Laxmichamarthi 2000

Inspirational

4.8  

Laxmichamarthi 2000

Inspirational

గెలుపన్నది నీలోనే వున్నది

గెలుపన్నది నీలోనే వున్నది

2 mins
35.4K శీర్షిక: గెలుపు అన్నది నీలో ఉన్నది


 స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి గమనిస్తున్న. ఈ రోజు ఎందుకో తను హుషారుగా లేదు. కళ్ళు కూడా ఏడ్చినట్లు ఉన్నాయి. తీసుకెళ్లిన బాక్స్ లో అన్నం అలానే ఉంది. రాగానే టీవీ పెట్టుకుని పుస్తకాలు ముందేసుకునే అమ్మలు ఈరోజు పుస్తకాలు తీసుకుని మౌనంగా కూర్చుంది. తను చదవట్లేదు ఏదో ఆలోచిస్తోంది. అర్థం అవుతోంది. ఏదో జరిగింది.


 అమ్మలు అంటూ ప్రేమగా దగ్గర కూర్చున్నాను. తన కళ్ళలో నీళ్ళు..ఏమైందమ్మా అంటూ దగ్గరగా తీసుకున్నాను. ఏడుస్తోంది. ఎవరు ఏడుస్తారో తెలుసా పిరికివాళ్ళు చేతగాని వాళ్ళు ఏడుస్తారు. మా అమ్మలు చాలా ధైర్యవంతురాలు కాకపోవచ్చు కానీ పిరికిది కాదు కదా అన్నాను. కొద్దిసేపు తర్వాత చెప్పడం మొదలు పెట్టింది.


 ఈరోజు స్కూల్లో సెక్షన్స్ చేశారు అమ్మ. నన్ను డల్లర్స్ సెక్షన్స్ లో వేశారు. అనిచెప్పింది.పదోతరగతిలోకొచ్చిన మా అమ్ములు. మార్కులు కూడా పరవాలేదమ్మా. కానీ నన్ను డల్లర్ సెక్షన్లో వేశారు. ఓ క్షణం విద్యావ్యవస్థ మీద కోపం వచ్చింది. ర్యాంకులకోసం పాకులాడే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు. 


నేనేమంటానో అని భయంగా చూస్తుంది. తన బాధ అర్ధం అయింది. అమ్మ, నాన్న ఏమంటారో అని భయపడుతుంది. తన స్నేహితుల్ని మిస్ అవుతుంది. తోటి పిల్లలు గెలిచేస్తారని సిగ్గుపడుతుంది. తేలిగ్గా నవ్వేస్తూ దగ్గరికి తీసుకున్నాను. చిట్టితల్లీ !నువ్వు మా బంగారానివిరా. చదివి ర్యాంకులు తీసుకొస్తేనే నువ్వు మా కూతురువా? ఎప్పుడన్నా అలా అన్నామా? నీ లోవుండే సామర్ధ్యం నీది కదా !చెప్పు. అన్నాను. 


అలాకాదమ్మా !నేను పనికిరాని దాన్ననే కదా !ఆ సెక్షన్ లో వేశారు. అంటే నాలో సమర్ధత లేదనే కదా. అంది బాధగా. ఎవరన్నారు నువ్వు ఎందుకు పనికిరావని. నువ్వు పాడినంత మధురంగా మీ క్లాస్ లో ఎవరైనా పాడగలరా? నీ అంత పద్దతిగా ఎంతమంది వున్నారు? నీలా క్రమశిక్షణ తో వుండెవాళ్ళెంతమంది? నీ అంత మధురంగా ఎవ్వరిని బాధపెట్టకుండా మాట్లాడతారా? గొడవలు పెట్టుకోకుండా వుంటారా? ఇన్ని మంచి లక్షణాలు ఉంచుకొని నిన్ను నువ్వు తక్కువ చేసుకొంటావా? జీవితంలో గెలవాలంటే కావాల్సింది మార్కులు, సెక్షన్స్ కాదమ్మా. మంచి వ్యక్తిత్వం, సత్ప్రవర్తన. ఆ విషయంలో నీదే మొదటి ర్యాంకు. ఇక సెక్షన్ అంటావా, ఓడితేనే గెలుపు కసి పెరుగుతుంది. ఇది కాలం నీకిచ్చిన ఓ ఛాలంజ్ అనుకో. ఎవరిని నిందించవద్దు. నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదో అవకాశం. ఒక్క అడుగు వెనక్కేశామంటే వంద అడుగులు దూసుకెళ్తామని అర్ధం. ఒకవేళ అనుకున్నంత సాధించలేకపోయినా కొంతైతే ముందుకెళతాం కదా. ఎక్కడున్నామన్నది కాదు. ఎలావున్నామన్నది ప్రధానం. తామరపువ్వుకూడా బురదలోనే పుడుతుంది. ఎప్పుడూ ఏడవకు. బెంబేలు పడకు. నువ్వేడ్చినకొద్దీ నవ్వేవాళ్ళుంటారు. నిన్నేడిపించాలనుకునేవారు నువ్వు నవ్వినకొద్దీ ఏడుస్తారు. 


ఇప్పుడుచెప్పు నీలో గెలవాలన్న కసి పెంచే ఈ పరాజయం మంచిదా, కాదా అన్నాను. అవునమ్మా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. అంది కాన్ఫిడెంట్ గా అమ్ములు. నీకోసం ఇందాక వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేశాను. పొద్దుట్నుంచి ఏం తినలేదుగా తినమన్నాను. 


తన కళ్ళలో ఇందాకటి నిరాశ లేదు. ఎప్పట్లా కూనిరాగం తీస్తూ తింటోంది అమ్ములు. రేపు తను గెలిచినా, గెలవకపోయినా కుంగిపోదనే నమ్మకం వచ్చింది. 

తల్లిదండ్రులుగా ప్రతిఒక్కరు పిల్లలకు ఆ నమ్మకాన్నివాలి. ర్యాంకుల తోనో మార్కులతోనో పక్కపిల్లలతో పోల్చి వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకూడదు. వారి ఆసక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే ప్రతి పిల్లలు మాణిక్యాలే. మట్టిలో అలాగే ఉండిపోతాయా, మెరుస్తాయా అనేది పెంచే తల్లిదండ్రుల చేతుల్లో, మెరుగులు దిద్దే పాఠశాలల చేతిలోనే ఉంటుంది. 


ప్రోత్సహించండి. నిరుత్సాహపరచకండి. 

ఓ తల్లి ఆవేదన. 


Rate this content
Log in

Similar telugu story from Inspirational