raparthi anuradha

Fantasy

4.2  

raparthi anuradha

Fantasy

రాజు గారి ముగ్గురు కొడుకులు

రాజు గారి ముగ్గురు కొడుకులు

7 mins
440


*"" అనగనగా  సువర్ణ పురం..

అనే రాజ్యం...!

*" సువర్ణ పురం రాజు మహాబలుడు

ఆయనకి ముగ్గురు భార్యలు

మొదటి భార్య అనతి

రెండవ భార్య వినతి

మూడవ భార్య సుమతి.

పేరుకు తగ్గట్టు ముగ్గురు మూడు విధాల

మనస్తత్వలు గలవారు

కానీ అక్కా చెల్లెళ్ళు

ఒకరి పై ఒకరికి మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ

ఓకే రాజు నీ వివాహం చేసుకోవడం వలన

వారి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి..

ఏడాది వ్యవధి తేడాతో ముగ్గురికి ముగ్గురు

కొడుకులు పుట్టారు...

మొదటి భార్య కొడుకు

భాను ప్రకాషుడు. రెండవ భార్య కొడుకు

ఇంద్ర ప్రకాషుడు.. మూడవ భార్య కొడుకు

సూర్య ప్రకాషుడు..

ఇలా ముగ్గురు కొడుకులు పుట్టడం తో

ఆ రాజు ఎంతో సంతోషం గా ఉన్నాడు

ఒకనాడు ఆ రాజ్యానికి జమదగ్ని మహర్షి

రావడం జరిగింది

ఆయన యజ్ఞ యాగాలు జరిపించడం కొరకు

మహారాజుల సహకారం కావాలి అని కొన్ని రాజ్యాల రాజులని కలవడం జరిగింది అని మహాబలుడు కి

తెలియ చేశారు మహర్షి

*"అంతే మహాబలుడు మీరు ఇంకే రాజ్యానికి

వెళ్ళవలసిన అవసరం లేదు అని

మీకు అన్ని విధాల నేను సహకరిస్తాను

అని ప్రార్థించి ఆయన యాగానికి ఏర్పాట్లు అన్ని మహా బలుడు చేశాడు

*" మహర్షి యాగం దిగ్విజయం గా జరిగింది

అందుకు ఆయన ఎంతో సంతోషించి.....

మహాబల నీ భక్తి వినయానికి మెచ్చాను

నీకు ఒక సువర్ణ వృక్షాన్ని బహుమతి గా

ఇస్తున్నాను అది నీ మందిరం లో వెలిసింది

యాడాధికో సువర్ణ ఫలం దక్కుతుంది

దాన్ని జాగర్త చేసి ఇరువది ఒక్క ఫలములు

ఒకచోట చేర్చి నీవు ఆ పరమేశ్వరునికి

అర్పించితే నీవు తిరుగులేని మహారాజు

అవుతావు నీకు బదులు నీ కుమారులు ఎవరైనా

గాని ఆ సువర్ణ ఫలములు ఇరువది ఒక్కటి

ఒకచోటికీ చేర్చి పరమశివునికి అర్పిస్తే

ఆ భాగ్యం వానికే దక్కుతుంది

శుభం అని దీవించి పంపినారు.

*"" అందునా రాజు సంతోషం గా రాజ్యానికి

చేరుకున్నాడు

ఆయన మందిరం వెనుక భాగం న ఒక మామిడి చెట్టు ప్రత్యక్షం అవ్వడం ఆయన

గమనించారు

అది సామాన్యమైన మామిడి

చెట్టులానే ఉంది

అది చూసి రాజు యేడాధికి

ఒక్కసారే ఈ వృక్షం సువర్ణ ఫలం అందిస్తుంది

అంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియ నివ్వను

అని రహస్యం గా ప్రతి యడాధి ఫలాన్ని

సేకరించి భద్రపరుస్తు వస్తున్నాడు.... పద్దెనిమిది సంవత్సరాలు గా

రాజు ఫలాలు దాచాడు..

పంతొమ్మిది సంవత్సరం వచ్చింది

అంత వరకు ఇంట్లో రాణుల కి గాని కుమారులకు

గాని విషయం తెలియదు

ఇప్పుడు రాజు మొదటి కొడుకు వయసు ఇరువై రెండవ కొడుకు వయసు పంతొమ్మిది

మూడవ కొడుకు వయసు పద్దెనిమిది..

ముగ్గురు తెలివైన వాళ్ళే కానీ వారిలో ఉత్తముడు

ఎవరో తెలియడానికి ఇంకా సమయం రాలేదు.

అంతా చిన్నవాడిని హేళన చేస్తూ ఉంటారు.

*"ఆరోజు తెల్లవారు ఝామున మహారాజు ఫలం

కొరకు వృక్షం దగ్గరకు వెళ్ళాడు

చూడబోతే సువర్ణ ఫలం నీ ఎదో పక్షి భక్షించి నట్టు తెలుస్తుంది

అంతే రాజు కంగారు పడ్డాడు

ఏంటిది సువర్ణ ఫలం నీ భక్షించే పక్షి కూడా

ఉంటుందా అయ్యో మరల ఫలం కొరకు యేడాది

ఆగాలే అనుకుంటూ ఉంటే మహర్షి

ఆయన చింత చూసి దిగులు పడకండి

మహారాజా నిరీక్షించండి అని ఆదేశించారు...

*""ఆ రాజు చేసేది లేక వచ్చే యేడాధి కోసం

వేచి చూసాడు

మరల అదే విధముగా ఫలాన్ని ఎదో పక్షి భక్షించి

పోయింది అంతే మహారాజు లో విచారం ఎక్కువయింది ఇలా ఎందుకు జరుగుతోంది రెండు ఫలాలు

కోల్పోయాను అంటే రెండేళ్లు వృధా చేశాను అని కుమారులను పిలిచి విషయం తెలియ చేశాడు.

మరల వచ్చే యేదాధి ఈ వృక్షానికి సువర్ణ ఫలం

లభిస్తుంది దాన్ని కాపాడి నాకు అందిస్తే వారికి

అర్ధ రాజ్యం ఇస్తాను అనడం తో వచ్చే యేడాది

వరకు ఆ ముగ్గురు కొడుకులు వేచి చూశారు

ఆరోజు రానే వచ్చింది

రాత్రి సమయం లో ముగ్గురు కొడుకులు

వృక్షం చుట్టూ కాపలా కాస్తున్నారు

అందులో చివరి వాడు కాపలా కాయకుండా అక్కడే నిద్రపోయాడు

కానీ మొదటి వాడు రెండవ వాడు నిద్ర పోకుండా

చిన్నవాడని హేలన చేస్తూ వీడు ఇక్కడ ఉండటం వృథా అని గేలి చేస్తూ

పన్నెండు వరకు మేలుకునే ఉన్నారు

సరిగ్గా పన్నెండు కావస్తుండగ..

ఆ ఇరువురికి విపిరీతం గా నిద్ర కమ్ముకుంది

వాళ్ళు ఇంక తమ వల్ల కాదు అని అక్కడికక్కడే

నిద్రలోకి జారుకున్నారు.

కానీ అప్పటి వరకు నిధురించిన

సూర్య ప్రకాషుడు

వెంటనే నిద్ర మేలుకుని కాపలా

కాయడం మొదలు

పెట్టాడు.

*"అంతలో అక్కడికి ఒక బంగారు పక్షి ఎగురుకుంటూ వచ్చింది అప్పుడే కాసిన సువర్ణ ఫలం క్షించ

చూడబోతే ఆ పక్షిని అడ్డుకున్నాడు

సూర్య ప్రకాషుడు..

ఆ పక్షి ఫలం భక్షించ కుండా అతడి నుండి

తప్పించుకుని ఎగిరిపోయింది.

ఆ విధముగా ఫలాన్ని సూర్య ప్రకాశుడు

కాపాడాడు.

అలాగే అతడి చేతిలో పక్షి ఈక ఉండిపోయింది.

ఆ ఫలాన్ని పక్షి ఈక నీ పట్టుకుని సూర్య ప్రకాషుడూ

తండ్రి దగ్గరకు వెళ్ళి చూపించాడు.

అంతే రాజు కి ఫలం పోలేదు అనే సంతోషం

ఆ ఈక నీ చూసి

ఎక్కడ లేని కోపం వచ్చింది

బంగారు పక్షి అంటూ ఒకటి ఉందా

ఉంటే ఎక్కడ ఉంది దాన్ని ఎవరు ఇక్కడికి

పంపిస్తున్నారు నేను గొప్ప శక్తి వంతుడ్ని

తిరుగు లేని మహారాజు నీ కావడం

ఎవరికి ఇష్టం లేదు అని చింతిస్తూ

మంత్రి వర్య నీ పిలిచి విషయం తెలిపాడు మాహారాజు

*"ఆ రాజు చెప్పింది విన్న మంత్రి

మహారాజా ఈ పక్షి ఈశాన్య దిక్కగా ఎగురుకుంటూ వచ్చింది అంటే అటువైపు ఉన్నది ప్రసేన మహారాజు

అతడి రాజ్యం నుండే ఈ పక్షి ఇక్కడికి వస్తుంది

అంటే ప్రసేనుడు మీ ఇరువై ఒక్క సువర్ణ ఫలములు వరం సంగతి తెలుసుకుని ఉంటాడు

ఎలా అయిన మీ సువర్ణ ఫలములు కాజేయాలి

అని ఇలా అతడి దగ్గర ఉన్న సువర్ణ పక్షి నీ

పంపిస్తున్నాడు అని అంతా వివరం గా తెలిపారు

*" అంతే రాజావారి కి ఎక్కడ లేని కోపం వచ్చింది ప్రసేనుడు ముందు నుండి తన రాజ్యం నీ సొంతం చేసుకోవాలి అని పథకం పన్నాడు

అతడు తనకి శతృవు..

అందుకే రాజా వారు తన కుమారుని తెలివికి

పరీక్ష పెట్టీ ఆ పక్షిని తెచ్చి తనకి ఇస్తే పూర్తి

రాజ్యాన్ని అప్పచెప్పి పట్టాభిషిక్తుడుని చేస్తాను

అని ప్రతిజ్ఞ చేశారు

*" అంతే అక్కడికి వచ్చిన ఇరువురు కుమారులు అంధులకు తమకు అవకాశం ఇమ్మని కోరగా

రాజావారు ప్రయత్నం చేయమని అనుమతి

ఇచ్చారు.

*" అందుకు సూర్య ప్రకాషుడు అన్నగారికి మొదటి అవకాశం ఇమ్మని చెప్పినాడు

ముందుగా భాను ప్రకాషుడు ప్రసేనుడు కోటకు

చేరుకుని ఆ పక్షి ఉన్న పంజరం చేరుకున్నాడు

ఎలా అయినా ఆ పక్షిని పట్టుకోవాలి అని చూసి

ఆ పక్షిని ముట్టుకోగానే శబ్ధం మొదలయింది

అంతే వెంటనే భటులు అక్కడికి వచ్చి అతడ్ని

బంధించారు

అంతట మహాబలుడు విచారం చెందుతూ ఉంటే

ఇంద్ర ప్రకాషుడు తాను పోయి ఆ పక్షిని అన్నగారిని విడిపించుకుని వస్తాను అని పోయి తాను కూడా

అక్కడి బటులకి చిక్కుకున్నాడు

*" మూడవ వాడు తాను పోయి వచ్చెదను అనగా

అతడి తల్లి పార్వతి దేవి ప్రియ భక్తురాలు కొడుకు

నుదిట కుంకుమ తిలకం దిద్ది నీవు విజయుడువి

అయి తిరిగి రా కుమారా

వెంట నీ అన్నలని క్షేమము గా తీసుకు రావాలి

అని దీవించి పంపింది.

చెల్లెలి దీవెన విన్న అక్కలు ఎంతో సంతోష పడి

వారు కూడా కుమారుడిని ఆశీర్వదించి

నీ అన్నలను విడిపించుకుని రా కుమారా అని

కొరినారు.

*" సూర్యప్రకాష డు నవ్వుతూ అందరి ఆశీర్వాదం అందుకుని ప్రసేనుడు కోట చేరుకుని అక్కడ

భద్రత ప్రదేశం లో ఉన్న సువర్ణ పక్షి నీ

పట్టుకోబోయి ఆలోచించి

అన్నలు చేసిన పొరపాటు తాను చేయ కూడదు

అని అక్కడి పంజరాన్ని చేత పుచ్చుకుని కదిలాడు

విచిత్రం పంజరం పట్టుకుంటే ఎలాంటి ప్రమాద సూచన కలుగలేదూ...

పక్షిని ముట్టుకుంటే నే అక్కడి శబ్ధం వస్తోంది అని

అతడికి అర్థం అయింది.

*"అనుకున్నట్టే సూర్య ప్రకాశుడు

ఆ సువర్ణ పక్షి నీ తన రాజ్యం కి చేర్చాడు

ఆ విషయం తెలుసుకున్న

ప్రసేనుడు ఓటమి ఒప్పుకుని

తన తప్పు మన్నించ మని ఆ పక్షి తమ పూర్వీకుల

తపో దీక్షకు ఫలితం అని

దాన్ని తిరిగి ఇచ్చేయమని కోరారు

అలాగే రాజావారి కుమారులను విడిచి పెట్టేసాడు

*"" అంతే మహాబలుడు అవేశం గా

నీ కారణం గా నా వ్రతం కి అంతరాయం జరిగింది

రెండు ఫలాలు వృథా అయ్యాయి అంటూ ఉంటే

ప్రసేనుడు ఎంతో వినయం గా మహారాజా

ఇవిగోండి మీ రెండు ఫలములు మీ మూడవ

కుమారుడు అతని ఇరువురి అన్నలని ఈ ఇరు ఫలములను సొంతం చేసుకున్నాడు

మీ అందరిలో మిక్కిలి తెలివైన వాడు ఇతడే.

ఈ ఫలముల ప్రతి ఫలము సూర్య ప్రకాషునికి చెందుతుంది నేను నా ఓటమికి ఒప్పుకుని నా

కుమార్తెను సూర్య ప్రకాషునికి ఇచ్చి వివాహం

చేయుటకు అంగీకరిస్తున్నాను

నా అర్ధ రాజ్యం ఇస్తాను అని ఎంతో మెంచుకుంటు తెలియ చేశాడు

*" అంతే మహాబలుడు సంతోషం గా ప్రసేనుడు

సువర్ణ పక్షి నీ అతడికి తిరిగి ఇచ్చేసి అతడి

కుమార్తెను కోడలు చేసుకొనుటకు అంగీకరించాడు

అలాగే ఇంతటి విజయం సాధించిన సూర్య ప్రకాషునికి మొత్తం రాజ్యం ఇచ్చి వేస్తాను అనడం తో

సూర్య ప్రకాషుడు

కలుగు చేసుకుని

ఆగండి తండ్రి మీరు రాజ్యాన్ని మా ముగ్గురు

అన్న తమ్ములకి ఇవ్వండి

*"అన్నలు నాకంటే శక్తి వంతులు

కానీ శక్తి ఒక్కటే సరిపోదు

యుక్తి కూడా ఉండాలి సమయానికి తగ్గ తెలివి

అణుకువ ఉండాలి

ఎదుటి వారిని ఎప్పుడు తక్కువ అంచనా వేయరాదు

ఆ ఒక్కటి తెలుసుకుంటే పొరపాటు అన్నదే జరగదు

అని అన్నలకి నమస్కరించి విషయం చెప్పాడు.

*" అన్నలు తమ్ముని వినయం తెలివి మెచ్చుకుని

దగ్గరకు తీసుకుని తమని క్షమించమని

వేడుకున్నారు...

అంతే అంతా సంతోషం గా ఉన్నారు

మహారాజు చెంత ఇరువది ఒక్క ఫలములు చేరినవి

కానీ మహారాజు ఆ ఫలములు పరమేశ్వరుని కి

చిన్న కుమారిని చేతుల మీదుగా సమర్పించాడు

అంతే ఆ ఫలముల వలన పరమ శివుడు సంతోషించి అక్కడ ప్రత్యక్షం అయ్యాడు

*"'సూర్య ప్రకాషునికి దీవించి నీ కీర్తి ప్రతిష్టలు లోకం అంతా వ్యాపిస్తాయి నీ తెలివి సమర్థం తో

లోకాన్నే జయించే మహారాజు గా వెలుగొందుతావు

అని వరం ఇచ్చి పరమశివుడు అంతర్ధానం

అయినాడు.

*" ఆ వెంటనే అక్కడి మామిడి చెట్టు మాయం

అయ్యింది

సూర్య ప్రకాషునికి పూజ ఫలం దక్కింది అని

తెలుసుకున్న మహర్షి అక్కడికి వచ్చి ఆశీర్వదించి

ఇదంతా నీ తండ్రి అనాడు యాగానికి చేసిన సేవ కి ఫలితం కుమార

శక్తి కంటే యుక్తి ముఖ్యం అన్న నీ మాట లోకం

అంతా తెలుసుకుని ఎదుటి వారిని చిన్న చూపు చూడకుండా గర్వం అహాన్ని పక్కన పెట్ట గలిగితే

ఇంక చింత అనేదే ఉండదు

సుఖీభవ అని ఆశీర్వదించి

మహారాజు ముగ్గురు కొడుకులు లో ఉత్తముడు

సూర్య ప్రకాషుడు అని తెలియ చేసి వెళ్లారు..

మహాబలుడు చాలా సంతోషం గా కుమారుని

కోరిక మేర మిగిలిన ముగ్గురు కొడుకులకి రాజ్యం

ఇచ్చి రాణిలని చూసి ఓకే చోట వివాహం

జరిపించారు,

ప్రసేనుడు కూడా పరమశివుని మెప్పించిన వాడు తనకు అల్లుడిగా వచ్చినాడు అని సంతోష పడ్డారు

వివాహ వేడుకలో అంతా ఆనందం గా ఉండగా

సూర్య

ప్రకాషునికి చెంత వచ్చి వాలింది

సువర్ణ పక్షి అతడు నవ్వుతూ ఆ పక్షి నోటికి చేతి

కంకణం ఇచ్చినాడు....

అది ఆనందం గా స్వీకరించి

ఇక నా మహారాజు నీవే నీ

అజ్ఞ శిరసా వహిస్తాను రాజా

అని అంటూ

ఎగిరింది... సూర్య ప్రకాషుడు నవ్వుతూ

అతడి పక్కనే ఉన్న రాణి కళ్ళలోకి చూసాడు

ఆమె సిగ్గు పడుతు తల దించుకుంది

అంతా అక్షింతలు వేసి ఆశీర్వదించారు...!

శుభం..!

సో ఫ్రెండ్స్ ఎవర్ని తక్కువ అంచనా వేయరాదని

తెలియ చేయడానికి చిన్న ప్రయత్నం చేశాను

ఇంతకీ కథ ఎలా ఉంది చెప్పాలి

మీ అనూరాధ..

ధన్యవాదాలు...🙏🙏🙏Rate this content
Log in

Similar telugu story from Fantasy