Divya Pandeti

Drama

3.9  

Divya Pandeti

Drama

నా పయనం ఎటు వైపు ..? 3

నా పయనం ఎటు వైపు ..? 3

17 mins
730


షాప్ లో కరెంట్ లేకపోవడంతో...నెట్ సెంటర్ లో నా రిసల్ట్ చూద్దామని వెళ్తున్నా నాకు ఎదురైంది మేడం.

ఆవిడకి విషయం చెప్తే...

నా మాట విని...ఎం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి,సిస్టం ముందు కూర్చుంది కరెంట్ లేకపోయినా.

"అవసరం లేదు.నేను చూసాను."అంది నన్ను కనీసం చూడకుండానే.

"ఏమైంది మేడం?"అడిగా ఆతృతగా.

కానీ మేడం ఎం సమాధానం చెప్పకుండా....సైలెంట్ గా నన్ను చూసింది.

ఆవిడ నన్ను కోపంగా చూస్తున్నట్టు అనిపించి...ఫెయిల్ అయ్యనేమో అని చెమటలు పట్టేశాయ్.

మేడం మౌనం....నాలో అలజడిని రేపింది.నాలో నిరాశ మొదలైంది.అసలు ఎం వచ్చింది రిసల్ట్ లో...?అన్న ఆలోచన తొలిచేస్తుంటే.

"శీను....నా వజ్రం మెరిసిపోతోంది.నా నమ్మకమే నిజమైంది."

అన్న మేడం మాటలు విని....నేను వింటోంది నిజమా...కదా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే....

"జస్ట్ పాస్ అవ్వు చాలు అంటే.డిస్టిన్షన్ లో పాస్ అయ్యావ్.ఇది నేను ఊహించలేదు తెలుసా."

మెరిసే కళ్ళతో నన్ను చూస్తూ అంటున్న ఆమె ముందు మొకరిల్లాను నేను.ఆ ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలో.....ఆ సంతోషాన్ని ఎలా మోయాలో...మేడంకి ఎలా కృతజ్ఞతలు తెలపాలో...ఏదీ... ఏదీ... అర్థం కాలేదు.

నా కళ్ళ నుండి వస్తున్న ఆనందబాష్పాలు....నా షర్ట్ ని తడిపేస్తున్నా...నన్నే గమనిస్తూ,మరో నలుగురు మనుషులు అక్కడ ఉన్నారన్న సృహ కూడా మరిచిపోయాను.

"శీను...."అంటూ నా భుజం మీద చెయ్ వేసిన మేడం చేతిని....

కళ్ళకి అద్దుకుంటు...గట్టిగా పట్టుకున్నాను.మాట రావడంలేదు.అది బాధకాదు....ఆనందం అని అంటే అది చిన్న పదమే అవుతుంది.ఎదురుగా ఉన్న మనిషి నాకు ఒక దేవుతల కనిపించిందా క్షణం.

చెయ్ వదిలి కాళ్లు పట్టుకోబోయాను....టక్కున లేచి దూరం జరిగి నిలుచుంది.

"ఎం చేస్తున్నావ్ శీను.నీకేమైనా పిచ్చా."అరిచింది.

మాట్లాడలేదు నేను.ఎం మాట్లాడను.....ఇప్పుడు నేను ఉన్న స్థితిలో మాటలు కరువయ్యాయ్.

"రేయ్ శీను....ఊరుకోరా.నువ్వు సాధించావ్.ఇది ఆనందించాల్సిన విషయం.ఇలా ఏడుస్తారా ఎవరైనా.ఛా....."

నా కళ్ళు తుడుస్తూ.....అన్నాడు రాజన్న.ఏమ్ అనుకున్నాడో ఏమో గిరి....

"రేయ్ శీను.మాకు పార్టీ ఇవ్వాలి నువ్వు."అంటూ వచ్చాడు ముందుకి.

గిరిని చూసి నవ్వి....చందుని చూసాను.వాడు నా వైపు ఒక చూపు చూసి లోపలికి వెళ్లిపోయాడు. ఆ చూపుకి అర్థం ఏంటో మరి.

సేతు సార్ కి చెప్తే....నన్ను మెచ్చుకోలుగా చూసి.ఇంకా చదువుకోరా.అని సలహా ఇచ్చారు.

సాయంత్రం వరకు అక్కడే గడిపేసాను.మేడం కూడా అక్కడే ఉన్నారు.నాలుగు గంటలకు ఎప్పటిలాగే ఇన్స్టిట్యూట్ కి కాలినడకన బయలుదేరాను.నా కూడా మేడం కూడా నడుస్తున్నారు.

"మేడం మికేల కృతజ్ఞతలు చెపుకోవాలో తెలియడం లేదు.మీరు ప్రోత్సహించకుంటే...నేను అసలు ఇలా..."

"శీను...ఇంతకు ముందు కూడా చెప్పా.నీ విజయానికి నువ్వే బాద్యుడివి.ఇంకెవరు కాదు.కాకూడదు కూడా.ఇంకోసారి ఇలా మాట్లాడకూ."కొంచెం కోపంగానే అంది మేడం.


ఇద్దరం ఇన్స్టిట్యూట్ లో ఉన్నాం...

"మేడం మీరు తప్పుగా అనుకోనంటే..ఒకటి అడగచ్ఛా?"

సిస్టం చూస్తూ ఉన్న మేడం....చాలా శాంతంగా,"హ అడుగు."అంది.

"అదీ.సేతు సార్ మికేమవుతారు?"

"బాబాయ్ అని పిలుస్తున్నగా.మళ్ళీ అడుగుతావే."

"అంటే సార్ హిందూ.మీరు ముస్లిం కదా అని."

"మా నాన్న,బాబాయ్ సొంత అన్నదమ్ములు.మా నాన్న హిందూ.కానీ మా అమ్మ ముస్లిం.వాళ్లది లవ్ మ్యారేజ్."

"హో అలాగా.ఇంకోటి మేడం."

"ఎందుకు లేటు అడుగు."

"మీరు వాడే పెర్ఫ్యూమ్ చాలా బాగుంటుంది.ఎక్కడ కొంటారు?"

"నీకెందుకు.ఎం నీకావాలా?"

"కావాలా అంటే.కావాలి.ఒకరికి గిఫ్ట్ ఇద్దామని."

టక్కున చూసింది నన్ను."ఎవరికి?"అడిగింది అనుమానంగా.

"అదీ మా చెల్లెలికి."అన్నాను ఆవిడ చూపుకే భయపడి.

"హో.ఇది ఇక్కడ దొరకదు శీను.మా మామయ్యా దుబాయ్ లో ఉంటారు.వచ్చినప్పుడు తెస్తారు.రాలేకపోతే పంపిస్తారు."

"అవునా.మా చెల్లెలి ఫ్రెండ్ కూడా ఇదే వాడుతుంది మేడం.తనతో ఉంటే ఆ సువాసనకి మీరే గుర్తొస్తారు."

"హో..."అని స్క్రీన్ మీద చూపు నిలిపి...తథేకంగా చూస్తూ ఉంది.

"మీరు ఇలా బుర్కా ఎందుకు?"

"అమ్మ కోసం.తను ఒప్పుకోదు."

"ఎప్పుడు తీయరా మేడం."

"ఎందుకలా అడుగుతున్నావ్?"

"ఎం లేదు ఊరికే అడిగా."

"నీకు తెలుసుకోవాలి అనే జిజ్ఞాశా ఉంటే...పనికొచ్చే విషయాలు తెలుసుకో.ఇలాంటి పనికిమాలిన విషయాలు కాదు."కోపంగా అని వెళ్లింది మేడం.

నేను అక్కడే కూర్చోని ఆలోచిస్తున్నా....పెర్ఫుమ్ చెల్లికి గిఫ్ట్ ఇవ్వాలి అని ఎందుకు అబద్ధం చెప్పా. నేను ఇవ్వలనుకుంది మేఘాకి కదా.అది చెప్పడానికి ఎందుకు భయపడ్డాను.ఏంటో నేను.

ఈరోజు మేడం కొంచెం సాఫ్ట్ గా మాట్లాడారు నాతో.నేనే అనవసరంగా ఏదేదో అడిగి చిరాకు తెప్పించా.అని నన్ను నేను తిట్టుకున్నా.

సింధు కాల్ చేయడంతో.... బైటికొచ్చి,కొన్ని డైరీ మిల్క్ చాకలెట్స్ కొనుకొన్ని,షాప్ కి వెళ్లి రాజన్న కి ఇచ్చా,పిల్లలకి ఇవ్వమని.....బైక్ లో కేఫ్ కి వెళ్లా.


"ఏంట్రా లేటు."

"వచ్చాగా."అని అనీల్ కి చెప్తు వాడి పక్కన కూర్చున్నా.

"ఏంటీ...ఇంకా ఎం స్టార్ట్ చేయలేదు.ఎరా అనీల్."

"నువ్వు వస్తావ్ అని వెయిటింగ్."అని లేచాడు,ఇద్దరం చాలా ఐటమ్స్ తీసుకొచ్చాం.బిల్ నేనే ఇచ్చా.

"ఏంటి శీను...మంత్ ఎండ్ లో టైట్ గా ఉంటుంది కదా.ఇంత పెట్టావ్.ఇన్ని ఐటమ్స్ తీసుకున్నావ్?"

అనీల్ గాడి ప్రశ్నకి చిన్నగా నవ్వుతూ.....

"ఇన్నిరోజులు అప్పు కట్టాలికదా అని ఎక్కువ ఖర్చుపెట్టలేకపోయా అనీల్.అప్పు తీరిపోయింది.ఇన్ని ఐటమ్స్ ఎందుకు అని ఆడిగావ్ కదా.ఈరోజు నా ట్రీట్.ఇంకా ఏమైనా కావాలన్న చెప్పండి."

"ఎంట్రోయ్ వరాలు కురిపిస్తున్నావ్.ఏంటి సంగతి...కొంపదీసి లవ్ లో గాని పడ్డావా."అనీల్ చమత్కారంగా అడుగుతూ ఉంటే..

ఫోన్ చూస్తూ,మధ్యలో నవ్వుతూ.....తింటూ ఉన్న హసినాకి పొరపోయి గట్టిగా దగ్గుతూ ఇబ్బందిపడింది.అంకిత నీళ్లు తాగించేసరికి....కాసేపటికి నార్మల్ అయ్యింది.

"ఆర్ యు ఓకే హసి."

"హ....హ అనీల్."అంటూనే నన్ను చూసింది,ఎందుకో మరి.అంతలోనే చూపు తిప్పుకుంది.ఈ అమ్మాయి నాకర్ధం కాదు అనుకున్న.

"ఇందాకా ఏదో చెప్తున్నావ్ శీను."మేఘా అడిగేసరికి.. అసలు విషయం మార్చిపోయానే అనుకొని..

"మీకు తెలియకుండా నేనో పని చేశా."

"ఎంటన్నయ్య అది?"

"డిగ్రీ ఎక్సమ్స్ రాసా."

అందరూ షాక్ అయ్యారు.

"ఎప్పుడురా.మాకు తెలియకుండా.కాలేజ్ కి ఎప్పుడు వెళ్ళావ్. అసలు ఎప్పుడు చదువుకున్నావ్."అనీల్ క్వశ్చన్స్ కి అడ్డుపడుతూ..

"ఎహే ఆగు.అది కాదు ఇప్పుడు ముఖ్యం.ఈరోజు రిసల్ట్స్ వచ్చాయ్.అంటే శీను.... నువ్వు పాస్ అయ్యావ్ అందుకేనా ఈ ట్రీట్.కంగ్రాట్స్ శీను."అంది నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ అంకిత.

"థాంక్యూ అంకిత."

అందరూ కంగ్రాట్స్ చెప్పారు.అందరూ నమ్మలేకపోతున్నట్టు చూస్తూ ఉంటే...హసి మాత్రం ఇదేం అంత పెద్ద విషయం కానట్టు,తనకి అంత పట్టింపు లేనట్టు.నార్మల్ గా విష్ చేసి ఊరుకుంది.నిజంగానే ఈ అమ్మాయి నాకెప్పటికి అర్ధం కాదు అనుకున్నా.

నేను ఎలా చదువుకున్నది చెప్పా.మేడం గురించి కూడా.

"అవునా....చాలా మంచి వ్యక్తిలా ఉందే."అంది అంకిత.

"ఎవరా మేడం?"ఆశ్చర్యంగా అడిగింది మేఘా.

"అన్నట్టు శీను మీ అమ్మ వాళ్ళకి చెప్పావా?"అడిగింది హసి.

"ఇంకా లేదు."

"ఫోన్ చేయరా.చాలా హ్యాపీ అవుతారు."

"లేదు అనీల్.నేరుగా వెళ్లి చెప్పాలి.అప్పుడు వాళ్ళ కళ్ళలో సంతోషం చూడాలని ఉంది."

"గుడ్ రా శీను. ఒక పక్క పని చేసుకుంటూనే....చదువుకున్నావ్.సిటీకి వెళ్తే చెడిపోతారు అనుకుంటారు గాని.అది తప్పని నిరూపించావ్.నిజంగా నాకు చాలా ప్రౌడ్ గా ఉందిరా."

చిన్నగా నవ్వుతూ,"సరేగాని నేను ఎల్లుండి తిరుపతి వెళ్తున్నా.మీరు రండి...తిరుమలకు కాలి నడకన వస్తా అని మొక్కుకున్నా.వెళ్దామ్."అన్నా

"హో....థాట్స్ గుడ్ శీను నేనొస్తా."అంది మేఘా చాలా ఎక్సయిట్ అవుతూ.

"నేను వస్తారా అన్నయ్య".సింధు కూడా ఒప్పుకుంది.

"ఒకరిద్దరు కాదు.అందరం వెళ్దామ్."

"నో శీను. మా నాన్న పంపించరు.మీరు వెళ్ళండి."అంటున్న అంకితని చూసి.

"ఒసేయ్ అంకుల్ తో నేను చెప్తాలే.నువ్వు మరీ అలా ఫేస్ పెట్టకు."అని అభయం ఇచ్చింది సింధు.

"నేను విజయవాడ వెళ్లి ఇంద్రకీలాద్రి ఎక్కుదాం అనుకున్నా...ఇక మీరందరు ఆ ఏడూ కొండలు ఎక్కాలని డిసైడ్ అయ్యాకా.డెసిషన్ మార్చుకున్న."అని అనీల్ కూడా వస్తా అన్నాడు.

ఇక మిగిలింది హసీనా...

"నేను రాలేనులే.మీరు వెళ్లి రండి."

"అయ్యో హసీనా.నువ్వు గుడికి రాకులే. మా ఊరికి రా బాగుంటుంది.ఎప్పుడు సిటీని చూసుంటారు.ఒకసారి పల్లె వాతావరణాన్ని కూడా చూసినట్టు ఉంటుంది."

"సారీ శీను. ఎం అనుకోకు.ప్లీస్."అంది రెక్యూస్టింగ్ గా.

"సరే నీ ఇష్టం."అని ఊరుకున్నా.హసికి కాల్ రావడంతో తను ఆటోలో వెళ్లిపోతా అని వెళ్ళింది.

"ఈ హసి ఏంటే ఈ మధ్య మరీ రిసేర్వేడ్ గా ఉంటోంది.సరిగ్గా మాట్లాడ్డం లేదు.ఇది వరకు చలాకీగా ఉండేది కదా."తన అనుమానాన్ని వెళ్లబుచ్చింది అంకిత.

"అదే కదా.నేను గమనిస్తున్న చాలా రోజుకుగా.సరిగ్గా ఉంటట్లేదు మనతో ముందులా.ఏమైందో ఏంటో?"ఆలోచిస్తోంది సింధు.

నేను కూడా....ఎందుకు ఈ అమ్మాయి కొంచెం మిస్టీరియస్ గా ఉంటోంది నాకు అని.

కేఫ్ నుండి ఇంటికి వెళ్లిన మేము.బాబాయ్ కూడా ఉండటంతో నా ఎక్సమ్స్ గురించి చెప్పా.

బాబాయ్,పిన్ని ఇద్దరు హ్యాపీ.పిన్ని అయితే చాలా పొంగిపోయింది."నా కొడుకు ఏదైనా సాధిస్తాడు.ఎంత దిష్టి తగిలిందో"అని..దిష్టి తీసింది కూడా.

"ఇంకా చదువుకో శీను.పని మానెయ్.నేను చదివిస్తారా."అన్నాడు బాబాయ్.

"వొద్దు బాబాయ్.నేను ఎవరికి భారం కాలేను.సింధు భవిష్యత్తు ముఖ్యం.నేను చదువుకుంటా గాని....పని మాత్రం ఆపాను.నాకోసం చాలా చేశారు బాబాయ్.మరి సింధు పెళ్లి నాటికి....అన్నగా,నా వంతు బాధ్యత నేనూ చేయాలిగా."

"కొడుకు లేని లోటు తీరుస్తున్నావురా.ముందే ఇక్కడికి వచ్చుంటే.....ఈపాటికి మంచి పొజిషన్ లో ఉనుంటావ్."

"ఇప్పుడు మాత్రం ఏమైంది బాబాయ్.శీను తప్పకుండా మంచి పొజిషన్ లో ఉంటాడు.ఇంకో ఐదేళ్లు చూస్తూ ఉండండి.మన శీను గాడేనా అని ఆశ్చర్యపోయేలా ఉంటాడు."అన్నాడు అనీల్....నన్ను హత్తుకుంటూ.


రెండు రోజుల తరువాత అందరం తిరుపతికి బయల్దేరాం.

మా ప్రయాణం చాలా సరదాగా సాగుతోంది.పాటలు పాడుకుంటూ...చిరుతిల్లు తింటూ....

హైదరాబాద్ నుండి గుంతకల్ చేరుకోగానే....హోరున వర్షం.తుఫాను హెచ్చరికలు జారిచేసినట్టు సమాచారం.

జంక్షన్ లో చాలాసేపు ట్రైన్ ఆపేశారు.దాదాపు గంట గడిచింది.స్టేషన్ రద్దీగా ఉంది....వర్షం వల్ల.కొన్ని ట్రైన్లు రద్దు చేసినట్టు తెలిసింది.

"అయ్యో వెంకటేశ్వరా.నీ సన్నిధికి వస్తూ ఉంటే ఏంటయ్యా మాకి పరీక్షా."ట్రైన్ లో కొంతమంది భక్తులు శ్రీవారికి మొరపెట్టుకుంటున్నారు.

మా గోలలో మేమున్నాం...అవేం పట్టించుకోకుండా.

"రేయ్ అనీల్.చిప్స్ తెండిరా."అంది సింధు.

"ట్రైన్ ఎక్కినప్పటి నుండి పది ప్యాకెట్లు ఖాళీ చేశారు.ఇంకా కావాలా."

"రేయ్ ఊరికే దిష్టి పెట్టకు.పోయ్ తెండి."బెదిరింపులోకి దిగింది అంకిత.

వీళ్ళు అడిగింది తేకపోతే కొట్టేలా ఉన్నారని....ఇద్దరం దిగాం.

చిప్స్ తీసుకుని పక్కన సమోసా అమ్ముతుంటే అటు వెళ్ళా నేను.అనీల్ ట్రైన్ ఎక్కేసాడు.సమోసాలు అమ్మే అవ్వ...కళ్ళు సరిగ్గా కనిపించక,చిల్లర ఎరుతూనే ఉంది.

"సరేలే అవ్వ.పర్లేదు ఉంచుకో".అని వచ్చేస్తోంటే.

"ఏయ్...ఏంటి నాకేమైన మూష్టేస్తున్నావా.ఇచ్చిన సమోసలకి మాత్రమే డబ్బు తీసుకుంటా.ఆగు...మిగిలిన చిల్లర ఇస్తా."అని ఏరుతుంటే ఆవిడని చూస్తూ నిల్చున్న.

కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా,వయసు మీద పడి....ఇక పని చేయలేనని శరీరం మొరాయిస్తున్నా.ఒకరి మీద ఆధారపడటం ఇష్టంలేక,కష్టించి సంపాదించాలి అని...ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్న,అది అడుక్కోవడంతోనే సమానంగా భావించిన ఆ పెద్దావిడ ఆత్మభిమాననికి....కష్టించే గుణానికి మనసులోనే జోహార్లు తెలుపుకుంటు ఉంటే..

ఆవిడ నా చేతిలో డబ్బు పెట్టడం,ఇటు ట్రైన్ కదలడం రెండు ఒకేసారి జరిగాయ్.

కంగారుగా ట్రైన్ వైపు పరుగుపెట్టాను.ఒక చేత్తో సమోసాల కవర్ గట్టిగా పట్టుకునే,ట్రైన్ ఎంట్రన్స్ దగ్గరి హ్యాండిల్ పట్టుకోబోయే లోగా...ఒక చెయ్ నన్ను పట్టుకుని,బలంగా లోపాలికి లాగింది.

ఆ ఫోర్స్ కి నేను తనని పట్టుకుని సరిగ్గా నిలుచుని చూస్తే అంకిత.

"ట్రైన్ కదిలేవరకు ఏమ్ చేస్తున్నావ్ బైటా.చూసుకోవాలిగా శీను."అని కంగారుగా,భయంగా అరిచి.అంతలోనే సర్దుకుని."సరే పదా."అని ముందుకు నడిచింది.

ఒక్కక్షణం.... ఆ ఒక్కక్షణం అంకిత ఎందుకో కొత్తగా అనిపించింది నాకు.

కవర్ సింధూకి ఇచ్చి,నా ఎదురుగా ఉన్న అంకితని చూస్తూ.....కాంగా కూర్చున్నా.

కాసేపటికి అనీల్ ని చూస్తూ,"ఎరా..నేను బైటే ఉన్నా కదా.నేను రాలేదని గమనించలేదారా అనీలూ."అడిగా వాడిని.

"సారీ రా.అమ్మ ఫోన్ చేస్తేను..మాట్లాడుతూ నిన్ను గమనించలేదు."

"మరి నువ్వు సింధు?"అని తనని చూసా.

"నేను జబర్దస్త్ చూస్తున్నారా.నిన్ను చూడలేదు."

మేఘాని చూస్తే,ఇద్దరం కలిసే జబర్దస్త్ చూస్తున్నాం అని సింధు ఫోన్ చూపించింది.

అంకితని చూసా.....తనేం పట్టనట్టు బైటకి చూస్తూ,కిటికీ ఊచలపై పడిన వాన నీటి బిందువులను.... ఒక్కొక్కటిగా తన ముని వేళ్ళతో తడుముతూ.....అదో ఆటలా,ఆడుకొంటోంది.


చేరవలసిన సమయనికన్న ఆలస్యంగా తిరుపతి చేరుకున్నాం.రెండు ఆటోలు మాట్లాడుకుని,మా ఊరు బయల్దేరాం.

మమ్మల్ని చూడగానే ఎదురొచ్చి మా బ్యాగులు తీసుకుని,అందరిని పలకరించారు అమ్మా వాళ్లు.

స్నానాలు గట్రా ముగించుకుని...అమ్మ వాడ్చిన ఇడ్లిలు తిని...బైట కూర్చోని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం.

"శీను నువ్వు ఎక్సమ్స్ పాస్ అయ్యింది చెప్పు మీ అమ్మ వాళ్ళకి."అని అంకిత అనేసరికి లోపలికి వెళ్ళా.

నాన్న బాగానే కొలుకున్నాడు.. చేత్తో చిన్న చిన్న పనులు చేయగలుగుతున్నాడు.నాన్న మా కోసం తెచ్చిన మటన్ ని చిన్న ముక్కలుగా కత్తితో కొడుతూ ఉన్నాడు.

అమ్మ మసాలా రుబ్బుతోంది రోట్లో.వెళ్లి అమ్మ పక్కన కూర్చోని....తనని జరగమని నేను రుబ్బాడం మొదలు పెట్టాను.

"నీకెందుకురా అయ్యా.అందరిని మన చేల్లోకి తీసుకుపో.అడా....వెంకయ్య మామిడి తోపు లోకి పొండయ్య..బాగుంటది."అంటున్న నాన్న ని నవ్వుతూ చూసి..

"అమ్మ ....మిక్సీ కొంటానే.ఇలా రుబ్బే పని తప్పుతుంది ."

"ఎందుకురా అయ్యా.డబ్బు దండగా."

"ఏంటమ్మా.ఎప్పటికి ఇలానే ఉండిపోతామా.మనము బాగా బ్రతకద్దా."

"అవి రేపు నీకు పెండ్లయినాకా.మీరు కొనుకొండయ్యా.మాకెందుకు."

"అదేంటమ్మా.మీరు మేము అని వేరు చేసి మాట్లాడుతున్నావ్.నేను ఎప్పటికి మీతోనే ఉంటా."

"ఈ పల్లెటూరిలో ఎడుంటావయ్యా.పట్నం లోనే ఉండు. మంచిగా సంపాయించు.మంచి అమ్మాయిని చూసి పెండ్లి జేసుకో....సుఖంగా ఉండయ్యా."

"హ్మ్...ఉంటా.కానీ మీతో ఉంటేనే నాకు సుఖం.మీతో ఒక విషయం చెప్పాలి.నేను మధ్యలో ఆపేసిన చదువు...మళ్ళీ మొదలు పెట్టాను.మొన్ననే ఫలితాలు వచ్చాయ్.పాస్ అయ్యాను.ఇంకా చదువుకుంటా.....లేదా జాబ్ చూసుకుంటా."

అని నా ఫ్లో లో నేను చెప్పుకు పోతున్నా,రుబ్బుతూనే...ఇద్దరు ఎం మాట్లాడకపోయే సరికి తలెత్తి చూసా.వారి కళ్ళలో అంతులేని ఆనందం...పట్టరాని సంతోషం.

అమ్మ గబగబా చెయ్ కడుక్కొని...నా నోట్లో చక్కెర పోసి....

"నూరేళ్లు సల్లగుండయ్యా.తన వల్లే నీ సదువు మద్యేలో ఆగిపోనాదని మీ అయ్యా బాధపడని దినం లేదయ్య.ఓపక్క కట్టపడుతూనే....సదూకున్నావ్ అంటే,మొదలు ఆనందించేది మీ అయ్యే."అంది అమ్మ నాన్నని చూస్తూ..

నాన్న నన్నే చూస్తున్నాడు.ఆయన కళ్లు నా కొడుకు అన్న గర్వంతో....వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయ్.

"నాన్నా..."మెల్లగా లేచి,నాన్నని హత్తుకున్నాను.ఆ ఆలింగనం నాలో కొత్త ఆశలని, కొత్త ఉత్సాహన్ని కలిగించాయ్. ఇంకా సాధించాలి అనే ఆలోచనని రేకెత్తించాయ్.గట్టిగా కళ్ళు మూసుకున్నాను.

నీళ్లు నిండిన కళ్ళని తెరిచేసరికి.....తలుపు దగ్గర నిల్చొని ఉంది అంకిత.నన్ను నవ్వుతూ చూసి వెళ్ళింది.


మరుసటి రోజు...తెల్లవారుజామునే లేచిన మేము,తలరా స్నానం చేసి....తిరుపతికి వెళ్లి...అలిపిరి చేరుకుని...శ్రీవారి మెట్టు నుండి....మా నడక ప్రారంభించాం.

అనీల్,సింధు...మేఘా,నేను అలవోకగా ఎక్కేస్తుంటే.అంకిత మాత్రం ఆపసోపాలు పడుతూ నెమ్మదిగా వస్తోంది.

తన కోసం నేనూ ఆగి....తనతో మాట్లాడుతూ,తనకి అలసట తెలియకుండా...గోవింద నామ స్మరణ చేస్తూ ఎక్కుతున్నాం ఇద్దరం.

మిగిలిన వాళ్ళు చాలా దూరం వెళ్లిపోయినట్టు ఉన్నారు.కనుచూపుమేరలో కనిపించలేదు వాళ్లు.

"అమ్మో నా వల్ల కావడంలేదు శీను. ఎలా ఎక్కుతున్నారు వీళ్లంతా."అంటూ పక్కన కూర్చుండిపోయింది అంకిత ఆయాసపడుతూ.

జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చి,తన పక్కన కూర్చున్న నేను.

"శీను నా వల్ల అయ్యేలా లేదు..నేను వెనక్కి వెళ్లిపోతా.నువ్వు వెళ్లు."

"ఓయ్ అలా అనకూడదు.ఒకసారి మొదలుపెట్టాక ఆపకూడదు.మెల్లగా వెళ్దాంలే.మన దర్శనం సాయంత్రం కదా."

"రాలేననిపిస్తోంది.3550 మెట్లు శీను.భయమేస్తోంది ."అంది మెట్లను చూస్తూ.

"నేను ఉన్నా కదా.పదా వెళ్దామ్."అని చెయ్ ఇచ్చా.

నా చెయ్ అందుకుని...నడుస్తూ,కబుర్లు చెప్తూ....మధ్యలో తన గురించి అడుగుతూ ఉంటే....వాళ్ళ కుటుంబ విషయాలు చెప్తూ ఉంది అంకిత.

వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఎంప్లొయ్.చాలిచాలని జీతంతో...సంసారం నెట్టుకొస్తోంది వాళ్ళ అమ్మ.తనకి ఒక తమ్ముడు ఉన్నాడు.ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు.వాళ్ళ నాన్నకి....డబ్బు సరిపోవడంలేదని చిరాకు.ముందు అబ్బాయి కాకుండా అమ్మాయి పుట్టిందని తల్లి మీద,తన మీద చీటికీమాటికి అరుస్తూ ఉంటాడట.

కొడుకు కన్నా తను ఎందులోనూ తీసిపోనని వాళ్ళ నాన్నకి తెలిసేలా చేసి...మంచి జాబ్ తెచ్చుకుని....తమ్ముడి బాధ్యత తనే తీసుకోవాలని.తల్లిని ఇకనైనా సుఖపెట్టాలని తన కోరికని చెప్పింది.ఇన్నాళ్లు తన చదువుకు కావాల్సిన డబ్బు కూడా వాళ్ళ నాన్న విసుకుంటూనే ఇచ్చాడట.

అలా మాట్లాడుకుంటూ...మా దర్శన సమయానికి కొంచెం ముందుగా చేరుకున్నాం.ముందుగా కల్యాణకట్టకు వెళ్లి నేను తలనీలాలు సమర్పించి మొక్కు తీర్చుకున్నాను.మిగిలిన వాళ్ళు మూడు కత్తెరలిచ్చారు.

వారాంతం కావడంతో తిరుమల రద్దీగా ఉంది.దర్శనానికి చాలా సమయం పట్టింది.

క్యూ లైన్ లో గంటలు గంటలు నిలుచున్న చిరాకు,విసుగు.....దానివల్ల కలిగిన నిస్సత్తువ.అన్ని గర్భగుడి అయిన ఆనందనిలయం లోని స్వామి వారి దివ్యమంగళ రూపం కాంచగానే....తన్మయత్వం తో కూడిన ఆథ్యాత్మిక భావన....శరీరానికి నూతన ఉత్తేజం కలిగించింది.

ఉదయం నుండి ఏమి తినకపోయినా....స్వామివారి దర్శనభాగ్యం లభించడంతో....భక్తులందరితో పాటు మేమూ ఎలుగెత్తి గోవిందనామ స్మరణ చేస్తూ....స్వామి వారి రూపాన్ని మా మదిలో పదిల పరుచుకునే ప్రయత్నం చేసాం.కాని అది అసాధ్యం.

మూలవిరాట్ దర్శనం తరువాత విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించి.....శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించాము.

ఆ తరువాత వెంకన్న లడ్డు ప్రసాదం తీసుకుని.శ్రీవారి ఉచిత అన్నప్రసాదంలో రాత్రి భోజనం చేసి.....తిరుగుప్రయణం అయ్యాం.

బస్సులు రద్దీగా ఉన్నాయ్.ఎక్కడ దొరికితే అక్కడ చతికిల పడ్డాం.నేను,అంకిత ఒక చోట కూర్చున్నాం.బాగా రాత్రవ్వడం,అలసట వలన ఐదు నిమిషాల్లోనే...నిద్రపట్టేసింది అందరికి.

ఘాట్ రోడ్ మలుపులుతో....బస్ సునాయాసంగా వెళుతుంటే....ఆ మలుపులకి నిద్రాభంగం కలిగి కళ్ళు తెరిచిన నాకు.....అంకిత నా ఎదపై నిద్రపోతు,నాకు అతిసమీపంగా కనిపించింది.

తనని పక్కకి జరిపే ప్రయత్నం చేసినా....లాభం లేకపోయింది.తను నా చేతిని చుట్టేసి,గట్టిగా పట్టుకుని....పూర్తిగా నా పై వాలిపోయి ఉంది.

కొంత ఇబ్బందిగానే సాగింది నా ప్రయాణం.కళ్ళు తెరిస్తే.....అంకిత ఇంకెంత ఇబ్బంది పడుతుందో అనిపించింది.కాసేపటికి బస్ బస్ స్టాండ్ లో ఆగడంతో కళ్ళు తెరిచిన అంకిత.....తను ఉన్న స్థితి చూసి,టక్కున లేచింది.

నేను కళ్ళు మూసుకొని ఉన్నా...అంతా గమనిస్తూ ఉన్నాను.నాకు తెలిసింది అంటే....తను ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతుందని.

తిరుపతిలో ఆటోల్లో బయల్దేరి,ఇంటికి చేరుకుని...అమ్మ మేడ మీద పక్కలు పరిచి ఉంచడంతో....నేరుగా వెళ్లి పడుకుండిపోయాం.ఉదయం ఎనిమీదైనా లేవబుద్దికాలేదు మాకు.


ఆలస్యంగా లేచి...ఒకేసారి భోజనం చేసుకుని,మామిడి తోపులోకి వెళ్ళాం.

అక్కడే సాయంత్రం వరకు సరదాగా గడిపేసామ్.పొద్దుపోతోందని ఇంటికి బయల్దేరుతూ ఉంటే...కొన్ని మామిడికాయలు కోసుకోస్తాం అని...

"నేను మళ్ళీ తెస్తాను రండి."అన్నా వినకుండా... అంకిత,మేఘా వెనక్కి వెళ్లారు.

తోపు నుండి బైటికొచ్చిన మాకు...ఏదో శబ్దం వినిపించి ఆగాం. మేఘా అరుపులు వినిపిస్తున్న వైపు వెళితే....

బోరు బావిలో పడిన అంకిత ఈత రాక మునిగిపోతు కనిపించింది.ఆలస్యం చేయకుండా.....బావిలోకి దూకి,తనని పైకి తీసుకొచ్చి పడుకోబెట్టాను.

సృహలో లేదు తను.అందరు కంగారు పడుతున్నారు.అంకితని బోర్లా పడుకోబెట్టి....వీపు పైన గట్టిగా నొక్కడంతో,మింగిన నీళ్లు కక్కింది.మెల్లగా సృహలోకి వచ్చి కళ్ళు తెరిచింది.

"అక్కి అర్ యు ఓకే."అంటూ సింధు భయంగా,కంగారుగా అడుగుతూ ఉంటే....మెల్లగా తల ఊపి నన్ను చూసింది....తన చెంప చెల్లుమనిపించా నేను.చాలా కోపం వచ్చింది నాకు.

"అన్నయ్య ఏంట్రా.ఎందుకు కొట్టావ్?"అంటూ అక్కి తల అదుముకుని,నన్ను సిరియస్గా చూసింది సింధు.

"కొట్టాలా...నరకాలా...ఎం చిన్న పిల్లా.జాగర్తగా ఉండటం తెలియదా.నేను తెస్తా అన్నా వినకుండా పెద్ద పుడింగిలా వెళ్ళింది."

"ఎం కాలేదుగా నువ్వు సీరియస్ అవ్వకు."సర్ది చెప్పబోయింది సింధు.

"ఏమైనా అయ్యుంటే?నేనూ...."అంటూ ఆగి అంకితని చూశాను. ఛా...అసహనంగా లేచి,మీరు ఇంటికి వెళ్లిపోండి అని,నేను ఇంకెటో వెళ్ళా.


మరుసటిరోజు సాయంత్రమే మా ప్రయాణం.అమ్మ మాకోసం గారెలు చేయడానికి పిండి రుబ్బుతు ఉంటే.....అంకిత తాను రుబ్బుతా అని కూర్చుంది.

అంతసేపు అమ్మతో సరదాగా మాట్లాడుతూ ఉన్న అంకిత....నేను అటు రాగానే మాటలు ఆపేసి,కనీసం నన్ను చూడకుండా.....తనపాటికి తను రుబ్బుకుంటు ఉంది.

ఛా...అనవసరంగా కొట్టా తనని.ఫీల్ అయినట్టు ఉంది.అయినా నేనెందుకంత ఆవేశపడ్డా అసలు.నాకేమైంది?సమాధానం లేదు నా దగ్గరా.కనీసం తెలుసుకోవాలని కూడా అనుకోలేదు.

సాయంత్రం హైదరాబాద్ బయల్దేరాం.....అమ్మ తినడానికి ప్యాక్ చేసి ఇవ్వడంతో తిని పడుకున్నాం.

నాకు నిద్రపట్టడంలేదు...అంకిత నాతో మాట్లాడడం లేదు.అది నాకు రుచించడంలేదు.ఎందుకో అర్థం కావడంలేదు.అక్కడ ఉండ బుద్దికాక...ఎంట్రన్స్ దగ్గర వచ్చి నిలుచున్న....

ఆ రైలు వేగంతో పోటీపడుతూ.....నా ఆలోచనలు పరిగెడుతున్నాయ్.నన్ను నేను అంచనా వేసుకునే పనిలో పడ్డా.నాలో,నా ఆలోచనల్లో వస్తున్న మార్పు దేనికి సంకేతమో ఎలా తెలుసుకోవాలో తెలియక సతమతమవుతున్న.

టకటక మంటూ రోధపెడుతున్న....రైలు పట్టాల శబ్దాల మధ్య....ఒక తియ్యని గొంతు నన్ను పిలిచేసరికి వెనక్కి తిరిగిచూసా.

"ఇక్కడెం చేస్తున్నావ్ శీను.నిద్రపట్టలేదా?"ఆవలిస్తూ అడిగింది అంకిత.

"హ....లోపల ఊపిరాటంలేదు అందుకే."

"నాక్కూడా.వీకెండ్ కదా....రష్ ఎక్కువ ఉంది.లేకుంటే ఏసీ లో బుక్ చేసుండచ్చు."

"హ్మ్...."అని ఆగి,తననే చూస్తూ ఉండిపోయా.అది గమనించి..

"ఏంటి శీను?"

"అదీ...అదీ అంకిత ఐ యామ్ సారీ.నేను కొట్టాల్సింది కాదు అలా.ఎందుకో కోపం వచ్చేసింది.తప్పుగా అనుకోకు."

"అయ్యో దానిదేం ఉంది శీను. ఆ టైం లో ఎవరైనా అలాగే చేస్తారు.అసలే మా నాన్నని బలవంతంగా ఒప్పించి తీసుకొచ్చింది సింధు.ఇక్కడ నాకేమైన అయ్యుంటే.....మా నాన్న గోలగొల చేసుంటాడు.నువ్వు కొడితే కొట్టావ్ గాని...నాకేం కాకుండా కాపాడావ్.థాంక్యూ శీను."

"మరి ఎందుకు నాతో మాట్లాడ్డం లేదు నువ్వు."

"అదా....ఏదో నా ఇగో సాటిస్ఫ్యాక్షన్ కోసం మాట్లాడలేదులే.దానికె ఇలా అయిపోయావా.నేనేం ఫీల్ అవటంలేదులే..ఊరికే నువ్వు ఫీల్ అవ్వకు.వచ్చి పడుకో."అని తను వెళ్ళబోతు ఆగి..

"అన్నట్టు నీకో విషయం చెప్పాలి.ఈరోజు మేఘా నీ గురించి పోసిటివ్ గా మాట్లాడింది.శీను చాలా మంచివాడే.ఎంత కష్టపడుతున్నాడు.....ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అంటూ ఏదో చెప్పింది.శీను నీ లైన్ క్లియర్ అయినట్టే..మెల్లగా మేఘాతో నీ మనసులో మాట చెప్పేయ్."

అని నవ్వుతూ వెళ్ళిపోయింది అంకిత.

నేను అక్కడే ఆగిపోయా....మేఘా గురించి అస్సలు ఆలోచనే రావడంలేదు.నా మైండ్ అంత అంకిత చుట్టే ఉంది.

అంకిత నార్మల్ గానే ఉంది.నేనే ఎక్కువ ఆలోచిస్తున్నాన అనిపించింది.కానీ....ఎందుకు అంత భయంవేసింది నాకు.

ఊరిలో ఎంతో మంది ఇలాంటి ప్రమాదాల్లో చిక్కుకున్నపుడు.....నేను చాలాసార్లు కాపాడాను.కానీ ఏనాడు అంత కంగారు,భయం కలగలేదు.మరి అంకిత విషయంలో ఎందుకు కలిగింది.ఎందుకు?

కొన్ని ప్రశ్నలకి సమాధానం మన దగ్గరే ఉన్నా....మనమే గుర్తించలేం అంటారు.మరి ఈ ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉందా.అది నేనెప్పుడూ తెలుసుకుంటాను.


ఎప్పటిలాగే షాప్ కి వెళ్ళాను....వెంకన్న లడ్డు ప్రసాదం తీసుకుని.

అందరికి ఇచ్చి...పని చేసుకుంటూ,బైట సర్వీసింగ్ కి వెళ్లి.....సాయంత్రం వచ్చేసరికి మేడం ఉన్నారు షాప్ లో.

"నమస్తే మేడం."

"హ్మ్...ఊరెళ్ళావట."

"అవును మేడం.ప్రసాదం తీసుకోండి."అని రెండు లడ్డులు ఇచ్చాను.

"ఇంకేంటి శీను. నెక్స్ట్ ఎం చేద్దామనుకుంటున్నావ్?"

"మేడం బ్యాంక్ ఎక్సమ్స్ కి ప్రిపేర్ అవుదామని ఉంది."

నా మాట విని నన్ను ఆశ్చర్యంగా చూస్తూ...

"గుడ్ శీను.నేనడగ్గానే....మీరే చెప్పండి మేడం అంటావనుకున్నా.కానీ...నిగురించి నిర్ణయం నువ్వే తీసుకున్నావ్.మంచిది శీను... నీకు ఎలా అనిపిస్తే అలాగే చెయ్."

"అంటే మేడం నన్ను బ్యాంక్ ఎక్సమ్స్ రాయమంటారా?"

"అఫ్కోర్సు శీను అది నీ ఇష్టం.ఇక్కడే పని చేసుకుంటూ...పీజీ,లేదా ఎం.బీ.ఏ,ఎం.సి.ఏ ఏదైనా చేయచ్చు.కానీ బ్యాంక్ ఎక్సమ్స్ రాసి జాబ్ వస్తే ఇంకా మంచిది కదా. అక్కడ జాబ్ చేస్తూ కూడా చదువుకోవచ్చు.గుడ్ డెసిషన్ శీను."

"థాంక్యూ మేడం.మీరు కోప్పడతారనుకున్నా."

"శీను.... ఎప్పుడైనా సరే,మనకు ఏది మంచో,ఏది కరెక్టో మనకు మాత్రమే తెలుస్తుంది.ఒకరు చెప్తేనో,ఇంకొకరు అనుకుంటేనో,మరెవరి కోసమో.....దాన్ని మనకు మనం ఆపాదించుకోకూడదు.మన సొంత నిర్ణయం ఉండాలి....దాని మనం గట్టిగా నమ్మాలి.అర్ధం అయ్యిందా."

నేను మేడంనే చూస్తూ ఆలోచనలో పడ్డాను.

"ఏంటి శీను ఆలోచిస్తున్నావ్?"

"ఎం లేదు మేడం ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది.ఒక్కోసారి పక్క వారి మాటలు మనల్ని చాలా ప్రభావితం చేస్తాయ్.....కొన్ని మంచి వైపు నడిపిస్తే.మరి కొన్ని చెడు వైపు.మరికొన్ని....మన వ్యక్తిత్వాన్ని మనమే మర్చిపోయేలా."

"ఓయ్ శీను. ఎంటెంటో మాట్లాడేస్తున్నావ్.ఏమైంది నీకు?"అంటూ నా మొహం ముందు చిటికే వేస్తూ అడిగింది మేడం.

"సారీ మేడం.ఎం లేదు."

"నువ్వేం చేసిన పర్లేదు....కానీ స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రం వదలకు.అలాగే.....కొత్త కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ఉంటూ.సరేనా."

"అలాగే మేడం."

కొన్నిరోజుల తరువాత....నేను ఎక్సమ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను.సింధు వాళ్ళకి కాలేజ్ లో క్యాంపస్ ఇంటర్వూస్ జరిగాయి.సింధు,అంకిత సెలెక్ట్ అయ్యారు.జాబ్ జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యారు.

మేఘా ఎంటెక్ చేయలనుకుంది.అనీల్ ఎంబీఏ చదవడానికి తిరిగి విజయవాడ వెళ్లిపోవాలని అనుకుంటున్నాడు.


ఆరోజు సింధు బర్త్డే.పైగా ఆదివారం కావడంతో.....మా గ్యాంగ్ అంత వచ్చారు ఇంటికి ఉదయమే.

పిన్ని మా అందరికి స్పెషల్స్ చేసేపనిలో ఉంది.మేమంతా ఒక రూమ్ లో కూర్చోని సరదాగా కార్డ్స్ ఆడుకుంటూ ఉన్నాం.

మధ్యాహ్నం భోజనం చేసి సినిమాకి వెళ్ళాం.అంకిత వెళ్లి టికేట్స్ తెచ్చింది.రెండు సీట్లు పక్క రోలో వచ్చాయ్.నేను అటు వెళ్లి కూర్చున్నా.

నా వెనకే వచ్చిన అంకిత నా పక్కన కూర్చుంటుంది అనుకుంటే...మేఘా వచ్చి కూర్చుంది.నాకెందుకో అది నచ్చలేదు.అంకితకి చూసాను.....యధాలాపంగా నన్ను చూసి,ప్రొసీడ్ అన్నట్టు చెయ్ చూపించింది.

అప్పుడు అర్థం అయ్యింది నాకు.నేను మేఘాని ఇంప్రెస్స్ చేయాలనుకున్న కదా.....అందుకే అంకిత మా ఇద్దరికీ వేరుగా టికెట్స్ తీసుకుందని.

ఇంటర్వెల్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చిస్తే తింటూ....సినిమాలో మునిగిపోయింది మేఘా.మూడు గంటల సినిమాలో మేఘా కానీ,నేను కానీ అసలు నోరు తెరిచి ఒక్కమాట కూడా మాట్లాడుకోలేకపోయాం.

సాయంత్రం ఇంటికి వచ్చి....పిన్ని టీ ఇస్తే వద్దని మేడ మీదికి వెళ్ళాను.

నా మైండ్ అంత డిస్టర్బ్ గా ఉంది.నాకేం అర్థం కావడంలేదు.నేను మేఘాతో ఎందుకు మాట్లాడలేకపోయాను.అందరితో ఫ్రీగా మాట్లాడే నేను...మేఘా తో ఎందుకు...అది భయమా,తడబాటా...లేకపోతే ఇష్టం లేకా?

అసలు నా పక్కన అంకిత కూర్చొకపోతే ఎందుకంత ఫీల్ అయ్యాను.మేఘా వస్తే హ్యాపీ అవ్వాలి కానీ...ఎందుకు నచ్చలేదు నాకు.నాకేం అవుతోంది.

ఆ సమయంలో ఎందుకో మేడం మాటలు గుర్తొచ్చాయ్.

మనకు ఏది మంచో,ఏది కరెక్టో మనకు మాత్రమే తెలుస్తుంది.ఒకరు చెప్తేనో,ఇంకొకరు అనుకుంటేనో,మరెవరి కోసమో.....దాన్ని మనకు మనం ఆపాదించుకోకూడదు.

ఎస్ నిజమే.మేఘా మీద నాకున్నది ప్రేమ కాదు ఆకర్షణ.అది కూడా చందు,గిరిల మాటల ప్రభావం వలన కలిగింది.వాళ్ళు నన్ను తక్కువ చేసి మాట్లాడారని....మేఘాతో పరిచయం పెంచుకుని,వాళ్ళకి నా స్టామినా తెలిసేలా చేయలనుకున్నాను.....కానీ దాన్నే ప్రేమ అని ఫీల్ అయ్యాను.నాకు నేను ఆ ఫీలింగ్ ని ఆపాదించుకున్నాను.కానీ కాదు మేఘా మీద నా ఫీలింగ్ అది కాదు.కానే కాదు.

మరి అంకిత మీద నా అభిప్రాయం ఏంటి.తను పక్కనుంటే బాగునట్టు అనిపించడమే కాదు,తను లేకపోతే ఏదో వెలితిగా కూడా ఉంటోంది,ఎందుకు?తనకి ఏదైన అయితే.....నాకెందుకంత బాధ.ఇదేనా ప్రేమన్.....

"శీను..."నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ వచ్చింది అంకిత.

"ఇక్కడున్నావా.ఎం చేస్తున్నావ్?"

"మొక్కలకు నీళ్లు పోస్తున్నా."

"హో గుడ్."అంటూ గులాబీ పువ్వుని సున్నితంగా తడుముతూ నిల్చుంది.

తెల్లటి గులాబీల పక్కన..... అప్పుడే అస్తమిస్తున్న సూర్యణి వెలుగుకి,బంతి పువ్వులా పసిడి వర్ణంతో మెరిసిపోతున్నట్టు అనిపించింది అంకిత నాకు.

కనురెప్పవేయకుండా తననే చూస్తూ ఉంటే..."ఏంటి శీను?"అంది నన్ను నవ్వుతూ చూసి.

"అంకిత నన్ను పెళ్లి చేసుకుంటావా?"ఆ క్షణం నా మదిలో మెదిలిన మాట అది...ఆలస్యం చేయకుండా అడిగేసాను.

అంకిత మొహంలో నవ్వు మాయం అయ్యి....అయోమయం చోటు చేసుకుంది.

"నువ్వు సరిగ్గానే విన్నావ్.నన్ను పెళ్లి చేసుకుంటావా?"

కాసేపటి మౌనం తరువాత మెల్లగా..."ఎం మాట్లాడుతున్నావ్ శీను.నువ్వు మేఘాని..."

"మేఘాని నేను ప్రేమించట్లేదు అంకిత.అది కేవలం అట్రాక్షన్.అది నేను కొంత ఆలస్యంగా తెలుసుకున్నాను."

"మరి ఇంత సడెన్గా నామీద ప్రేమేల పుట్టుకొచ్చింది శీను."కొంచెం కరుకుగా అడిగింది.

"సడెన్గా కాదు అంకిత.మేఘా మీద నాకున్నది అట్రాక్షన్ అని ఎలా ఆలస్యంగా తెలుసుకున్నానో....అలాగే నీ మీద ప్రేమను తెలుసుకున్నాను.ఇంకా లెట్ చేయకూడదని అడిగేసాను."

తను సైలెంట్గా ఉంది.నాకు తెలుసు ఇది తను ఊహించి ఉండదు.ఇలా సడెన్గా అడిగితే ఆ ఆడపిళ్ళైనా ఎలా నిర్ణయం తీసుకోగలదు.

"అంకిత...ఇన్నిరోజులుగా నన్ను చూస్తున్నావ్.నా గురించి ఒక అంచనాకు వచ్చే ఉంటావ్.నాకెలాంటి బ్యాడ్ హబిట్స్ లేవు."

"అది కాదు శీను....నేనెప్పుడూ నీ గురించి అలా ఆలోచించలేదు."అంది నా మాటలకు అడ్డుపడుతూ.

"అర్ధం చేసుకోగలను అంకిత.బాగా ఆలోచించి చెప్పు.పర్లేదు.నాకూ టైం కావాలి."

"దేనికి?"

"నువ్వు జాబ్ కి సెలెక్ట్ అయ్యావ్.స్టార్టింగే ముపైవేల జీతం.నీ జీతాన్ని అందుకోవాలంటే....నాకు కనీసం ఏడాదైనా పడుతుంది.ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా తమ కన్నా పై స్థాయి వాళ్లకి తమ బిడ్డని ఇవ్వాలని అనుకుంటారు."

"కానీ నాకు ఆస్తిలేదు,అంతగా అందం కూడా లేదు....కనీసం ఎక్కువ సంపాదన అన్నా ఉంటేనేకదా...దైర్యంగా మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడగలను.నాకు తెలుసు...నన్ను అల్లుడిగా ఒప్పుకోడానికి ఎవరు ఇష్టపడరు."

"కానీ అంకిత....నా భార్యని పువ్వులో పెట్టి చూసుకొకపోయినా,కంటనీరు పెట్టనీకుండా చూసుకోగాలను.ఆస్తి లేకపోయినా....కష్టించే సత్తువ ఉంది,దేనైనా సాధించగలను అనే కొండంత ఆత్మవిశ్వాసం ఉంది."

"అదే వెలకట్టలేని ఆస్తి శీను."అంది అంకిత నన్ను మెచ్చుకోలుగా చూస్తూ.తను ఎం చెప్తుందా అని చూస్తూ ఉంటే...

"శీను...ఇప్పుడు నువ్వన్న ప్రతి మాట నిజమే.కాదనను.నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయ్.రేపు మన చేతిలో ఎం ఉండదు శీను. మన చెయ్ దాటిపోయే పరిస్థితులు ఎదురవ్వచ్చు.నేను మాట ఇవ్వలేను కానీ....ఆలోచిస్తాను."

"ఇన్నిరోజులుగా చూస్తున్నా అన్నావ్ కదా...ఇన్నిరోజులు నిన్ను ఒక స్నేహితుడిగానే చూసాను.ఆ విధంగా ఆలోచించలేదు.ఇప్పుడు ఆ పని చేస్తాను."

"థాంక్యూ అంకిత.బలవంతం ఎం లేదు.రేపు నీ నిర్ణయం ఏదైనా పర్వాలేదు.కానీ....దీని వల్ల మన స్నేహానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు.అలా జరిగితే....ఇలా అడిగి,ఒక మంచి స్నేహితురాలిని కోల్పోయా అని జీవితాంతం బాధపడతాను."

"సరే శీను....నువ్వు కూడా నేనేం చెప్పిన పోసిటివ్ గా తీసుకోవాలి."అని నవ్వుతూ...మొక్కలకు నీళ్లు పోస్తున్నా తనకి సాయం చేస్తున్నాను.

మనసులోని ప్రశ్నలకు జవాబు దొరికింది.అర్ధం చేసుకునే మనిషి జీవితభాగస్వామిగా లభిస్తే....ఆ మనిషి ఏదైనా సాధించగలడు.స్నేహితురాలిగా నా హితవు కోరుకున్నా అంకిత....నాకు భార్యగా వస్తే,నాకు మించిన అదృష్టవంతుడు ఉండడేమో అనిపించింది.


మరోనెల గడిచింది ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు.సింధు,అంకిత ఇద్దరు ఓకే కంపెనీకి సెలెక్ట్ కావడంతో...చాలా హ్యాపీ గా ఉన్నారు.

మేఘా చెన్నై SMR కాలేజ్ లో ఎంటెక్ సీట్ రావడంతో తను ఇంకో వారం రోజుల్లో బయల్దేరబోతోంది.

హసీనాకి కూడా చెన్నై లోనే పీజీ సీట్ వచ్చింది...మేఘాకి,తనకి ఎక్కువ దూరం ఉండటంతో....కలిసి ఉండే వీలు లేకుండాపోయింది.

ఇక అనీల్ కూడా బయల్దేరబోతున్నాడు.నేనూ ఎక్సమ్స్ రాసి రిసల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను.

ఈ నెల రోజులు మేం సరిగ్గా కలవలేకపోయాం.ఒకరు ఉంటే మరొకరు రాలేకపోయారు.హసీనా అయితే అసలు కనిపించనేలేదు.

అనీల్ ఇంకో రెండు రోజుల్లో బయల్దేరపోతున్నాడని... అందరం కచ్చితంగా కలవాలని అనుకున్నాం.

షాప్ లో పని ముగించుకుని ముందుగా కేఫ్ కి చేరుకున్న నాకు....మేం ఎప్పుడు కూర్చునే టేబుల్ దగ్గర కనిపించింది....ఒక బుర్కా అమ్మాయి.

ఒక్కత్తే ఉంది కదా....పక్క టేబుల్లో కూర్చోమని చెబుదామని....పిలిచాను తనని,వెనుక నుండి.

తను మొహానికి వేసుకున్న ముసుగు తొలగించి,అద్దాలు పెట్టుకుంటూ వెనక్కి తిరిగింది.

"హో హసీనా నువ్వా.ఎవరో అనుకున్నా.ఎలా ఉన్నావ్.అసలు కనిపించడమే లేదేయ్.సింధు బర్త్డే రోజు కనిపించావ్.మళ్ళీ ఇదిగో ఇప్పుడే ...నీ దర్శన భాగ్యం లభించింది నాకు."అంటూ చమత్కారంగా అంటూ ఉంటే....తనేమో ఏదో పరధ్యానంగా ఉంది.

"ఏంటి హసీనా అలా ఉన్నావ్?"

"ఎం లేదు.నేను వెళ్తాను."

"అరే.వెళ్తా అంటావేంటి.అందరూ వస్తారు ఉండు.మళ్ళీ ఎప్పటికి కలుస్తామో ఏంటో.అనీల్ ఎల్లుండి విజయవాడ వెల్పోతున్నాడుగా.....వాడికోసమే ఈరోజు ప్లాన్ చేసింది."

కాసేపు సైలెంట్గా ఉన్నా...హసీనా ఏదో ఇబ్బందిగా ఉండేసరికి...

ఈ అమ్మాయి ఎందుకిలా ఉంటుందో అడిగేయాలి అనుకుని....తనతో మాటలు కలిపేలోగా.

"శీను...."తనే పిలిచింది.

"హ చెప్పు హసీనా."

"అదీ...నేనూ..."హసీనా ఏదో చెప్పబోయేలోగా,అంకిత వచ్చి....నా పక్కన కూర్చుంది.

"హాయ్ హసి. ఏంటి ముందే వచ్చేసారు."అడిగింది నన్ను చూస్తూ.

"పని అయిపోయింది వచ్చేసా."

"హో...హసి నువ్వెంటే. మేఘాతో వెళ్లకుండా...రేపే వెళ్లిపోతున్నావట చెన్నై కి.ఎం అంత తొందరా?"

"హాస్టల్ చూసుకోవాలిగా అక్కి.అందుకే.సరే నాకు లేట్ అవుతోంది.ప్యాక్కింగ్ చేసుకోవాలి.ఉంటా..బాయ్."అంటూ మేము పిలుస్తున్న వినిపించుకోకుండా వెళ్ళిపోయింది హసీనా.

"ఎంటో ఈ పిల్ల.ఈ మధ్య మరీ అర్ధం కాకుండా ప్రవర్తిస్తోంది."అంది అంకిత సాలోచనగా.

"నికేమైన తేనా?"

"వద్దులే శీను.అందరూ రాని....అవునూ నీ రిసల్ట్ ఎప్పుడు వస్తాయ్."

"ఇంకో మూడు రోజుల్లో.ఎం?"

"ఎం లేదు.అదీ...నన్ను ఒకటి అడిగావ్ కదా.దానికి సమాధానం చెబుదాం అని."

"ఎం చెప్తావ్?"

"ఎం చెప్పాలని అనుకుంటున్నానో అది.కానీ శీను.... మళ్లీమళ్లీ చెప్తున్నా.నువ్వు పోసిటివ్ గా తీసుకోవాలి."

అంటున్న అంకితని కొంచెం బేరుగ్గా చూసా.తను పదేపదే ఎందుకలా అంటోందో......నా బుర్రకి అర్ధం కావడంలేదు.ఒకవేళ తనకి అలాంటి ఉద్దేశం లేదేమో....వెంటనే చెప్పేస్తే,నేను తట్టుకోలేనేమో అని ఇన్నిరోజులు వెయిట్ చేయించిందేమో అని మొదటిసారి అనుమానం కలిగింది.

"ఓయ్ ఏంటి అలా అయిపోయావ్?"అంకిత పిలిచేసారికి చూసా తనని.

"ఎంలేదులే.."అంటూ ఉంటే వచ్చేసారు అందరూ.

చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ....సరదాగా గడిపేశాం.ఇక బయల్దేరాబోతు నా పాకెట్ చెక్ చేస్తే ఫోన్ లేదు.

"రేయ్ మీరు వెళ్లిపోండి.నా ఫోన్ షాప్ లోనే మర్చిపోయిన్నట్టు ఉన్నా.వెళ్తా."అని అనీల్ కి చెప్పి బైటకి వచ్చాను.

"శీను... శీను... వెయిట్."అంటూ పరిగెడుతూ వచ్చింది మేఘా.

"ఏంటి?"

"నన్ను మీ షాప్ దగ్గర ఉన్న బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయవా ప్లీస్."అంది బుంగమూతి పెట్టి.

"సరే రా."అని తనతో షాప్ ముందు నుండే,బస్ స్టాప్ లో డ్రాప్ చేసి,తనకి బాయ్ చెప్పి...షాప్ లోకి అడుగుపెట్టగానే..మేడం కనిపించారు.

"నమస్తే మేడం."విష్ చేశా ఆవిడని.

నన్ను చూడకుండానే.....మెల్లగా తల ఊపింది.

నా ఫోన్ ఎక్కడ పెట్టానో చూసి,తీసుకుని...వాటర్ తాగుతూ ఉంటే...నా దగ్గరికి వచ్చారు చందు,గిరి.

ఇద్దరు ఆశ్చర్యంగా నన్నే చూస్తూ ఉంటే...

"ఏంటి అలా చూస్తున్నారు?"అడిగా.

"ఇందాకా నీతో వచ్చిన అమ్మాయీ...."అని ఆగిపోయాడు గిరి.

హో.....మేఘా నాతో బైక్ మీద ఏంటి,ఎలా అనా వీళ్ళ డౌట్.అనుకోని.

"మేఘన...తను నా ఫ్రెండ్."అన్న

"ఎలారా?"ఇంకా నమ్మలేక అడిగాడు చందు.

"ఎలాగోలా.మేఘా నేను చాలా క్లోస్ లే."అన్నా వాళ్ళని ఇంకా ఉడికించాలని.

"నిజం చెప్పరా.మేఘా ఎలా తెలుసు నీకు."బెదిరిస్తున్నట్టు అడుగుతున్న చందుని చూసి కోపం వచ్చింది నాకు.

"ఎలా అయితే ఏముంది.తెలుసు.అది చాలదా."అని చిన్నగా నవ్వుతూ మేడం దగ్గరికి వెళ్లి.

"మేడం."పిలిచా.

"ఏంటి?"అరిచింది.

ఎందుకో అంత కోపం అర్ధం కాలేదు నాకు.

"ఎం లేదు మేడం.మీరేదో పనిలో ఉన్నట్టు ఉన్నారు."అని వెల్పోతుంటే...పిలిచింది ఆవిడే.

"ఎంటో చెప్పు శీను. ఏదో అడగాలని వచ్చావ్ గా."

"అదీ...ఎం.సి.ఏ చేయాలని అప్లై చేసాను.మెటీరియల్ ఎక్కడ దొరుకుతుందో అని."

"హో...లైబ్రరీలో చూడు.లేదా..ఇన్స్టిట్యూట్ లో శేఖర్ కి చెప్తా.....తను హెల్ప్ చేస్తాడు నీకు.తనకి టచ్ లో ఉండు నువ్వు."అంది.

"ఓకే మేడం.థాంక్యూ సో మచ్."

"హ్మ్...శీను.నేను వేరే ఊరు వెళ్లిపోతున్నా.బహుశా మనం కలవడం ఇదే ఆఖరు కావచ్చు.ఇంకో ఐదేళ్లు ఇటు రాలేను.నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి...నేను ఊహించని పొజిషన్ లో ఉండాలి నువ్వు."అంది మేడం.

ఇన్నిరోజులు నేను ఎటు వెళ్లలో చెప్తూ....నా వెన్నంటే ఉన్న మేడం.....ఇక ఉండరు అంటే ఎందుకో బాధగా అనిపించింది.నా పయనం మొదలైంది మేడం వల్లే....ఇప్పుడు మధ్యలోనే ఆవిడ తోడు ఉండదు....ఇకపై నా పయనం ఒంటరిగా కొనసాలగించాలి అంటే...బేరుకుగా అనిపించింది.

మేడం మాటలు,ఆవిడ నాలో నింపిన స్ఫూర్తి.....నేను సరైన మార్గంలో నడవాలని ఆవిడ పడిన తపన.అన్ని తలుచుకుంటుంటే....మేడం లేని లోటు ఇప్పుడే తెలుస్తోంది నాకు.

"శీను..."మేడం పిలుపుతో ఈలోకంలోకి వస్తూ,నా ఎదురుగా చెయ్ ముందుకు చాపిన మేడంని చూసాను...

సంశయిస్తూ ఆవిడకి చెయ్ అందివ్వగానే.....నా చేతిని గట్టిగా పట్టుకుని..

"ఆల్ థి బెస్ట్ శీను."అంది నా కళ్ళలోకి సూటిగా చూస్తూ.

"థాంక్యూ మేడం."అని నేను అనగానే....నా చెయ్ వదిలి ఫాస్ట్ గా వెళ్ళిపోయింది.

@@@@@@

"బస్ కి ఇంకా చాలా టైం ఉంది కదా.ఎందుకు ఇంత త్వరగా తీసుకొచ్చావ్?"

బైక్ డ్రైవ్ చేస్తూ......నా వెనక ఉన్న అనీల్ ని అడిగా.విజయవాడ వెళ్తున్న వాడిని....డ్రాప్ చేయడానికి వచ్చా నేను.

"ఇక్కడ ఆపరా శీనుగా."అన్నాడు ఆపేసా.

"ఏంట్రా?"

"రా లోపలికి."అన్నాడు..చూస్తే అది బార్ అండ్ రెస్టారెంట్.

"ఎందుకురా?"

"రేయ్...ఇక్కడికి వచ్చినప్పటి నుండి,తాగలేదురా.బాబాయ్ కి తెలిస్తే....తంతాడని.రేపు ఇంటికి వెళ్ళినా తాగలేను....అమ్మ చీపురకట్ట తిరగేస్తుంది.ఉన్నది ఈ ఒక్కరోజే....తాగనిరా."

"ఇందుకేనా ముందే తీసుకొచ్చావ్ ....ఎం అక్కర్లేదు పదా."అని బైక్ స్టార్ట్ చేశా.

ఇంజిన్ ఆపి...కీస్ తీసేసుకున్నాడు అనీల్.

"ప్లీస్ రా.ఒకే ఒక్క బీర్.ప్రామిస్.అంతకుమించి తాగితే కొట్టు.ప్లీస్ రారా."

వాడి బాధ చూడలేక..."ఒక్కటంటే ఒకటే చెప్తున్నా."అని ఇద్దరం లోపలికి వెళ్ళాం.

"హే శీను." అప్పుడే లోపలికి వస్తు పలకరించాడు గిరి,పక్కనే చందు కూడా ఉన్నాడు.

"హాయ్ గిరి."

"నువ్వెంటి శీను ఇక్కడ.నువ్వు మందు కొట్టవుగా."

"అదీ వీడు నా కజిన్ అనీల్...వీడి కోసం వచ్చాలే."

"అనీల్,వీళ్లు నాతో పాటు షాప్ లో పనిచేస్తారు."అని పరిచయం చేశా.

నలుగురం ఒకే టేబుల్ ముందు కూర్చున్నాం.

ఎవరికి కావాల్సింది వాళ్ళు తెప్పించుకుని తాగుతున్నారు.

ఒక బీర్ కే ఊగిపోతున్న అనీల్..ఇంకోటి తెమ్మని ఆర్డర్ ఇచ్చాడు.

"రేయ్ నీకు ఎక్కువైంది.ఇంక చాలు పదా."అంటున్నా నన్ను వారించి...

"శీనుగా....నువ్వు పెద్ద దొంగవిరా."అన్నాడు అనీల్ మత్తుగా.

"ఏంట్రా?"

"నువ్వు చెప్పకపోయినా...నేను కనిపెట్టేసా.నువ్వూ....అంకిత...హ....కదా."అన్నాడు రెండు వేళ్లు పెనవేస్తూ.

"నీకెలా తెలుసు అనీల్?"ఆశ్చర్యంగా అడిగా.

"నాకు తెలుసురారేయ్.ఫస్ట్ లో మేఘాని ఇంప్రెస్ చేయాలని ట్ర్య్ చేశావ్.కానీ...అంకితకి క్లోస్ అవుతూ వచ్చావ్.నీకు అంకితనే కరెక్ట్ రా....మేఘా నీ టైప్ అమ్మాయి కాదు.ఈ విషయం నీకు చెప్పాలని చాలాసార్లు అనుకున్నా.కానీ నువ్వెలా రియాక్ట్ అవుతావో అని ఊరుకున్నా...."అని ఆగి ఒక గుక్క తాగి..

"అంకిత చాలా మంచి అమ్మాయి రా.నికైతే పర్ఫెక్ట్ మ్యాచ్ అసలు.నువ్వు లక్కీ రా శీనుగా."అన్నాడు.

చిన్నగా నవ్వుతూ,"అంకితని అడిగానురా.కానీ తనేం చెప్పలేదు.రేవు చెప్తా అంది.ఎం చెప్తుందో అని టెన్షన్ గా ఉంది."

"టెన్షన్ ఎందుకు.కచ్చితంగా ఓకే చెప్తుంది.తనకి నువ్వంటే ఇష్టంరా."

"అబ్బో నీకెలా తెలుసు?"అంటూ యధాలాపంగా చందు ని చూసాను,వాడు ఎందుకో ఇబ్బందిగా కదిలాడు.

"ఎలానా...మనం తిరుపతి వెళ్లిన రోజు.నువ్వు ఏదో కొంటు ఉంటే,నేను ట్రైన్ ఎక్కేసాను కదా.అంకిత నిన్నే చూస్తూ ఉండటం గమనించా.నువ్వు బైటే ఉండి,ట్రైన్ కదిలింది చూడు...అప్పుడు అంకిత ఎంత కంగారు పడిందో తెలుసా.అప్పుడే అర్ధం అయిందిరా... తనకి నీమీద ఫీలింగ్ ఉందని."

"మనం లాస్ట్ టైం సినిమాకి వెళ్ళాం కదా.నువ్వూ,మేఘా పక్క రోలో విడిగా కూర్చున్నారు కదా.అప్పుడు కూడా...అంకిత దృష్టి మీ మీదే ఉంది,అస్సలు సినిమా చూడలేదు తను.ఎందుకో అన్ఈజీగా అనిపించింది.అది నువ్వు పక్కన లేకపోవడం వల్ల అని తరువాత అర్ధం అయ్యింది నాకు."

"సో అంకిత కచ్చితంగా ఓకే చెప్తుంది చూడు."అని రెండో బాటల్ కాళీ చేసాడు.

"హో శీను.నీ లవ్ సక్సెస్ అవ్వబోతున్న శుభసందర్భంలో...నువ్వూ కూడా ఒక పెగ్ వేయాల్సిందే."అని బలవంతం చేసాడు చందు.

"ప్లీస్ చందు నాకలవాటు లేదు."వారించా.

"అదేం కుదరదు.నువ్వు తాగాల్సిందే..."అని ఎంత చెప్తున్నా వినకుండా....ఏదో తాగించేశాడు నా చేత చందు.

గొంతంతా చికాకుగా,చేదుగా మారింది...పక్కన కోక్ ఉంటే తాగితే గాని నాలుక చల్లబడలేదు.

"ఏంటి శీను ఒక్క దానికే ఇలా అయిపోతే ఎలా.అమ్మాయిలే తాగుతున్నారు....నువ్వెంటి శీను."

నాకు ఇంకా ఇబ్బందిగానే ఉంది.ఇంకో కోక్ బాటల్ ఖాళీ చేసినా ఉపశమనం కలగడంలేదు.

"శీను....నువ్వేమైనా చేయగలవ్ అనుకున్నా.ఆఫ్టరల్ బీర్ తాగలేకపోతున్నావేంటి."అని ఎగతాలిగా నవ్వాడు చందు.

"తాగడం ఏమైనా గొప్ప విషయమా."కోపం వచ్చింది వాడి నవ్వు చూసి.

"హ....మరి కాదా.చూడు చుట్టూ ఇంతమంది ఫుల్ గా తాగి...సేఫ్ గా ఇంటికి వెళ్తారు.గడప దాటి ఇంట్లోకి అడుగుపెట్టగానే,మత్తుగా పడిపోతారు.ఎందుకంటావ్?"అన్నాడు మత్తుగా.

"ఏమో నాకేం తెలుసు."చిరాకుగా ఉంది నాకా డిస్కేషన్.

"సరే అది వదిలేయ్.ఇంతమంది తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే.....నువ్వు మాత్రం మడి కట్టుకుని కూర్చుంటావా."

"నాకు ఇష్టం లేదు అని చెప్పాకదా చందు వదిలేయ్."

"నో...నేనొప్పుకొను.నువ్వు తాగాల్సిందే.ఓ...హో...సారీ.తాగితే ఇంటికి వెళ్ళేలోగా మత్తుగా పడిపోతావని భయమా.నువ్వు ఏదో చదివి పైకి రాగలవుగాని...ఇది వల్ల కాదు.నీకంత సీన్ లేదులే."అన్నాడు తేలిగ్గా.

వాడి మాట నాకు నచ్చలేదు.వీడు మళ్ళీ నన్ను తేలిక చేసి మాట్లాడుతున్నాడు.వీడికి నేనేంటో చూపించాలి....అనుకోని.

ముందున్న బాటిల్ తీసుకుని దింపకుండా గడగడ తాగేసాను.మొత్తం ఖాళీ చేశాకా.....ఆయాసంగా బాటిల్ టేబుల్ మీద పెట్టేసరికి,చేతులు పట్టుతప్పుతున్నట్టు అనిపించింది.

ఒకసారి తల విదిలించి...వాళ్ళని చూసాను.ముగ్గురు నోరెళ్ళబెట్టి,ఆశ్చర్యంగా చూస్తున్నారు.

అదేం పట్టించుకోకుండా.....బిల్ పేయ్ చేసి,చందుని ఒక చూపు చూసి,అనీల్ ని తీసుకుని.....బస్ స్టాండ్ కి బయల్దేరాను.

బస్ రెడీగా ఉంది.కానీ కదలడానికి టైం పడుతుంది అనడంతో...బ్యాగ్ లోపల పెట్టి,వచ్చాడు అనీల్.

"ఏంట్రా ఇది.ఎందుకు తాగావ్ నువ్వు?"

"లేకపోతే నాకు చేత కాదు,నేను చేయలేను అని ఆ చందు అలా మాట్లాడుతూ ఉంటే...చూస్తూ ఊరుకోవాలా."

"ఎడిచ్చావ్.వాడు నిన్ను కావాలనే రెచ్చగొట్టాడు. ఎందుకో తెలియదుగాని.....నాకలాగే అనిపించింది.రేయ్...ఎప్పుడు లేనిది తాగేసావ్.అది ఎక్కువగానే.నా మాట విని ఆటోలో వెళ్లు.డ్రైవ్ చేయకు."

"అబ్బా ఆపరా బాబు.నేను బానే ఉన్నాను.చూడు సరిగ్గానే మాట్లాడుతున్నా కదా.నువ్వు కంగారు పడకు."వాడికి సర్దిచెప్తు ఉండగానే బస్ కదిలింది,అనీల్ ఎక్కాడు

"రేయ్....ఆటోలో వెళ్లు.ఇంటికి వెళ్లగానే నాకు కాల్ చెయ్."అని చెప్తూనే ఉన్నాడు కంగారుగా అనీల్ కిటికీలో నుండి.

బస్ కనిపించినంత వరకు ఉండి.... అనీల్ మాటలకు నవ్వుకుంటూ....బైటికొచ్చి,బైక్ కిక్ కొట్టానో లేదో... కళ్ళు బైర్లుకమ్మినట్టు అనిపించింది.

అదేం పట్టించుకోకుండా...బైక్ స్టార్ట్ చేసుకుని...రోడ్ ఎక్కాను.

అంకిత నీకు కచ్చితంగా ఓకే చెప్తుంది.....అన్న అనీల్ మాటలే గుర్తొస్తున్నాయ్.రేపు నాకు రెండు పరీక్ష ఫలితాలు రాబోతున్నాయ్.ఒకటి నాకు ఉపాధిని కలిగించేది.అది తప్పినా.....మరో అవకాశం ఉంటుంది.

మరొకటి జీవితానికి సంబంధించింది...అది తప్పితే,మరో అవకాశం ఉండదు.అంకిత ఎందుకు లేట్ చేస్తోందో అర్ధం కాలేదు.మొన్న తను అన్న విషయమే కలవరపెడుతోంది నన్ను.

ఎం చెప్పినా.....నేను పాసిటివ్


Rate this content
Log in

Similar telugu story from Drama