."

సింధు చెప్పినా ఒక్కొమాటా.....నా గుండెల్లో తుట్టాల్లా దిగుతున్నాయ్.ఇంత జరిగిందా....నాకు ఇలా అయ్యిందని బాధలో ఉన్న వాళ్ళు.....అంకిత వాళ్ళ నాన్న చేసిన గోడవకి ఇంకెంత బాధపడివుంటారు.

బాగుపడతానని నన్ను ఇక్కడికి పంపిస్తే....ప్రేమ అంటూ,తాగి ప్రాణం మీదకి తెచ్చుకున్నా అని నన్ను ఎంత అసహ్యించుకునీ ఉంటారు.ఛా.....నాలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదు.

అంకిత.......అంకిత నాకోసం ప్రాణాలు తీసుకోడానికి సిద్ధపడిందా.తనకు నామీద ఇంత ప్రేమ,నమ్మకం కలిగాయ్.ఎప్పుడు వాళ్ళ నాన్నకి భయపడే తను.....నాకోసం తండ్రిని ఎదిరించిందా.

అంకితకి పెళ్లి అయిపోయింది అని తెలిసినప్పుడు వచ్చిన కన్నీళ్లు....ఇప్పుడు రావడంలేదు.అంకిత ముందుగానే తన అభిప్రాయం చెప్పి ఉంటే....అప్పుడు పరిస్థితి ఏంటి.

ఇప్పుడు అంకిత మరొకరి భార్య....నన్ను చేసుకోకపోవడమే మంచిదైంది.తన దృష్టిలోను నేనొక తాగుబోతుగా మారాను.అది మంచిదేలే.ఎందుకో ఇప్పుడు అంతగా బాధ అనిపించలేదు.

సింధు ఫోన్ రింగ్ అయ్యింది.మాట్లాడి..

"హసి..అమ్మ వాళ్ళు పక్క వీధిలో వ్రతానికి వెళ్లారు.నన్ను వచ్చి వాయనం తీసుకోమంటున్నారు.నేనొక పది నిమిషాల్లో వచ్చేస్తా.ఇక్కడే ఉండు.అన్నయ్య ఒక్కడే ఉన్నాడుగా.లేస్తే.....ఫ్రిడ్జ్ లో జ్యూస్ ఉంది ఇవ్వు."అని గబగబా చెప్పి,వెళ్లిపోయినట్టు ఉంది...గేట్ తీసిన శబ్దం వినిపించింది.

@@@@@@

అశాంతిగా మారినా మనసుకు.....అప్పుడే కరెంట్ కూడా పోవడంతో....ఇంకా చికాకుని కలిగించింది.ఉక్కపోతగా ఉండి.....రూంలో ఉండబుద్ది కాక...హాల్ లోకి వెళ్దామ్ అని మెల్లగా లేచాను.

నిన్నటి నుండి ఎం తినకపోవడం వలన ఏమో.....నీరసంగా అనిపించి కళ్ళు తిరిగాయ్.పడబోతు ఉంటే....

"శీను....."నన్ను గట్టిగా పట్టుకుంది హసి.అప్రయత్నంగా తన చుట్టూ చెయ్ వేసి.....నేను మరింత బలంగా పట్టుకున్నాను.

"ఇలా కూర్చో...."కంగారుగా నన్ను బెడ్ దగ్గరికి తీసుకెళ్తుంటే..

"హసి...ఇక్కడ ఊపిరాడటం లేదు.బైటకి తీసుకెళ్తావా?"

"హ రా.."అని హాల్ లోకి తీసుకెళ్లింది.

"బైటకి అంటే....ఇక్కడికి కాదు.....అలా బైటకి."అని ద్వారం వైపు చూపించేసరికి.

"నేనా...శీను ఇంట్లో ఎవరూ లేరు.సింధు వచ్చేస్తుంది అప్పుడు ఆటోలో వెళ్దామ్."అంది తను.

"ప్లీస్ హసీనా.ఇక్కడ ప్రాణం పోతున్నట్టు ఉంది.కొంచెం ప్రశాంతత కావాలి.ప్లీస్."

నేనలా వేడుకోలుగా అడుగుతుంటే.....నన్ను జాలిగా చూస్తూ సరే అని తల ఊపి.ఆటోని ఆపి....నన్ను ఎక్కించి.ఇంటికి తాళం వేసి....వచ్చింది.

పది నిమిషాల ప్రయాణం కూడా నాకు....ఎన్నో మైళ్లు దాటి వచ్చినట్టే అనిపించింది.ఆటో ఆగగానే... డబ్బు ఇచ్చి నన్ను నెమ్మదిగా దింపింది.చూస్తే గుడికి వచ్చాం.

ప్రశ్నార్థకంగా చూసా తనని."నువ్వేగా ప్రశాంతత కావాలి అన్నావ్.ఇక్కడ బోలెడంత ప్రశాంతత దొరుకుతుంది రా."

అంటూ నన్ను మెట్లెక్కిస్తు ఉంటే...

"ఆగు హసి.నేను వెళ్తాలే.....నువ్వు రాకూడదు కదా."

"పర్లేదు శీను.నాకు అలాంటి పట్టింపులేమి లేవు.చాలాసార్లు ఫ్రెండ్స్ తో వచ్చాను.పదా."

ఇద్దరం దర్శనం చేసుకుని....వచ్చి ప్రాంగణంలో కూర్చున్నాం.

నేను ఎక్కడో చూస్తూ...ఉంటే హసి నన్నే చూస్తూ ఉంది.అది గమనించి..

"ఏంటి హసి అలా చూస్తున్నావ్?"

"ఎంలేదు నేను మొదట చూసిన శీను ఏనా ఇప్పుడు నేను చూస్తోంది అని ఆలోచిస్తున్నా."

"అంటే?"

"శీను.నువ్వు చాలా చలాకీగా ఉండేవాడివి.చురుగ్గా...ఏ పనైనా చిటికెలో చేసేసేవాడివి.నీ మొహంలో ఎప్పుడు చెరిగిపోని చిరునవ్వు ఉండేది.నీ కళ్ళలో ఆత్మవిశ్వాసం కనిపించేది.ఇప్పుడు అవేం లేవు."

విరక్తిగా నవ్వాను..."ఎలా ఉంటాయి హసి.అన్ని....నా ఆక్సిడెంట్ తోనే పోయాయ్.ఇప్పుడు నేనేం చేయగలను.....ఏమి చేయలేను."

"హో...అంటే ఇక్కడితో నీ జీవితం ఆగిపోయిందనే అనుకుంటున్నావా?"

"ముందుకు ఎలా వెళ్లను హసి.ఒకరు పట్టుకుంటే గాని అడుగు వెయ్యలేని నేను.....ఎలా నడవగలను."

"నిన్ను నడిపించడానికి ఇంతమంది ఉన్నారు.నువ్వు నడవాలి అనే దృఢసంకల్పంతో ఉంటే...చేయూతనివ్వడానికి అందరూ సిద్ధంగానే ఉంటారు శీను."

"నేనేం చేయగలను హసి.నాకు లేనిపోని ఆశలు కలిగించకు."అసహనంగా అన్నా నన్ను చూసి..

"ఇదే అసహనం....రేవు మీ బాబాయికి కలగచ్చు శీను. ఇలా ఏన్నాళ్లు మీ ముగ్గురిని ఆయన పోషించగలరు.అసలు ఆయానకేంటి అవసరం.పోనీ మీ నాన్న ఎన్నాళ్ళు కష్టపడగలరు అదీ ఈ వయసులో...ఆలోచించావా."

"నేనేం చేయలేను అని నువ్విలాగే ఉంటే....ఇక్కడి సమస్య ఇక్కడే ఉండిపోతుంది.సమస్యని నువ్వు ఎంత పెద్దది అనుకుంటే...అంతే పెద్దదిగా కనిపిస్తుంది."

"ఏ సమస్య మనుషులకన్న,వారి మనోధైర్యనికన్న పెద్దది కాదు.....కాకూడదు.నువ్విలా డీలా పడిపోకూడదు శీను.ఇప్పుడు నువ్వేం చేయగలవో తెలుసుకో.నేనేం చేయలేను అని నెగటివ్ థాట్ మైండ్ లోకి రానివ్వకు...నేనేం చేయగలను అని మాత్రమే ఆలోచించు."

"దేవుడు ఒక ద్వారం మూసేస్తే మరో ద్వారం తెరుస్తాడు. అది చీకటిగా ఉంది,లోపల ఎమ్ముందో,ఎంత దూరం వెళ్లాలో.....ముందుకేం వెళ్తామ్ అని భయపడితే...ఆ చీకటి అవల ఉన్న వెలుగుని ఎప్పటికి చూడలేం."

హసి మాటలు వింటూ....తననే చూస్తూ ఉన్నా నాకు...ఎందుకో మేడం గుర్తొచ్చారు.

మేడం అయితే ఇలాగే చెప్పేవారు.కానీ కొంచెం కోపంగా.హసి ఇంతలా మాట్లాడగలదా.ఎప్పుడు సైలెంట్ గా,అయోమయంగా కనిపించే హసీ నేనా అనిపించింది నాకు.

@@@@@

"ఎక్కడికి వెళ్లారు మీరు.ఎంత కంగారు పడ్డామో తెలుసా."

నన్ను చూడగానే కొంచెం అరిచినట్టు అడిగింది సింధు.

"అరవకు సింధు.హసి ని నేనే తీసుకెళ్లామని అడిగాను."

"చెప్పాలిగా అన్నయ్య.నీ ఫోన్ ఇంట్లోనే ఉంది.హసీకి చేస్తే ఎత్తడం లేదు."

"హో సారీ సింధు.గుడికి వెళ్ళాం.డిస్టర్బెన్స్ అని సైలెంట్లో పెట్టా.చూసుకోలేదు."సంజాయిషీ ఇచ్చింది హసి.

"పర్లేదులే తల్లి.వాడికి వెల్లాలనిపించి అడుగుంటాడు." మా అమ్మ హసి నొచ్చుకుందని....తన వైపు మాట్లాడింది.

రాత్రి హసి కూడా మాతో పాటే బోజనమ్ చేసింది....అనీల్ డ్రాప్ చేసాడు తనని.

రాత్రి హసి చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాను.

"ఏంట్రా అంతగా ఆలోచిస్తున్నావ్?"

"ఎంలేదు అనీల్.ఎం చేద్దామా అని."

"అంటే?"

"ఇలా ఇంట్లోనే ఉంటే ఎలారా.బాబాయ్ కి భారం కాకపోతే.ఏదో ఒక పని చేసుకోవాలి.అదే ఎం చేయాలా అని ఆలోచిస్తున్నా..."

"ఏరా....బాబాయ్ నిన్ను భారం అనుకుంటాడా.అలా ఎందుకు ఆలోచిస్తున్నావ్ నువ్వు."

"బాబాయ్ అనుకుంటాడాని కాదు అనీల్.నాకే నచ్చడం లేదు.ఇలా ఒకే గదికి పరిమితమైపోవడం....

నాన్న కష్టపడుతున్నాడు.ఈ వయసులో...నేను వాళ్ళకి ఆసరాగా ఉండాలిగాని.ఇలా కాదుగా."

"హ్మ్....ఎం చేస్తావ్?"

"నువ్వే చెప్పు ఎం చేయను.మళ్ళీ షాప్ కైతే వెళ్లలేను.అర్ధం కావడంలేదురా."

"పోనీ చదువుకుంటావా శీను.అప్పుడు నువ్వు ఎం.సి.ఏ చేయాలి అన్నట్టు ఉన్నావ్ కదా."

"హ..."అని ఏదో గుర్తొచ్చినట్టు...టక్కున వాడి వైపు చూసాను... కొంత టెన్షన్ గా.

"ఏంట్రా?"నన్ను చూసి...అడిగాడు.

"రేయ్ అనీల్.నేను బ్యాంక్ ఎక్సమ్స్ రాసా కదరా.ఆ రిసల్ట్స్ ఏమైయ్యాయ్?"

"అవును కదా.దాని గురించే మర్చిపోయాం.ఉండు సింధు దగ్గరా లాప్టాప్ తేస్తా."అని వెళ్ళాడు.

ఇది నేనెలా మర్చిపోయా అసలు.ఛా....ఇన్ని రోజులు టైం వేస్ట్ అయ్యింది...అసలు రిసల్ట్ ఎమ్మోచిందో ఎంటో.

అనీల్ లాప్టాప్ తేగానే.....ఓపెన్ చేసి టెన్షన్గా.....సెర్చ్ చేసాను.నా పక్కనే కూర్చోని నన్నే చూస్తూ ఉన్న అనీల్ ఇంకా టెన్షన్ పడుతున్నాడు.

"రేయ్ అనీల్...నేను పాస్ అయ్యారా."చాలా సంతోషంగా చెప్పాను.గట్టిగా అరుస్తూ నన్ను హత్తుకున్నాడు వాడు.

పాతాళంలో కూరుకుపోయిన నాకు.....పైకి రావడానికి చిన్న ఆసరా దొరికినట్టు అనిపించింది.అంతలోనే మళ్ళీ అనుమానం మొదలైంది.

రిసల్ట్స్ వచ్చి రెండు నెలల పైనే అయ్యింది.ఈపాటికి ఇంటర్వ్యూ కి రమ్మని లెటర్ పంపించి ఉంటారు.ఇంటర్వూస్ కూడా జరిగిపోయాయి ఉండచ్చు...అదే చెప్పా అనీల్ కి.

"రేయ్ థింక్ పాజిటివ్ రా.ఒకవేళ ఇంకా ఇంటర్వూస్ జరగకుండా కూడా ఉండచ్చుగా.నీతో పాటు రాసిన వాళ్ళలో ఎవరైనా తెలిసినవాళ్ళు ఉంటే కనుక్కో."అన్నాడు.

వెంటనే ఫోన్ తీసుకుని...తెలిసిన వారికి కాల్ చేసి కనుక్కున్నాను.

"అనీల్ నీ మాట కొంత నిజం అయ్యింది.మన ఇంటర్వ్యూ డేట్....లెటర్ లోనే మెన్షన్ చేశారట.కొంత మంది ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యారట.ఇప్పుడు నాకు వచ్చిన లెటర్ ఎక్కడ ఉందో చూడాలి."

నా మాట విని ఇక ఆలస్యం చేయకుండా....హాల్ లోకి వెళ్లి...

"పిన్ని...పిన్ని..."అరిచాడు అనీల్.

"ఏంట్రా?"

"పిన్ని....శీను కి ఏదైనా లెటర్ వచ్చిందా?"

"శీనుకా.....ఏమోరా.నాకు గుర్తులేదు....ఏమైంది?"

"అబ్బా.....ముందు వచ్చిన లెటర్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పు."కంగారు పెట్టెస్తున్నాడు.

వాడి దెబ్బకి అందరూ వెతులాట మొదలు పెట్టారు.ఈ రెండు నెల్లలో...ఇంట్లో ఎవరూ స్థిమితంగా లేరు.ఒక పక్క నా ఆక్సిడెంట్....డబ్బుల కోసం టెన్షన్.వెంటనే సింధు పెళ్లి....ఆ పనులు.

పెళ్లికని ఇంటికి సున్నం వేయించారట...అప్పుడు సామాన్లన్నీ పక్కకి మార్చి.....మళ్ళీ సర్దారు.దానికి పర్యవేక్షణ అంత అనీలే చేశాడట.దాంతో కొన్ని వస్తువులు...ఉండాల్సిన చోట లేవని.అన్ని వెత్తుకోవాల్సి వస్తోందని......పిన్ని విసుగు రోజు వినిపిస్తూనే ఉంది,అనీల్ సరిగ్గా సర్దించలేదని.

దాని కారణంగానే...ఇప్పుడు వచ్చిన లెటర్స్ కూడా ఓపట్టానా దొరకడంలేదు.రాత్రంతా ఎవరు నిద్రపోలేదు....కాదు,కాదు అనీల్ నిద్రపోనివ్వలేదు ఎవరిని.నాన్న,బాబాయ్...అర్ధరాత్రి వరకు వెతికి..ఇక వల్ల కాక మేడ మీదకు వెళ్లి పడుకున్నారు.

ఇల్లంతా చిందరవందర చేసేసాడు అనీల్.మళ్ళీ సర్దాలంటే మాటలా.ఎప్పటికో తెల్లవారుజామున... పడుకున్నారు అందరూ.

నాకు కంటి మీద కునుకు రాలేదు.సుదూరంగా కనిపిస్తున్న వెలుగును....చేరుకోలేకపోతున్నా అని బాధ.నాతో పాటే ఉన్న అనీల్..

"బాధపడకురా....లెటర్ దొరుకుతుంది."అని ఇంకా ఏదో బాక్స్ లో చూస్తున్నాడు.

"వదిలేయ్ అనీల్.దొరికిన పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.నా ఇంటర్వ్యూ టైం అయ్యిపోయుండచ్చు.నువ్వెళ్ళి పడుకోపో....."అని అక్కడే సోఫాలో వాలి పడుకున్నాను.

నా గొంతులో బాధ...ఏదో తెలియని వైరాగ్యం....ఎం చేయలేకపోతున్నా అనే చింత.

లైట్ ఆఫ్ చేసి.....ఫ్యాన్ స్పీడ్ పెంచి...వాడు వెళ్లి పడుకున్నాడు.

నాకు నిద్రపట్టలేదు....ఒక్క రాత్రిలో జీవితం తలకుందులు అవ్వడం అంటే ఇదేనేమో అనిపించింది.

ఆ రాత్రి నేను...తాగకుండా ఉంటే,ఈపాటికి ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యి....జాబ్ లో జాయిన్ అయ్యి ఉండేవాడిని.ఇంకా చదువుకునేవాడిని.పొలం అమ్మి ఉండేవారు కాదు.

నాన్న నన్ను చూసి గర్వపడేవాడు.అమ్మ,పిన్ని నాకు రోజు దిష్టి తీసి...నన్ను మురిపెంగా చూసేవారు.సింధు పెళ్లికి అన్ని నేనే ముందుండి చేసేవాడిని.పెళ్లిలో అందరికి నా కొడుకు అని గొప్పగా చెప్పుకొని ఉండేవాడు బాబాయ్.

అంకితతో సంతోషన్గా ఉండేవాడిని.మేడం....మేడం నన్ను చూసి ఎంత గర్వపడేవారు.అన్ని....అన్ని సర్వనాశనం అయ్యిపోయాయ్.

హసీనా నువ్వన్నట్టు.....ఒక ద్వారం మూసేసిన దేవుడు.....ఇంకో ద్వారం చూపించాడు.కానీ తాళం దాచేసి.... ఎడిపిస్తున్నాడు.చీకటిని చూసి బెదరకూడదు అనుకుంటే.....కనీసం ఇప్పుడు లోపలికి వెళ్లే మార్గమే తెరుచుకోవడంలేదు.

దేవుడు కూడా పగ పడతాడా అనిపించింది.ఇది పరీక్షా.....లేక నాకు విధించిన శిక్షా.....

ఇంకా ఉంది...

WHEN ONE DOOR IS CLOSED, DON'T YOU KNOW THAT MANY MORE ARE OPEN.



Rate this content
Log in

Similar telugu story from Drama