Divya Pandeti

Drama

4.6  

Divya Pandeti

Drama

నా పయనం...ఎటు వైపు...? 2

నా పయనం...ఎటు వైపు...? 2

21 mins
584సింధు పిలవడంతో కేఫ్ కి వెళ్లి,అక్కడ ఉన్న అమ్మాయిని చూసి షాక్ అయ్యాను.

ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయ్యింది.నోటి నుండి మాట రాలేదు...పక్కన అనీల్,సింధు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి....ఎదురుగా ఉన్న అమ్మాయిని చూస్తూ ఉన్న.

"రేయ్...."అనీల్ నా భుజం పట్టి కుదిపేసరికి,తమాయించుకుని వాడిని చూసాను.

"చెప్పు అనీల్."

"ఏంట్రా అలా అయిపోయావ్?"

"ఎం లేదు.ఎంటో చెప్పండి.అర్జెంట్ గా రమ్మన్నారు.ఎందుకు?"అన్నాను ఆ అమ్మాయి నుండి అతి కష్టం మీద చూపు తిప్పుకుంటు.

"హ్మ్..ఇందా."అని కీస్ ఇచ్చాడు.

అవి తీసుకుంటూ..."ఏంటివి?"అడిగా వాడిని.

"నీ కొత్త బైక్ కీస్."

"నా బైక్ ఎన్టీరా?"

"అన్నయ్య...నువ్వు రోజు బస్ లో,షేర్ ఆటోలో తిరుగుతూ ఇబ్బంది పడుతున్నావ్ కదా.అందుకే నాన్న....నీకోసం సెకండ్ హాండ్ బైక్ చూడమని,అనీల్ తో చెప్పాడు.వాడు పనిచేస్తోంది షోరూం లోనేగా.....ఎక్స్చేంజి లో వచ్చిన బైక్ ని చూసి..మంచి కండిషన్ లోనే ఉంది అని...కొని తెచ్చాడు."

అని ముగించింది సింధు.నాకేం చెప్పాలో తెలియలేదు.బాబాయ్...నామీద చూపిస్తున్న అభిమానానికి పొంగిపోతూనే....వీళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కాక,సైలెంట్ గా చేతిలో ఉన్న కీస్ ని చూస్తూ ఉన్నాను.

నా ఎమోషన్స్ ని అర్ధం చేసుకున్న అనీల్,నా భుజం చుట్టూ చెయ్ వేసి...నిమిరాడు.వాడికి తెలుసు మా ఇంటి పరిస్థితి.నేను ఎందుకిలా కష్టపడుతున్నానో.వాడి స్నేహపూర్వక,ఓదార్పుతో కూడిన స్పర్శకి చలించిపోయాను.

నన్ను గమనించిన సింధు...నన్ను మాములు చేయడానికి.

"ఒసేయ్..ఇక్కడ ముగ్గురు మనుషులం మాట్లాడుకుంటూ ఉంటే....నీ మానాన నువ్వు ఫోన్ చూస్తూ కూర్చుంటావా."అని నా ఎదురుగా ఉన్న అమ్మాయి మీద గైమంది.

"అబ్బా ఉండవే తల్లి."అని విసుక్కుని, ఒక చేత్తో ఫోన్ పట్టుకునే,ఇంకో చెయ్ నా ముందుకు చాపి...

"హాయ్ ఐ యాం మేఘన.నైస్ టు మీట్ యు మిస్టర్..."అని ఆగి సింధుని చూసింది.

"శీను.. శ్రీనివాస్."అని సింధు చెప్పగానే..

"మిస్టర్ శ్రీనివాస్."అంది.

ఆ అమ్మాయి చెయ్ పట్టుకుని...అలా కదిలించగానే,చెయ్ వెనక్కి తీసుకుని...మధ్యలో ఆపిన పనిని కంటిన్యూ చేస్తోంది.

మేఘన....తన గొంతు,ఆమె స్పర్శ....నాలో ఏదో గమ్మత్తుని కలిగించింది.తననే చూస్తూ ఉన్నాను..కానీ తను ఫోన్ లో చాటింగ్ చేస్తూ,మధ్యమధ్యలో నవ్వుతూ...ఈ లోకంలో లేనట్టు ఉంది.

"రేయ్ అన్నయ్య.తను అంకిత....నా క్లాస్మేట్."అంటూ పక్క చైర్ లో ఉన్న అమ్మాయిని పరిచయం చేసింది సింధు.

పలకరింపుగా నవ్వి.....హాయ్ చెప్పుకున్నాం.

అనీల్ పిలవడంతో....వెళ్లి అందరికి,సమోసాలు... కాఫీ తీసుకొచ్చి కూర్చున్నాం.

"అవునే అక్కి.ఈ హసి ఏంటే ఇంకా రాలేదు."కేఫ్ ద్వారం వైపు చూస్తూ అడిగింది సింధు.

"ఏమోరా...వస్తా అనే చెప్పింది."అంది అంకిత.

నలుగురు ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు.నేను మాత్రం మేఘననే చూస్తూ కూర్చున్నాను.

ఇంతలో...నాకు బాగా పరిచయం ఉన్న పెర్ఫ్యూమ్ స్మెల్ నా ముక్కుపుటలను తాకింది.ఒక్క క్షణం నా మెదడు అలెర్ట్ అయ్యింది.మేఘన నుండి చూపు తిప్పేసరికి ఎదురుగా ఒక అమ్మాయి...కళ్ళకి సోడబుడ్డి లాంటి కళ్లద్దాలతో కనిపించింది.తను ఎందుకో కంగారుగా ఉందనిపించింది నాకు.

"రావే.నికోసమే వెయిటింగ్.దా కూర్చో."అంది నా పక్క చైర్ ఆ అమ్మాయికి చూపిస్తూ సింధు.

ఆ అమ్మాయి మోహమాటపడుతూ...

"సింధు నువ్వు అటు కూర్చో."అని తనని బలవంతంగా లేపి.మేఘన పక్కన కూర్చుంది.

"అన్నయ్య తను హసీనా.మేం నలుగురం స్కూల్ ఫ్రెండ్స్.నేను,అక్కి,మేఘా బీటెక్ చేస్తుంటే....హసి మాత్రం మెడిసిన్ తీసుకుంది."

"హో..అయితే త్వరలోనే మీరు డాక్టర్ అవ్వబోతున్నారన్నమాటా."అన్నాను నవ్వుతూ హసీనా ని చూస్తూ.

చిన్నగా నవ్వుతూ నన్ను చేసి.....టక్కున చూపు తిప్పుకుంది తను.

ఏంటీ అమ్మాయి.ఎందుకు నన్ను చూసి అంతలా ఇబ్బంది పడుతోంది.ఏమై ఉంటుంది.కనీసం నన్ను సరిగ్గా చూడను కూడా చూడటం లేదు.ఎందుకని?అని ఆలోచించాను.

"హసి...ఎంటేయ్ బుర్కా లేకుండా వచ్చావ్ కొత్తగా."ఆశ్చర్యంగా అడిగింది అక్కి.

"హే అవును కదా....హసీనా ఈమధ్య నిన్ను ఎప్పుడు బుర్కా లేకుండా చూడలేదు నేను.ఎప్పుడో టెన్త్ లో ఉన్నప్పుడు చూసా నీ ఫేస్.మళ్ళీ ఇప్పుడు చూస్తున్నా."అని నవ్వాడు అనీల్.

మాటిమాటికి ఎంట్రన్స్ వైపు చూస్తూ కంగారుగా,భయడుతోంది హసీనా

"ఓయ్ ఏంటే ఏమైంది హసి. అలా ఉన్నావ్?"

"అదీ....అదీ...హా....కాలేజ్ లో ఒకడు నా వెంట పడుతున్నాడని చెప్పాకదా.వాడు నన్ను ఫాలో చేస్తూ వచ్చాడు.ఓకే చెప్పక పోతే....యాసి...యాసిడ్ పోస్తా అని బెదిరిస్తున్నాడు.బుర్కాలో ఉంటే గుర్తుపడతాడాని తీసేసా."అంది భయంగా.

హో....ఇదా ఈ అమ్మాయి భయానికి కారణం.చ....ఈ వెదవలు ఆడపిల్లల్ని ప్రశాంతంగా ఉండనివ్వరు కదా.పాపం బాగా భయపడిపోతోంది ఈ అమ్మాయి.అనుకున్నా.

"లైట్ హసి. ఇవన్నీ కామన్.నువ్వు భయపడుతూ ఉంటే....ఇంకా భయపెడుతూనే ఉంటారు.నువ్వింత వీక్ గా ఉంటే ఎలా హసి.మన మేఘాని చూసి నేర్చుకో....డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండాలి."సమోసా తింటూ...హసి కి గీతోపాదేశం చేస్తున్నాడు అనీల్.

"రేయ్ నువ్వు ఉండరా బాబు.హసి.....మీ నాన్న కి చెప్పవే.ఆయనే చూసుకుంటారు."

"లేదు సింధు.నాన్నకి తెలిస్తే,వాడిని బ్రతకనివ్వరు.నీకు తెలుసుగా...ఆ రాజేష్ గాడి గురించి చెప్తే నాన్న ఎం చేశారో."

"కరెక్టే."

"అందుకే నాన్నకి చెప్పలేను.వీడికి చాలా చెప్పి చూసా....వినడం లేదు ఎదవా."

హసి మాటల్లో వాడు ఇబ్బంది పెడుతున్నాడు అనే భయం కన్నా....వాళ్ళ నాన్న కి తెలిస్తే వాడి పరిస్థితి ఏంటి అని ఆందోళనే ఎక్కువ కనిపించింది నాకు.

"సరే నీ కూడా వస్తాలే మీ ఇంటి వరకు.వాడేమైన ఎస్త్రలు చేస్తే అప్పుడు చూద్దాం."అన్నాడు అనీల్.

"అనీల్ నేను బైక్ తేలేదు.డ్రాప్ చేస్తావా?"అంది వాడిని చూస్తూ హసి.

"హ ఓకే.పదా."అని లేచి..నన్ను సింధుని ఇంటికి వెళ్లిపోమని.అక్కి కి,మేఘా కి బాయ్ చెప్పి వెళ్లారు ఇద్దరు.

కాసేపటికి మేఘా వాళ్ళు కూడా వెళ్లిపోయారు. చివరగా నేను సింధు బయల్దేరాం.

బాబాయ్ లేరు ఇంట్లో...ఏదో పని మీద విజయవాడ వెళ్లారని చెప్పింది పిన్ని.

ఒక అరగంటకు ఇంటికి వచ్చాడు అనీల్.ఇద్దరం తిని, మేడ మీద పక్క పరుచుకుని పడుకున్నాం.

"అనీలూ...నీకు సింధు ఫ్రెండ్స్ అందరూ బాగా పరిచయమా?"

"హా శీను.చిన్నప్పటి నుండి హాలిడేస్ కి వస్తున్నాగా.అందరూ స్కూల్ ఫ్రెండ్స్ కదా....వస్తే ఐదుగురం బాగా రచ్చ చేసేవాళ్ళం.మేం బాగా క్లోస్ కూడా....ఈ సింధు లాగే కొంచెం కూడా మర్యాద లేకుండా...రారా,పోరా అని పిలుస్తారు నన్ను."

"కొంచెం అలవాటైతే నిన్ను అలాగే పిలుస్తారు వీళ్ళు.ఆడపిల్లలు కాదురా బాబు....ఆడ దెయ్యాలు.వాళ్ళతో షాపింగ్ కి వెళ్లామో....డబ్బు సరిపోకపోతే మనల్నే అమ్మేస్తారు...అంత డేంజర్ రా నాయనా..."

వాడి మాటలకి చిన్నగా నవ్వుతూ ఉంటే...అనీల్ మాత్రం నాన్ స్టాప్ గా వాగుతూనే ఉన్నాడు....

కానీ నాకేం వినిపించడం లేదు.మేఘన గురించే ఆలోచిస్తున్నా.వాగి..వాగి...అలుపొచ్చిందేమో నిద్రపోయాడు వాడు.

ఎంత వింత ఇది.....కలలా ఉంది.అసలు మేఘన....సింధు ఫ్రెండ్ అవ్వడమే పెద్ద విచిత్రం అనిపించింది నాకు.మేఘనని తలుచుకుంటూ....పైకి లేచి,చల్ల గాలిని...ఆ గాలితో పాటు నన్ను తాకుతున్న సన్నజాజి పరిమళాలను...ఆస్వాదిస్తూ...

మొదటిసారి మేఘన గురించి విన్న రోజుని,సందర్భాన్ని గుర్తు చేసుకున్నాను.

అటు ఇటుగా ఒక నెలన్నారా ముందు.అంటే......సింధు హోలీడేస్ అని ఊరువెళ్లిన తరువాత...కొన్ని రోజులకి.

(లాస్ట్ ఎపిసోడ్ లో శీను వచ్చి రెండు నెలలు గడిచాయి అని చెప్పాను కదా.అంటే ఇప్పుడు ఒక నెలన్నారా వెన్నక్కి వెళ్లాను.అంటే  అప్పటికి అనీల్ కూడా తెలియదు శీను కి ...గమనించగలరు.)

ఒకరోజు చందు,గిరి షాప్ లోనే ఉన్నారు.రాజన్న నాకో పని అప్పగించి వెళ్ళాడు బైటకి.అది చేసుకుంటూ ఉంటే...వాళ్లిద్దరూ ఫోన్ లో ఏదో చూస్తూ,గుసగుసగా మాట్లాడుకుంటూ...మధ్యలో ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు.

వాళ్లు ఎందుకలా ఉన్నారో అర్థం కాలేదు నాకు.నేను చొరవగా అడగలేను...వాళ్ళతో నేను కలవలేకపోయాను.కాదు..కాదు..వాళ్లే కలుపుకోలేదు నన్ను.

అది మంచిదేలే అనిపించింది నాకు.....ఇన్నిరోజులుగా వాళ్ళని గమణిస్తుండటంతో.మన స్నేహితులను చూసి మనల్ని అంచనా వేస్తారు నలుగురు.ఆరు నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్లవుతారు అంటారు.వీళ్లిద్దరితో స్నేహం చేస్తే....కచ్చితంగా నేను చెడిపోతానని అర్ధం అయ్యింది.

చందుకి ఫోన్ వస్తే మాట్లాడుతూ....షాప్ బైటికి వెళ్ళాడు.నేను ఏదో వైర్ అవసరమై....గిరి పక్కనే ఉన్న రాక్ దగ్గరికి వెళ్లి తీసుకుంటూ ఉంటే.....గిరి ఫోన్ చూస్తూ...నేను పక్కనే ఉన్నా అని గమనించకుండా..

"అబ్బా ఎమున్నావ్ మేఘాన.ఇంత తెల్లగా ఎలా పుట్టావ్ అసలు.రోజు పాలతో స్నానం చేస్తావా.ఒక్కసారి మా వైపు చూసావంటే....అక్కడికక్కడే చచ్చిపోతాం మా కుర్రాలంతా.ఇంక మాతో మాట్లాడావో... బాబోయ్.ఒక్కసారి నీతో మాట్లాడి,నిన్ను ముట్టుకోవలని ఉంది మేఘా."

"ఎప్పటికి వస్తుందో అంతా అదృష్టం.పక్కనే ఉంటావ్...రోజు కనిపిస్తు పిచ్చెక్కిస్తున్నావ్ మేఘా.ఏది ఏమైనా సరే....నిన్ను పడేయాలి.ఒక్కసారి నిన్ను గట్టిగా పట్టుకుని....అమాంతాం....."

వాడి మాటల్లో వస్తున్న మార్పుకి నాకు చెమటలు పట్టాయ్.వాడు ఏదో లోకంలో ఉన్నట్టు....ఫోన్ వైపు చూస్తూ....ఏదేదో వాగేస్తున్నాడు.వాడి మాటలకు అడ్డుకట్ట వేయాలని.....కావాలనే రాక్ లోఉన్న ఒక బాక్స్ కింద పడేశాను.

తల విదిలించి,చిరాగ్గా.....కొంచెం కోపంగా నన్ను చూసి బైటికి వెళ్ళాడు.తేలిగ్గా ఊపిరి పీల్చుకుని...పనిలో పడ్డాను.

కానీ నాకు తెలియకుండానే....వాడి మాటలు పదే పదే గుర్తొస్తున్నాయ్ నాకు.మేఘన...ఎంత బాగుందా పేరు.వాడు అంత ఇదిగా చెప్తున్నడంటే గొప్ప అందగత్తె అయ్యుంటుంది అనిపించింది.

రోజూ బుర్కా అమ్మాయి వచ్చి...కంప్యూటర్ లో ఏదో పని చేసుకుంటూ...ఒక గంట ఉండి వెళ్తోంది.కానీ నన్ను పట్టించుకోవట్లేదు...ఆ రోజు జరిగినది దృష్టిలో ఉంచుకొని,నేనూ సాధ్యమైన్నంత వరకు తన ముందుకు వెళ్లకుండా ఉంటున్నాను.

ఒకరోజు సాయంత్రం....రాజన్న టీవీ రిపేర్ చేస్తూ,నన్ను చూడమని చెప్పడంతో గమనిస్తూ ఉన్నా.

కౌంటర్ దగ్గర చందు,గిరి ఉన్నారు.

"రేయ్ ఎం పని లేదేంట్రా కాళిగా ఉన్నారు?"అరిచాడు రాజన్న వాళ్ళని.

"అబ్బా అన్నా. ఇందాకేగా వచ్చాం.కాసేపు కూడా రెస్ట్ తీసుకోనీవా."అన్నాడు గిరి...ఆతృతగా బైటకి చూస్తూ.

వాళ్ళు ఎం చేస్తున్నారో పసిగట్టగలిగాను...అప్పుడు సమయం 5.30.అక్కడికి కొంచెం దూరంలో ఉన్న కంప్యూటర్ క్లాస్ వదిలే సమయం అది.కొంత మంది అమ్మాయిలు మా షాప్ మీదుగానే...పక్కన ఉన్న బస్ స్టాప్ కి వస్తారు.వాళ్ళని వీళ్ళు చూస్తూ ఉంటారు.

"రేయ్ మేఘా రా."అరిచాడు చందు.

"అబ్బా వైట్ కలర్ డ్రెస్ లో దేవతల ఉందిరా."మైమరచిపోయి చూస్తూ అన్నాడు గిరి.

"హ్మ్....ఎప్పుడు దూరం నుండి చూడటమే గాని,దగ్గరగా చూసే రాతే లేదేంట్రా మనకి."వాపోయాడు చందు.

వాళ్ళ నిరాశ,నిసృహలు వింటుంటే...ఆ అమ్మాయిని వాళ్ళు వర్ణిస్తున్న తీరు తలుచుకుంటుంటే...ఎందుకో మొదటిసారి ఆ అమ్మాయిని చూడాలని అనిపించింది.

వాళ్ళు ఇంకా ఆకలిగొన్న పిల్లులా(పులులు అంటే అర్థం మారిపోయే ప్రమాదం ఉంది,అందుకే పిల్లులు అన్నా)...బస్ స్టాప్ వైపే చూస్తూ ఉండేసరికి మేఘా ఇంకా అక్కడే ఉంది అని అర్థం అయ్యింది.కానీ ఎలా ఇక్కడి నుండి వేలవడం. రాజన్న ఎక్కడికిరా అని అడిగితే ఏం చెప్పాలి.

ఆలస్యం చేస్తే...మేఘా వెళ్లిపోతుందేమో అని భయం.నా ప్రవర్తన,ఆలోచన నాకే విచిత్రంగా, నమ్మబుద్దికాకుండా ఉంది.మనసు మళ్లించాలన్న కుదరడంలేదు వయసు ప్రభావం.

కొద్దిసేపటికి ఇద్దరు వచ్చి రాక్ లో సరుకు సర్దుతూ ఉండటంతో మేఘా వెళ్లిపోయిందని అర్ధమైంది నాకు.

అలా రెండు రోజులు మేఘా ఆలోచనలతో గడిపేసాను....ఆమెను ఒక్కసారి చూడాలి అన్న కోరిక మాత్రం నా మెదడులో గట్టిగా నాటుకు పోయింది.అలా ఒక రోజు సాయంత్రం...

"రేయ్ మేఘా బస్ స్టోప్లో ఒంటరిగా ఉంది."చాలా సంతోష పడిపోతు అంటున్నాడు చందు.

"రేయ్....ఈరోజు ఎలాగైన మాట్లాడలిరా."అన్న గిరితో..

"నువ్వు కాదు నేను వెళ్తా.తన ఫోన్ నంబర్ తెస్తా."

"నీకంత లేదురా.నీవల్ల కాదు."అంటూ చందుని...నిరుత్సాహపరుస్తున్నాడు గిరి.

"బెట్టా...కచ్చితంగా తేస్తా.రెండు వేలు సరేనా."

"హ సరే పొ చూద్దాం."అని పందానికి ఒప్పుకున్నాడు గిరి.

చందు బస్ స్టాప్ వైపు కదిలాడు.వారి మాటలు విన్న నేనూ ఆతృతగా పని వదిలి,చూసాను.

మేఘా....కాలు మీద కాలు వేసుకొని,గడ్డం కింద చెయ్ పెట్టుకుని..తల దించుకుని ఫోన్ చూస్తూ ఉంది.తన మొహం అస్సలు కనిపించడంలేదు.

తల ఎత్తుతుందని ఆశగా చూస్తూ ఉంటే....చందు మేఘా ముందు అడ్డంగా నిలబడేసరికి.....ఇక తను కనిపించలేదు మాకు.

తనతో ఏదో మాట్లాడుతూ....మధ్యలో మా షాప్ వైపు చూపించి.కాసేపు మాట్లాడి....తనకి బాయ్ అన్నట్టు చెయ్ ఊపి వాడు ఇలా వస్తు ఉండగానే...మేఘా మొహానికి స్కార్ఫ్ కట్టుకుని.....స్కూటీ వేసుకుని వెళ్ళిపోయింది.

ఈలా వేసుకుంటూ హుషారుగా వచ్చిన చందు....లోపల ఉన్న వాటర్ క్యాన్ నుండి నీళ్ళు తాగుతూ ఉంటే...మేమిద్దరం చూస్తూ ఉన్నాం వాడిని.

"రేయ్..తెచ్చావా నంబర్?"

"నేను వెళ్లడం తేకపోవడమునా.తెచ్చా."

"అయితే చెప్పు."అని తన ఫోన్ తీసాడు గిరి,చందు చెప్తే సేవ్ చేస్కోడానికి.

"అంత లేదమ్మ.ముందు రెండు వేలు ఇలా ఇవ్వు."

"అబ్బా ఇస్తాలేరా.ముందు నంబర్ చెప్పు."గిరి తొందరపెడుతూ ఉంటే...

చందు నంబర్ చెప్పబోయి.....ఆగి నన్ను చూసాడు.

"ఏంట్రా అలా చూస్తున్నావ్.వాడికి చెప్తే నువ్వు సేవ్ చేసుకుందాం అనుకుంటున్నావా?"అన్నాడు.

నేనేం మాట్లాడాలా.అసలు నాకా ఉద్దేశమే లేదు.కంగా చూస్తు ఉంటే....

నవ్వుతూ...."ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావట్ర.కనీసం నీకు స్మార్ట్ ఫోన్ కూడా లేదు.చదువుకోక పోయినా....మేము మాట్లాడే అంత ఇంగ్లీష్ కూడా నువ్వు మాట్లాడలేవ్.నీకెందుకురా సిటీ అమ్మాయిలు.రేపు ఎప్పుడైనా..మీ నాన్న ఒక పల్లెటూరి బైతుని తెచ్చి,నీకు కట్టబెడతారు...అప్పుడు చూసుకో మీ ఆవిడని."

ఆ మాటకి గిరి కూడా నవ్వేస్తూ....చందు ఫోన్ తీసుకుని,మేఘా నంబర్ నోట్ చేసుకుంటూ..

"రేయ్ పాపం వదిలేయరా.వాడికి అంత సీన్ లేదు.వాడు ఎప్పుడు చూడు పని..పని..అంటూనే ఉంటాడు.ఎం సాధిద్దాం అనో మరి.ఇంక అమ్మాయిల జోలికేం పోతాడు....వీడి ఫెసు...."అంటూ వెనక్కి తిరిగి సైలెంట్ అయ్యాడు.

వీళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారా అని చూస్తే.....బుర్కా అమ్మయి కోపంగా చూస్తూ ఉంది చందు,గిరి లిద్దరిని.

"నమస్తే మేడం."అని తనకి చెప్పి....గిరి బైటకి వెళ్ళాడు.చందు ఏదో పని ఉన్నట్టు..లోపలే ఉన్న ఇంకో గదిలోకి వెళ్ళాడు.

ఆ అమ్మాయి నన్ను ఒకసారి చూసి వెళ్లి కంప్యూటర్ ముందు కూర్చుంది.

వాళ్ళ మాటలు విని తను ఎందుకంత కోపంగా చూసిందో నాకు అర్థం కాలేదు.దాని గురించి ఆలోచిస్తూ ఉంటే...

"హే బాబు."ఆ అమ్మాయి గొంతు.నన్ను కాదులే అనుకోని పట్టించుకోలేదు.

"నిన్నే వినిపించడం లేదా."ఇంకొంచెం గట్టిగా పిలిచింది.తలెత్తి టేబుల్ వంక చూస్తే....బుర్కా అమ్మాయి నన్నే చూస్తోంది.

"నన్నా మేడం?"

"ఇక్కడ ఇంకెవరున్నారు నిన్నే ఇలా రా."

గదమాయిస్తూ మాట్లాడుతున్నా తనని చూస్తూ...ఎందుకు పిలుస్తుందో అర్థం కాక.పని వదిలి తన ముందుకు వెళ్లాను.

"నీకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చా?"

"రాదు మేడం."

"నేర్పిస్తా..నేర్చుకుంటావా?"

"నేనా..."

"నువ్వే.ఎందుకంత ఆశ్చర్యం."

"అంటే..నాకెందుకు అని..."నేను నసుగుతు ఉంటే,అప్పుడే వచ్చిన సేతు సార్..

"ఎందుకురా వాడికి?"

"ఎందుకేంటి బాబాయ్.ఇంకొన్ని రోజుల్లో నాకు కాలేజ్ తెరుస్తారు.అప్పుడు తరచుగా ఇక్కడికి రాలేను.ఈ పనులన్నీ ఎవరు చేస్తారు.అందుకే ఇతనికి నేర్పిస్తే...మంచిది కదా."

"అబ్బా...వాడు నేర్చుకోలేడురా.వాడు చదువుకోలేదు."

"దీనికి చదువుతో ఎం పని.ఏమయ్యా కొంచెమైన ఇంగ్లీష్ వస్తుందా?చదవగలవా?"అంది నన్ను చూస్తూ.

"అంటే.....చదవగలను,అర్థం చేసుకోగలను....కాని మాట్లాడలేను."

"చాలు.బాబాయ్..ఇతనికి నేర్పిస్తా.నీకు కంపెనీ వాళ్ళకి,డీలర్స్ కి ఏదైనా మెయిల్ చేయాలన్నా తెలియదు.నేర్చుకోమంటే నా వల్ల కాదు అని చేతులెత్తేశావ్.అన్ని నేనే చూస్తున్నా...ఇక పై నాకు అంత టైం ఉండదు.సో...ఇతనికి అన్ని నేర్పించి,చెప్తాను..చూసుకుంటాడు."

"సరే నీ ఇష్టం.మా మాట ఎప్పుడు విన్నావ్ గనక.కాని ఇతనే ఎందుకు అని."

"ఎందుకంటే...."అని నన్ను చూస్తూ,"మంచివాడిలా ఉన్నాడు.ఆ చందు,గిరి ల కాదు.ఎప్పుడు పని మీదే ఉంటున్నాడు....వాళ్ళలా సొల్లు వేసుకోకుండా.నమ్మకంగా కనిపిస్తున్నాడు.డబ్బు లావాదేవీలు కూడా ఇవ్వచ్చు అనిపిస్తోంది."అంది నన్నే సూటిగా చూస్తూ.

తనకి నా మీద అంత నమ్మకం ఏంటో,ఎందుకో మరి.నాకైతే ఆ క్షణం ఆమె చూపుల నుండి తప్పించుకు పారిపోవలని అనిపించింది.

"సరే నీ ఇష్టం.వీడి మీద నాకూ నమ్మకం ఉంది.శీను.... పాప చెప్పేది శ్రద్ధగా నేర్చుకో."అని సేతు సార్ కూడా ఒప్పుకున్నారు.

అప్పటి నుండి...రోజు సాయంత్రం 5.30 నుండి 6.30 వరకు నాకు కంప్యూటర్ గురించి చెప్తూ,దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో వివరిస్తూ ఉండేది.ముందు నాకంత ఇష్టం లేకపోయినా...నాకు ఎలాగైనా నేర్పించాలి అనే తనలోని తపన గమనించాక....శ్రద్ధ పెట్టాను.

"నువ్వు చాలా త్వరగా నేర్చుకుంటున్నావ్.ఎంత వరకు చదువుకున్నావ్?"

"డిగ్రీ మధ్యలో ఆపేసానండి."

"ఎందుకు?"

"ఇంట్లో ప్రోబ్లేమ్స్ వలన."

"మళ్ళీ రాస్తావా?"

"ఆ ఆలోచన లేదండి.ప్రస్తుతానికి....పని చేసుకోవడమే."

"హ్మ్...ఇందా ఇక్కడ సైన్ చెయ్."అని ఒక పేపర్ ఇచ్చింది.

"ఏంటండి ఇది?"

"చదవడం వస్తుంది కదా.చూడు."

దూర విద్యలో డిగ్రీ పూర్తిచేయడానికి అప్లికేషన్ అది.

"ఎందుకండి ఇది?"

"డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ కంప్లీట్ చెయ్.కాలేజ్ కి వెళ్లాల్సిన పని లేదు.రోజు ఒక రెండు గంటలు చదువు.మరి డిస్టిన్షన్ లో పాస్ అవ్వాల్సిన అవసరంలేదు....జస్ట్ పాస్ అవ్వు చాలు."

ఆ పేపర్ నే చూస్తూ ఉన్న నాకేం అర్థం కాలేదు.ఎందుకు ఈ అమ్మాయి నా గురించి ఇంతల ఆలోచిస్తోంది.నా చదువు గురించి తనకెందుకు.అని ఆలోచిస్తూ ఉన్నా.

"హలో మరి ఎక్కువగా ఆలోచించకు.ఏదో కష్టపడుతున్నావ్.డిగ్రీ కంప్లీట్ అయితే...మంచిగా ఇంకో మంచి జాబ్ ఏదైనా వస్తది అని చెప్తున్నా.ఇష్టం ఉంటే చెయ్ లేదా మానెయ్."అని వెళ్ళిపోయింది.

తను ఎందుకు చెప్పినా...ఈ విధంగా నేను ఎందుకు ఆలోచించలేకపోయానా అనిపించింది.వచ్చిన సమస్య గురించి,దానికి పరిష్కారం గురించి ఆలోచించానేగాని...నా భవిష్యత్తు గురించి పట్టించుకోలేదు.ఈ రెండేళ్లలో..నేను ఇలా నా డిగ్రీ పూర్తి చేసి ఉండచ్చు కదా అనుకోగానే.

ఛా... ఎంత సమయం వృధా అయ్యింది.అందరిలా నేను ఆలోచించా.నాన్నకి అలా అవ్వగానే....పుస్తకాలు మూలన పడేసి,మడక భుజానికి ఎత్తుకున్నానే గాని.మడక తో పని లేని సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోలేకపోయాను.

చదవాలి....కచ్చితంగా చదవాలి.డిగ్రీ పట్టా అందుకోవాలి.అని గట్టిగా ఆనుకొని.... ఆ అప్లికేషన్ నింపి.గుండెల నిండా ఊపిరి పీల్చుకుని...నా జీవితంలో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికాను.

@@@@@

రోజు బుర్కా అమ్మాయి దగ్గర కంప్యూటర్ గురించి నేర్చుకుంటూనే...అక్కడే నా చదువుకు సంబంధించి నా చేత నోట్స్ కూడా రాయించేది.నా కోసం లైబ్రరీ నుండి బుక్స్ కూడా తెచ్చిచేది.

"నువ్వు టైపింగ్ నేర్చుకో ఎప్పటికైనా పనికొస్తుంది.పక్క వీధిలో టైపింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది వెళ్లు.అక్కడే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్సెస్ కి కూడా అటెండ్ అవ్వు."అంది ఒకరోజు.

"ఇన్స్టిట్యూట్ కా.ఇప్పటికే డబ్బు సరిపడటం లేదండి.ఇంటికి పంపించాలి నేను."

"డబ్బు ఇవ్వకులే."

"డబ్బు ఇవ్వకపోతే ఎవరు చేర్చుకుంటారండి."

"చెప్పింది చెయ్.ఎక్కువ మాట్లాడకూ.ఈరోజే వెళ్లి జాయిన్ అవ్వు నా పేరు చెప్పు."అంది.

"అలాగే..కానీ మీ పేరేంటో నాకు తెలియదే."

"నా పేరు...."అని ఆగి."నేను నీ గురించి అక్కడ చెప్తాలే నువ్వేళ్ళు."అంది.

ఇంకో పని మొదలు.ఒక పక్క షాప్ లో పని చేసుకుంటూ సంపాదిస్తూనే,రాత్రి పూట చదువుకుంటూ....టైపింగ్ నేర్చుకుంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాను.కానీ ఎప్పుడు లేని విధంగా ఒక నూతనోత్సాహంతో రోజులు సాఫీగా గడిచిపోతున్నాయ్.

వీటన్నిటి మధ్యలో మేఘాని మాత్రం మర్చిపోలేదు నేను.తనని చూడాలి అనే నా కోరిక రోజురోజుకీ బలపడుతూనే ఉంది.

ఇలా నేను చదువుకుంటున్న విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు....డిగ్రీ పట్టా అందుకుని వారిని సర్ప్రైజ్ చేయాలని.

ఒకరోజూ చందు ఫోన్ లో ఎవరితోనో చాటింగ్ చేస్తూ ఉన్నాడు....

"రేయ్..."అరిచారు ఎవరో గట్టిగా.షాప్ కి వచ్చి.

ఎవరబ్బా అలా అరుస్తున్నారు అని చూస్తే...ఒక అమ్మాయి ఉంది.చాలా చక్కగా ఉంది తను.

"మేఘా..."అంటూ నవ్వుతూ వెళ్ళాడు చందు.

"నీ ఎబ్బా.మేఘా ఏంట్రా మేఘా.ఏదో సొంత మరదలిని పిలిచినట్టు పిలుస్తున్నావ్.అసలెవడ్రా నువ్వు.ఏబ్రాసి ఎదవా.ఆ మెసేజ్ లేంట్రా."

"అదేంటి మేఘన.మనం ఫ్రెండ్స్ కదా అని మాములుగా చాట్ చేశా."

"మనం ఫ్రెండ్స్ ఎన్టీరా.ఆ రోజు ఏదో మాట్లాడి....అనాథాశ్రమానికి డొనేషన్ అని డబ్బు తీసుకుని,ఈవెంట్స్ ఉంటే చెప్తామ్ అని నంబర్ తీసుకుని రోజు పిచ్చి పిచ్చి మెసేజులు పెడుతూ....ఇర్రిటేట్ చేస్తున్నావ్."

"ఇన్నిరోజులు ఎవరో తెలియక ఊరుకున్నా.....చిన్న డౌట్ వచ్చి,టీవీ రిపేర్ అనగానే..వచ్చి చేస్తా అన్నావ్ చూడు.అప్పుడు కంఫర్మ్ అయ్యింది.ఇంకోసారి నాకు కాల్ గాని,మెసేజ్ గాని చేశావో చంపేస్తా దొంగ సచ్చినోడా."

వాడిని చడామడా దులిపేసి..ఇంకా ఏదో తిట్టుకుంటూ వెళ్ళిపోయింది మేఘా.

అప్పుడు చందు మొహం చూడాలి....నెత్తురు చుక్కలేదు.గిరి నవ్వాపుకుంటున్నాడు.నవ్వితే...అసలే బక్కప్రాణి,చందు ఒక పీకు పీకాడంటే చచ్చురుకుంటాడు.

మా ముందు పరువు పోవడంతో అవమానభారంతో.....ఉక్రోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

చందు వెళ్ళాకా....గిరి అప్పటివరకు కష్టంగా ఆపుకున్న నవ్వుని బయటపెట్టాడు.పడి పడి నవ్వుతున్న గిరిని చూసి నాకు నవ్వాగలేదు. నవ్వుతూనే మేఘాని తలుచుకున్నాను.

వీళ్ళు అన్నట్టే చాలా అందంగా ఉంది మేఘన.కుందనపు బొమ్మలా.....ఆ కళ్ళలో ఏదో మాయ ఉంది.ఆ గొంతు ఎంత కరుకుగా పలికినా....చెవ్వులో అమృతం పోసినంత హాయిగా వినిపించింది.

ప్రస్తుతంలోకి వచ్చేదాం.....రాత్రి మేడ మీద ఉన్న శీను....

మేఘాని తలుచుకోగానే నా పెదవులు విచ్చుకోవడం.ఏదో తెలియని పరవశం కలగడం.గమ్మత్తుగా బాగుంది ఆ ఫీలింగ్.

మేఘాతో మాట్లాడ్డనికే అంత ఇదైపోయారు వాళ్ళు.నన్ను అద్దంలో మొహం చూసుకోమని ఎగతాళి చేశారు.ఇప్పుడు మేఘా నాకు తెలుసు...మాట్లాడాను,ముట్టుకున్నాను అని తెలిస్తే...వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో తలుచుకుంటే నవ్వొస్తోంది.

నా ఆలోచనా విధానం సరైనదేనా అని తర్కించుకునే స్థితిలో లేను నేను.వాళ్ళు నన్ను తక్కువ చేసి చూడటం,మాట్లాడటం...నాలో కసిని పెంచాయ్. అందుకేనేమో...మేడం చెప్పగానే ఇంకేం ఆలోచించకుండా చదువుకోవాలని అనుకున్నాను.

అనీల్ రాకతో నాలో ఇంకా మార్పొచ్చింది.ఇన్స్టిట్యూట్ పుణ్యమా అని ఇంగ్లీష్ కూడా బాగా వస్తోంది.ఇంట్లో అనీల్,సింధుతో....షాప్ లో మేడంతో సాధ్యమైనంత వరకు ఇంగ్లీష్ లో మాట్లాడడానికి ట్ర్య్ చేస్తూ..నన్ను నేను రాటుదేల్చుకుంటున్నాను.

రెండు నెలల క్రితం నాకు....ఇప్పటి నాకు ఎంత తేడా.అప్పుడు....కేవలం కష్టపడటం,డబ్బు కూడబెట్టడం,శెట్టి అప్పు తీర్చడం ఇంతే.కానీ ఇప్పుడు నాకంటూ ఒక లక్ష్యం ఉంది.చదువుకోవాలి....మేడం ఎందుకు నా దృష్టిని మరల్చారో తెలియదుగానీ.

ఆవిడ చూపిన మార్గంలో నడిచి...నేను నా గమ్యాన్ని చేరుకోగలను అని నమ్మకం కలిగింది.నామీద నాకు విశ్వాసం పెరిగింది.ఏదైనా చేయగలను,దేనైనా సాధించగలను అని.

ఇప్పుడు నా ముందున్న చిన్న చిన్న లక్ష్యాలు ఏంటి అంటే మేఘా దృష్టి నామీద పడేలా చేసుకుని....చందు,గిరి లకు నేను ఎందులోనూ తక్కువకాదు అని నిరూపించడం.అలాగే సెప్టెంబర్ లో జరిగే ఎక్సమ్స్ లో పాస్ అవ్వడం.

నాకు టైం చాలా తక్కువ ఉంది.సాధ్యమైనంత ఎక్కువ సమయం చదుకోడానికి కేటాయించాలి.షాప్ లో పని లేని టైంలో...చదువుకోవాలి.మేడం నామీద పెట్టిన నమ్మకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వొమ్ముచేయకూడదు.

అవునూ...ఈరోజు కేఫ్ లో,మేడం దగ్గర వచ్చే లాంటి పెర్ఫ్యూమ్ స్మెల్,ఆ అమ్మాయి హసీనా రాగానే కూడా వచ్చింది.బాగుంటుంది ఆ సువాసన.హసీనా నన్ను చూస్తే ఎందుకంత కంగారుపడుతోంది.తన ప్రవర్తన ఎందుకో అనుమనించేలా ఉంది.

ఒకవేళ మేడం,హసి ఇద్దరు ఒక్కరేనా.ఛ...ఛ...అదెలా సాధ్యం.హసీనా బాగా భయస్తురాలిలా ఉంది.కానీ మేడం అలా కాదు.మాములుగా మాట్లాడినా అరిచి,కొట్టినట్టే ఉంటుంది.చూపులతోనే భయపెటేస్తుంది అందరిని.చాలా కమాండింగ్ గా మట్లాడుతుంది.

ఇద్దరు ఒకరైయ్యే అవకాశమే లేదు.నేను ఏదేదో ఆలోచిస్తున్నా అనవసరంగా.

నిద్రలో పక్కకి తిరుగుతూ,నన్ను చూసి....

"రేయ్ ఏంట్రా ఇంకా పడుకోలేదా.వచ్చి పడుకోరా."అని అటు తిరిగి పడుకున్నాడు అనీల్.

మేఘాని తలుచుకుంటూ....నేను నిద్రపోయాను.

@@@@@@

ఎప్పటిలాగే షాప్ కి వెల్లాను కాకపోతే బైక్ లో.షాప్ ముందు బైక్ పార్క్ చేస్తున్న నన్ను ఆశ్చర్యంగా చూసారు చందు,గిరి.

"ఏరా...బైక్ ఎప్పుడు కొన్నావ్?"

"బాబాయ్ కొన్నారు రాజన్న.నిన్ననే.సెకండ్ హాండ్ ది."

"ఏదో ఒకటి.అంత దూరం నుండి రోజు రావాలంటే ఆటోలకే నీ జీతం మొత్తం అయిపోతుంది.మీ బాబాయ్ మంచి పని చేసారు."

"శీను...ఈరోజు పాప రాదంట.కొన్ని వస్తువులు తెప్పించాలి.ఆర్డర్ పెట్టు."అని సేతు సార్ చెప్తూ ఉంటే...ఆ పని పూర్తి చేసి.రాజన్నకి హెల్ప్ చేస్తూ ఉన్నా.

"రేయ్ శీను.... ఈ ఫాయిల్ మార్చాలి,కొత్తది తీసుకురా."రాజన్న చెప్పింది తేవడానికి లోపలికి వెళ్లాను.

"ఏంటి రాజన్న.ఈ మధ్య మాతో మాట్లాడ్డమే మానేశావ్?"

చందు రాజన్నని అడగటం వినిపిస్తోంది నాకు.

"నేనెక్కడ మానేసారా.మీరే...మీ పనిలో బిజీగా ఉన్నట్టు ఉన్నారు."

"ఎంలేదు.ఆ శీను గాడు వచ్చినప్పటి నుండి చూస్తున్న.అసలు పట్టించుకోవడంలేదు మమ్మల్ని నువ్వు."

"రేయ్ మీరు వచ్చిన కొత్తలో ఎలా అయితే పని నేర్పించానో.అలాగే ఇప్పుడు శీను కి నేర్పుతున్న.దాంట్లో ఎమ్ముందిరా."

"మాకల అనిపించడంలేదు.నువ్వు,సేతు సార్....ఆఖరికి మేడం కూడా వాడికే సపోర్టు.మమ్మల్ని తన ముందు కూడా నిల్చొనివ్వని మేడం.ఏకంగా తన పక్కన కూర్చోబెట్టుకొని...కంప్యూటర్ నేర్పుతోంది."

"ఎందుకురా అంత కుళ్లు.రేయ్....వాడిలో ఆ టాలెంటు ఉంది నేర్చుకుంటున్నాడు.మధ్యలో నీకేంటి.నీకు ఇష్టమైతే నేర్చుకో."

"హ...నాకెవరు నేర్పుతారు.వాడికంటే మేడం ఉంది.నీకు తెలుసా....కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ కి కూడా వెళ్తున్నాడు.మేడం వాడికి అక్కడ ఫ్రీగా చెప్పిస్తోందంటా.హ్మ్.....నాకు అలాగా అందరూ సాయం చేసేవాళ్ళు ఉంటే బాగుణ్ణు."

"వాళ్ళ బాబాయ్ బైక్ కొనిచ్చాడు.ఇక్కడ నువ్వు పని నేర్పించావ్.మేడం చదవమని ఎంకరేజ్ చేస్తోంది.ఇంతమంది వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకర్ధం కావడంలేదు."

చందు మాటలు వింటూ అక్కడే కూర్చుండిపోయాను.వాడు ఎంత నిస్టురంగా మాట్లాడినా...అది నిజమే కదా అనిపించింది.

బాబాయ్ నన్ను ఆదరించి,ఇక్కడ పని ఇప్పించకుంటే.....నేను ఏమైయ్యేవాడిని?రాజన్న నన్ను సానబెట్టకుంటే..ఈరోజు సుబ్బి శెట్టి అప్పు సగం తీర్చగలికేవాడినా!మేడం చొరవ తీసుకుని నాకు సాయం చేయకుంటే....చదవాలన్న ఆసక్తి నాలో కలిగేదా?

ఇంతమంది వెనకుండి నన్ను ముందుకు నడిపించకపోతే...ఇప్పుడు నేను ఇలా ఉండేవాడినా.వారి రుణం ఎలా తీర్చుకోవాలి.వారు అందించిన తోడ్పాటు మరువలేనిది.సమయం వచ్చినప్పుడు నాకు చేతనైన సాయం వారికి అందించాలి.తప్పకుండా చేయాలి....అది సాయం కాదు నా బాధ్యత.

@@@@@@

ఎప్పుడైతే ప్రతిదీ నా బాధ్యత అనుకున్నానో.....అప్పటినుండి సమయం వృధా చేయకుండా,కష్టపడుతున్నాను.

రోజు సాయంత్రం ఇన్స్టిట్యూట్ నుండి...సింధు వాళ్ళను కలవడానికి వెళ్తున్నాను.వాళ్ళతో సరదాగా గడుపుతున్నాను.అదీ కూడా ఎందుకు అంటే మేఘా కోసం.తన దృష్టిలో పడటంకోసం.

వారితో త్వరగా కలిసిపోయాను.వాళ్ళతో సమానంగా జోకులు వేస్తూ.....అనీల్ మీద సెటైర్లు వేస్తూ ఉంటే....ఇది నేనేనా అని నాకే ఆశ్చర్యంగా అనిపించేది ఒక్కోసారి.

ఆరోజు ఆదివారం కావడంతో అందరం సినిమాకి వెళ్ళాం.ఇంటర్వెల్ లో....అనీల్,నేను ఇంకా అంకిత వెళ్లి పాప్ కార్న్,డ్రింక్స్ తీసుకొచ్చి,ఇచ్చి కూర్చున్నాం.

"హే అనీల్ నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలిరా ప్లీస్."అంది మేఘా.

"నావల్ల కాదు.అక్కడ పెద్ద క్యూ ఉంది.కావాలంటే నువ్వెళ్ళి తెచ్చుకో."అన్నాడు వాడు.

మేఘా ఎంత బ్రతిమాలుతున్న వెల్లనంటే వెళ్లను అని కరాకండిగా చెప్పేసాడు అనీల్.

పాపం తను అంతలా అడుగుతుంటే.....వెళ్లి తెద్దాం అనుకున్నా.కానీ నన్ను అడక్కుండా తెస్తే ఏమైనా అనుకుంటుందేమో అని ఊరుకున్నా.

"సచ్చినోడా."అని అనీల్ ని తిట్టి."శీను ప్లీస్ నువ్వు తెచ్చివా."అంది నన్ను చూస్తూ.

ఆ మాటకోసమే ఎదురుచూస్తున్న నేను స్ప్రింగ్ ల లేచి,చకచకా...బైటికి అడుగులు వేసాను.అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది.ఇందాక మేము ఇంటర్వెల్ కి కొంచెం ముందే వచ్చి తీసుకున్నాం.ఇప్పుడు చాలా మంది ఉన్నారు అక్కడ.

అందరూ తీసుకుని,నేను కౌంటర్ దగ్గరి వెళ్ళేసరికి కొంత టైం పట్టింది.ఫ్రైస్ అడిగి...జేబులో పర్సు తీసి,తల పట్టుకున్నాను.

అయ్యో ప్రతిసారి అనీల్ ఖర్చుపెడుతున్నాడని....

ఇందాక కొన్నవాటికి నేనే డబ్బు ఇచ్చాను కదా.పది రూపాయలే ఉన్నాయ్ ఇప్పుడెలా.అని ఆలోచిస్తూ ఉండిపోయా.

ఫ్రెంచ్ ఫ్రైస్ లేకుండా లోపలికి ఎలా వెళ్లనూ.వెళ్లి ఎం చెప్పనూ.ఫ్రెంచ్ ఫ్రైస్ అయిపోయాయని అబద్ధం చెప్తే.ఛా....అలా చెప్పలేను.మేఘా మొదటిసారి అడిగిన కోరిక కూడా తీర్చలేని పరిస్థితి వచ్చిందేంటి.అని తల కొట్టుకుంటూ ఉంటే..

సార్ అని కౌంటర్ లో అతను పిలిచి ఫ్రైస్ అక్కడ పెట్టాడు.ఆర్డర్ చేసి...ఇప్పుడు వద్దు అని కూడా వీళ్ళతో చెప్పలేను.దేవుడా...ఇక తప్పదు అనీల్ ని పిలవాల్సిందే.అనుకోని ఫోన్ తీసానో లేదో...

నా షర్ట్ పాకెట్ లో ఎవరో చెయ్ పెట్టినట్టు అనిపించి....పక్కకి చూసా.

అంకిత....ఆశ్చర్యగా ఉంది నాకు,తను అంత చొరవగా నా షర్ట్ పాకెట్ లో చెయ్ పెట్టడం.

ఎంత ఫాస్ట్ గా వచ్చిందో...అంతే ఫాస్ట్ గా వెళ్ళిపోయింది.అసలు పాకెట్ లో ఎందుకు చెయ్ పెట్టిందా అని చూస్తే.....వెయ్యి రూపాయల నోట్లు రెండు ఉన్నాయ్.

(స్టోరీ ఆరు సంవత్సరాల ముందు జరుగుతోంది కదా.అప్పటికి ఐదు వందలు,వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేయలేదుగా.)

నా దగ్గర డబ్బు లేదని అంకితకి ఎలా తెలుసు.తెలిసినా తనేందుకు నాకు డబ్బు ఇచ్చింది.తను నాతో బాగానే మట్లాడుతుంది గాని...ఇంత చనువుగా ఎప్పుడు లేదే.నా ఆలోచనలతో నేను ఉంటే...కౌంటర్ లో వాళ్ళు మళ్ళీ పిలవడంతో.ఫ్రైస్ తీసుకుని...లోపలికి వెళ్ళాను.

మేఘాకి అవి ఇచ్చి కూర్చున్నా.అంకితని చూస్తే అటు చివర కూర్చోని ఉంది.కాసేపటికి సినిమాలో లీనమైన నేను....పెర్ఫ్యూమ్ సువాసనకి,తల తిప్పి చూసా.పక్కన హసీనా ఉంది.

నన్ను చూసి కొంచెం ఇబ్బందిగా,"అంటే అక్కడ సరిగ్గా కనిపించడంలేదు.ముందు ఉన్న అతను చాలా పొడుగ్గా ఉన్నాడు."అంది ఏదో సంజాయిషీ ఇస్తున్నట్టు.

హో అని తల ఊపి ఊరుకున్నా.నాకు నవ్వోచ్చింది.ఎందుకు ఈ అమ్మాయి ఇంతలా భయపడుతుంది ప్రతిదానికి.నన్ను చూస్తే చాలు ఇబ్బందిగా ఫేస్ పెడుతుంది ఎందుకో.కానీ ఈ పెర్ఫ్యూమ్ స్మెల్ మాత్రం...నాకు మేడంనే గుర్తుచేస్తుంది.అనుకున్నా.

సినిమా అయ్యాకా.....హసీనా త్వరగా వెళ్ళాలి అని తొందరపెట్టడంతో మేఘా తీసుకుని వెళ్ళిపోయింది తనని.

మిగిలిన వాళ్ళం ఐస్ క్రీమ్ తింటూ ఉన్నాం పార్లర్ లో.అంకితతో మాట్లాడదాం అంటే కుదరలేదు.ఇంతలో నాకు ఫోను షాప్ నుండి....

"అనీల్ నాకు పనుంది మీరు వెళ్లిపోండి."అని లేస్తూ ఉంటే.

"రేయ్ నేను,సింధు ఇంటికెళ్తాము.నువ్వు అక్కిని బస్ స్టాప్ లో డ్రాప్ చెయ్....తను బైక్ తేలేదు."అన్నాడు వాడు.

సరే అని అంకితకి తీసుకుని బయల్దేరా....పది నిమిషాల తరువాత బస్ స్టాప్ లో డ్రాప్ చేస్తే....సైలెంట్గా దిగి వెళ్లి అక్కడ కూర్చుంది తను.

ఏంటి తను ఎం మాట్లాడదు.అలా ఎందుకు చేసిందో అడగాలి...లేకపోతే నా వల్ల కాదు అనుకోని,బైక్ స్టాండ్ వేసి,వెళ్లి తన పక్కన కొంచెం దూరంగా కూర్చున్నా.

"అంకిత.."

"హ్మ్.."

"ఎందుకు డబ్బు ఇచ్చావ్ నాకు?"

"నీ దగ్గర లేదు కాబట్టి."

"లేదని నీకెలా తెలుసు?"

"చూసాను.అన్ని తీసుకున్నప్పుడు నువ్వేగా ఇచ్చావ్.ఉన్న డబ్బు మొత్తం అక్కడే అయిపోయింది.మేఘా ఆడిగేసరికి ముందు వెనక ఆలోచించకుండా....పెద్ద హీరోల వెళ్లిపోయావ్.సడెన్గా గుర్తొచ్చి వచ్చా...లేకపోతే హీరోవి కాస్తా జీరోవి అయ్యుంటావ్."

"అయినా...అమ్మాయి అడగగానే దూకేయడం కాదు.కొంచెం ఆలోచించి అడుగు వేయాలి.లేకుంటే ఇదిగో ఇలాగే బోక్కబోర్ల పడతావ్.నువ్వు ఫ్రైస్ లేకుండా వచ్చున్నుంటే మేఘా ముందు నీ పరువు పోయేది.అందుకే ఇచ్చా."

"మేఘా దగ్గర నా పరువు పోయేదా.ఎందుకలా అన్నావ్?"

"ఎందుకంటే మేఘా అంటే నీకు ఇష్టం కాబట్టి.తన దృష్టి నీ మీదకి మళ్లించుకోడానికి ట్ర్య్ చేస్తున్నావ్ కాబట్టి.కనీసం ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తేలేకపోయాడు అని తను నిన్ను చిన్న చూపు చూస్తే తట్టుకోగలవా."

"ఒక్క నిమిషం....ఇది నీకెలా తెలుసు?"

"బాబు నేను అమ్మాయిని.ఒక అబ్బాయి చూపు ఎలా ఉంటుందో ఆ మాత్రం అర్ధం చేసుకోలేనా.నువ్వు ఫస్ట్ టైం మేఘాని చూసినప్పుడే నాకు తెలిసిపోయింది."

"నువ్వు మాములు దానివి కాదే తల్లి.నీతో జాగ్రత్తగా ఉండాలి.ఆవాలిస్తే పేగులు లెక్కపెట్టేలా ఉన్నావ్.అది సరే....మేఘా ముందు నా పరువుపోతే నీకెందుకు?"

"నువ్వు నా ఫ్రెండ్ వి రా.నువ్వు ఎవరి ముందు తక్కువ కాకూడదు.నువ్వు ఎంత కష్టపడుతున్నావో చూస్తున్నా....ఈ కాలం అబ్బాయిల కాదు నువ్వు.నువ్వో స్పెషల్ అబ్బాయివి.నువ్వు ఎంచుకునే ఫీల్డ్ లో....ఎప్పుడు టాప్ లో ఉండాలని కోరుకుంటున్నా.ఉంటావ్ కూడా.....నాకా నమ్మకం ఉంది."

అని నేను ఆశ్చర్యం, అయోమయంలో ఉండగానే..తను ఎక్కవలసిన బస్ రావడంతో ,నాకు బాయ్ చెప్పి వెళ్ళిపోయింది అంకిత.

నామీద అంకిత కున్న అభిప్రాయం విన్నాకా....తనకి నా మీద ఎంత అభిమానం ఉందొ అర్థం అయ్యింది.మన అభ్యున్నతిని కాక్షించే,అర్థం చేసుకునే ఫ్రెండ్ దొరకడం కూడా అదృష్టమే కదా.

@@@@@@

నా ఎక్సమ్స్ మొదలైయ్యాయ్. ఎవరికి చెప్పలేదు నేను.అన్ని రాసాను....కానీ ఏదో భయం.ఫలితం ఎలా ఉంటుందో అని గుబులు....

మధ్యలో ఒకసారీ ఊరికి వెల్లాను.ఇన్ని నెలలు కూడబెట్టిన డబ్బు అంత తీసుకెళ్లి...సుబ్బి శెట్టి అప్పు లెక్క చూసి,వడ్డీతో సహా కట్టేసాను.

చాలారోజుల తరువాత ఊరు వెళ్లడంతో....అందరూ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే....మనసుకి చాలా హాయిగా అనిపించింది.

నాన్న ఆనందానికి అవధులు లేవు.తెగ సంబరపడిపోతున్నాడు.నాకు అసలు ఏ పని చెప్పకుండా....కాలు కింద పెట్టనివ్వకుండా,నాకోసం అవి చెయ్,ఇవి చెయ్ అని అమ్మని కంగారుపెడుతూ,హైరానా పడుతున్నాడు.

"నాన్న...ఏంటిది.కొత్త అల్లుడు మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు హడావిడి చేసే మామల.ఇలా కూర్చో నువ్వు.నేనేమైన పరాయివాడినా....మర్యాదలు చేయడానికి.నీకిమధ్య చాదస్తం బాగా పెరిగిపోయింది."

అని నాన్నని నా పక్కన కూర్చోబెట్టుకొని.....భుజం చుట్టు చెయ్ వేసాను.

నన్ను చూడలేకా....తల దించుకుని అన్నాడు నాన్న.

"ఏంటి నాన్న?"

"అయ్యా.ఏ తండ్రయినా బిడ్డలకి మంచి బతుకునియ్యాలని అనుకుంటాడు.కానీ నేను నీకేం ఇయ్యలేకపోయినా.నన్ను సమించయా."

"అదేంటి నాన్న.....నువు నన్ను క్షమాపణ అడగటం ఏంటి.నువ్వు నాకు ఎం ఇవ్వలేదని ఎందుకనుకుంటున్నావ్.నాకు జన్మనిచ్చారు అది చాలదా.నువ్వు మనసు కష్టపెట్టుకోకు.నేనలా పొలం వైపు వెళ్ళొస్తా.."అని వెళ్లాను,అక్కడే ఉంటే నాన్న ఇంకా ఎమోషనల్ అవుతాడని.

ఏపుగా పెరిగిన పైరు నన్ను చూడగానే పలకరింపుగా ఊగినట్టు అనిపించింది.గట్టు మీద కూర్చొని.....ఆ పచ్చి,పచ్చటి పైర గాలితో కలగలిపి.....వస్తున్న మట్టి వాసనను ఆస్వాదీస్తూ కూర్చున్నా.

నేను లేని ఇన్నిరోజులు ఇక్కడ పని మాత్రం ఆపించలేదు.నాన్నకి కుదరకపోవడంతో....కౌలు కీయమని చెప్పాను.కానీ నాన్న అలా వద్దని...కూలి మనుషులను పెట్టుకుని పంట వేసాడు.

ఇక ఏ కష్టం లేదు.అప్పు తీరిపోయింది కాబట్టి.....సమస్య లేదు.కానీ నేను ఇంకా సిటీలో ఉండాలా.....లేక తిరిగొచేయాలా మాత్రం అర్ధం కాలేదు.ఎక్సమ్స్ రాసాను...రిసల్ట్స్ వస్తాయ్.వచ్చాకా....పాస్ అయితే,తరువాత ఎం చేయాలి.నా దగ్గర సమాధానం లేదు.సరేలే ముందు పాస్ అవ్వని....తరువాత చూద్దాం అనుకున్నా.

నాలుగు రోజులుండి.....అమ్మ,నాన్నలని తీసుకొని వచ్చాను.నాన్నని మంచి హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపించాను.మందులు ఇచ్చి...ఏవో కొన్ని ఎక్స్ర్సీస్లు చేస్తే....త్వరగా కొలుకుండాడని చెప్పారు.అలాగే అమ్మకి కూడా అన్ని టెస్టులు చేయిస్తే...రక్తం తక్కువ ఉందని.టానిక్ లు రాసిచ్చారు.

ఒక వారంరోజులు,అమ్మ శారదా పిన్నితో చాలా సంతోషంగా గడిపేసింది.ఎప్పుడు ఇంటి పనులు,బాధ్యతలతో తలమునకలై ఉండే ఆడవాళ్లకు....ఇలాంటి ఆటవిడుపులు చాలా అవసరంకదా.పైగా పుట్టింటి వారిని కలిసిన వేళా.....వాళ్ళకి పండగే మరి.

అమ్మ వాళ్ళని బస్ ఎక్కించి....పొలం పనులు ఆపొద్దని.ఇద్దరిని ఆరోగ్యం బాగా చూసుకోమని....వీలు చూసుకుని త్వరలోనే వస్తానని చెప్పాను.రిసల్ట్స్ వచ్చాకా...స్వయంగా వెళ్లి చెప్పి,వారి కళ్ళలో ఆనందం చూడాలని ఉంది నాకు.

@@@@@@@

ఒకరోజు సాయంత్రం షాప్ లో...

"రేపే రిసర్ట్స్ గుర్తుందా?"

మేడం అలా ఆడిగేసరికి భయం వేసింది.ఆవిడ గొంతు అంత కఠినంగా ఉంది మరి.

"ఉంది మేడం."

"ఏంటి భయపడుతున్నావా?"

"భయం అంటే..భయం కాదు.ఎందుకో కంగారుగా ఉంది."

"అంటే నీమీద నీకు నమ్మకం లేదు.చదివాను....బాగా రాసాను అన్నావ్.మరి ఎందుకా కంగారు."

"ఏమో మేడం.తెలియడంలేదు."

"చూడు.ఎప్పుడు,ఏ పనైనా మన శక్తి వంచన లేకుండా,పూర్తి శ్రద్ధతో చేయాలి.అంతేగాని ఫలితం దక్కుతుందా లేదా అని భయపడుతూనో,అనుమానంతోనో చేస్తే...మన హండ్రెడ్ పెర్సెంట్ న్యాయం చేయలేం."

"కష్టపడ్డావ్...రాశావ్.రిసల్ట్ ఎలా వచ్చినా.అధైర్య పడకు.మొదటిసారే విజయం సాధించలేకపోవచ్చు.అంత మాత్రాన...నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు.సరేనా."

ఆమె మాటలు.....నన్ను మోటివేట్ చేస్తున్నట్టు ఉన్నాయ్.ముందుగా నన్ను ఏ పరిస్థితి కైనా సిద్ధం చేస్తున్నట్టు.

"అది సరే.తరువాత ఎం చేద్దాం అని?"

"అంటే మేడం.అర్థం కాలేదు."

"అదేనయ్య బాబు.పీజీ చేస్తావా అని అడుగుతున్నా."

"పీజీ నా....లేదు మేడం.ఇంకా ఎందుకు."

"ఎందుకేంటి ఎందుకు?"

కోపంగా దబాయిస్తూ అంది మేడం.తన కళ్ళలో కోపం,చిరాకు స్పష్టంగా తెలుస్తోంది.

"అది కాదు మేడం.నేను ఇక్కడి వరకు రావడమే గొప్ప.మీరు చెప్పబట్టే ఎక్సమ్స్ రాయగలిగాను.మళ్ళీ పీజీ అంటే కష్టమేమో అని."

"నేను చెప్పబట్టి కాదు.నీలో విషయం ఉంది కాబట్టి.ఏదో ఇంటి సమస్యల మూలనా....నీ చదువుని మూలన పడేశావ్ గాని.లేకుండా ఇప్పటికి మంచిగా ఉండేవాడివి.ఇదిగో....నీ శ్రమకి,నీ విజయలకి నువ్వే కారణం అవుతావు గాని, మరొకరు కాదు."

"ఎవరైనా ఒక దారి చూపిస్తారు అంతే.చెయ్ పట్టుకుని....నీతో నడవరు.అలా నడిచేది ఒక్క నీ భార్య మాత్రమే.రేపు నీ భార్య,వాళ్ళ ఇంటి మనుషుల ముందు నువ్వు తక్కువ కాకూడదు అంటే....ఇప్పుడు కష్టపడి మంచి పొజిషన్ లో ఉండాలి.తరువాత నీ ఇష్టం...."అని లేచింది మేడం.

"మేడం....ఒకవేళ... నేను పాస్ కాకపోతే?"

టక్కున నన్ను చూసి... "కాకపోతే,ఇన్నిరోజులు మెరుగులేని వజ్రాన్ని సాన పెట్టి..దాని వెలుగు చూడాలనుకున్న నా వెర్రితనానికి నన్ను నేను తిట్టుకుంటా."

"నేను సాన పెట్టింది వజ్రాన్ని కాదు....ఒక గులకరాయిని అనుకొని సరిపెట్టుకుంటా.కానీ అలా బాధపడే అవసరం నాకు రాదు.నువ్వు కచ్చితంగా పాస్ అవుతావ్.నాకా నమ్మకం ఉంది."అని ఒక క్షణం నా కళ్ళలోకి సూటిగా చూసి...వెళ్ళిపోయింది.

మేడంకి నా మీద ఉన్న నమ్మకం...నామీద నాకెందుకు లేదు.ఎందుకు భయపడుతున్న....లేదు నేను పాస్ అవుతా.రాస్తున్నప్పుడు ఎప్పుడు కలగని అనుమానం ఇప్పుడెందుకు.బలంగా సంకల్పిస్తే.....మనస్ఫూర్తిగా కోరుకుంటే అది కచ్చితంగా జరిగితీరుతుంది.మేడం నమ్ముతున్నారు....నేను నమ్ముతా.

@@@@@@

రాత్రి చాలా ప్రశాంతగా నిద్రపోయా.ఉదయం కొత్త ఉత్సాహంతో లేచి,చకచకా నా పనులు పూర్తి చేసుకుని షాప్ కి వెళ్ళా.

"ఏంట్రా శీను. మంచి హుషారుగా ఉన్నావ్.ఏంటి సంగతి."

"ఈ రోజు నా రిసల్ట్స్ వస్తాయ్ అన్నా."

"అలాగా.తప్పకుండా పాస్ అవుతావ్ రా."

"థాంక్స్ అన్న."అని ఒకసారి రిసల్ట్ ఎప్పుడు వస్తాయో చెక్ చేసాను.పన్నెండు పైన అని ఉండడంతో..

అబ్బా....అప్పటివరకు వెయిట్ చేయాలా.అని పనిలో పడ్డా.

ఎప్పుడెప్పుడు పన్నెండవుతుందా అని మాటిమాటికి గడియారం వంక చూస్తూ...గడిపేసా.సమయం దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఆతృత పెరగశాగింది.

సరిగ్గా...పన్నెండు అయ్యే సమయానికి కరెంట్ పోయింది.అప్పుడు నన్ను చూసి...చందు,గిరి నవ్విన నవ్వు తలుచుకుంటే వొళ్ళుమండిపోయింది.సాధారణంగా నాకు కోపం రాదు....నాకు చాలా ఓపిక అని కూడా అంటూ ఉంటారు అందరూ.అలాంటి నాకు మొదటిసారి కోపం వచ్చింది వాళ్ళని చూసి.

పన్నెండున్నారా అయింది కరెంట్ రాలేదు.విసుగొచ్చి...

"రాజన్న....అలా నెట్ సెంటర్ వరకు వెళ్ళొస్తా."అని బయల్దేరాను.

షాప్ బైటకి అడుగుపెట్టానో లేదో..నాకు ఎదురొచ్చింది మేడం.

"ఎక్కడికి వెళ్తున్నావ్?"

"అదీ షాప్ లో కరెంట్ లేదు మేడం.రిసల్ట్స్ వచ్చాయ్ కదా..నెట్ సెంటర్ లో చూద్దామని వెళ్తున్నా."

నా మాట విని...ఎం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి,సిస్టం ముందు కూర్చుంది కరెంట్ లేకపోయినా.

"చూడాల్సిన అవసరం లేదు.నేను చూసాను."అంది నన్ను కనీసం చూడకుండానే.

"ఏమైంది మేడం?"అడిగా ఆతృతగా.

కానీ మేడం ఎం సమాధానం చెప్పకుండా....సైలెంట్ గా నన్ను చూసింది.

ఆవిడ నన్ను కోపంగా చూస్తున్నట్టు అనిపించి...ఫెయిల్ అయ్యనేమో అని చెమటలు పట్టేశాయ్.

మేడం మౌనం....నాలో అలజడిని రేపింది.నాలో నిరాశ మొదలైంది.అసలు ఎం వచ్చింది రిసల్ట్ లో...?

ఇంకా ఉంది....

BELIEVING IN YOURSELF IS THE FIRST SECRET OT SUCCESSRate this content
Log in

Similar telugu story from Drama